ఈ ఘటన చూశారంటే కోపం కట్టలు తెంచుకోక మానదు. అసలు అక్కడ ప్రభుత్వం ఉందా అనిపించక తప్పదు. ఉత్తర ప్రదేశ్ అంటేనే అక్కడ దౌర్జన్యాలు, ధమనకాండలు, రౌఢీయిజాలకు పెట్టింది పేరు అని పరోక్ష విమర్శలు ఉండనే ఉన్నాయి. సాక్ష్యాత్తు ప్రభుత్వమే అలాంటి పనులు చేయిస్తుందనే నిత్యం ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉంటాయి. అధికారం ఉన్నవారే కాకుండాడబ్బున్నవాళ్లు కూడా జులుం చెలాయిస్తారని ఈ తాజా ఘటన అద్ధం పడుతుంది. ఇంతకీ అంత పెద్ద రౌడీయిజం ఎవరు చేశారో తెలుసా.. ఓ మహిళ. అది కూడా లేడీ డాన్లాగా. ఓ చర్చి పక్కన ఉన్న భూములను పట్టపగలే కబ్జా చేసేందుకు సొంతంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చింది. అది కూడా తుపాకీ ధరించి. ఎవ్వరినీ దగ్గరికి రానివ్వకుండా ఆ తుపాకీతో బెదిరిస్తూ అప్పటికే ఆ పొలంలో ఉన్న పంటను నాశనం చేస్తూ పొలం ఆక్రమించే ప్రయత్నం చేసింది. అడ్డుకునేందుకు ఓ మహిళ ప్రయత్నించగా ఆమె మీద నుంచి ట్రాక్టర్ పోనిచ్చింది. అదృష్టవశాత్తు ఆమహిళ గాయాలతో భయటపడింది. పోలీసులు చాలా సేపటి తర్వాత తీరిగ్గా వచ్చి ఆమెను తీసుకెళ్లారు. కానీ, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఆమె భర్త వద్ద ఈ స్థలానికి సంబంధించిన నకిలీ దస్తావేజులు కూడా ఉండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బిజ్నోలో చోటుచేసుకుంది.
Published Thu, Jul 23 2015 8:13 AM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement