
సాక్షి, కడప అర్బన్/కార్పొరేషన్: కడప నగరశివార్లలోని రామాంజనేయపురం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. రామాంజనేయపురంలో గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరక్ష్యరాస్యులైన మహిళలకు అప్పులిచ్చి లొంగదీసుకొని ఈ రొంపిలోకి దించుతున్నట్లు సమాచారం. గతంలో మరియాపురంలో వ్యభిచార గృహం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడినట్లు ఓమహిళ ఈ అసాంఘీక కార్య్రక్రమానికి తెరతీసింది.
చెన్నై, ముంబయి ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి విటులను ఆకర్షిస్తున్నట్లు సమాచారం. ఆ మహిళా డాన్‌కు జిల్లా టీడీపీ నాయకులతో పాటు, స్థానిక పోలీసుల మద్దతు భారీగానే ఉంది. పెద్ద పెద్ద కార్లలో రాజకీయ నాయకులు, పోలీసులు, ఇతర నాయకులు వచ్చిపోతుంటారు. ఐదేళ్లుగా ఆమె ఇదే వ్యాపారం సాగిస్తూ చాపకింద నీరులా తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోందని చెబుతున్నారు. పెద్ద పెద్ద వాళ్లు ఆమెను పలకరించి పోతుండటంతో స్థానికులెవ్వరూ ఆమెపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది.
అప్పుడప్పుడు నామమాత్రంగా తనిఖీలకు వచ్చిన పోలీసులను మామూళ్లతో మభ్యపెడుతున్నారు. ‘వీకెండ్ స్పెషల్’ పేరుతో ‘పెద్ద మనుషుల’ కోసం ప్రత్యేక బృందం గుట్టు చప్పుడు కాకుండా సహకారం అందిస్తున్నట్లు సమాచారం. వారికి కావాల్సిన సురక్షిత సరంజామాను కూడా యథేచ్చగా సరఫరా చేస్తున్నారనీ గట్టిగా వినిపిస్తోంది.
ఇబ్బంది పడుతున్న స్థానికులు
రాత్రిళ్లు వ్యభిచార గృహం అనుకొని ఇతరుల ఇళ్ల తలుపులు కొడుతుండటంతో స్తానికులు లోలోన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ వ్యవహారంపై కొందరు జిల్లా ఉన్నతాధికారులకు పలు సార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవట్లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై ఎస్పీ దృష్టి పెట్టి అసాంఘీక కార్యకలాపాలను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment