ఆధారాలుంటే బయటపెట్టవచ్చుగా! | Vishal Fires On Bharathiraja And T rajendar | Sakshi
Sakshi News home page

ఆధారాలుంటే బయటపెట్టవచ్చుగా!

Published Tue, May 15 2018 8:18 AM | Last Updated on Tue, May 15 2018 8:18 AM

Vishal Fires On Bharathiraja And T rajendar - Sakshi

విశాల్‌

తమిళసినిమా: తనపై ఆరోపణలకు ఆధారాలుంటే బయట పెట్టవచ్చుగా.. మాటలు కాదు..చేతల్లో చూపండి అంటూ నిర్మాతలమండలి అధ్యక్షుడు, నటుడు విశాల్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం ఈయన వ్యతిరేక వర్గానికి చెందిన దర్శకుడు భారతీరాజా, టీ.రాజేందర్, నటుడు రాధారవి, రితీశ్, రాధాకృష్ణన్‌ తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విశాల్‌పై ఆరోపణల దండయాత్ర చేసిన విషయం తెలిసిందే.

దీనిపై స్పంధించిన విశాల్‌ నిర్మాతల మండలి నిధి రూ.7 కోట్లకు సంబంధించిన లెక్కలు చూపలేదు అంటూ ఆరోపణలు చేశారన్నారు. నిజానికి మండలి నిధి విషయంలో అవకతవకలు జరగలేదని, ఎవరూ అక్రమాలకు పాల్పడలేదన్నారు. అంతా భద్రంగానే కాపాడుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. పైరసీ వంటి వాటిని వేళ్లతో అణచివేడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తనపై ఆరోపణలకు ఆధారాలుంటే నిరూపించాలన్నారు. మాటలు కాకుండా చేతల్లో చూపాలని విశాల్‌ వారికి సవాల్‌ విసిరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement