
నమిత
పెళ్లి తర్వాత ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు నమిత. 2016లో మలయాళ నటుడు మోహన్‌లాల్ ‘పులి మురుగన్’నే సిల్వర్ స్క్రీన్‌పై నమిత లాస్ట్ సినిమా. లేటెస్ట్‌గా తమిళ దర్శకుడు టి.రాజేందర్ డైరెక్షన్‌లో ఓ మూవీలో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ‘ఇండ్రయ కాదల్ డా’ (ఇవాళ్టి ప్రేమ రా అని అర్థం) అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ రొమాంటిక్ డ్రామాలో నమిత లేడీ డాన్‌లా కనిపించనున్నారు. పదకొండేళ్ల తర్వాత టి.రాజేందర్ మెగాఫోన్ çపడుతున్న ఈ చిత్రం యూత్‌ని టార్గెట్ చేసే విధంగా ఉండబోతోందట. త్రి భాషా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో చాలా మంది కొత్త నటులు కనిపించనున్నారని దర్శకుడు టి.రాజేందర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment