ఈ అందమైన అమ్మాయి పెద్ద ఆటం బాంబు | This beautiful Girl Is A Don Who Has Spread Terror In Surat | Sakshi
Sakshi News home page

ఈ అందమైన అమ్మాయి పెద్ద ఆటం బాంబు

Published Fri, May 25 2018 8:26 PM | Last Updated on Sun, May 27 2018 9:53 PM

This beautiful Girl Is A Don Who Has Spread Terror In Surat - Sakshi

సూరత్‌ : చూడటానికి చూడముచ్చటగా.. తాకితే కందిపోయే శరీర సౌదర్యంతో, కళ్లు తిప్పుకోనివ్వని అందాన్ని కలిగి ఉంటుంది ఈ అమ్మాయి. ఆమె ముఖంలో అయితే ఇట్టే అమాయకత్వం ఉట్టిపడుతుంది. కానీ ఈ అమ్మాయి గురించి వింటే మీరు మాత్రం షాకవ్వాల్సిందే. సూరత్‌లో క్రైమ్‌ల మీద క్రైమ్‌లు చేసి ‘లేడీ డాన్‌’ నగరాన్నే తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది. 20ఏళ్లకే ఈమె నగర పోలీసులకు చుక్కలు చూపించింది. ఈమె పేరు అస్మితా. ఇటీవలే ఈ అమ్మాయిను నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒక దుకాణంలో నగదును అపహరించుకుని పోతున్న అస్మితను నగర పోలీసులు ఎట్టకేలకు పట్టుకుని, జైలు ఊసలు లెక్క పెట్టేలా చేశారు.

పాన్‌ సెల్లర్‌ వద్దకు వచ్చి, బెదిరించిన ఈ అమ్మాయి అతని షాపులో నగదును తీసుకుని ఉడాయించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. ఈ మే 21న ఉదయం ఆ సంఘటన చోటు చేసుకుంది. చూడటానికి ఇంత బాగున్నా ఈ అమ్మాయి ఈ పనులు చేయడం ఏమిటా..? ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. పోలీసులకే ఈ లేడీ పెద్ద తలనొప్పిగా మారిందంటే అర్థం చేసుకోండి ఈ లేడీ డాన్‌ హవా ఎలా సాగుతుందో. ఈమెకు వ్యతిరేకంగా స్థానికులైతే కనీసం నోరు కూడా మెదపరట. ఎట్టకేలకు ఈమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు, చాలా క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement