సినీ రంగంలో దర్శకుడు టి.రాజేందర్‌ను అష్టావధాని అంటారు. తాను ఈయన తన చిత్రాలకు కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం, నిర్మాణం, కథానాయకుడు ఇలా అన్ని బాధ్యతలను తనే నిర్వహిస్తుంటారు. అలా ఆయన చేసిన పలు చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. కాగా తాజాగా నాన్ కడైసీ తమిళన్ అనే చిత్రానికి ఈయన పాటలు, సంగీతాన్ని అందిస్తున్నారు. సీఆర్‌టీ కంపెనీ పతాకంపై ఎంఏ రాజేంద్రన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ఆదివారం ఉదయం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో దర్శకుడు టి.రాజేందర్, చిరు బడ్జెట్ చిత్ర నిర్మాతల సంఘం అధ్యక్షుడు అన్బు సెల్వన్ నటుడు ఇమాన్ అన్నాచ్చి, కరాటే రాజా తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం దర్శకుడు టీ రాజేందర్ క్లాప్ కొట్టి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను సినిమాలకు సంగీతాన్ని అందించి చాలాకాలం అయిందన్నారు. అందుకు కారణం ఇటీవలి కాలంలో వస్తున్న చిత్రాల్లో పాటలకు తగ్గ బాణీలను కట్టకపోవడమేనన్నారు.
అలాంటిది చాలా కాలం తర్వాత ఈ చిత్రానికి పాటలు, సంగీతాన్ని అందించడానికి కారణం 'నాన్ కడైసీ తమిళన్' అనే చిత్ర టైటిలేనన్నారు. చిత్ర దర్శక నిర్మాత ఎమ్‌ఏ రాజేందర్ మాట్లాడుతూ మిత్రుల ప్రోత్సాహంతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యానన్నారు. దీనికి టి. రాజేందర్ సంగీతాన్ని అందించటం సంతోషంగా ఉందన్నారు. విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని పలు భాషల్లో రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో నటించే నటీనటులు, ఇతర సాంకేతిక వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment