T Rajendar
-
అందుకే సంగీతానికి దూరం.. ప్రధాన కారణం అదే!: దర్శకుడు
సినీ రంగంలో దర్శకుడు టి.రాజేందర్‌ను అష్టావధాని అంటారు. తాను ఈయన తన చిత్రాలకు కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం, నిర్మాణం, కథానాయకుడు ఇలా అన్ని బాధ్యతలను తనే నిర్వహిస్తుంటారు. అలా ఆయన చేసిన పలు చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. కాగా తాజాగా నాన్ కడైసీ తమిళన్ అనే చిత్రానికి ఈయన పాటలు, సంగీతాన్ని అందిస్తున్నారు. సీఆర్టీ కంపెనీ పతాకంపై ఎంఏ రాజేంద్రన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ఆదివారం ఉదయం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు టి.రాజేందర్, చిరు బడ్జెట్ చిత్ర నిర్మాతల సంఘం అధ్యక్షుడు అన్బు సెల్వన్ నటుడు ఇమాన్ అన్నాచ్చి, కరాటే రాజా తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం దర్శకుడు టీ రాజేందర్ క్లాప్ కొట్టి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను సినిమాలకు సంగీతాన్ని అందించి చాలాకాలం అయిందన్నారు. అందుకు కారణం ఇటీవలి కాలంలో వస్తున్న చిత్రాల్లో పాటలకు తగ్గ బాణీలను కట్టకపోవడమేనన్నారు. అలాంటిది చాలా కాలం తర్వాత ఈ చిత్రానికి పాటలు, సంగీతాన్ని అందించడానికి కారణం 'నాన్ కడైసీ తమిళన్' అనే చిత్ర టైటిలేనన్నారు. చిత్ర దర్శక నిర్మాత ఎమ్ఏ రాజేందర్ మాట్లాడుతూ మిత్రుల ప్రోత్సాహంతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యానన్నారు. దీనికి టి. రాజేందర్ సంగీతాన్ని అందించటం సంతోషంగా ఉందన్నారు. విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని పలు భాషల్లో రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో నటించే నటీనటులు, ఇతర సాంకేతిక వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు. చదవండి: రజనీకి గవర్నర్ పదవిపై ఆయన సోదరుడు కీలక వ్యాఖ్యలు -
చికిత్స కోసం అమెరికా వెళ్లిన నటుడు.. ఎయిర్‌పోర్టులో ఎమోషనల్
T Rajendar Gets Emotional During Going To US For Medical Treatment: ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు టి. రాజేందర్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఇటీవల కడుపునొప్పితో బాధపడుతూ చెన్నైలోని ఓ హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన వైద్యుల సూచన మేరకు చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. అయితే అమెరికాకు పయనమయ్యే సమయంలో మంగళవారం (జూన్ 14) రాత్రి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో ఎమోషనల్‌గా మాట్లాడారు. ఆయన ఆరోగ్యం, కొడుకు శింబు గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. 'నేను కేవలం నా కొడుకు కోసమే విదేశాలకు వెళ్తున్నా. నా కొడుకు చాలా గొప్పవాడు. ఎంతో మంచివాడు. ఎందుకంటే గత కొద్దిరోజులుగా శింబు అమెరికాలోనే ఉండి నా వైద్యానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. నా కోసం తన తర్వాతి సినిమా షూటింగ్‌లు, ఆడియో ఫంక్షన్స్‌ను వాయిదా వేసుకున్నాడు. శింబు సినిమాల్లో గొప్ప నటుడు మాత్రమే కాదు తన తల్లిదండ్రుల పట్ల మంచి మనసున్న కొడుకు. ఇలాంటి కొడుకును కన్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. అలాగే నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు నన్ను పలకరించి, నా ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న కమల్ హాసన్, తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కృతజ్ఞతలు.' అంటూ భావోద్వేగంగా తెలిపారు టి. రాజేందర్. చదవండి: ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్ ఏం చెప్పాలో మాటలు రావడం లేదు.. నితిన్ ఎమోషనల్ -
మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లిన నటుడు
సీనియర్ నటుడు, దర్శక, నిర్మాత టి.రాజేందర్ ఇటీవల అనూహ్యంగా గుండెపోటుకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని స్థానిక పోరూరులోని రామచంద్ర ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా వైద్య పరీక్షలు నిర్వహించే క్రమంలో వైద్యులు టి.రాజేందర్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళంలో బ్లాక్ ఏర్పడిందనే విషయాన్ని గుర్తించారు. అత్యవసర చికిత్సతో ఆయన కోలుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల పరామర్శించి వచ్చారు. ఇప్పటికీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రాజేందర్‌ను ఆయన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం మంగళవారం సాయంత్రం అమెరికాకు తీసుకెళ్లారు. ఆయనతో పాటు భార్య ఉష, కుమారులు నటుడు శింబు, కురళరసన్, కూతురు ఇళఖ్య ఉన్నారు. చదవండి: నజ్రియాతో కలిసి నాని భార్య స్టెప్పులు.. వీడియో వైరల్ ఇద్దరం ఒక్కటయ్యాం.. పెళ్లి ఫొటో షేర్ చేసిన విఘ్నేశ్ -
స్టార్ హీరో తండ్రికి అస్వస్థత
కోలీవుడ్ స్టార్ శింబు తండ్రి, నటుడు టి.రాజేందర్ అస్వస్థతకు లోనయ్యారు. మే 7న ఆయనకు ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో అప్పటినుంచి ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ విషయం బయటకు పొక్కడంతో హీరో శింబు సోషల్ మీడియాలో తన తండ్రి ఆరోగ్యం గురించి ఓ లేఖ విడుదల చేశాడు. 'మా తండ్రికి ఛాతీలో నొప్పి రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నాము. పొత్తికడుపులో రక్తస్రావం అవుతుండటంతో ఆయనకు ఇంకా మెరుగైన వైద్యం అవసరమని డాక్టర్లు చెప్పారు. వారి సూచన మేరకు విదేశానికి తీసుకెళ్లాం. ప్రస్తుతం ఆయన బాగున్నారు. ట్రీట్మెంట్ పూర్తవగానే తిరిగొస్తాం. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు' అని శింబు రాసుకొచ్చాడు. కాగా రాజేందర్ అనారోగ్యానికి గురి కావడంతో మొదట చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. రెండు వారాలు చికిత్స అందించిన తర్వాత పొరూర్లోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడని పక్షంలో మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లారు. pic.twitter.com/Wo2AZOxNR0 — Silambarasan TR (@SilambarasanTR_) May 24, 2022 https://t.co/8oKFJwpMET — VIJAY ANNA Fan 🕊 (@MathaiyanVijay) May 24, 2022 చదవండి 👇 విజయ్ మాల్యా కూతురి పెళ్లికి వెళ్లాను, అక్కడ నాతో ఏం చేయించారంటే? భర్తకు విడాకులు, ప్రియుడితో నటి ఎంగేజ్మెంట్.. మాజీ ప్రేయసి వార్నింగ్ -
చిక్కుల్లో హీరో శింబు కుటుంబం.. కారు డ్రైవర్ అరెస్ట్
Simbu Car Driver Arrest For Runs Over 70 Year Old Man In Chennai: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఫ్యామిలీ చిక్కుల్లో పడింది. నిర్లక్ష్యంగా కారు నడిపిన 70 ఏళ్ల వృద్ధుడి ప్రాణం తీసినందుకు శింబు కారు డ్రైవర్ సెల్వంని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 18న రాత్రి శింబు తండ్రి, నటుడు టి. రాజేందర్ కారులో వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఒక వృద్ధుడు పాకుతూ రోడ్డు దాటుతున్నాడు. అటునుంచి వస్తున్న వాహనాల వెలుగులతో వృద్ధుడిని గమనించని డ్రైవర్ కారు నడపడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన టి. రాజేందర్ ప్రమాదం జరిగిన చోటు నుంచి 10 మీటర్ల దూరంలో కారు దిగి అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. అయితే అప్పటికే ఆ వృద్ధుడు మునుస్వామి మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు శింబు డ్రైవర్ సెల్వంను మార్చి 19న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ నెట్టింట హల్చల్ చేస్తోంది. దీంతో శింబు కుటుంబాన్ని విమర్శిస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనపై శింబు కుటుంబం ఇంకా స్పందించలేదు. కాగా ఈ కారు శింబు పేరు మీద రిజిస్టర్ అయి ఉండటం గమనార్హం. சாலையை கடக்க முயன்ற முதியவர் மீது ஏறி இறங்கிய நடிகர் சிம்புவின் கார்.. பதைபதைக்க வைக்கும் சிசிடீவி காட்சி.. காரில் சிம்புவின் தந்தை டி.ராஜேந்தரும் இருந்ததாக தகவல்..#Simbu #ActorSimbu #SimbuCarAccident #Death #CCTVfootage #TRajendran pic.twitter.com/9Z9w3diXev — Asianetnews Tamil (@AsianetNewsTM) March 24, 2022 -
శింబు పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాజేందర్
హైదరాబాద్ : సంచలన నటుడు శింబు ఇంకా మోస్ట్ బ్యాచిలర్‌గానే ఉన్నాడు. ఈయనకు ప్లేబోయ్ ఇమేజ్ కూడా ఉంది. కెరీర్ ప్రారభంలో నయనతారతో కొన్నాళ్లు ప్రేమాయణం నెరిపాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకునేటప్పుడు మనస్పర్ధలతో విడిపోయారు. కొంతకాలానికి ఈ హీరో హన్సికను ప్రేమించాడు. కొన్నాళ్లకు ఆమెతో కూడా బ్రేకప్ అయ్యాడు. ఆ తర్వాత ఎవరితోనూ ప్రేమలో పడలేదు. అయితే ఇటీవల శింబు వివాహంపై కోలివుడ్లో చర్చ జరుగుతోంది. లాక్డౌన్ అనంతరం శింబు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో శింబు పెళ్లిపై ఆయన తల్లిదండ్రులు సీనియర్ నటుడు, దర్శకుడు టీ.రాజేందర్, ఉషా రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. శింబు పెళ్లిపై వస్తున్న వార్తలు అవాస్తవమని, వాటిని నమ్మొద్దని అభిమానులను అభ్యర్థించారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. (చదవండి : జెస్సీకి కార్తీక్ ఫోన్.. ఆ తర్వాత ఏమైంది?) ‘శింబు పెళ్లిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లలో వాస్తవం లేదు. శింబుకు సరిపోయే జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నాం. అమ్మాయి కోసం వెతుకుతున్నాం. జాతకాలు కలిసే అమ్మాయి దొరికితే మేమే అందరికి తెలియజేస్తాం. అప్పటి వరకు వేచి చూడండి. దయచేసి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మకండి’ అని శింబు తల్లిదండ్రులు ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. కాగా, శింబు పెళ్లిపై వస్తున్న రూమర్స్ కొత్తేమీ కాదు. 2019లో శింబు సోదరుడు కురళరసన్‌కు వివాహం జరిగినప్పుడు కూడా శింబు పెళ్లిపై వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆయన కూడా పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు చక్కర్లు కొట్టాయి. కాగా, తాజాగా శింబు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించాడు. ‘కార్తీక్ డయల్ సేతాయన్’ పేరుతో విడుదలైన ఈ షార్ట్‌ఫిలిం నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. -
రూ.125 కోట్లతో.. ఐదు భాషల్లో
ఒక చిత్రం మిస్ అయితే స్టార్ హీరోలు పెద్దగా పట్టించుకోరు. అదిపోతే మరొకటి వస్తుందనే ధీమా వారికి ఉంటుంది. ఇక సంచలన నటుడు శింబు అయితే అస్సలు కేర్ చేయరు. ఎందుకంటే శింబులో కేవలం నటుడే మాత్రమే కాదు, దర్శకుడు, నిర్మాత, రచయిత కూడా. అలాంటి నటుడు తనే సొంతంగా చిత్రం చేసి తానేంటో నిరూపించుకోగలడు. ప్రస్తుతం శింబు అదే చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో సురేష్ కామాక్షి నిర్మించతలపెట్టిన ‘మానాడు’ అనే చిత్రంలో నటించనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరిగింది. మధ్యలో ఆగిపోయిందనే ప్రచారం జరగడంతో నిర్మాత సురేష్ కామాక్షీ మానాడు చిత్రం ఆగిపోలేదు, షూటింగ్ జరుగుతోందని వివరణ ఇచ్చారు. అలాంటిది ఇటీవల సడన్‌గా అనివార్యకారణాల వల్ల శింబుతో మానాడు చిత్రం చేయడం లేదని ప్రకటించారు. అయితే వేరే నటుడితో మానాడు చిత్రం ఉంటుందని, ఆ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు. అయితే ఆ వెంటనే శింబు అభిమానులను ఖుషీ చేసే వార్త వెలువడింది. ఎప్పుడైతే మానాడు నుంచి శింబును తొలగించిన వార్త ప్రచారం అయిందో ఆ వెంటనే శింబు తండ్రి టి.రాజేందర్ స్పందించారు. మానాడు పోతేనేం శింబు ‘మహా మానాడు’తో వస్తున్నాడు అని వెల్లడించి షాక్ ఇచ్చారు. అవును శింబు హీరోగా మహా మానాడు చిత్రం తెరకెక్కనుందని, ఆ చిత్రాన్నిశింబునే స్వీయ దర్శకత్వంలో శింబు సినీ ఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్నట్లు తెలిపారు. ఇటీవల కుటుంబంతో సహా విదేశీ పర్యటన చేసినట్లు, ఆ సమయంలో మహా మానాడు చిత్ర కథ గురించి చర్చించినట్లు టి.రాజేందర్ చెప్పినట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని రూ.125 కోట్ల భారీ బడ్జెట్లో తమిళంతో పాటు ఐదు భాషలో రూపొందించనున్నట్లు సమాచారం. -
మతం మార్చుకున్న టాప్ హీరో సోదరుడు
సాక్షి, చెన్నై: కోలీవుడ్ టాప్ హీరో శింబు సోదరుడు కురళరసన్ తాజాగా మతం మార్చుకున్నారు. ఆయన ఇస్లాం మతాన్ని స్వీకరించారు. శింబుతోపాటు బాలనటుడిగా కురళరసన్ పలు చిత్రాల్లో నటించారు. ఆ తరువాత సంగీతంపై దృష్టి సారించి శింబు, నయనతార జంటగా నటించిన ‘ఇదునమ్మ ఆలు’ చిత్రంతో సంగీతదర్శకుడిగా మారారు. ఆయన తండ్రి సీనియర్ దర్శక, నిర్మాత, నటుడు టీ. రాజేందర్.. ఆయన ఏ మతమైన సమ్మతమే అంటారు. ఇక, ఆయన పెద్ద కొడుకు శింబు శివభక్తుడు. కూతురు ఇలఖ్య ఆ మధ్య క్రైస్తవ మతంలోకి మారి పెళ్లి చేసుకున్నారు. తాజాగా కురళరసన్ ఇస్లాం మతం స్వీకరించారు. ఆయన శుక్రవారం చెన్నై, అన్నాశాలైలోని మక్కా మసీదులోని ముస్లిం మత గురువుల సమక్షంలో ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కురళరసన్ తల్లిదండ్రులు టీ.రాజేందర్, ఉషా హాజయ్యారు. టీ.రాజేందర్ మాట్లాడుతూ కురళరసన్ చిన్నతనంలోనే ఇస్లాం మతం వైపు ఆకర్షితుడయ్యాడని, తనకు అన్ని మతాలు సమ్మతం కావడంతో తన ఇష్టాన్ని గౌరవించినట్లు తెలిపారు. సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్, యువన్ శంకర్‌రాజా ఇప్పటికే ఇస్లాం మతాన్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా కురళరసన్ ఆ కోవలో చేరారు. అయితే కురళరసన్ ఒక ముస్లిం యువతిని ప్రేమిస్తున్నారని, ఆమెను పెళ్లి చేసుకోవడానికే తను మతం మారారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. -
శింబు చుట్టూ కుట్ర జరుగుతోంది
పెరంబూరు: శింబు చుట్టూ కుట్ర జరుగుతోందని ఆయన తండ్రి, నటుడు, దర్శక నిర్మాత, లక్ష్య డీఎంకే పార్టీ అధ్యక్షుడు టీ.రాజేందర్ అన్నారు. ఆదివారం సేలంకు వెళ్లిన ఈయన మీడియాతో మాట్లాడుతూ తనకు రాజకీయ వనవాసం ముగిసిందని అన్నారు. ఇప్పుడు విముక్తి కలిగిందని అన్నారు. రాజకీయాల్లో తాను ఎంజీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడినని చెప్పారు. ఇప్పుడు కొత్తగా రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయని వెటకారంగా మాట్లాడారు. రాజకీయ పార్టీని ప్రారంభించడానికి చాలా సహనం అవసరం అని అన్నారు. పోరాటం తరువాత కరుణానిధి డీఎంకే అధ్యక్షుడయ్యారని గుర్తు చేశారు. కరుణానిధి ఉండగా ఎన్నికలను ఎదుర్కోవడం వేరు ఆయన లేని ఇప్పటి డీఎంకే ఎదుర్కొనే ఇప్పటి పరిస్థితులు వేరు అని అన్నారు. చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష పదవి అన్నది సాధారణ విషయం కాదని, తల చుట్టూ వేడెక్కించే మంట లాంటిదని పేర్కొన్నారు. తాను రాజకీయవాదినని చెప్పడం కంటే ఆధ్యాత్మిక వాదినని చెప్పుకుంటానన్నారు. తాను ఆధ్యాత్మికంగానే నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. ఆయన కొడుకు, నటుడు శింబుకు సంబంధించిన కేసులో శనివారం మద్రాసు హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు గురించి స్పందిస్తూ శింబు చుట్టూ కుట్ర జరుగుతోందని టి.రాజేందర్ వ్యాఖ్యానించారు. -
లేడీ డాన్
పెళ్లి తర్వాత ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు నమిత. 2016లో మలయాళ నటుడు మోహన్‌లాల్ ‘పులి మురుగన్’నే సిల్వర్ స్క్రీన్‌పై నమిత లాస్ట్ సినిమా. లేటెస్ట్గా తమిళ దర్శకుడు టి.రాజేందర్ డైరెక్షన్లో ఓ మూవీలో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ‘ఇండ్రయ కాదల్ డా’ (ఇవాళ్టి ప్రేమ రా అని అర్థం) అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ రొమాంటిక్ డ్రామాలో నమిత లేడీ డాన్‌లా కనిపించనున్నారు. పదకొండేళ్ల తర్వాత టి.రాజేందర్ మెగాఫోన్ çపడుతున్న ఈ చిత్రం యూత్‌ని టార్గెట్ చేసే విధంగా ఉండబోతోందట. త్రి భాషా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో చాలా మంది కొత్త నటులు కనిపించనున్నారని దర్శకుడు టి.రాజేందర్ పేర్కొన్నారు. -
వివాహానంతరం తొలి చిత్రం
చెన్నై: సాధారణంగా అందరి జీవితాలు పెళ్లికి ముందు, ఆ తరువాత అన్నట్టుగా మార్పులు చోటుచేసుకుంటాయి. ఇందుకు సినిమా వారు అతీతులు కాదు. ముఖ్యంగా కథానాయికల జీవితాల్లో ఈ మార్పు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. పెళ్లి అయితే ఇక కథానాయకిగా పనికిరారు అనే పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త మారుతోంది. హీరోయిన్ సమంత లాంటి అతి కొద్దిమందే దీన్ని బ్రేక్ చేస్తున్నారు. ఇక నమిత విషయానికి వస్తే ఇంతకుముందు యువకుల డ్రీమ్ గర్ల్. అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే నమిత గత ఏడాది తన బాయ్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొత్త చిత్రమేదీ చేయలేదు. అయితే అంతకు ముందు నటించిన పొట్టు చిత్రం ఈ నెల 25న తెరపైకి రానుంది. తాజాగా మరో సంచలన చిత్రంలో నటించే అవకాశం నమితను వరించిందనే ప్రచారం జరుగుతోంది. దర్శక నిర్మాత టి.రాజేందర్ సుమారు 11 ఏళ్ల తరువాత చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రాజకీయ నేపథ్యంతో ఈ చిత్రం ఉంటుందని, ఇందులో నమిత ప్రధాన పాత్రను పోషించనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. నటుడు రాధారవి ప్రముఖ నటులు కొందరు నటించనున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇటీవల ఇతర హీరోలతో కలిసి అన్న, మామ వంటి పాత్రలను చేస్తున్న టి.రాజేందర్ చాలా కాలం తరువాత ఆయన స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్ర పోషించడానికి సిద్ధం అవుతున్నారన్నమాట. ఇక నమిత విషయానికి వస్తే వివాహానంతరం నటించడానికి అంగీకరించిన తొలి చిత్రం ఇదే అవుతుంది. మరి ఈ చిత్రం ఆమె రీఎంట్రీ నట జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందన్నది వేచి చూడాలి. -
ఆధారాలుంటే బయటపెట్టవచ్చుగా!
తమిళసినిమా: తనపై ఆరోపణలకు ఆధారాలుంటే బయట పెట్టవచ్చుగా.. మాటలు కాదు..చేతల్లో చూపండి అంటూ నిర్మాతలమండలి అధ్యక్షుడు, నటుడు విశాల్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఈయన వ్యతిరేక వర్గానికి చెందిన దర్శకుడు భారతీరాజా, టీ.రాజేందర్, నటుడు రాధారవి, రితీశ్, రాధాకృష్ణన్ తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విశాల్‌పై ఆరోపణల దండయాత్ర చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పంధించిన విశాల్ నిర్మాతల మండలి నిధి రూ.7 కోట్లకు సంబంధించిన లెక్కలు చూపలేదు అంటూ ఆరోపణలు చేశారన్నారు. నిజానికి మండలి నిధి విషయంలో అవకతవకలు జరగలేదని, ఎవరూ అక్రమాలకు పాల్పడలేదన్నారు. అంతా భద్రంగానే కాపాడుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. పైరసీ వంటి వాటిని వేళ్లతో అణచివేడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తనపై ఆరోపణలకు ఆధారాలుంటే నిరూపించాలన్నారు. మాటలు కాకుండా చేతల్లో చూపాలని విశాల్ వారికి సవాల్ విసిరారు. -
మా నాన్న ఏకపత్నీ వ్రతుడు
సాక్షి సినిమా: మా నాన్న ఏకపత్నీవ్రతుడు అని అన్నది ఎవరో తెలుసా? సంచలన నటుడు శింబు. ఈయన తండ్రి సీనియర్ నటుడు, దర్శకుడు టీ.రాజేందర్. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీరంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలి. అంతేకాదు రాజకీయనాయకుడు కూడా. ప్రాసలో పంచ్ డైలాగ్స్ చెప్పడంతో దిట్ట. అయినా ఆయనపై సెటైర్లు వేస్తుంటారు. టీఆర్ డైలాగులను, ఆయన స్టైల్స్‌ను సినిమాల్లోనే కాకుండా బయట కూడా పేరడీ చేస్తుంటారు. అయితే ఇలా తన తండ్రిని పరిహాసం చేసేవారిపై ఆయన కొడుకు, సంచలన నటుడు శింబు దండెత్తారు. ఇటీవల ఒక టీవీ చానల్లో అతిథులుగా టీఆర్, ఆయన కొడుకు శింబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శింబు తన తండ్రి గురించి మాట్లాడుతూ తన తండ్రి చాలా ఉన్నతుడని పేర్కొన్నారు. ఆయనలో చాలా ప్రతిభ ఉందన్నారు. అలాంటి వ్యక్తిపై కొందరు సెటైర్స్ వేస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి నోటితోనే సంగీత బాణీలు కడతారని, దాన్ని కొందరు పరిహాసం చేస్తుంటారని, అదే విధంగా తన తల జుత్తును ఎగరేసే స్టైల్‌ను ఎగతాళి చేస్తుంటారని అన్నారు. అలా చేయడం మీ వల్ల అవుతుందా అని ప్రశ్నించారు. తన తండ్రి ఇప్పటికీ సూపర్‌గా డాన్స్ చేస్తారని, అలా మీరు 20 ఏళ్ల వయసులో కూడా చేయలేరని అన్నారు. ఏ అమ్మాయిని చూసినా మీకు ఏదో భావం కలుగుతుందని, తన తండ్రి మాత్రం ఏకపత్నీవ్రతుడని పేర్కొన్నారు. ఆయనకు ఎలాంటి దురలవాట్లు లేవన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా చెప్పాలంటే సెటైర్లు వేసే వారంతా ప్రతిభలేనివారేనని అన్నారు. తన తండ్రి ప్రతిభ అంగీకరించి గౌరవించేవారినే తాను గౌరవిస్తానని శింబు ఆవేశంగా మాట్లాడారు. ఆయన మాటలకు అదే వేదికపై ఉన్న టీ.రాజేందర్ ఆనంద బాష్పాలు రాల్చారు. -
రాజకీయాల్లో సినీ రచ్చ
తమిళసినిమా: రాజకీయాల్లో సినీ తారల వెలుగులే కాదు రచ్చలు చాలానే చూస్తున్నాం. ప్రముఖ పార్టీల నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీలను నెలకొలిపి చరిత్ర సృష్టించిన వారు. నేరుగా సినిమాల నుంచి రాజకీయరంగప్రవేశం చేసి విజయం సాధించిన వారు ఉన్నట్లే, స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలో కి దిగి చర్చకు దారి తీసి రచ్చ చేసిన వారు చాలా మందే ఉన్నారు. తాజాగా నటుడు విశాల్ ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమై నామినేషన్ దాఖలు చేసి, అది తిరస్కరణకు గురై ఎలా కలకలం సృష్టిస్తుందో కల్లారా చూస్తున్నాం. ఇదే విధంగా ఇంతకు ముందు చాలా సార్లు జరిగిన సంఘటనలు ఉన్నాయి. వాటిలో కొన్ని సంఘటనలను చూద్దాం. నటుడు ఎస్వీ.శేఖర్ ఎంజీఆర్ మరణానంతరం ఏడీఎంకే రెండుగా చీలిపోయింది. అలాంటి పరిస్థితుల్లో 1989లో జరిగిన శాసనసభ ఎన్ని కల్లో నటుడు ఎస్వీ.శేఖర్ మైలాపూర్ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పో టీగి దిగారు.ఆ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి గెలుపొందారు.ఎస్వీ.శేఖర్ కేవలం 650 ఓట్లు మాత్రమే రాబట్టుకోగలిగారు. టీ.రాజేందర్: నటుడు,దర్శకుడు, ఛాయాగ్రహకుడు ఇలా పలు శాఖల్లో అనుభవం కలిగిన టి.రాజేందర్ 1980లో డీఎంకే పార్టీ ప్రచారకర్తగా నియమితులయ్యారు. ఆ తరువాత ఆయన మనస్పర్థల కారణంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి తాయగ మరుమలర్చి కళగం అనే సంఘాన్ని ప్రారంభించారు. అలా టి.రాజేందర్ 1991లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా అన్నాడీఎంకే పార్టీ నేత జయలలిత పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో డీఎంకే తమ అభ్యర్థిని పోటీకి నిలపకుండా టి.రాజేందర్‌కు మద్దతు పలికింది. అదే విధంగా 2006లోనూ టి.రాజేందర్ తన సొంత నియోజక వర్గం మైలాడుదురైలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నటి రేవతి కూడా.. సహజ నటిగా పేరు పొందిన నటి రేవతి కూడా రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నించారు. 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దక్షణ చెన్నై నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక సంచలన నటుడుగా పేరొందిన నటుడు మన్సూర్ అలీఖాన్ కూడా స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపునకు దూరమయ్యారు. ఇలా ప్రతిసారి రాష్ట్ర శాసన సభ, పార్లమెంట్ ఎన్నికల్లో సినీరంగానికి చెందిన తారలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తూ రచ్చ చేస్తూనే ఉన్నారన్నది గమనార్హం. -
ఆయన మాటల వల్ల వారం నిద్రపోలేదు
ఇటీవల తమిళనాట సీనియర్ నటుడు దర్శకుడు టీ రాజేందర్, హీరోయిన్ ధన్సికల మధ్య జరిగిన వివాదం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ సినిమా వేడుకలతో తన పేరు ప్రస్తావించలేదంటూ రాజేందర్, ధన్సికను ఉద్దేశించి స్టేజ్ మీదే అవమానకరంగా మాట్లాడటం, ఆమె కన్నీరు పెట్టుకోవటంతో అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో పలువురు తమిళ సినీ నటులు ధన్సికకు మద్ధతు తెలిపారు. తాజాగా ఈ సంఘటనపై ఓ మీడియా సమావేశంలో స్పందించిన ధన్సిక, ఆ సంఘటన గురించి వివరించారు. రాజేందర్ మాటలు తనను తీవ్రంగా బాధించాయని, ఆ సంఘటన తరువాత తనకు వారం రోజుల పాటు నిద్రపట్టలేదని తెలిపింది. అంతేకాదు టి రాజేందర్ ఆధ్యాత్మిక వేత్త అని చెపుతుంటారన్న ధన్సిక ఆధ్యాత్మిక భావాలున్న వ్యక్తి అలా మాట్లాడరని, అందరి ముందూ అలా కేకలు వేయరని తెలిపింది. తాను గతంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నానని, మహిళలకు ఏ రంగంలో అయినా ఈ బాధలు తప్పవని తెలిపింది. -
కూత్తాన్ కోసం టీఆర్ పాట
తమిళసినిమా: తమిళ చిత్ర పరిశ్రమలో సకలకళావల్లభుడు ఎవరంటే టి.రాజేందర్ అనే బదులే వస్తుంది. నటుడు, దర్శకుడు, సంగీతదర్శకుడు, చాయాగ్రాహకుడు, గీతరచయిత, గాయకుడు ఇలా పలు విభాగాల్లో నిష్టాతుడైన టీఆర్ గాయకుడిగా తన చిత్రాలకే పాడుకుంటారు. ఆయన పాడాలంటే ఆ పాటలు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తుంటాయి.అందుకే ఆయనతో తమ చిత్రాల్లో ఒక్క పాట అయినా పాడించాలని దర్శక నిర్మాతలు కోరుకుంటారు. అయితే బయట చిత్రాలకు పాడాలంటే ఆ పాట ఆయన మనసును హత్తుకోవాలి. లేదంటే నిక్కచ్చిగా సారీ అని చెప్పేస్తారు. అలాంటిది నవ నటుడు కథానాయకుడిగా నటిస్తున్న కూత్తాన్ చిత్రానికి ఆయన పాట పాడడం విశేషం. నిలగిరీస్ డ్రీమ్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నీలగిరీస్ మురుగన్ నిర్మిస్తున్నారు. వెంకీ.ఏఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా రాజ్‌కుమార్ అనే నవ నటుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. బాలాజీ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కోసం గీతరచయిత రాఖేష్ రాసిన మాకిస్తా కీంకిస్తా అనే పాటను చిత్ర వర్గాలు టి.రాజేందర్‌తో పాడించాలని భావించారట. దీంతో సంగీత దర్శకుడు బాలాజి టి.రాజేంద్రన్‌ను కలిసి కూత్తన్ చిత్రంలో ఒక పాట పాడాలని కోరగా నో అన్నారట. అనంతరం బాలాజి పాట వినమని కోరగా విన్న టి.రాజేందర్ ఆ పాట ట్యూన్స్ బాగా నచ్చేయడంతో ఈ పాటను ఎవరు పాడినా హిట్ అవుతుందని కితాబిచ్చి తాను పడతానని చెప్పారని చిత్ర దర్శకుడు తెలిపారు. ఈ పాటను నృత్యదర్శకుడు అశోక్రాజా నృత్యదర్శకత్వంలో భారీ ఎత్తున చిత్రీకరించనున్నట్లు ఆయన తెలిపారు. -
హీరోయిన్ కన్నీళ్లు
చెన్నై: ప్రముఖ నటుడు, దర్శకుడు టి. రాజేందర్ అందరి ముందు ఓ హీరోయిన్ను కడిగిపారేశారు. చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో యువనటి ధన్షికపై శివాలెత్తిపోయారు. ధన్షిక ప్రసంగంలో తన పేరు ప్రస్తావించలేదని ఆగ్రహంతో ఊగిపోయారు. ఎంత పొగరంటూ దుర్భాషలాడినంత పనిచేశారు. పొరపాటున మరచిపోయానని చెప్పినా రాజేందర్ లక్ష్యపెట్టలేదు. సారీ చెప్పినా కనికరించలేదు. దీంతో ధన్షిక వేదికపైనే కన్నీటి పర్యంతమయింది. రాజేందర్-ధన్షిక వివాదానికి ‘విళితిరు’ చిత్ర ప్రెస్‌మీట్ వేదికైంది. చిత్రంలో హీరోయిన్గా నటించిన ధన్షిక సినిమా గురించి మాట్లాడింది. నటీనటులు, టెక్నీషియన్స్ అందరి గురించి ప్రస్తావించింది. కానీ సినిమాలో ఓ పాట పాడిన రాజేందర్ పేరు చెప్పడం మరచిపోయింది. దీన్ని అవమానంగా భావించిన రాజేందర్.. స్టేజ్‌పైనే ఆగ్రహం ప్రదర్శించారు. కబాలి చిత్రంలో రజినీకాంత్‌తో నటించి మాత్రాన హీరోయిన్లు అయిపోరని, పెద్దలను గౌరవించాలని చురకలంటించారు. సహచర ఆర్టిస్టులకు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలని గద్దించారు. పెద్ద ఆర్టిస్టులకు గౌరవించకపోతే భవిష్యత్ ఉండదని హెచ్చరిస్తూ ఆమె వైఖరిని కఠినంగా తప్పుబట్టారు. స్టేజ్‌పై ప్రసంగించడం తనకు అలవాటు లేదని, అంతేతప్ప కావాలని చేసింది కాదని ధన్షిక ఎంత సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. రాజేందర్ వైఖరితో ఖిన్నురాలైన ఆమె మౌనంగా ఉండిపోయింది. హీరో శింబు తండ్రి అయిన రాజేందర్ గతంలోనూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. -
పాటపాడి అలరించనున్న హీరో తండ్రి..
చెన్నై: తెలుగు చిత్రపరిశ్రమలో 15 శాతం జీఎస్టీ పన్నునే అమలవుతోందని, అక్కడ రాష్ట్రప్రభుత్వాలు అదనంగా పన్నును విధించడం లేదని సీనియర్ నటుడు, దర్శకుడు టి. రాజేందర్ పేర్కొన్నారు. ఆయన కుమారుడు శింబు హీరోగా నటించిన ఇదునమ్మ ఆళం చిత్రం సరసుడు పేరుతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతోపాటు తమిళనాడులో విడుదల కానుంది. తమిళంలో శింబు, నయనతార జంటగా నటించిన ఈ చిత్రాన్ని శింబు ఆర్ట్స్ పతాకంపై టి. రాజేందర్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈయన రెండో కుమారుడు కురలరసన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్రంలో 50,60 సన్నివేశాలను రీషూట్ చేసి తెలుగులో నేరు చిత్రంగా విడుదల చేస్తున్నారు. అదే విధంగా తమిళంలో పొందుపరచని హలో పాటను తెలుగు చిత్రంలో చేర్చామని, ఈ పాట యువతను అలరిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. దీనికి సరసుడు అనే టైటిల్‌ను పెట్టారు. ఇందులో టి. రాజేందర్ ఒక పాటను రాయడంతోపాటు ఒక పాటను పాడటం విశేషం. సరసుడు చిత్రాన్ని తానే శింబు ఆర్ట్స్ బ్యానర్లో సొంతంగా విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రేమసాగరం చిత్రం నుంచి తనను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. అదే విధంగా తన కొడుకు శింబు నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో అనువాదం అయ్యి మంచి విజయాన్ని సాధించయన్నారు. అలా, మన్మధ, వల్లభ చిత్రాల తరువాత ఈ సరసుడు సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. -
శింబుపై కుట్ర జరుగుతోంది
తన కొడుకు, నటుడు శింబుపై కుట్ర జరుగుతోంది. తన చిత్రాలు విడుదల కాకుండా సమస్యలు సృష్టిస్తున్నారంటూ సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత టి.రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. శింబు నటించిన వాలు చిత్రాన్ని నిక్ ఆర్ట్స్ పతాకంపై చక్రవర్తి నిర్మించారు. హన్సిక హీరోయిన్. సమస్యలపై సమస్యల కారణంగా చాలా కాలంగా విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని శింబు తండ్రి టి.రాజేంద్రన్నే విడుదల చేయడానికి పూనుకున్నారు. చిత్రాన్ని ఈ నెల 17న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో మ్యాజిక్ రేస్ సంస్థ వాలు చిత్రం తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి హక్కులు తమకు ఉన్నట్లు 10 కోట్లకు 2013లోనే ఒప్పందం కుదుర్చుకున్నటు పేర్కొంటూ రెండు రోజుల క్రితం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం విచారణకు 13వ తేదీన వాయిదా వేస్తూ నిర్మాతల తరపున బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాటు చిత్ర విడుదలపై కోర్టు తాత్కాలిక నిషేధం విధించిందంటూ మీడియా ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని టి.రాజేంద్రన్ తీవ్రంగా ఖండించారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాలు చిత్ర విడుదల పై కోర్టు తాత్కాలిక నిషేధం విధించిందని ఒకవర్గం మీడియా అసత్య ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం స్టేటస్కో అని పేర్కొందని దాన్ని స్టేగా ప్రచారం చేస్తున్నారని అన్నారు.కోర్టు తీర్పుకు తలవంచుతా : వాలు చిత్ర వ్యవహారాన్ని న్యాయస్థానం ఈ నెల 13న విచారించనుందన్నారు. కోర్టు తీర్పును శిరసావహిస్తానని టీఆర్ అన్నారు. తనకు భగవంతునిపై నమ్మకం ఉంది. ఆయన మంచి చేస్తాడనే నమ్మకం ఉందని అన్నారు. శింబుపై కుట్ర జరుగుతోంది: శింబుపై కుట్ర జరుగుతోందని, తన చిత్రాలు విడుదల కాకుండా సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వాలు చిత్ర నిర్మాత చక్రవర్తి కష్టాల్లో ఉన్నారు. ఆయన్ని ఆదుకోవాలనే ఈ చిత్రాన్ని తాను విడుదల చేయాలని భావించానని అన్నారు. వాలు చిత్రాన్ని తాను విడుదల చేయనున్నట్లు జూన్ నెల 19వ తేదిన ప్రకటించానన్నారు. అప్పటినుంచి ప్రచారం చేస్తున్నానని అలాంటిది ఈ మధ్య కాలంలో మౌనంగా ఉన్న మ్యాజిక్ రేస్ సంస్థ సడన్‌గా ఇప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. వాలు చిత్ర హక్కులను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? లేక చిత్ర విడుదలను నిలిపి వేయాలనుకుంటున్నారా? ఇదంతా చూస్తుంటే శింబుపై కుట్ర జరుగుతోందని అనుమానం కలుగుతుందన్నారు. వాలు చిత్ర విడుదల కోసం తమిళనాడులోని డిస్ట్రిబ్యూటర్ల తదితర సంప్రదింపులు జరిపి వారి సహకారం కోరి చిత్రాన్ని విడుదల చేయడానికి తీవ్ర కృషి చేస్తుంటే తనతో పాటు డిస్ట్రిబ్యూటర్లు మనోభావాలు దెబ్బతినేలా కొందరు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలో రాజకీయం జరుగుతోందని ఆరోపించారు.