Bharati Raja
-
నా సినిమా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు: దర్శకుడు
వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడు, ఛాయాగ్రాహకుడు తంగర్ బచ్చాన్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం మేఘంగల్ కలైగిండ్రన, రిమోట్ మీడియా సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో దర్శకుడు భారతీరాజా ప్రధాన పాత్రలో పోషించారు. దర్శకుడు గౌతమ్ మీనన్, నటి అతిథి బాలన్, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటవ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా సోమవారంసాయంత్రం ఈ చిత్రం చైన్నెలోని ఒక ప్రివ్యూ థియేటర్లో చిత్రాన్ని మీడియాకు ప్రదర్శించారు. అనంతరం దర్శకుడు తంగర్ బచ్చన్ మాట్లాడుతూ మానవ సంబంధాలను, కుటుంబ భావోద్వేగాలను ఆవిష్కరించే ఈ చిత్రాన్ని మూడు రోజుల క్రితం తమిళనాడులోని 500 మంది సాధారణ ప్రేక్షకులను ఎంపిక చేసి మేఘంగల్ కలైగిండ్రన చిత్రాన్ని వారి కోసం ప్రత్యేకంగా ప్రదర్శించినట్లు చెప్పారు. మంచి చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ కచ్చితంగా ఉంటుందన్నారు. అందుకు ఉదాహరణ తాను ఇంతకుముందు దర్శకత్వం వహించిన అళగి చిత్రమేనని పేర్కొన్నారు. చిత్ర వ్యాపారం కోసం 100 ప్రదర్శనలు ఏర్పాటు చేశామని, అయినా చిత్రాన్ని కొనుగోలు చేయడానికి బయ్యర్లు ముందుకు రాలేదని చెప్పారు. అలాంటిది అళగి చిత్రం విడుదలై ఎంత సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందేనన్నారు. కాగా చిత్ర జయాపజయాలను నిర్ణయించేది ప్రేక్షకులేనని దర్శకుడు తంగర్ బచ్చాన్ పేర్కొన్నారు. కాబట్టి మేఘంగల్ కలైగిండ్రన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. -
మోడ్రన్ లవ్ చెన్నై..స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
మోడ్రన్ లవ్ చైన్నె అనే అంథాలజీ వెబ్ సీరీస్ ఈనెల 18వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. టైలర్ డర్డన్ అండ్ కినోఫీస్ట్ సంస్థ నిర్మించిన ఈ వెబ్ సీరీస్‌కు త్యాగరాజన్ కుమారరాజా నిర్వహణ బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఒక ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించారు. ఆయనతో పాటు మొత్తం ఆరు ఎపిసోడ్లుగా రూపొందిన దీనికి దర్శకుడు భారతీరాజా, బాలాజీ శక్తివేల్, రాజుమురుగన్, అక్షయ్ సుందర్, కృష్ణకుమార్, రామ్‌కుమార్ ఆరుగురు దర్శకులు ఒక్కో ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించారు. ఆంగ్లంలో మోడ్రన్ లవ్ పేరుతో రూపొంది విశేష ప్రేక్షకాదరణను పొందిన ఈ అంథాలజీ వెబ్ సీరీస్‌ను మోడ్రన్ లవ్ చైన్నె పేరుతో రీమేక్ చేయడం విశేషం. ఇది ప్రేమను వివిధ కోణాల్లో ఆవిష్కరించే వెబ్ సీరీస్ అని నిర్వాహకుడు, దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ తాను సంప్రదాయం కలిగిన వ్యక్తినన్నారు. 50 ఏళ్లుగా పలు చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ వచ్చానని, సరికొత్త ప్రేమకథా చిత్రానికి దర్శకత్వం వహించాలన్న తన ఆసక్తి దర్శకుడు త్యాగరాజన్ కుమార్‌రాజా ద్వారా ఈ అంథాలజి వెబ్ సీరీస్‌తో నెరవేరిందని పేర్కొన్నారు. ప్రేమలేని జీవితం ఉండదన్నారు. జీవితంలో ప్రేమలో పడని వాడు కళాకారుడు కాలేడని అన్నారు. ప్రేమకు ఫిదా సినిమా అంటూ ఉండదని, ప్రేమ చాలా గొప్పదని పేర్కొన్నారు. చదవండి: అప్‌కమింగ్ లేడీ ఓరియంటెడ్ సినిమాలివే! -
శివాజీ గణేషన్‌ను ఇండస్ట్రీ పట్టించుకోలేదు: ఇళయరాజా షాకింగ్ కామెంట్స్
సాక్షి, చెన్నై: దివంగత నటుడు శివాజీ గణేషన్‌ను చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం తగిన రీతిలో సత్కరించలేదని సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. ప్రముఖ రచయిత మరుదు మోహన్ నటుడు శివాజీ గణేషన్ గురించి రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం చెన్నైలో జరిగింది. దర్శకుడు భారతి రాజా, కే.భాగ్యరాజ్, సంగీత దర్శకుడు ఇళయరాజా, రచయిత ముత్తులింగం, నటుడు ప్రభు, రాంకుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై ఇళయరాజా మాట్లాడుతూ.. శివాజీ గణేషన్ నుంచి తాను నేర్చుకున్న అనేక విషయాల్లో కాలం ఒకటని పేర్కొన్నారు. క్రమశిక్షణలో ఆయనకు మించిన వారు మరొకరు ఉండరన్నారు. తన కారు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు స్టూడియో ముందు ఆగుతుందన్నారు. ఒకసారి తాను ఆలస్యంగా రావడంతో ఏమిటి రాసా నువ్వు కూడానా అని శివాజీ గణేషన్ తనను అడిగారన్నారు. రికార్డింగ్ స్టూడియోలో ఆయన తన అనువాభవాలను పంచుకునే వారని చెప్పారు. ఒకసారి సినీ పరిశ్రమ తరపున శివాజీ గణేషన్‌కు అభినందన సభ జరిగిందన్నారు. ఆయనకు ఒక కానుక అందించాలని నిర్ణయించామన్నారు. అందుకు తగిన నగదును పరిశ్రమ వర్గాల నుంచి వసూలు చేసినట్లు చెప్పారు. నటీనటులు తినే భోజనంలో ప్రతి బియ్యం గింజ పైనా శివాజీ గణేషన్ పేరు ఉంటుందన్నారు. దీంతో ఆయనకు ప్రదానం చేసే జ్ఞాపికపై ఎవరి పేర్లు ఉండరాదని, దానికి అయ్యే ఖర్చును తానే ఇస్తానని చెప్పానన్నారు. ఆ విషయం తెలిసి శివాజీ గణేషన్ ఎవరిని మరిచినా ఇళయరాజాను మరవకూడదని అన్నారన్నారు. శివాజీని సినిమా పెద్దలు గాని, ఏ ప్రభుత్వం తగిన విధంగా సత్కరించలేదని, అయితే వ్యక్తిగతంగా ఎవరైనా చేశారంటే అది ఈ ఇళయ రాజానే అని పేర్కొన్నారు. చదవండి: మొత్తం బిగ్‌బాస్ ద్వారా రేవంత్ ఎంత సంపాదించాడో తెలుసా? అందుకే సీతారామంకు తెలుగు వారిని తీసుకోలేదు: హను రాఘవపూడి -
మళ్లీ అనారోగ్యానికి గురైన సీనియర్ దర్శకుడు
సీనియర్ దర్శకుడు భారతీరాజా మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని స్థానిక అంజిగరైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. భారతీరాజా అనారోగ్యం కారణంగా గత నెల 24వ తేదీ ఇదే హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. జలుబు, అజీర్ణం సమస్యతో బాధపడుతున్న ఆయనకు అత్యవసర విభాగంలో వైద్య సేవలు అందించారు. సుమారు 20 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్న భారతీరాజా ఆరోగ్యం మెరుగుపడడంతో ఇటీవలే ఇంటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో శుక్రవారం ఆస్పత్రికి తరలించారు. -
‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్‌పై డైరెక్టర్ భారతీరాజా ఫైర్
సాక్షి, చెన్నై: తమిళనాడులో ది ప్యామిలీమెన్ 2 వెబ్‌సిరీస్‌పై నిరసనల సెగలు రగులుతున్నాయి. నటి సమంతను శ్రీలంకకు చెందిన తమిళ యువతి పాత్రలో నెగటివ్‌గా చూపించిన ఈ వెబ్‌సిరీస్‌పై తమిళనాట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెబ్ సిరీస్‌ను నిషేధించాలంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, పలు రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఇలా ఉండగానే వెబ్‌సిరీస్ ఈ నెల 4న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది. ఈ చర్యలను నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ తీవ్రంగా ఖండించారు. తాజాగా సీనియర్ దర్శకుడు భారతీరాజా ఈ వెబ్‌సిరీస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తమిళ జాతికి వ్యతిరేకంగా రూపొందిన ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్‌సిరీస్‌ను ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించకపోవడం బాధాకరమన్నారు. తమిళ ద్రోహులు రూపొందించిన వెబ్‌సిరీస్‌గా పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి నిషేధం విధించాలని కోరారు. ప్రసారాన్ని ఆపకుంటే అమెజాన్ సంస్థపై పోరాటం చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. -
నాకు మాటలు రావట్లేదు: భారతీరాజా
-
విశాల్ నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు!
సాక్షి, చెన్నై : నటి మీరామిథున్ తన వివాదస్పద వ్యాఖ్యలకు బ్రేక్ వేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపించడం లేదు. ఆ మధ్య హీరోలు విజయ్, సూర్యలను వ్యక్తిగతంగా విమర్శలు చేసి వారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. అంతేకాకుండా మీరామిథున్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను తీవ్రంగా హెచ్చరించారు. అయినా నటి మీరామిథున్లో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇటీవలే రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరో వివాదస్పద అంశానికి తెర తీశారు. ఈసారి విశాల్‌ను టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాజీ మేనేజర్ విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. అందులో విశాల్ తనను పెళ్లి చేసుకుంటానని రెండు, మూడు ఏళ్లుగా అడుగుతూ వచ్చారని మీరా మిథున్ పేర్కొన్నారు. తన తల్లికి విశాల్ అంటే చాలా ఇష్టమని, అయితే తనకు ధనవంతుడైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అందుకే విశాల్‌ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినట్టు తెలిపారు. మరి దీనికి విశాల్ ఎలా స్పందిస్తారో చూడాలి. -
ఆధారాలుంటే బయటపెట్టవచ్చుగా!
తమిళసినిమా: తనపై ఆరోపణలకు ఆధారాలుంటే బయట పెట్టవచ్చుగా.. మాటలు కాదు..చేతల్లో చూపండి అంటూ నిర్మాతలమండలి అధ్యక్షుడు, నటుడు విశాల్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఈయన వ్యతిరేక వర్గానికి చెందిన దర్శకుడు భారతీరాజా, టీ.రాజేందర్, నటుడు రాధారవి, రితీశ్, రాధాకృష్ణన్ తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విశాల్‌పై ఆరోపణల దండయాత్ర చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పంధించిన విశాల్ నిర్మాతల మండలి నిధి రూ.7 కోట్లకు సంబంధించిన లెక్కలు చూపలేదు అంటూ ఆరోపణలు చేశారన్నారు. నిజానికి మండలి నిధి విషయంలో అవకతవకలు జరగలేదని, ఎవరూ అక్రమాలకు పాల్పడలేదన్నారు. అంతా భద్రంగానే కాపాడుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. పైరసీ వంటి వాటిని వేళ్లతో అణచివేడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తనపై ఆరోపణలకు ఆధారాలుంటే నిరూపించాలన్నారు. మాటలు కాకుండా చేతల్లో చూపాలని విశాల్ వారికి సవాల్ విసిరారు.