![Simbu Parents T Rajendar And Usha Give Clarity On His Marriage - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/7/simbu.jpg.webp?itok=4KK28wzx)
హైదరాబాద్ : సంచలన నటుడు శింబు ఇంకా మోస్ట్ బ్యాచిలర్‌గానే ఉన్నాడు. ఈయనకు ప్లేబోయ్ ఇమేజ్ కూడా ఉంది. కెరీర్ ప్రారభంలో నయనతారతో కొన్నాళ్లు ప్రేమాయణం నెరిపాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకునేటప్పుడు మనస్పర్ధలతో విడిపోయారు. కొంతకాలానికి ఈ హీరో హన్సికను ప్రేమించాడు. కొన్నాళ్లకు ఆమెతో కూడా బ్రేకప్ అయ్యాడు. ఆ తర్వాత ఎవరితోనూ ప్రేమలో పడలేదు. అయితే ఇటీవల శింబు వివాహంపై కోలివుడ్‌లో చర్చ జరుగుతోంది. లాక్‌డౌన్ అనంతరం శింబు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో శింబు పెళ్లిపై ఆయన తల్లిదండ్రులు సీనియర్ నటుడు, దర్శకుడు టీ.రాజేందర్, ఉషా రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. శింబు పెళ్లిపై వస్తున్న వార్తలు అవాస్తవమని, వాటిని నమ్మొద్దని అభిమానులను అభ్యర్థించారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
(చదవండి : జెస్సీకి కార్తీక్ ఫోన్.. ఆ తర్వాత ఏమైంది?)
‘శింబు పెళ్లిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లలో వాస్తవం లేదు. శింబుకు సరిపోయే జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నాం. అమ్మాయి కోసం వెతుకుతున్నాం. జాతకాలు కలిసే అమ్మాయి దొరికితే మేమే అందరికి తెలియజేస్తాం. అప్పటి వరకు వేచి చూడండి. దయచేసి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మకండి’ అని శింబు తల్లిదండ్రులు ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. కాగా, శింబు పెళ్లిపై వస్తున్న రూమర్స్ కొత్తేమీ కాదు. 2019లో శింబు సోదరుడు కురళరసన్‌కు వివాహం జరిగినప్పుడు కూడా శింబు పెళ్లిపై వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆయన కూడా పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు చక్కర్లు కొట్టాయి. కాగా, తాజాగా శింబు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించాడు. ‘కార్తీక్ డయల్ సేతాయన్’ పేరుతో విడుదలైన ఈ షార్ట్‌ఫిలిం నెటిజన్లను తెగ ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment