lady don
-
ఢిల్లీ లేడీడాన్ అరెస్ట్.. డ్రగ్స్ సరఫరా చేస్తుండగా..
న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో లేడి డాన్‌గా పేరొందిన జోయాఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జోయాఖాన్ వద్ద నుంచి 270 గ్రాముల నిషేధిత హెరాయిన్‌ను స్పెషల్ సెల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ హషీమ్బాబా మూడో భార్య అయిన జోయాఖాన్ బాబా నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తోంది. విలాసవంతమైన జీవితం గడిపే జోయా సెలబ్రిటీల పార్టీలు,ఫంక్షన్లకు తరచు హాజరవుతుంది.గ్యాంగ్ నడిపే విషయమై తన భర్త బాబాను తరచు జైలుకు వెళ్లి కలిసి సలహాలు తీసుకుంటుందని పోలీసులు తెలిపారు.జోయాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె వారి నుంచి తప్పించుకుంటూ వస్తోంది.అయితే నార్త్ఈస్ట్ఢిల్లీలో డ్రగ్స్ సరఫరా చేస్తోందని వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి జోయాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.జోయా వద్ద దొరికిన 270 గ్రాముల హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఒక కోటి రూపాయల దాకా ఉంటుందని అంచనా. -
నోయిడా హత్య కేసు.. లేడీ డాన్ అరెస్ట్
ఢిల్లీ: సంచలనం సృష్టించిన ఎయిర్ ఇండియా ఉద్యోగి సూరజ్ మాన్ హత్య కేసులో ఎట్టకేలకు లేడీ డాన్ కాజల్ ఖత్రీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నోయిడాలో ఈ ఏడాది జనవరి 19న ఎయిర్ ఇండియా ఉద్యోగి సూరజ్ మాన్ కారులోనే హత్యకు గురైన సంగతి తెలిసిందే. బైక్‌పై వచ్చిన హంతకుల ముఠా కాల్పులు జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. 8 నెలల తర్వాత కీలక పురోగతి సాధించారు. ఈ హత్య వెనుక ఢిల్లీ లేడీ డాన్ కాజల్ ఖత్రీ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. గ్యాంగ్‌స్టర్ కపిల్ మాన్ ఆదేశాల మేరకే ఈ హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు.బాధితుడు సూరజ్ మాన్.. గ్యాంగ్‌స్టర్ పర్వేష్ మాన్ సోదరుడు. కపిల్ మాన్.. పర్వేష్ మాన్ మధ్య ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది. తన తండ్రిని పర్వేష్ మాన్ హత్య చేశాడంటూ కపిల్ మాన్ పగ పెంచుకున్నాడు. దీంతో తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు పర్వేష్ మాన్ సోదరుడు సూరజ్ మాన్ హత్యకు ప్లాన్ వేశాడు.ఇదీ చదవండి: చెప్పులు వేసుకుని రావద్దన్న డాక్టర్‌పై దాడి.. వీడియో వైరల్అయితే, తన భార్య అయిన.. లేడీ డాన్ కాజల్ ఖత్రీ సాయంతో ప్రణాళిక అమలు చేశాడు. కాగా, కపిల్ మాన్, పర్వేష్ మాన్ ఇద్దరూ ఢిల్లీలోని మండోలి జైల్లోనే ఉన్నారు. కాజల్ ఖత్రీ తలపై రూ.25 వేలు పారితోషికం ఉందని ఢిల్లీ పోలీసు అధికారి సంజయ్ భాటియా వెల్లడించారు. నోయిడాలో హత్యకు గురైన సూరజ్ మాన్ కేసులో కాజల్‌ను అరెస్ట్ చేసి నోయిడా పోలీసులకు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. -
లేడీ డాన్ అనూరాధ ఆటకట్టు
న్యూఢిల్లీ: రాజస్థాన్‌కు చెందిన లేడీ డాన్ అనురాధ చౌదరి ఆట కట్టించారు ఢిల్లీ పోలీసులు. పలు మర్డర్ కేసులు, దోపిడి, కిడ్నాప్ ఆరోపణలున్న గ్యాంగ్‌స్టర్ అనురాధను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ శనివారం ప్రకటించింది. మరో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జతేదిని ఉత్తర ప్రదేశ్‌లో అరెస్ట్ చేసిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. తదుపరి విచారణ కోసం వీరిద్దరినీ రిమాండ్‌కు తరలించారు. రాజస్థాన్‌లో దోపిడీ, కిడ్నాప్ , హత్యతో సహా అనేక కేసులలో నిందితురాలు. అనురాధ గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పాల్ సింగ్ సహచరి అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ సెల్-కౌంటర్ ఇంటెలిజెన్స్) మణిషి చంద్ర తెలిపారు. రాజస్థాన్‌లోని చురు జిల్లాలో 2017లో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో ఆనంద్‌పాల్ హతమైనాడనీ, అయితే పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న అనురాధ కాలా జతేదిని కలిసిందని చెప్పారు. వీరిద్దరు తొమ్మిది నెలలుగా కలిసి ఉంటున్నారన్నారు. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలలో అనేక దోపిడీలు, హత్యలు, ఇతర క్రూరమైన నేరాలలో కాలా జాతేది మోస్ట్ వాంటెడ్. అతని తలపై రూ. 7 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. కాగా పోలీసుల సమాచారం ప్రకారం, ఛత్రసల్ స్టేడియం ఘర్షణ, యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్‌ను అరెస్టు చేసిన కేసులో అతని బంధువు సోను కూడా గాయపడడంతో గ్యాంగ్‌స్టర్ పేరు బయటపడింది. దీంతో సుశీల్ కుమార్‌తో జతేదీకి ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. -
అన్ను గ్యాంగ్ ఫ్రం మాలేగావ్!
సాక్షి, సిటీబ్యూరో: అన్ను డాన్‌గా చలామణి అయ్యే ఆమె పేరు సాజిదా బషీర్ అన్సారీ.. మహారాష్ట్రలోని మాలేగావ్‌కు చెందిన ఈమె మరికొందరిని ‘ఎంగేజ్’ చేసుకుంటుంది.. మహారాష్ట్రతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లోని నగరాల్లో పంజా విసురుతుంది.. గత ఏడాది అక్టోబర్‌లో గుల్జార్‌హౌస్‌లోని ఓ జ్యువెలరీ దుకాణం నుంచి భారీగా బంగారు చెవి దుద్దులు ఎత్తుకుపోయింది.. రంగంలోకి దిగిన దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు.. విచారణ నేపథ్యంలో కుర్లాలోనూ నేరం చేసినట్లు బయటపడింది. దీంతో గత వారం వచ్చిన అక్కడి పోలీసులు ఈ గ్యాంగ్‌ను పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లారు. ఆ మహిళల్ని సభ్యులుగా చేసుకుని.. మాలేగావ్‌లోని కమలాపుర ప్రాంతానికి చెందిన అన్ను డాన్ ఆ పట్టణంలో ఉన్న మహిళల్ని ఎంచుకుని గ్యాంగ్ ఏర్పాటు చేసుకుంటుంది. భర్తల నుంచి వేరుపడి ఒంటరిగా నివసిస్తున్న వారితో పాటు భర్తలు చనిపోయిన మహిళలను ఆకర్షిస్తుంది. తనతో వచ్చి సహకరిస్తే ఒక్కో ట్రిప్‌నకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఇస్తానంటూ ఒప్పందం చేసుకుంటుంది. ఇలా ఒక్కో దఫా నలుగురి నుంచి ఐదుగురు మహిళలు, ఇద్దరు డ్రైవర్లతో అద్దెకు తీసుకున్న తేలికపాటి వాహనాల్లో ఎంచుకున్న ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ గ్యాంగ్ సాధారణంగా మాలేగావ్ నుంచి కనిష్టంగా 300 గరిష్టంగా 600 కిమీ దూరంలో ఉన్న పట్టణాలను టార్గెట్‌గా చేసుకుంటుంది. మాలేగావ్ నుంచి బయలుదేరే ముందే వాళ్లు ఏం చేయాలనే దానిపై తమ అనుచరులకు పక్కా ఆదేశాలు జారీ చేస్తుంది. దుకాణా యజమానులు, ఉద్యోగులను ఆకర్షించాలని, వివిధ వస్తువులు చూపమంటూ వారి దృష్టిని మళ్లించాలని స్పష్టం చేస్తుంది. దుకాణంలో ఉన్నంత సేపూ ఒకరికి ఒకరు పరిచయం లేనట్లే నటించాలని వారికి చెబుతుంది. దుకాణాదారుల దృష్టి మళ్లించి.. ఓ నగరాన్ని టార్గెట్‌గా చేసుకున్న తర్వాత అక్కడకు చేరుకునే అన్ను గ్యాంగ్ లాడ్జిలో బస చేస్తుంది. రద్దీగా ఉండి, ఎక్కువ మంది ఉద్యోగులు లేని బంగారం దుకాణాలను ఎంచుకుంటుంది. అన్ను సహా గ్యాంగ్ సభ్యులంతా ఎవరికి వారుగా వేర్వేరుగా ఆ దుకాణంలోని వస్తారు. ఆపై అనేక వస్తువులు చూసినట్లు నటించి, ఓ డిజైన్‌ను ఖరారు చేస్తారు. దానికి సంబంధించి ఆ దుకాణ యజమానికి అడ్వాన్స్ కూడా చెల్లిస్తారు. ఈ లోపు అన్న అదను చూసుకుని కొన్ని వస్తువులతో ఉన్న జ్యువెలరీ బాక్స్‌తో ఉడాయిస్తుంది. తర్వాత మిగిలిన వాళ్లూ ఏమీ ఎరగనట్లు వెళ్లిపోతారు. ఈ పంథాలో ఈ గ్యాంగ్ గత ఏడాది అక్టోబర్ 28న నాంపల్లిలోని లాడ్జిలో బస చేసింది. అదే రోజు సాయంత్రం గుల్జార్‌హౌస్‌లోని ఖాజా అండ్ సన్స్ జ్యువెలరీ దుకాణానికి వెళ్లింది. అక్కడ మోడల్స్ నచ్చలేదంటూ పక్క దుకాణం నుంచి చెవి రింగుల కూడిన బాక్స్ తెప్పించింది. చివరకు ఓ నెక్లెస్ నచ్చినట్లు నటించిన ఈ గ్యాంగ్ సభ్యులు దాన్ని అర్డర్ ఇచ్చింది. రూ.5 వేలు అడ్వాన్స్ సైతం చెల్లించి అదును చూసుకుని 22.5 తులాల బంగారు రింగులతో కూడిన ఆ బాక్స్‌ను తీసుకుని ఉడాయించింది. మరుసటి రోజు ఈ విషయం గుర్తించిన దుకాణ యజమాని మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వాహన నంబర్ ఆధారంగా.. ఓ నగరంలో నేరం చేసిన వెంటనే ఈ గ్యాంగ్ తమ వాహనంలో ప్రయాణమవుతుంది. మళ్లీ కొన్నాళ్ల దాకా అటు వైపు రాదు. ఈ కేసు దర్యాప్తు చేయడానికి దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. బుర్ఖాలు ధరించిన నలుగురు మహిళల ఆనవాళ్లు వెతుకుతూ ఆ దుకాణం నుంచి వరుసగా అన్ని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను తనిఖీ చేస్తూ వెళ్లింది. ఈ నేపథ్యంలోనే చార్మినార్ సమీపంలో ముఖానికి ముసుగులు తొలగించిన అనుమానితులు కనిపించారు. మరికొన్ని సీసీ కెమెరాలను తనిఖీ చేయగా వీళ్లు ప్రస్తుతం పార్కింగ్ ప్లేస్‌గా మారిన చార్మినార్ బస్టాండ్‌లో రెండు వాహనాలను ఉంచినట్లు తేలింది. వాటి నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు మాలేగావ్‌కు చెందిన నేరగాళ్లుగా గుర్తించి అక్కడకు వెళ్లారు. అయితే అప్పటికే అన్ను గ్యాంగ్ రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు వెళ్లినట్లు గుర్తించింది. అక్కడే కాపుగాసిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఎట్టకేలకు అన్నుతో పాటు తాహెరా ఖుర్షీద్, నజియా షేక్ ఇజ్రాయిల్, షబానా యూసుఫ్ మన్సూరీ, సయ్యద్ రహీం, సయ్యద్ నవాజ్‌లను అరెస్టు చేసింది. వీరి నుంచి 30 తులాల బంగారు ఆఖరణాలు రికవరీ చేసింది. విచారణ నేపథ్యంలో అన్ను గ్యాంగ్ 2012లో నిజామాబాద్‌లో నేరం చేసి అరెస్టు అయిందని తేలింది. పాతబస్తీ తర్వాత ఈ ముఠా ముంబైలోని కుర్లాలోనూ ఓ నేరం చేసినట్లు అంగీకరించింది. దీంతో పోలీసులు అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. గత వారం పీటీ వారెంట్లతో వచ్చిన కుర్లా పోలీసులు ఈ గ్యాంగ్‌ను అక్కడకు తరలించారు. -
మెక్సికో లేడీ డాన్ ఆఖరి క్షణాలు....
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇన్స్టాగ్రామ్’ సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మెక్సికో మాఫియా లేడీ డాన్ ‘లా కత్రినా’ పోలీసుల ఎన్కౌంటర్లో మరణించారు. ఆమె అసలు పేరు మెరియా గ్వాడలూప్ లోపెజ్ ఎస్కివెల్. హత్యలు, కిడ్నాప్‌లతోపాటు మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ వ్యాపారం చేసే మాఫియా మూఠాకు ఆమె 2017లో నాయకురాలు అయ్యారు. తండ్రి నుంచి ఆమెకు ఆ నాయకత్వం దక్కిందని చెబుతారు. ఆమె గత అక్టోబర్ 14వ తేదీన పోలీసులపై దాడి చేయగా 13 మంది పోలీసులు మరణించారు. 9 మంది గాయపడ్డారు. అప్పటి నుంచి మెక్సికో పోలీసులు ఆమె కోసం కాపు కాస్తున్నారు. ‘ఎం 2’గా వ్యవహరించే మరో ముఠా నాయకుడిని కలుసుకునేందుకు ఆమె గత శుక్రవారం తన బాడీ గార్డులతో లా బొకాండ నగరంలోని ఓ ఇంటికి నిరీక్షిస్తుండగా, పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ఇంటిపై మెరుపు దాడి జరిపి కాల్పులు జరపగా, ఆమె మెడలో బుల్లెట్ దిగి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆమె మరణించారు. పోలీసుల కాల్పుల్లో ఆమె ముఠాకు చెందిన మరో యువతి మరణించగా, ఏడుగురు గన్మేన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ ఎత్తున తుపాకులు, మందుగుండు సామాగ్రి దొరికాయి. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సోమవారం మీడియాకు అందిన వీడియో ఫొటోలు, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తీవ్రంగా గాయపడిన లా కత్రినా ఆఖరి క్షణాలను వీడియోలో చూడవచ్చు. ఆమె ఏకే 47 తుపాకీ పట్టుకొని దిగిన ఫొటో అప్పట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం రేపింది, -
లేడీ డాన్ హల్చల్!
కృష్ణాజిల్లా, తాడేపల్లిరూరల్ (మంగళగిరి): రాజధాని పరిధిలోని తాడేపల్లి మున్సిపాలిటీలో ఓ లేడీ డాన్ హల్చల్ చేస్తోంది. దాదాపుగా రెండు ప్రాంతాల్లో చక్రం తిప్పుతూ తనదైన శైలిలో దౌర్జన్యం చేస్తూ, పేద బలహీన వర్గాల వారిని టార్గెట్ చేస్తోంది. అవసరాల నిమిత్తం రూ.10 వేలు, రూ.20 వేలు ఇచ్చి వడ్డీకి చక్రవడ్డీ వేసి రూ.20 వేల నుంచి రూ.40 వేలు వసూలు చేస్తోంది. సకాలంలో ఇవ్వకపోతే వారిపై దౌర్జన్యం చేయడమే కాకుండా చితకబాది మరీ వారి వద్ద ఉన్న ఆస్తులను కబ్జా చేసి తన వశం చేసుకుంటోంది. ఇలాంటి సంఘటనే తాజాగా నులకపేటలో సదరు లేడీ డాన్ దెబ్బకు ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను అప్పజెప్పి, ఏం చేయాలో అర్థంకాక చివరకు పోలీసులను ఆశ్రయించాడు. సేకరించిన వివరాల ప్రకారం.. నులకపేట ప్రాంతంలో నివసించే నాంచారయ్య వద్ద డ్రైవర్‌గా పనిచేసే విజయ్, అతని స్నేహితుడు సదరు మహిళ వద్ద రూ.10 వేలు నగదు తీసుకున్నారు. సకాలంలో ఆ నగదు చెల్లించకపోవడంతో రెండు రోజుల క్రితం విజయ్ తోలుతున్న ఆటోను సదరు మహిళ లాక్కొని, వడ్డీతో సహా రూ.20 వేలు చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. ఆటో డ్రైవర్ విజయ్ జరిగిన విషయాన్ని ఆటో యజమాని నాంచారయ్యకు చెప్పగా, నాంచారయ్య నా ఆటో నాకు ఇవ్వాలని సదరు లేడీ డాన్‌ను అడగ్గా, ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. నీకు చేతనైంది నువ్వు చేస్కో అని తేల్చి చెప్పింది. జరిగిన సంఘటనపై నాంచారయ్య శుక్రవారం నుంచి ఆది వారం వరకు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో పడిగాపులు గాచినా ఎటువంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. డ్రైవర్, అతని స్నేహితుడు డబ్బులు తీసుకుంటే మేమేం చేయాలి.., మా ఆటో లాక్కోవడం ఏమిటని ప్రశ్నించినా ప్రయోజనం లేదని నాంచారయ్య తెలియజేశాడు. గతంలో ఈ మహిళ నులకపేట ప్రాం తంలో ఓ ఆటో ఓనర్‌ను కరెంటు స్తంభానికి కట్టేయగా, పోలీసులు వెళ్లడంతో అతన్ని విడిచిపెట్టారు. అప్పుడు కూడా ఎటువంటి కేసూ నమోదు కాలేదు. సదరు మహిళ నులకపేట, పరిసర ప్రాం తాల్లోని రోజువారీ కూలీలు, కార్మికులను టార్గెట్ చేసి, వారి అవసరాల దృష్ట్యా రూ.10 వేలు, రూ. 20 వేలు ఇచ్చి, వారానికి రూ.10 వేలైతే రూ.1000 వడ్డీ, రూ.20 వేలైతే రూ.2000లు వడ్డీ వసూలు చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు దృష్టికి వచ్చినా మీరెందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఎవరికైనా అస్వస్థత చేసినప్పుడు, ఆటోలు రిపేర్ అయినప్పుడు ఆమె బారిన పడక తప్పట్లేదని, అయితే ఆమె చెప్పిన నగదు మొత్తం చెల్లిస్తున్నప్పటికీ 2, 3 రోజులు ఆలస్యమైతే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతోందని స్థానికులు అంటున్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న లేడీ డాన్‌పై రాజధాని పోలీసులు చర్యలు తీసుకుంటారా? లేక ఎందుకొచ్చిందిలే అని వదిలేస్తారో వేచిచూడాల్సిందే. -
లేడీ డాన్
పెళ్లి తర్వాత ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు నమిత. 2016లో మలయాళ నటుడు మోహన్‌లాల్ ‘పులి మురుగన్’నే సిల్వర్ స్క్రీన్‌పై నమిత లాస్ట్ సినిమా. లేటెస్ట్గా తమిళ దర్శకుడు టి.రాజేందర్ డైరెక్షన్లో ఓ మూవీలో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ‘ఇండ్రయ కాదల్ డా’ (ఇవాళ్టి ప్రేమ రా అని అర్థం) అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ రొమాంటిక్ డ్రామాలో నమిత లేడీ డాన్‌లా కనిపించనున్నారు. పదకొండేళ్ల తర్వాత టి.రాజేందర్ మెగాఫోన్ çపడుతున్న ఈ చిత్రం యూత్‌ని టార్గెట్ చేసే విధంగా ఉండబోతోందట. త్రి భాషా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో చాలా మంది కొత్త నటులు కనిపించనున్నారని దర్శకుడు టి.రాజేందర్ పేర్కొన్నారు. -
లేడీ డాన్‌గా నమిత
తమిళసినిమా: టీ.రాజేంద్రన్ చాలా గ్యాప్ తరువాత మళ్లీ మెగాఫోన్ పట్టడానికి రెడీ అయ్యారు. ఇంతకు ముందు ఒరు తాయిన్ శపథం, ఎన్ తంగై కల్యాణి, సంసార సంగీతం, ఇంగవీట్టు వేలన్, మోనీషా ఎన్మోనాలిసా, సొన్నాల్దాన్ కాదలా, తన కొడుకు శింబును హీరోగా పరిచయం చేస్తూ కాదల్ అళివదిల్లై వీరాస్వామి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శింబు సినీ ఆర్ట్స్ సంస్థ ద్వారా టీ.రాజేందర్ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న చిత్రానికి ఇన్రైయ కాదల్ డా అనే పేరును నిర్ణయించారు. దీనికి కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, ఛాయాగ్రహణ పర్యవేక్షణ, దర్శకత్వం బాధ్యతలను టీఆర్‌నే నిర్వహించనున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఇందులో నటి నమిత లేడీడాన్‌గా నటించడానికి సమ్మతించారని చెప్పారు. ఆమెతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు నటించనున్నారన్నారు. పలువురు కొత్తవారిని పరిచయం చేయనున్నట్లు చెప్పారు. వారితో పాటు రాధారవి, ఇళవరసన్, వీటీవీ గణేశ్, వెన్నిరాడై మూర్తి, పాండు, రోబో శంకర్, మదన్‌బాబు, కవన్ జగన్ నటించనున్నారని తెలిపారు. ఇది పూర్తిగా యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా ఉంటుందని, నేటి తరానికి తగ్గట్టుగా ప్రేమ,ప్రేమ,ప్రేమ మినిహా వేరేమీ ఉండదని టీఆర్.పేర్కొన్నారు. మరి ఇలాంటి లవబుల్ కథలో లేడీ డాన్‌గా నమిత పాత్ర ఏమిటో అన్న ఆసక్తి కలుగుతోందా? ఆ వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉషా రాజేందర్, సహాయ నిర్మాతగా ఫరూక్ పిక్చర్స్ టి.ఫరూక్ వ్యవహరిస్తున్నారు. -
బ్యూటీ విత్ బ్రెయిన్ లేడీ డాన్
-
సూరత్ లేడిడాన్ అస్మిత అరెస్ట్
-
ఈ అందమైన అమ్మాయి పెద్ద ఆటం బాంబు
సూరత్ : చూడటానికి చూడముచ్చటగా.. తాకితే కందిపోయే శరీర సౌదర్యంతో, కళ్లు తిప్పుకోనివ్వని అందాన్ని కలిగి ఉంటుంది ఈ అమ్మాయి. ఆమె ముఖంలో అయితే ఇట్టే అమాయకత్వం ఉట్టిపడుతుంది. కానీ ఈ అమ్మాయి గురించి వింటే మీరు మాత్రం షాకవ్వాల్సిందే. సూరత్‌లో క్రైమ్‌ల మీద క్రైమ్‌లు చేసి ‘లేడీ డాన్’ నగరాన్నే తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది. 20ఏళ్లకే ఈమె నగర పోలీసులకు చుక్కలు చూపించింది. ఈమె పేరు అస్మితా. ఇటీవలే ఈ అమ్మాయిను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక దుకాణంలో నగదును అపహరించుకుని పోతున్న అస్మితను నగర పోలీసులు ఎట్టకేలకు పట్టుకుని, జైలు ఊసలు లెక్క పెట్టేలా చేశారు. పాన్ సెల్లర్ వద్దకు వచ్చి, బెదిరించిన ఈ అమ్మాయి అతని షాపులో నగదును తీసుకుని ఉడాయించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ మే 21న ఉదయం ఆ సంఘటన చోటు చేసుకుంది. చూడటానికి ఇంత బాగున్నా ఈ అమ్మాయి ఈ పనులు చేయడం ఏమిటా..? ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. పోలీసులకే ఈ లేడీ పెద్ద తలనొప్పిగా మారిందంటే అర్థం చేసుకోండి ఈ లేడీ డాన్ హవా ఎలా సాగుతుందో. ఈమెకు వ్యతిరేకంగా స్థానికులైతే కనీసం నోరు కూడా మెదపరట. ఎట్టకేలకు ఈమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు, చాలా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. -
లేడీ డాన్‌గా ‘పద్మావతి’
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావత్ బాలివుడ్ చిత్రంలో పద్మావతిగా నటించి విశేష ప్రేక్షకాదరణను మూటకట్టుకున్న సినీతార దీపికా పదుకొనే విశాల్ భరధ్వాజ్ దర్శకత్వంలో రానున్న చిత్రంలో ‘లేడీ డాన్’గా నటిస్తున్నారు. ముంబై మాఫియా సామ్రాజ్యంలో రారాణిగా పేరుపొందిన స్వప్నాదీదీ అలియాస్ అశ్రాఫ్ ఖాన్‌గా ఆమె తెర మీదకు రానున్నారు. తన భర్తను చంపాలని కుట్రపన్నిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను దుబాయ్ నుంచి భారత్‌కు రప్పించి హత్య చేయాలనే ఏకైక లక్ష్యంతో స్వప్న దీదీగా మాఫియా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన అశ్రాఫ్ ఖాన్ ఎదుర్కొన్న అనుభవాల్లో ఎలాంటివో ఈ సినిమాలో హద్యంగా చూపించనున్నారు. ‘13వ శతాబ్దానికి చెందిన ‘పద్మావతి’ పాత్రలో నటించిన తర్వాత ఓ మహిళా శక్తి ఎలాంటిదో చూపించే స్వప్నా దీదీ పాత్రలో నటించేందుకు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాను. నిజంగా జరిగిన స్వప్నా దీదీ కథ నాకు ఎంతో నచ్చింది. ఇంకా ఈ సినిమాకు ఎలాంటి పేరు పెడతారో నాకు తెలియదు. కానీ పద్మావతి పాత్రలో నటించిన నేను ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన పాత్రలో నటించే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందిస్తున్నాను. పాత్రకు పూర్తి న్యాయం చేస్తానన్న విశ్వాసంతో ఉన్నాను’ అని దీపికా పదుకొనే మీడియాతో వ్యాఖ్యానించారు. జేన్ బోర్జెస్‌తో కలిసి ఎస్ హుస్సేన్ జాయ్దీ రచించిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ది ముంబై’ అనే పుస్తకంలోకి అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది చివరలో విడుదలవుతుందని నిర్మాణ వర్గాలు తెలిపాయి. -
గుట్టుగా ‘హైటెక్’ వ్యభిచారం..!
సాక్షి, కడప అర్బన్/కార్పొరేషన్: కడప నగరశివార్లలోని రామాంజనేయపురం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. రామాంజనేయపురంలో గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరక్ష్యరాస్యులైన మహిళలకు అప్పులిచ్చి లొంగదీసుకొని ఈ రొంపిలోకి దించుతున్నట్లు సమాచారం. గతంలో మరియాపురంలో వ్యభిచార గృహం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడినట్లు ఓమహిళ ఈ అసాంఘీక కార్య్రక్రమానికి తెరతీసింది. చెన్నై, ముంబయి ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి విటులను ఆకర్షిస్తున్నట్లు సమాచారం. ఆ మహిళా డాన్‌కు జిల్లా టీడీపీ నాయకులతో పాటు, స్థానిక పోలీసుల మద్దతు భారీగానే ఉంది. పెద్ద పెద్ద కార్లలో రాజకీయ నాయకులు, పోలీసులు, ఇతర నాయకులు వచ్చిపోతుంటారు. ఐదేళ్లుగా ఆమె ఇదే వ్యాపారం సాగిస్తూ చాపకింద నీరులా తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోందని చెబుతున్నారు. పెద్ద పెద్ద వాళ్లు ఆమెను పలకరించి పోతుండటంతో స్థానికులెవ్వరూ ఆమెపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అప్పుడప్పుడు నామమాత్రంగా తనిఖీలకు వచ్చిన పోలీసులను మామూళ్లతో మభ్యపెడుతున్నారు. ‘వీకెండ్ స్పెషల్’ పేరుతో ‘పెద్ద మనుషుల’ కోసం ప్రత్యేక బృందం గుట్టు చప్పుడు కాకుండా సహకారం అందిస్తున్నట్లు సమాచారం. వారికి కావాల్సిన సురక్షిత సరంజామాను కూడా యథేచ్చగా సరఫరా చేస్తున్నారనీ గట్టిగా వినిపిస్తోంది. ఇబ్బంది పడుతున్న స్థానికులు రాత్రిళ్లు వ్యభిచార గృహం అనుకొని ఇతరుల ఇళ్ల తలుపులు కొడుతుండటంతో స్తానికులు లోలోన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ వ్యవహారంపై కొందరు జిల్లా ఉన్నతాధికారులకు పలు సార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవట్లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై ఎస్పీ దృష్టి పెట్టి అసాంఘీక కార్యకలాపాలను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు. -
భూకబ్జా కేసులో లేడీడాన్ అరెస్ట్
చాంద్రాయణగుట్ట: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 400 గజాల ఇంటిని కబ్జా చేసిన లేడీడాన్ను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ ప్రకాష్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బండ్లగూడ గౌస్‌నగర్ ఉందాహిల్స్ కాలనీలో సంతోష్‌నగర్ ఈదిబజార్‌కు చెందిన షేక్ వారీస్కు 400 గజాల ఇల్లు ఉంది. ఈ ఇంటిని ఫర్జానా బేగం, మన్సూర్, మరో తొమ్మిది మందితో కలిసి నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి కబ్జా చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. రెండు రోజుల క్రితం పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో ఈమెను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా బెయిల్‌పై బయటికి రావడంతో మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు. కబ్జాలకు పాల్పడుతున్న నిందితురాలిపై ల్యాండ్‌గ్రాబింగ్ షీట్ తెరవనున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆ లేడీ డాన్ ట్రాక్టర్‌తో తొక్కించింది