న్యూఢిల్లీ: వీక్ ఎండ్ వస్తే చాలు జనాలు సినిమాలకు, జూపార్కలకు, మ్యూజియంకి వెళ్లేవారు. ముఖ్యంగా పురాతన వస్తువులను చూడటానికి పిల్లలు ఎక్కువ ఆసక్తి చూపేవారు. అలాంటిది కోవిడ్-19 కారణంగా గత కొన్ని నెలలుగా ఇళ్లకే పరితమైపోయారు. మ్యూజియంలలో పురాతణ వస్తువులను చూసి ఆనందించాలనుకునే వారు ఎప్పుడు ఇవి తిరిగి ప్రారంభం అవుతాయా అని ఆశగా ఎదురుచూస్తునన్నారు, అలాంటి వారికి కేంద్రం ప్రభుత్వం శుభవార్తచెప్పింది.
ఈ నెల 10వ తేదీ నుంచి మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు, ఎగ్జిబిషన్లను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుతిచ్చింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించడానికి గురువారం ప్రామాణిక మార్గదర్శకాలను జారీ చేసింది. నవంబర్ 10 నుంచి కేంద్ర సాస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు, ఎగ్జిబిషన్‌లు తిరిగి ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రం, నగర, స్థానిక చట్టాల నియమ నిబంధనలను అనుసరించి మిగతా వారు కూడా వీటిని పునః ప్రారంభించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వీటిని సందర్శించడానికి వచ్చేవారు తప్పనిసరిగా మాస్క ధరించి రావాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ప్రవేశ ద్వారం దగ్గర ముందుగా టెంపరేచర్ చెక్ చేసి, శానిటైజ్ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తారు. కరోనా విజుృంభిచడంతో కేంద్రం మార్చి నుంచి లాక్‌డౌన్ విధించింది. ఈ కారణంగా అన్నింటితో పాటు మ్యూజియంలు కూడా మూత పడ్డాయి. ఏడు నెలల తర్వాత వీటిని తిరిగి ప్రారంభించే అవకాశం దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment