
న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో లేడి డాన్‌గా పేరొందిన జోయాఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జోయాఖాన్ వద్ద నుంచి 270 గ్రాముల నిషేధిత హెరాయిన్‌ను స్పెషల్ సెల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ హషీమ్‌బాబా మూడో భార్య అయిన జోయాఖాన్ బాబా నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తోంది.
విలాసవంతమైన జీవితం గడిపే జోయా సెలబ్రిటీల పార్టీలు,ఫంక్షన్‌లకు తరచు హాజరవుతుంది.గ్యాంగ్ నడిపే విషయమై తన భర్త బాబాను తరచు జైలుకు వెళ్లి కలిసి సలహాలు తీసుకుంటుందని పోలీసులు తెలిపారు.జోయాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె వారి నుంచి తప్పించుకుంటూ వస్తోంది.
అయితే నార్త్‌ఈస్ట్‌ఢిల్లీలో డ్రగ్స్ సరఫరా చేస్తోందని వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి జోయాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.జోయా వద్ద దొరికిన 270 గ్రాముల హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక కోటి రూపాయల దాకా ఉంటుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment