సాక్షి, చెన్నై: తమిళనాడులో ది ప్యామిలీమెన్ 2 వెబ్‌సిరీస్‌పై నిరసనల సెగలు రగులుతున్నాయి. నటి సమంతను శ్రీలంకకు చెందిన తమిళ యువతి పాత్రలో నెగటివ్‌గా చూపించిన ఈ వెబ్‌సిరీస్‌పై తమిళనాట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెబ్ సిరీస్‌ను నిషేధించాలంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, పలు రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఇలా ఉండగానే వెబ్‌సిరీస్ ఈ నెల 4న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది. ఈ చర్యలను నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ తీవ్రంగా ఖండించారు.
తాజాగా సీనియర్ దర్శకుడు భారతీరాజా ఈ వెబ్‌సిరీస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తమిళ జాతికి వ్యతిరేకంగా రూపొందిన ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్‌సిరీస్‌ను ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించకపోవడం బాధాకరమన్నారు. తమిళ ద్రోహులు రూపొందించిన వెబ్‌సిరీస్‌గా పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి నిషేధం విధించాలని కోరారు. ప్రసారాన్ని ఆపకుంటే అమెజాన్ సంస్థపై పోరాటం చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment