museums
-
ఢిల్లీలో ఉత్తుత్తి బాంబు బెదిరింపులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానికి బాంబు బెదిరింపుల బెడద ఎక్కువైంది. ఢిల్లీలోని మ్యూజియాలు, ఆస్పత్రులను బాంబులతో పేల్చేస్తున్నట్లు ఆగంతకులు పంపిన ఈ మెయిల్స్ బుధవారం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. ముమ్మర తనిఖీలు చేసి అవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని లేదని తేల్చారు. నేషనల్ మ్యూజియం, రైల్వే మ్యూజియం, ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ బిహేవియర్, విద్యాసాగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, న్యూరో, అలైడ్ సైన్సెస్ మానసిక వైద్యాలయాలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఢిల్లీలో ఎయిర్‌పోర్టులు, స్కూళ్లు, ఆస్పత్రులు, ఆఫీసులకు నెల రోజులుగా బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. -
ప్రతి ఒక్కరూ మ్యూజియంలను సందర్శించాలి: కిషన్‌రెడ్డి
ఢిల్లీ: దేశ గతం, వర్తమానం, భవిష్యత్తులను ప్రతిబింబించే మ్యూజియంలను ప్రతి ఒక్కరూ సందర్శించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నాగరికత విలువలతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలను, కళలు, కళాఖండాలను ప్రదర్శించడంతోపాటు వర్తమాన పరిస్థితులను, సాంకేతిక విప్లవంతో భవిష్యత్తును దర్శించేందుకు ఈ మ్యూజియంలు ఎంతగానో ఉపయుక్తం అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పో రెండోరోజు సందర్భంగా.. వివిధ రాష్ట్రాల్లో మ్యూజియంల పునరుద్ధరణ, 2047 కోసం రాష్ట్రాలు నిర్దేశించుకున్న అజెండా తదితర అంశాలకు సంబంధించిన ప్యానెల్ డిస్కషన్ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. మ్యూజియంలను ప్రతి ఒక్కరూ సందర్శించేలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన కార్యాచరణను రూపొందించాలన్నారు. మరీ ముఖ్యంగా విద్యార్థులు, యువత మ్యూజియంల సందర్శన ద్వారా స్ఫూర్తిని పొందేందుకు వీలువుతుందని, ఈ దిశగా.. విద్యాశాఖతో కలిసి ముందుకెళ్లాలని ఆయన సూచించారు ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్‌పోలో ఫిజిటల్ ఎగ్జిబిషన్స్ (ఫిజికల్, డిజిటల్ ఎగ్జిబిషన్ల మధ్య సమన్వయం), టెక్నోమేలా, ఇన్-సిట్యు కన్జర్వేషన్ ల్యాబ్, పాఠశాల విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఎక్స్కవేషన్ పిట్, వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. భారతదేశంలో ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు, విశ్వవిద్యాలయలతో కలిసి 1200కు పైగా మ్యూజియంలు ఉన్నాయని, గత 9 ఏళ్లలోనే 145 య్యూజియంలను కేంద్రం కొత్తగా ఏర్పాటుచేసిందన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, ఆదీవాసీ వీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, గోవా తోపాటు 10 చోట్ల ఆదీవాసీ మ్యూజియంలు ఏర్పాటుచేశామన్నారు. దీంతోపాటుగా ఆధునిక సాంకేతికతను, ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు వి;hkద్యార్థులను ప్రోత్సహించేలా సైన్స్ సిటీ, సైన్స్ మ్యూజియం నిర్మాణం కూడా పెద్ద ఎత్తున జరుగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి మ్యూజియం, విప్లవ్ గ్యాలరీ మ్యూజియం (కోల్‌కతా), ఇండియన్ వార్ మెమోరియల్ మ్యూజియం, రెడ్ ఫోర్ట్ మ్యూజియం, నేషనల్ ఆర్కైవ్స్ మ్యూజియం మొదలైనవి.. నిర్మాణమైన వినియోగంలోకి వచ్చాయని.. నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ మ్యూజియంలు నిర్మాణంలో ఉన్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 2047 నాటికి దేశంలో మ్యూజియంల వ్యవస్థను మరింత బలోపేతం దిశగా.. అన్ని భాగస్వామ్య పక్షాలు పరస్పర సమన్వంతో ముందుకెళ్దామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, శ్రీమతి మీనాక్షి లేఖితోపాటు వివిధ రాష్ట్రాల సాంస్కృతిక శాఖ మంత్రులు పాల్గొన్నారు. -
AP: పురావస్తు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పురావస్తు ప్రదర్శనశాలలకు (మ్యూజియాలకు) ప్రభుత్వం కొత్తకళ తీసుకురానుంది. శిథిలావస్థలోని మ్యూజియం భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మ్యూజియాల్లో అంతర్జాతీయస్థాయి సాంకేతిక ప్రమాణాలతో ఆంటిక్విటీస్ (పురాతన వస్తువులు) డిస్ప్లే చేసేలా ప్రత్యేకదృష్టి సారిం చింది. తాజాగా విశాఖపట్నంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరుతో స్టేట్ మ్యూజియాన్ని నిరి్మంచనుంది. మరోవైపు కడపలోని భగవాన్ మహావీర్ మ్యూజియం, గుంటూరులోని బుద్ధశ్రీ మ్యూజియం, కర్నూలులోని జిల్లా మ్యూజియాల్లో కొత్త భవనాలు, ఇతర అభివృద్ధికి రూ.10 కోట్ల చొప్పున డీపీఆర్‌లను రూపొందించింది. శాసనాల పరిరక్షణకు.. రాష్ట్ర పురావస్తుశాఖ ఆధ్వర్యంలో లక్షలాది శాసనాలు, ఎస్టేంపేజీలు (శాసనాల కాపీలు) ఉన్నాయి. వీటిని భవిష్యత్తు తరాలకు అందించేందుకు, రాష్ట్ర సాంస్కృతిక, వారసత్వ సంపదను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా ప్రత్యేక ‘శాసన మ్యూజియం’ నిర్మాణానికి చర్యలు చేపడుతోంది. తద్వారా ఇప్పటివరకు లభ్యమైన శాసనాల వివరాలను ఒకేవేదికపై ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. పెండింగ్‌లో రూ.436.50 కోట్ల డీపీఆర్‌లు రాష్ట్రంలోని పురావస్తు ప్రదర్శనశాలలతో పాటు వారసత్వ నగరాల అభివృద్ధి, ఆంటిక్విటీస్ డిజిటలైజే‹Ùకు సంబంధించి రూ.436.50 కోట్ల డీపీఆర్‌లు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రూ.400 కోట్లతో రాజమహేంద్రవరాన్ని వారసత్వ నగరంగా తీర్చిదిద్దనున్నారు. వైఎస్సార్ జిల్లాలోని మైలవరం, శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ, జిల్లా కేంద్రం కాడినాడలోని ఆంధ్రసాహిత్య పరిషత్ మ్యూజియాల డీపీఆర్‌లకు అనుమతులు రావాల్సి ఉంది. మ్యూజియాల్లో ప్రవేశపెట్టే అంతర్జాతీయస్థాయి సాంకేతికత ఇలా.. - ఇంటరాక్టివ్ రెస్పాన్సివ్ డిజిటల్ వాల్ - వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ - ఇంటరాక్టివ్ డిస్ప్లే కియోస్క్ - ఆడియో–వీడియో టెక్నాలజీ - ప్రొజెక్షన్ మ్యాపింగ్, డిజిటల్ బుక్ వారసత్వ విలువలను ప్రోత్సహించాలి ఏపీలోని మ్యూజియాలను అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాం. మన అద్భుతమైన సంస్కృతి, వారసత్వ విలువలను ప్రోత్సహించాలి. ఇందులో భాగంగానే ఇప్పటికే కొన్ని డీపీఆర్‌లు కేంద్రానికి పంపగా.. కొత్తగా మరో నాలుగు మ్యూజియాలకు భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఇకపై సామాజిక మాధ్యమాల ద్వారా మన మ్యూజియాల్లోని విశిష్టతను ప్రచారం చేయనున్నాం. – జి.వాణీమోహన్, కమిషనర్, పురావస్తుశాఖ -
మమ్మీ అనొద్దు!
ఈజిప్ట్ తవ్వకాల్లో బయటపడిన మానవ అవశేషాలను మమ్మీ అని పిలవొద్దని, ఇకపై ఆ పదాన్ని బ్యాన్ చేస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన మ్యూజియంలు ప్రకటించాయి. అలా పిలవడం.. చనిపోయిన వాళ్లను కించపరిచినట్లే అవుతుందని, అలాంటి పనికి తాము ఒప్పుకోబోమని ప్రకటించాయి. బతికి ఉన్నవాళ్లకు ఎలాంటి హక్కులు ఉంటాయో..చనిపోయిన వాళ్ల హక్కులను కాపాడడం, గౌరవించడం అందరి బాధ్యత. మమ్మీ అనే పదానికి బదులుగా మమ్మీఫైడ్ పర్సన్ అని పిలవాలని, లేదంటే ఫలానా ఆనవాలు పేరు తెలిసిఉంటే.. పేరు పెట్టి అయినా పిలవాలని మ్యూజియంలు ఒక ప్రకటనలో స్పష్టం చేశాయి. ఈ మేరకు ఇంగ్లండ్‌లోని ఓ మ్యూజియం ఏకంగా బ్లాగ్‌లో ఈవిషయాన్ని పొందుపరిచింది. -
చరిత్ర గురించి తెలుసుకోవాలి: కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: మన చరిత్ర, వారసత్వ సంపద గురించి భవిష్యత్ తరాలు తెలుసుకునేందుకు మ్యూజియంలు సరైన వేదికలని, విద్యార్థులు మ్యూజియంలను సందర్శించడాన్ని తమ పాఠ్యప్రణాళికలో భాగంగా మార్చుకోవాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి సూచించారు. విద్యార్థు లు వివిధ అంశాలపై అవగాహన పెంచుకుని దాన్ని మన చరిత్ర, వర్తమానం, భవిష్యత్తులతో అనుసంధానం చేసుకోవడం అవసరమన్నారు. గురువారం ఢిల్లీలో ఓ ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ..మన పూర్వీకులు, స్వాతంత్య్ర సమరయోధులు, దేశంలోని వివిధ చారిత్రక ప్రాంతాలు, అక్కడి సంప్రదాయాలు, ప్రత్యేకతలు, మన పూర్వీకులు వినియోగించిన ఆయుధాలు, నాటి వస్త్ర సంపద, వాటిని నేయడంలో మనవాళ్ల కళాత్మక ఆలోచనలు వంటి ఎన్నో విషయాలను తెలుసుకునేందుకు మ్యూజియాలు ఉపయోగపడతాయని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మ్యూజియాల నిర్వాహకులు అలవర్చుకోవాలని, త్రీడీ సాంకేతికతతో బులెటిన్ బోర్డుల ఏర్పాటు, స్క్రీన్‌ను టచ్ చేయగానే ఆ వస్తువు విశిష్టత తెలిసేలా ఏర్పాట్లు చేయడం ద్వారా సందర్శకుల్లో మరింత ఆసక్తి పెరుగుతుందని వివరించారు. ఢిల్లీకి విద్యార్థులు వెళ్లినప్పుడు కర్తవ్యపథ్, నేతాజీ విగ్రహం, ఇండియాగేట్, ప్రధానమంత్రి సంగ్రహాలయం వంటి వాటిని సందర్శించడం ద్వారా మన చరిత్రను తెలుసుకోవడంతోపాటు దాన్నుంచి స్పూర్తి పొందేందుకు వీలవుతుందన్నారు. -
నాణేలు చూతము రారండోయ్! ఇక్ష్వాకుల నుంచి ఈస్ట్ ఇండియా కాలం వరకు
సాక్షి, హైదరాబాద్/ఖైరతాబాద్: చారిత్రక సైఫాబాద్ మింట్ కాంపౌండ్ మరో అరుదైన ప్రదర్శనకు వేదికైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సందర్శకులకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతోంది. మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ది సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్పీఎంసీఐఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ త్రిపాఠి పత్ర ఘోష్ ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్పీఎంసీఐఎల్ డైరెక్టర్లు ఎస్.కె.సిన్హా, అజయ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఒకప్పటి తూకపు బాట్లు 119 ఏళ్ల చరిత్ర కలిగిన మింట్ కాంపౌండ్‌లో నిజాం కాలం నుంచి నాణేలను ముద్రించారు. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు వివిధ రాజుల కాలాల్లో తయారు చేసిన, ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన విలువైన నాణేలను, స్మారక చిహ్నాలను ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. మహనీయుల స్మారకార్థం తయారైన నాణేలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. సైఫాబాద్ మింట్‌లో యంత్రాల ద్వారా నాణేలను తయారు చేసే ఛాయాచిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. చారిత్రక, సాంస్కృతిక వారధులు.. ∙మొఘల్ చక్రవర్తి జహంగీర్ కాలంలో క్రీ.శ 1613 నాటి 11 కిలోల బంగారు నాణెం మొహర్ చిత్రం సందర్శకులను కట్టి పడేస్తోంది. మొఘల్ సామ్రాజ్య ఔన్నత్యాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే ఈ అరుదైన నాణేన్ని నిజాంకు జహంగీర్ బహుమతిగా ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఈ నాణెం కువైట్‌లో ఉందని చారిత్రక పరిశోధకులు క్రాంతికుమార్ సేవక్ తెలిపారు. ఇలాంటి అరుదైన మొహర్లతో పాటు అనేక రకాల నాణేలను, చిహ్నాలను ఈ ప్రదర్శనలో వీక్షించవచ్చు. ఆయా కాలాల్లో రాజులు ఆరాధించిన దేవతామూర్తుల చిత్రాలు, వారి సాంస్కృతిక జీవితాన్ని, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే చిత్రాలతోనూ ఆ కాలంలో నాణేలు చలామణిలో ఉన్నాయి. ఇక్ష్వాకులు, చాళుక్యులు, శాతవాహనాలు, తదితర రాజుల కాలం నుంచి ఈస్టిండియా వారి ఏలుబడిలో చలామణిలో ఉన్న నాణేల వరకు ఈ ప్రదర్శనలో చూడవచ్చు. ఢిల్లీ సుల్తాన్లు, మహ్మద్‌బిన్ తుగ్లక్, మద్రాస్ ప్రెసిడెన్సీ, ట్రావెన్కోర్ మహారాజుల ఏలుబడి నాటి నాణేలతో పాటు నిజాం నవాబుల హయాంలో హాలీ చిక్కా నుంచి అణాల వరకు ఇక్కడ కనిపిస్తాయి. విదేశాల నాణేలు కూడా.. దేశంలోని పలు రాజవంశాల కాలం నాటి నాణేలతో పాటు వివిధ దేశాలకు చెందిన నాణేలను కూడా ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ తదితర దేశాలకు చెందిన నాణేలు ఇక్కడ కనిపిస్తాయి. బ్రిటీష్ రాజుల కాలంలోని వివిధ కాలాల్లో తయారు చేసిన నాణేలు సైతం ఉన్నాయి. 1835 నుంచి 1947 వరకు చలామణీలో ఉన్న ఈస్టి్టండియా నాణేలు ప్రదర్శనలో ఉంచారు. -
15, 16 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు
సాక్షి, హైదరాబాద్ : దేశ వారసత్వాన్ని, విజ్ఞాన సంప్రదాయాలను పెంపొందించడంలో సాంస్కృతిక సంస్థలు కీలకపాత్ర పోషిస్తాయని సాంస్కృతిక మంత్రిత్వశాఖ తెలిపింది. ‘భారతదేశంలో మ్యూజియంల రీ ఇమేజినింగ్’ అంశంపై ఈనెల 15, 16 తేదీ ల్లో హైదరాబాద్‌లో మొదటి అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొం ది. మ్యూజియంలు ఆడియో–విజువల్ మార్గాల ద్వారా దేశ సుసంపన్న వారసత్వాన్ని సంరక్షించి, డాక్యుమెంట్ రూపంలో భద్రపరచి ప్రదర్శించడంలో ప్రత్యేకత కలిగి ఉంటాయని వివరించింది. సదస్సుకు రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపింది. -
త్రీడీ విధానంలో పురావస్తు సమాచారం
సాక్షి, అమరావతి: పురావస్తు తవ్వకాల్లో బయల్పడిన లక్షల ఏళ్లనాటి వారసత్వ సంపద, సాంస్కృతిక ఆనవాళ్లను భావితరాలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. పురావస్తు ప్రదర్శన శాలల్లో భద్రపర్చిన పురాతన వస్తువుల సమగ్ర సమాచారాన్ని నూతన సాంకేతిక పద్ధతుల్లో నిక్షిప్తం చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 14 పురావస్తు ప్రదర్శన శాలలు ఉండగా.. తొలి దశలో విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు మ్యూజియాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు రాష్ట్ర పురావస్తు శాఖ రూపొందించిన డీపీఆర్‌లకు సైతం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభించడం విశేషం. సమాచారం కంటికి కనిపించేలా మ్యూజియాల్లో భద్రపరిచిన వస్తువులను 360 డిగ్రీల కోణంలో ఫొటోలు, వీడియో తీస్తారు. అనంతరం వాటికి సంబంధించి పూర్తి వివరాల(కాలం, లభ్యమైన ప్రదేశం, విశిష్టత)ను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో పొందుపరుస్తారు. దానిని పురావస్తు శాఖ వెబ్సైట్, ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లకు అనుసంధానిస్తారు. తద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఏ మ్యూజియంలో ఏ వస్తువు ఉంది, అది ఏకాలానికి చెందినదన్న విషయాన్ని సులభంగా తెలుసుకునేందుకు వీలుంటుంది. మరోవైపు పురాతన వస్తువుల భద్రత, రక్షణ విషయంలో కూడా పారదర్శకత ఉంటుంది. భవిష్యత్‌లో సదరు వస్తువు విరిగినా, చోరీకి గురైనా సులభంగా గుర్తించవచ్చు. ఇప్పటివరకూ మ్యూజియాల్లోని పురాతన వస్తువుల వివరాలు, ఫొటోలను గ్రంథస్థం చేస్తున్నప్పటికీ వాటిని పరిరక్షించడం పెను సవాల్‌గా మారింది. కొత్త విధానంతో సమాచారం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండనుంది. ఈ ప్రక్రియలో కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలో నడిచే పూణేకు చెందిన సీ–డాక్ సంస్థ సాంకేతిక సహాయాన్ని అందించనుంది. లక్షల ఏళ్లనాటి వారసత్వ సంపద క్రీ.పూ. లక్షల ఏళ్ల నుంచి 19 శతాబ్దం వరకు అనేక ప్రాచీన విశేషాలు పురావస్తు ప్రదర్శన శాలల్లో చారిత్రక వైభవాన్ని చాటుతున్నాయి. ఆది మానవులు, రాతియుగంలో వాడిన పరికరాలు, వినియోగించిన వస్తువులు కనువిందు చేస్తున్నాయి. వీటిల్లో రాతి విగ్రహాలు, చిత్రపటాలు, నాణేలు, బీడ్స్, ఫ్లేక్స్, కుండలు, ఆయుధాలు, పింగాణి పాత్రలు, రాగి, శిలా శాసనాలు వంటివి వేలాది రకాలున్నాయి. భావి తరాలకు అందిస్తాం.. డిజిటలైజేషన్ వల్ల పురాతన వస్తువుల సమాచారం అందుబాటులోకి రావడంతో పాటు వాటికి భద్రత, రక్షణ ఏర్పడుతుంది. భవిష్యత్‌లో సదరు వస్తువు దెబ్బతిన్న, చోరీ అయినా అంతకుముందే దానికి సంబంధించిన వివరాలు కచ్చితంగా నమోదై ఉంటాయి. ఫలితంగా వారసత్వ సంపదను భావితరాలకు జాగ్రత్తగా అందించేందుకు వీలుంటుంది. త్వరలో ఐదు మ్యూజియాల్లో డిజిటలీకరణ చేపట్టనున్నాం. – జి.వాణీమోహన్, పురావస్తు శాఖ కమిషనర్ -
మోడల్ ట్రైన్.. వైన్‌గ్లాసులను తాకుతూ కొత్త మెలోడీ .. ఎక్కడంటే!
బెర్లిన్: జర్మనీ హ్యాంబర్గ్‌లోని మినియేచర్ వండర్లాండ్ మ్యూజియం బొమ్మ రైళ్లకు పెట్టింది పేరు. బొమ్మ నగరాలు, బొమ్మ అడవులు, బొమ్మ నదులను దాటుతూ ప్రయాణిస్తుంటే పిల్లలే కాదు, పెద్దలు పిల్లలై ఆనందిస్తారు. గత సంవత్సరం కరోనా వల్ల ఈ మ్యూజియంను మూసివేయవలసి వచ్చింది. ఈ ఖాళీ సమయంలో మ్యూజియం టీమ్ గోళ్లుగిల్లుకుంటూ కూర్చోకుండా వినూత్నమైన ఆలోచన చేసింది. 211 మీటర్ల ట్రాక్‌లో ప్రయాణం చేసే మోడల్ ట్రైన్‌కు అటు ఇటూ 2,840 వైన్గ్లాస్లను పెట్టి అందులో నీళ్లు పోసారు. ఇందులో వింత ఏముంది అంటారా? ఈ మోడల్ ట్రైన్ చికుబుకు... అంటూ ప్రయాణించదు. కమ్మని మెలోడిలు వినిపిస్తూ ప్రయాణిస్తుంది. ఈ సంగీత ప్రయాణంలో వినిపించే ప్రపంచ ప్రసిద్ధ మెలోడి తరంగాలు వైన్గ్లాస్లోని నీళ్లను తాకి ప్రతిధ్వనిస్తూ కొత్త రకమైన అనుభూతి ఇస్తాయి. ‘లాంగెస్ట్ మెలోడి మోడల్ ట్రైన్’గా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కిన ఈ రైలుకు యూట్యూబ్‌లో వైరల్ అయిన ఒక వీడియో ప్రేరణ ఇచ్చింది. -
తెరుచుకోనున్న మ్యూజియాలు
న్యూఢిల్లీ: వీక్ ఎండ్ వస్తే చాలు జనాలు సినిమాలకు, జూపార్కలకు, మ్యూజియంకి వెళ్లేవారు. ముఖ్యంగా పురాతన వస్తువులను చూడటానికి పిల్లలు ఎక్కువ ఆసక్తి చూపేవారు. అలాంటిది కోవిడ్-19 కారణంగా గత కొన్ని నెలలుగా ఇళ్లకే పరితమైపోయారు. మ్యూజియంలలో పురాతణ వస్తువులను చూసి ఆనందించాలనుకునే వారు ఎప్పుడు ఇవి తిరిగి ప్రారంభం అవుతాయా అని ఆశగా ఎదురుచూస్తునన్నారు, అలాంటి వారికి కేంద్రం ప్రభుత్వం శుభవార్తచెప్పింది. ఈ నెల 10వ తేదీ నుంచి మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు, ఎగ్జిబిషన్లను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుతిచ్చింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించడానికి గురువారం ప్రామాణిక మార్గదర్శకాలను జారీ చేసింది. నవంబర్ 10 నుంచి కేంద్ర సాస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు, ఎగ్జిబిషన్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రం, నగర, స్థానిక చట్టాల నియమ నిబంధనలను అనుసరించి మిగతా వారు కూడా వీటిని పునః ప్రారంభించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వీటిని సందర్శించడానికి వచ్చేవారు తప్పనిసరిగా మాస్క ధరించి రావాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ప్రవేశ ద్వారం దగ్గర ముందుగా టెంపరేచర్ చెక్ చేసి, శానిటైజ్ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తారు. కరోనా విజుృంభిచడంతో కేంద్రం మార్చి నుంచి లాక్డౌన్ విధించింది. ఈ కారణంగా అన్నింటితో పాటు మ్యూజియంలు కూడా మూత పడ్డాయి. ఏడు నెలల తర్వాత వీటిని తిరిగి ప్రారంభించే అవకాశం దక్కింది. -
సినిమా థియేటర్లకు అనుమతి.. అయితే
కొలంబో : కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు విధించిన లాక్‌డౌన్‌తో ప్రపంచ వ్యాప్తంగా అన్ని సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల కొన్ని దేశాల్లో లాక్డౌన్ ఎత్తివేయడం, సడలింపులు ఇవ్వడంతో తిరిగి అన్ని రంగాల సేవలు పునఃప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కారణంగా మార్చి నుంచి మూతపడిన సినిమా హాళ్లను దేశ వ్యాప్తంగా తిరిగి ప్రారంభిస్తున్నట్లు శ్రీలంక ప్రకటించింది. ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గదర్శాలకు కట్టుబడి ఉంటే జూన్ 27(శనివారం) నుంచి థియేటర్లు తిరిగి తెరుచుకునేందుకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం సమాచారశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందుకు ప్రతి థియేటర్ నిర్వాహకులు స్థానిక ఆరోగ్యశాఖ అధికారులకు ఒప్పంద పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది. (ఈ నెల 29నుంచి కర్తార్‌పూర్ కారిడార్ ఓపెన్) అలాగే దేశంలో అన్ని మ్యూజియాలను, స్మారక చిహ్నాలు, సాంస్కృతిక కట్టడాల సందర్శనను జూలై 1 నుంచి తెరవనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇవన్నీ సందర్శకుల సంఖ్యపై పరిమితులు వంటి ఆరోగ్యశాఖ జారీ చేసిన కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఇదిలావుండగా కఠినమైన ఆరోగ్య మార్గదర్శకాలతో విదేశీ పర్యాటకుల కోసం ఆగస్టు 1నుంచి విమాన సర్వీసులను ప్రాంభిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. కాగా శ్రీలంకలో ఇప్పటి వరకు 2,000 వేల కరోనా కేసులు వెలుగు చూశాయి. వీరిలో 1,200 మందికి పైగా కోలుకుని డిశ్చార్జి అవ్వగా, 11 మంది మృత్యువాత పడ్డారు. (అహ్మద్ పటేల్ ఇంటికి ఈడీ అధికారులు) -
ప్రాణాయామం చాలా కీలకం: మంత్రి హరీష్‌రావు
సాక్షి, సంగారెడ్డి: యోగాలో ప్రాణాయామం చాలా కీలకమైనదని ఆర్థిక మంత్రి హరీష్‌రావు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ..సంగారెడ్డి నడి బొడ్డున 80 లక్షలతో యోగా భవనం, రెండు కోట్లతో బిర్లా సైన్స్ మ్యూజియాన్ని నిర్మిస్తున్నామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. హైదరాబాద్, వరంగల్ తరువాత సంగారెడ్డిలో మ్యూజియంను నిర్మిస్తున్నామని, మ్యూజియాలను సందర్శించడం ద్వారా పిల్లల్లో నాలెడ్జి పెంపొందుతుందని పేర్కొన్నారు. యోగా వలన వంద ఏళ్లకు పైగా బతికారని తరుచు వింటుంటామని, గాలి పీల్చి రుషులు బతికేవారని అన్నారు. ఇప్పుడు జీవన విధాన మార్పు, శ్రమ తగ్గడం వల్ల బీపీ, షుగర్, గుండెపోటు వంటివి రోగాలు పెరిగాయని అన్నారు. రోగాలు రాకుండా ఉండాలన్నా, ఒత్తిడిని అధిగమించాలన్నా యోగా అవసరమని తెలిపారు. మనిషి ఆహారాన్ని ఔషధంగా తీసుకోవాలి..లేకుంటే మనిషికి చివరగా ఔషధమే మిగులుతుందని అన్నారు. వందేళ్లు బతకాలనుకునే వారు ప్రాణాయామం చేయాలని, తాబేలు నాలుగు సార్లు శ్వాస తీసుకుని మూడు వందల ఏళ్ళు బతుకుతుందని అన్నారు. ఏనుగు 9 సార్లు శ్వాస తీసుకుని 150 ఏళ్ళు బతుకుతుందని, డాక్టర్ దగ్గరకు పోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలని, రోజుకు ఒక గంట యోగాకు కేటాయించాలని సూచించారు. యోగా, ప్రాణాయామం చేయడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి , ఏకాగ్రత పెరుగుతాయని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తప్పని సరిగా యోగాను నెర్పించాల్సిందేనని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. చదవండి: ఫలించిన హరీష్ రావు వ్యూహాలు.. జగ్గారెడ్డికి ఎదురుదెబ్బ -
‘మ్యూజియం దొంగలకు’ రెండేళ్ల జైలు
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలోని పురానీహవేలీలో ఉన్న హిజ్ ఎగ్జాల్డెడ్ హైనెస్ (హెచ్‌ఈహెచ్) నిజాం మ్యూజియంలో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను నాంపల్లి కోర్టు దోషులుగా తేల్చింది. 2018లో జరిగిన ఈ కేసును సిటీ దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రికార్డు సమయంలో ఛేదించి, సొత్తును యథాతథంగా రికవరీ చేశారు. ఆ ఏడాది సెప్టెంబర్ 4 తెల్లవారుజామున ఈ దొంగతనం జరగ్గా.. అదే నెల 11న ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ముబిన్ అనారోగ్యం నేపథ్యంలో 2018 జూలై ఆఖరి వారంలో మస్రత్ మహల్ సమీపంలో ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ రద్దీ ఎక్కువగా ఉండటంతో టోకెన్ తీసుకున్న మొబిన్ కాలక్షేపానికి దగ్గరలో ఉన్న నిజాం మ్యూజియంలోకి వెళ్లాడు. అక్కడ అవసరమైన భద్రత చర్యలు లేకపోవడంతో పాటు అందులో ఉన్న బంగారం టిఫిన్ బాక్స్, కప్పు, సాసర్, టీ స్ఫూన్లతో పాటు బంగారం పొదిగిన ఖురాన్‌ను ఇతడిని ఆకర్షించాయి. ఈ పురాతన వస్తువుల్ని చోరీ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకోవాలని భావించాడు. రాజేంద్రనగర్ ప్రాంతానికే చెందిన సెంట్రింగ్ వర్కర్ మహ్మద్ గౌస్ పాషాతో కలిసి రంగంలోకి దిగాడు. వీరిద్దరూ 2018 సెప్టెంబర్ 3 అర్ధరాత్రి స్క్రూడ్రైవర్లు, కటింగ్ ప్లేయర్, మేకులు పీకే ఉపకరణం, తాడు, పది హాక్సా బ్లేడ్స్లతో ద్విచక్ర వాహనంపై మ్యూజియం వద్దకు చేరుకున్నారు. వెంటిలేటర్‌పై ఉన్న గ్లాస్, గ్రిల్స్ తొలగించిన దాని ద్వారా మొబిన్ లోపలకు దిగాడు. ఓ అల్మారా పగులకొట్టి టిఫిన్ బాక్స్, కప్పుసాసర్, స్ఫూను తస్కరించి బ్యాగ్‌లో సర్దుకుని రాగా.. ఇద్దరూ కలిసి వాహనంపై పరారయ్యారు. తొలుత ఆ వస్తువుల్ని గోతిలో పాతిన ఇద్దరూ ముంబై వెళ్లి వచ్చిన తర్వాత తవ్వి తీసి భోజనం చేశారు. ఆ ఏడాది సెప్టెంబర్ 4న నమోదైన ఈ కేసులో నిందితుల కోసం రంగంలోకి దిగిన దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇద్దరినీ పట్టుకోవడంతో పాటు బంగారం టిఫిన్‌బాక్స్, టీకప్పు, సాసర్, స్ఫూన్ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ రూ.300 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన మీర్‌చౌక్ పోలీసులకు నిందితులపై పక్కాగా అభియోగాలు మోపారు. వీటిని విచారించిన నాంపల్లి కోర్టు మంగళవారం ఇద్దరు దొంగల్నీ దోషులుగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. -
మ్యూజియాలు భద్రమేనా?
సాక్షి, హైదరాబాద్: ఘనమైన గత వైభవానికి ప్రతీక.. భావితరాలకు జ్ఞాపిక.. పూర్వీకులు మనకిచ్చిన పురాతన చారిత్రక సంపద. తరతరాల చరిత్రకు ఆధారాలు, అలనాటి పాలనకు దర్పణాలు ఆ విలువైన పురాతన వస్తువులు. అత్యంత విలువైన ఆ సంపదకు క్రమంగా ఆపద ముంచుకొస్తోంది. చారిత్రక సంప దను కాపాడాల్సిన మ్యూజియాలకు రక్షణ కరువవుతోంది. చరిత్రను చాటే ఆనవాళ్లు ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలసిపోయే పరిస్థితి తలెత్తుతోంది. ‘నిజాం’లో చోరీ: పురావస్తు శాఖ నిర్వహిస్తున్న మ్యూజియాల్లో కొన్నింటికి రక్షణ కరువై విలువైన సంపద దుండగుల చేతికి చిక్కుతోంది. ఇటీవలి హైదరాబాద్ నిజాం మ్యూజియం దొంగతనమే ఇందుకు ఉదాహరణ. మ్యూజియాలపై ప్రభుత్వాల అలసత్వం, అక్కడ తగినంత భద్రత, సీసీ కెమెరాలు లేకపోవడం చోరీలకు కారణంగా చెప్పొచ్చు. పురావస్తు శాఖకు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించకపోవడం, సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం కూడా ఆ శాఖపై చిన్నచూపును తెలుపుతోంది. రాష్ట్రంలోని పురావస్తు శాఖలో 200 మంది సిబ్బంది అవసరం ఉండగా 50 మంది కూడా లేకపోవడంతో మ్యూజియాలకు రక్షణ లేకుండా పోతుంది. అన్నింటా విలువైన సంపదే హైదరాబాద్‌లో రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారక మ్యూజియం, సెంటినరీ జూబ్లీ హెరిటేజ్ మ్యూజియం, ఖజానా, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, పిల్లలమర్రి, అలంపూర్, పానగల్ మ్యూజియాలతో పాటు నాగార్జునసాగర్, కొలనుపాకలో పురావస్తు శాఖ వస్తు ప్రదర్శన శాలలు నడుస్తున్నాయి. వీటిల్లో రాజుల కాలం నాటి ఆయుధాలు, మట్టి కుండలు సహా మరిన్ని విలువైన వస్తువులున్నాయి. నాగార్జున కొండ మ్యూజియం 1959లో అప్పటి విద్యా శాఖ మంత్రి హుమాయన్ కబీర్ మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1923 నుంచి 1960 వరకు నాగార్జునసాగర్ పరిసరాల్లో పురావస్తు శాఖ వారు నిర్వహించిన తవ్వకాల్లో బయటపడిన శిలలు, శిల్పాలు, శాసనాలు ఇక్కడ ఉన్నాయి. ఫణిగిరిలో ఓ ఇంట్లో..: రాష్ట్రంలో పలుచోట్ల చారిత్రక వస్తువులు, ఆనవాళ్లు గుర్తించినా భద్రపరచడానికి నిధులు, సరిపడా సిబ్బంది లేక పురావస్తు శాఖ కునారిల్లుతోంది. ఫణిగిరిలోని విలువైన సంపదను గ్రామంలోని ఓ ఇంటి గదిలో ఉంచారు. పానగల్ మ్యూజియంలోనూ అనేక విగ్రహాలు ఆలనాపాలనా లేకుండా పడి ఉన్నాయి. ‘పానగల్’కు రక్షణేదీ? నల్లగొండ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని పానగల్ ఆర్కియాలజీ మ్యూజియాన్ని 1992లో ఏర్పాటు చేశారు. అనేక వినతుల తర్వాత మ్యూజియం ఏర్పాటు చేసినా దాని అభివృద్ధిని, జిల్లాలోని పురాతన వస్తువుల పరిరక్షణనూ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తమకున్న పరిధిలో చాలీచాలని సిబ్బందితోనే చారిత్రక సంపద పట్ల ఆసక్తి ఉన్న శాఖ ఉద్యోగులు, ఇతర చరిత్రకారుల సాయంతో సంపద పరిరక్షణకు తోచింది చేస్తున్నారు. మ్యూజియానికి కనీసం ప్రహరీ కూడా లేకపోవడంతో ఆరుబయట ఉన్న విగ్రహాలు, వస్తువులకు రక్షణ కరువైంది. 2014లో ఈ మ్యూజియం నుంచి 12వ శతాబ్దం నాటి గణపతి విగ్రహాన్ని దుండగులు అపహరించారు. సిబ్బంది సంఖ్య అరకొరగానే ఉండటంతో పగలు ఒకరు, రాత్రి ఇద్దరే (ఒకరు తాత్కాలిక ఉద్యోగి) రక్షణగా ఉంటున్నారు. -
నిజాం మ్యూజియంలో భారీ చోరీ సీసీటీవీ ఫుటేజ్
-
భాగ్యనగరిలో అధునాతన ‘మ్యూజియం’!
ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్ నిర్మించనున్న రాష్ట్ర ప్రభుత్వం - రూ.45 కోట్లతో కుతుబ్‌షాహీ టూంబ్స్ ప్రాంగణంలో ఏర్పాటు - స్వదేశీ దర్శన్ పథకం కింద కేంద్ర నిధులతో పనులు - నిర్మాణం పూర్తయితే దేశంలోనే అతిపెద్దదిగా రికార్డు సాక్షి, హైదరాబాద్: ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్.. ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనశాలలకు ప్రత్యామ్నాయంగా మారిన సరికొత్త ప్రక్రియ. ఓ చారిత్రాత్మక ప్రాంతానికి వెళ్తే.. దాని ప్రత్యే కతలు తెలుసుకునేందుకు సందర్శకులు అక్కడి మ్యూజియం కోసం వెదుకుతారు. మన దేశంలో వీటి జాడ అంతగా లేనప్పటికీ, విదేశాల్లో అన్ని ప్రధాన సందర్శనీయ ప్రాంతాల్లో మ్యూజియంలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటిని కూడా మార్చి ఆధునికంగా ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తు న్నారు. త్రీడీ పరిజ్ఞానంతో సరికొత్తగా విషయా లను మనముందుంచే ఏర్పాట్లు కూడా ఉంటు న్నాయి. కేవలం ఆయా ప్రాంతాల ప్రత్యేక తలను వివరించటానికే పరిమితం కాకుండా సదస్సులు, చర్చాగోష్టులు, ఎగ్జిబిషన్లు నిర్వ హించే వెసులుబాట్లు వీటి సొంతం. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఈ కేంద్రాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో తొలిసారిగా ఓ భారీ సెంటర్ ఏర్పాటు కాబో తోంది. నిర్మాణం పూర్తయితే ఇది దేశంలోనే పెద్ద ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్ కానుంది. దీనికి కుతుబ్‌షాహీ టూంబ్స్ ప్రాంగణం వేదిక కాబోతోంది. కేంద్ర ప్రభుత్వ పథకం ‘స్వదేశీ దర్శన్’ కింద దాదాపు రూ.45 కోట్ల భారీ వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. కుతుబ్ షాహీల సమాధులను అంతర్జాతీయ ప్రమాణా లతో అభివృద్ధి చేస్తున్న ఆగాఖాన్ ట్రస్ట్ పనులకు అదనంగా కేంద్రం దీనిపై భారీగా వ్యయం చేయబోతోంది. ఇటీవల స్వదేశీ దర్శన్ పథకం కింద రూ.94 కోట్లు మంజూరు చేసింది. ఇందులో సింహభాగం కుతుబ్ షాహీ టూంబ్స్ అభివృద్ధికే ఖర్చు చేయనున్నారు. టూంబ్స్ అభివృద్ధిపై సమీక్ష కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణ అభివృద్ధిపై పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం సమీక్ష జరిపారు. సమావేశంలో ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్ నిర్మాణంపైనా చర్చించారు. పురావస్తు శాఖ అధికారులతో పాటు ఆగాఖాన్ ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు. కుతుబ్‌షాహీ సమాధులను ప్రాధాన్య పర్యాటక కేంద్రంగానే కాకుండా యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా దక్కేలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం ఆగాఖాన్ ట్రస్టు నిర్వహిస్తున్న పనులు వేగంగా సాగాల్సి ఉందని పేర్కొన్న ఆయన, అంతర్జాతీయ స్థాయిలో ‘మ్యూజియం’ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దాన్ని కేంద్రానికి పంపి వీలైనంత త్వరగా నిధులు విడుదల చేసేలా చూడాల్సి ఉందన్నారు. టూంబ్స్ అభివృద్ధికి చేపడుతున్న పనుల వివరాలను ఆగాఖాన్ ట్రస్టు సీఈవో రితేశ్ నందా వివరించారు. స్వదేశీ దర్శన్ కింద పనులు చేపట్టే ఇతర ప్రాంతాల ప్రణాళికలను పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రహీం షా అలీ, అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణ వివరించారు. ఆధునిక హంగులతో.. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన కుతుబ్‌షాహీ రాజవంశానికి చెందిన పాలకుల సమాధులు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ప్రపంచంలో మరే రాజవంశానికి ఈ అవకాశం దక్కలేదు. హైదరాబాద్ నగర చరిత్ర వీరితోనే మొదలైంది. దీంతో ఆ వంశానికి చెందిన అన్ని వివరాలను ప్రజల ముగింట ఉంచే బృహత్తర ఏర్పాట్లు జరుగుతున్నాయి. టూంబ్స్ ప్రాంగణంలోని విశాలమైన స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. భారీ హంగులతో ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్‌ను నిర్మించాలని నిర్ణయించారు. -
జ్ఞానదీపాల వెలుగులో...
మే 18 ఇంటర్నేషనల్ మ్యూజియం డే మౌనముద్రదాల్చినట్లుగా కనిపిస్తాయి మ్యూజియాలు. నిజానికి అవి నిరంతరం మాట్లాడుతూనే ఉంటాయి. అవి ఉబుసుపోని మాటలు కాదు. కళాతత్వాన్ని గురించి విడమరచి చెప్పే మాటలు. చరిత్రను కళ్లకు కట్టినట్లుగా వ్యాఖ్యానించే మాటలు. కొన్ని మాటలు మాటలుగా మాత్రమే ఉండవు. అవి వెలుగుదీపాలై దారి చూపుతాయి. మ్యూజియంలోకి అడుగుపెట్టడం అంటే గంభీరమైన పాతభవనంలోకి అడుగుపెట్టడం కాదు. ఒక కొత్త దారిని వెదుకుతూ వెళ్లడం. జర్మనీలో ఎన్నో ప్రసిద్ధ మ్యూజియాలు ఉన్నాయి. ‘కవులు, ఆలోచనావాదుల భూమి’గా పిలవబడే జర్మనీ కళా, సాంస్కృతిక మేధా వికాసం ఆ దేశంలో కొలువుతీరిన మ్యూజియాల్లో వెయ్యివెలుగులై కనిపిస్తుంటుంది. ‘ఇంటర్నేషనల్ మ్యూజియం డే’ సందర్భంగా కొన్ని మ్యూజియాల గురించి సంక్షిప్తంగా... స్పేస్ ట్రావెల్ మ్యూజియం: స్పేస్ టెక్నాలజీకి అద్దంపట్టే ఈ మ్యూజియం ప్రాన్కోనియన్ నగరంలో ఉంది. భవిష్యత్ దార్శనికుడు, రాకెట్ సాంకేతిక జ్ఞాన మార్గదర్శిగా పేరున్న హెర్మన్ ఒబెర్త్ జ్ఞాపకాలకు సంబంధించిన వస్తువులతో పాటు క్యుములస్ రాకెట్, సిర్రస్ రాకెట్లాంటి రకరకాల రాకెట్లు ఇక్కడున్నాయి. మ్యూజియం ముందు కనిపించే స్విస్ జెనిట్ సౌండింగ్ రాకెట్ ప్రత్యేక ఆకర్షణ. బవేరియన్ నేషనల్ మ్యూజియం: మ్యూనిచ్‌లో ఉన్న ఈ మ్యూజియం జర్మనీలోని అతి పెద్ద మ్యూజియంగా పేరు గాంచింది. డెకొరేటివ్ ఆర్ట్స్‌కు సంబంధించిన ఈ మ్యూజియాన్ని 1885లో నిర్మించారు. ఆర్ట్ హిస్టారికల్, ఫోక్లోర్ కలెక్షన్ అనే రెండు విభాగాలుగా ఉన్న ఈ మ్యూజియంలో ఎన్నో అపురూపమైన వస్తువులు ఉన్నాయి. మ్యూజియం ఫైవ్ కాంటినెంట్స్: మ్యూనిచ్‌లో ఉన్న ఈ మ్యూజియంలో నాన్-యురోపియన్ ఆర్ట్‌వర్క్స్ ఉన్నాయి. 1859లో నిర్మించిన ఈ మ్యూజియం జర్మనీలో రెండవ అతి పెద్ద మ్యూజియంగా పేరు గాంచింది. రెండు లక్షలకు పైగా కళాకృతులు ‘మ్యూజియం ఫైవ్ కాంటినెంట్స్’లో ఉన్నాయి. జర్మన్ స్టీమ్ లొకోమోటివ్ మ్యూజియం: ఫ్రాంకోనియాలో ఉన్న ఈ మ్యూజియాన్ని 1977లో నిర్మించారు. ఈ మ్యూజియం ఉండే స్థలంలో 1895లో నిర్మించిన లొకమోటివ్ షెడ్ ఉండేది. దాదాపు 30 స్టీమ్ లొకోమోటివ్లు ఈ మ్యూజియంలో ఉన్నాయి. టాయ్ మ్యూజియం: ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ టాయ్ మ్యూజియం నురెంబెర్గ్లో ఉంది. 1971లో నిర్మితమైన ఈ మ్యూజియంలో ప్రాచీన చరిత్ర నుంచి ఆధునిక చరిత్ర వరకు కళ్లకు కట్టే బొమ్మలు, కళాకృతులు ఉన్నాయి. మ్యూజియం బ్రాండ్హోస్ట్: 2009లో మ్యూనిచ్‌లో నిర్మించిన ఈ మ్యూజియంలో ఆధునిక కళకు అద్దంపట్టే అపురూప కళాకృతులు ఉన్నాయి. విజువల్ ఆర్ట్ మూమెంట్లో కీలక పాత్ర వహించిన అమెరికన్ ఆర్టిస్ట్ ఆండీ వర్హాల్కు చెందిన వంద చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. అమెరికన్ పెయింటర్, ఫొటోగ్రాఫర్ టుంబ్లీ సృజనాత్మక చిత్రాలు 60 వరకు ఉన్నాయి. మ్యూజియం ఐలాండ్: బెర్లిన్‌లో ఉన్న మ్యూజియం ఐలాండ్ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో చోటు చేసుకుంది. మ్యూజియం ఐలాండ్‌లో ఐదు మ్యూజియాలు ఉన్నాయి. పెర్గమన్, బోడ్, న్యూయిజ్, అల్టే, ఆల్టేస్...అనే ఈ ఐదు మ్యూజియాలను వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుంచి సందర్శకులు వస్తుంటారు. ప్రాచీన చిత్ర, శిల్ప కళాసంపదకు ఈ మ్యూజియాలు అద్దం పడతాయి. బ్రైత్-మలి-మ్యూజియం: దక్షిణ జర్మనీలోని బెబైరక్ నగరంలో ఉన్న ఈ మ్యూజియంలో పురాతత్వ, చరిత్ర, కళలకు సంబంధించిన రకరకాల వస్తువుల కళాకృతులు ఉన్నాయి. -
పసుపు పచ్చని రోడ్డు తోడుంటే...
విహారం ‘‘అక్కడ ఏయే ప్రదేశాలు చూసి వచ్చారు?’’ అని ఒకప్పుడు నెదర్లాండ్స్‌కు వెళ్లి వచ్చిన పర్యాటకులను అడిగితే.... వైబ్రెంట్ క్యాపిటల్ ‘ఆమ్స్టర్డమ్’ గురించి... అక్కడ ఉన్న గొప్ప చారిత్రక ఆర్ట్ గ్యాలరీలు, మ్యూజియమ్ల గురించి చెప్పేవారు. అంతేనా? టులిప్ పువ్వుల గురించి కూడా. టులిప్ పుష్పాలను చూడాలంటే నెదర్లాండ్సలోనే చూడాలి అంటుంటారు. ‘ద గార్డెన్ ఆఫ్ యూరప్’గా పేరున్న లిస్సే నగరంలోని కెకెన్హాప్ గార్డెన్ గురించి మాత్రమే కాదు... హాగే నేషనల్ పార్క్ గురించి కూడా ప్రత్యేకంగా చెబుతుం టారు. 13,800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్క్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి స్కీడామ్ మాటేమిటి! అసలింతకీ అదేమిటి అంటారా? ‘బీద నగరం’ అంటే చప్పున గుర్తుపడతారేమో! నెదర్లాండ్‌సలోని స్కీడామ్ నగరంలో చారిత్రాత్మకమైన కాలువలు, ప్రపంచం లోనే ఎత్తై గాలిమరలు తదితర ఆకర్షణలు ఉన్నప్పటికీ... పర్యాటకుల దృష్టిలోకి ఈ నగరం ఎప్పడూ వెళ్లలేదు. కానీ ఇప్పుడు మాత్రం నెదర్లాండ్‌సకు వచ్చే పర్యాటకులు స్కీడామ్ గురించి తప్పని సరిగా ఆరా తీస్తున్నారు. దీనికి కారణం.... ఎల్లో బ్రిక్ రోడ్డు! స్కీడామ్లోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ ఎల్లో రోడ్ రూపు దిద్దుకుంది. పసుపురంగు సంతోషానికి, సేఫ్టీకి, సక్సెస్‌కి చిహ్నాలుగా అక్కడ భావిస్తారట. అందువల్లే ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తే... పనిలో విజయం సిద్ధిస్తుందని, ఐశ్వర్యం ఇంటి తలుపు తడుతుందని బలంగా నమ్ముతారు స్కీడామ్ వాసులు. ఇది ఎంత వరకు నిజమో తెలియదుగానీ ‘ఎల్లో బ్రిక్ రోడ్డు’ పుణ్యమా అని ఎవరూ పట్టించు కోని స్కీడామ్పై నేడు పర్యాటకులు అమితాసక్తి కనబరుస్తున్నారు. ‘‘ఎప్పుడూ మా నగరం ముఖం చూడనివాళ్లు కూడా ఇక్కడికి పదే పదే వస్తూండటం నాకైతే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది’’ అంటున్నాడు స్కీడామ్ నివాసి రోనాల్డ్. ‘‘నెదర్లాండ్‌సలో ఉన్నప్పుడు ఒక మిత్రుడు ఈ స్కీడామ్ గురించి చెప్పాడు. ఆసక్తితో అక్కడికి వెళ్లాను. నా ప్రేమ ఫలించాలని మనసులో అనుకుంటూ ఎల్లో రోడ్డు మీద ప్రయాణిం చాను. ఏదో సరదా కోసం చేసిన పని ఇది. కానీ చిత్రమేమిటంటే కొద్ది కాలంలోనే నేను ప్రేమించిన అమ్మాయితో నాకు పెళ్లి జరిగిపోయింది’’ అంటున్నాడు యువ ఆస్ట్రేలియన్ ఇంజినీర్ హ్యారిసన్. ‘ఎల్లో బ్రిక్ రోడ్డు మీద ప్రయాణిం చడం వల్ల మంచి జరుగుతుంది’ అనే ప్రచారాన్ని ఖండిస్తున్నవారు కూడా లేక పోలేదు. అయితే వారి ఖండన మండనల మాట ఎలా ఉన్నా....‘ఇదేదో వింత రోడ్డు’ అనుకునేవాళ్లు, ‘ఒక ప్రయత్నం చేద్దాం’ అనుకునేవాళ్లు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు. ఈ పసుపు పచ్చని రోడ్డు మీద ప్రయాణించి తమ సరదాను తీర్చుకుంటున్నారు. అమెరికన్ రచయిత ఎల్.ఫ్రాంక్ బామ్ రాసిన ‘ద వండర్ఫుల్ విజార్డ్ ఆఫ్ ఓజ్’ నవల చాలా ప్రాచుర్యం పొందింది. 1900 సంవత్సరంలో విడుదలైన ఈ పుస్తకం పాఠక ఆదరణ చూరగొనడమే కాదు... అమెరికన్ పాపులర్ కల్చర్‌లో భాగమై పోయింది. ఈ నవల ఆధారంగా ఇదే పేరుతో 1939లో హాలీవుడ్లో కామెడీ-డ్రామా ఫాంటసీ సినిమా రూపుదిద్దుకుంది. ‘ద విజార్డ్’లో ఎల్లో బ్రిక్ రోడ్డు ఒక ముఖ్య ఆకర్షణ. కాలక్రమంలో ఈ రోడ్డు నవలలో నుంచి వాస్తవ ప్రపంచంలోకి వచ్చింది. రెస్టారెంట్ల నుంచి ప్రచురణ సంస్థల వరకు ‘ఎల్లో బ్రిక్ రోడ్’ పేరును వాడుకున్నాయి. స్కీడామ్లోని పసుపు పచ్చని రోడ్డుకు ‘ఎల్లో బ్రిక్ రోడ్’ అని పేరు పెట్టింది కూడా అందుకే అని చెబుతుంటారు.