వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడు, ఛాయాగ్రాహకుడు తంగర్ బచ్చాన్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం మేఘంగల్ కలైగిండ్రన, రిమోట్ మీడియా సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో దర్శకుడు భారతీరాజా ప్రధాన పాత్రలో పోషించారు. దర్శకుడు గౌతమ్ మీనన్, నటి అతిథి బాలన్, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందించారు.
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటవ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా సోమవారంసాయంత్రం ఈ చిత్రం చైన్నెలోని ఒక ప్రివ్యూ థియేటర్‌లో చిత్రాన్ని మీడియాకు ప్రదర్శించారు. అనంతరం దర్శకుడు తంగర్ బచ్చన్ మాట్లాడుతూ మానవ సంబంధాలను, కుటుంబ భావోద్వేగాలను ఆవిష్కరించే ఈ చిత్రాన్ని మూడు రోజుల క్రితం తమిళనాడులోని 500 మంది సాధారణ ప్రేక్షకులను ఎంపిక చేసి మేఘంగల్ కలైగిండ్రన చిత్రాన్ని వారి కోసం ప్రత్యేకంగా ప్రదర్శించినట్లు చెప్పారు. మంచి చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ కచ్చితంగా ఉంటుందన్నారు.
అందుకు ఉదాహరణ తాను ఇంతకుముందు దర్శకత్వం వహించిన అళగి చిత్రమేనని పేర్కొన్నారు. చిత్ర వ్యాపారం కోసం 100 ప్రదర్శనలు ఏర్పాటు చేశామని, అయినా చిత్రాన్ని కొనుగోలు చేయడానికి బయ్యర్లు ముందుకు రాలేదని చెప్పారు. అలాంటిది అళగి చిత్రం విడుదలై ఎంత సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందేనన్నారు. కాగా చిత్ర జయాపజయాలను నిర్ణయించేది ప్రేక్షకులేనని దర్శకుడు తంగర్ బచ్చాన్ పేర్కొన్నారు. కాబట్టి మేఘంగల్ కలైగిండ్రన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment