Tamila nadu
-
రైతుల కోసం హెల్ప్‌లైన్
సాక్షి, చైన్నె: ప్రభుత్వ ప్రత్యక్ష వరి కొనుగోలు కేంద్రాలలో ఎదురయ్యే సమస్యలపై రైతులు ఫిర్యాదు చేయడానికి వీలుగా వాట్సాప్ హెల్ప్‌లైన్‌ను తమిళనాడు కన్స్యూమర్ గూడ్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదివారం ప్రకటించారు. రాష్ట్రం 2,600 కంటే అధికంగా ప్రత్యక్ష వరి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. రోజుకు సుమారు 12,800 మంది రైతుల నుంచి సుమారు 60,000 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేస్తున్నారు. అయితే కొన్ని కొనుగోలు కేంద్రాలలో రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్టు, ఇక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. దీంతో రైతుల కోసం 180059 93540 నంబరుతో చైన్నె ప్రధాన కార్యాలయంలో 24 గంటల హెల్త్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చారు. అలాగే అన్ని ప్రత్యక్ష వరి సేకరణ కేంద్రాల జోనల్ మేనేజర్, డైరెక్టర్ సీనియర్ రీజినల్ మేనేజర్ల మొబైల్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచారు. ఆ ఫోన్ నంబర్లను కూడా సంప్రదించి రైతులు ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదులపై తక్షణ విచారణ, న్యాయం, పరిష్కారం దిశగా అదనపు రిజిస్ట్రార్ స్థాయిలో ఒక ప్రత్యేక పర్యవేక్షణ అధికారిని నియమించారు. ఆయన ఆధ్వర్యంలో 8 కమిటీలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అలాగే తమిళనాడు కన్స్యూమర్ గూడ్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మొబైల్ నంబర్ 94452 57000కు వాట్సాప్ ద్వారా సైతం ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించారు.నేను క్షేమంగానే ఉన్నా..!తమిళసినిమా: ప్రముఖ హాస్యనటుడిగా, కథానాయకుడిగా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నటుడు యోగిబాబు. కాగా ఒక షూటింగ్లో పాల్గొనడానికి వెళ్లిన ఈయన ఏలగిరి నుంచి బెంగళూరు హైవే రోడ్లో ఆదివారం వేకువజామున చైన్నెకి కారులో ప్రయాణం చేస్తుండగా రాణిపేట, వాలాజా సమీపంలోని చెన్న సముద్రం టోల్గేట్ వద్ద కారు అదుపు తప్పడంతో ప్రమాదానికి గురైనట్లు అందులో ప్రయాణిస్తున్న యోగిబాబు, ఆయన అనుచరులు గాయాల పాలైనట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అయ్యింది. కాగా ఈ ప్రచారంపై నటుడు యోగిబాబు స్పందించారు. ఆయన మీడియాకు విడుదల చేసిన ఒక ప్రాంతంలో తాను ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదని క్షేమంగా ఉన్నానని తెలిపారు. నిజానికి తాను పయనిస్తున్న కారు ప్రమాదానికి గురి కాలేదని, తన వెనుక చిత్ర యూనిట్ ప్రయాణం చేస్తున్న కారు పంచర్ కావడంతో ఆగిపోయిందని, అందులో ప్రయాణం చేస్తున్న వారికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. కాగా తాను ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని పేర్కొన్నారు. ఇలాంటి వార్తలు విని తన మిత్రులు, సినీ ప్రముఖులు ,అభిమానులు, పత్రికల వారు పలువురు తనకు ఫోన్ చేసి విచారించారని, అలా తనపై అక్కర కలిగిన వారందరికీ ఈ సందర్భంగా తన ప్రేమతో కూడిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
కమల యోధురాలు
తిరువరూర్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ కమలా హారిస్‌ను పోరాట యోధురాలంటూ ఆకాశానికెత్తేస్తున్నారు తమిళనాడులోని ఆమె పూర్వికుల గ్రామ ప్రజలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి, విజయం సాధిస్తారంటూ తులసేంద్రపురం గ్రామస్తులు ధీమాగా చెబుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడవుతుండటంతో గ్రామస్తులు టీవీలకు అతుక్కుపోయారు. స్థానిక శ్రీ ధర్మ శాస్త పెరుమాల్ ఆలయంలో పూజలు చేసి, కమల గెలవాలని మొక్కుకున్నారు. మధ్యాహ్నానికల్లా ట్రంప్‌దే విజయమని, కమల ఓడిపోతున్నారని తేలడంతో నిరుత్సాహానికి గురయ్యారు. మంగళవారం గ్రామానికి అమెరికా, బ్రిటన్ల నుంచి వచి్చన కమల అభిమానులు ముగ్గురు బుధవారం తిరిగి వెళ్లిపోయారు. ‘కమల గెలిస్తే దీపావళికి మించి ఘనంగా ఉత్సవం నిర్వహించాలని అనుకున్నాం. ఇందుకోసం, టపాసులు సిద్దంగా ఉంచాం. ఆలయంలో పూజలయ్యాక అన్నదానం, స్వీట్లు పంపిణీ చేయాలనుకున్నాం’అని డీఎంకే తిరువరూర్ జిల్లా ప్రతినిధి, తులసేంద్రపురం గ్రామ నేత జె.సుధాకర్ చెప్పారు. ‘గెలుపోటములు జీవితంలో భాగం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమల గట్టిపోటీని ఎదుర్కొన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని చూస్తే మెచ్చుకోవాల్సిందే. ఆమె యోధురాలు, మళ్లీ పోటీ చేసి విజయం సాధిస్తారు’అని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడామె అధ్యక్షురాలు కాకపోవచ్చు, భవిష్యత్తు ఏదో ఒకనాడు కమల అమెరికా అధ్యక్షపీఠం ఎక్కడం ఖాయమంటూ మరికొందరు విశ్వాసం వ్యక్తం చేశారు. ‘కమల ఓటమిని తట్టుకోలేకపోతున్నాం. కానీ, ఆమెకిప్పుడు 60 ఏళ్లే. ఈ ఓటమితో నిరాశ చెందక ఇంతకుమించి పట్టుదలతో పోరాడి వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధిస్తారనుకుంటున్నాం’అని గ్రామానికి చెందిన టీఎస్ అన్బసరసు చెప్పారు. తమ గ్రామంలోని కుటుంబానికి చెందిన ఓ మహిళ అమెరికా మొట్టమొదటి అధ్యక్షురాలవుతారని గ్రామస్తులంతా ఆశతో ఉన్నారని ఆయన అన్నారు. అధ్యక్షురాలైతే కమల తమ గ్రామానికి వస్తారని ఎదురుచూస్తామని చెప్పారు. చదవండి: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. స్పీకర్ మైక్ జాన్సన్ ప్రకటన -
‘మీరే హిందూ మతానికి అసలైన శత్రువులు’.. పవన్‌కు డీఎంకే కౌంటర్
చెన్నై: తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కౌంటర్ ఇచ్చింది. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన రాజకీయంపై సుప్రీం కోర్టు మొట్టి కాయలు వేసిన విషయాన్ని గుర్తు చేసింది పవన్ వారాహి డిక్లరేషన్ సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా మాట్లాడారు. ‘సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలనుకుంటే, వారే తుడిచి పెట్టుకుని పోతారు. తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నా’ అంటూ హెచ్చరించారు.అయితే పవన్ వ్యాఖ్యలపై డీఎంకే గట్టి కౌంటర్ ఇచ్చింది. డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. తమ పార్టీ ‘ఏ మతం గురించి, ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు.. కుల దురాగతాలు, అంటరానితనం గురించి మాత్రమే మాట్లాడుతుంది’ అని సూచించారు. తిరుమల లడ్డూ వివాదంపై సెప్టెంబర్ 30న తొలిసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా.. శ్రీవారి ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించడం తగదంటూ మొట్టికాయలు వేసింది. తాజాగా ఆ వ్యాఖ్యల్ని ప్రస్తావించిన హఫీజుల్లా..‘ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీలే హిందూ మతం, మానవత్వానికి నిజమైన శత్రువులు ’ ద్వజమెత్తారు. డీఎంకే ఏ మతం గురించి మాట్లాడదు. మతాన్ని, హిందూ దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేది బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్. వారే అసలైన శత్రువులు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో మీకు మీరే సాటి అని సెటైర్లు వేశారు. ‘ఇంకా.. కులం, అంటరానితనంపై అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, పెరియార్ ఇతర ద్రావిడ ఉద్యమ వ్యవస్థాపకుల తరహా వైఖరినే డీఎంకే అవలంభిస్తుంది. వాటికి అనుగుణంగా కులం, అంటరానితనం గురించి పోరాడుతుంది. వ్యతిరేకిస్తుందని సూచించారు.👉చదవండి: సుప్రీంలో చంద్రబాబుకు ఎదురు దెబ్బ -
కోర్టు ఆదేశాలు.. ఈశా ఫౌండేషన్‌లో పోలీసుల సోదాలు
చెన్నై: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్‌కు చెందిన ఈశా ఫౌండేషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన సొంత కూతురికి పెళ్లి చేసి సంప్రదాయబద్ధంగా స్థిరపడేలా ఏర్పాటు చేసిన వాసుదేవ్.. యువతులను ప్రాపంచిక వృత్తిని త్యజించమని, తల దువ్వుకుని, తన యోగా కేంద్రాల్లో సన్యాసులుగా జీవించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించింది.సోమవారం హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టు ఎస్ఎం సుబ్రమణ్యం, వి.శివజ్ఞానం ఎదుట విచారణ విచారణకు వచ్చింది. విచారణ జరిగే సమయంలో కీలక కామెంట్స్ చేసింది. ఈశా పౌండేషన్‌కు సంబంధించి సమగ్ర నివేదికను సెప్టెంబర్ 4 (శుక్రవారం) లోపు కోర్టుకు అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే..తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లాలోని తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్.కామరాజ్ (69)హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో తన ఇద్దరు కుమార్తెల్లో శక్తి సామర్ధ్యాలను తగ్గేలా మందులు ఇచ్చారని, జుత్తు కత్తిరించుకుని తన యోగా కేంద్రాల్లో సన్యాసులుగా జీవించమని ప్రోత్సహించినట్లు ఆరోపించారు. ఈశా ఫౌండేషన్‌లో చేరితన పెద్ద కుమార్తె ..ప్రతిష్టాత్మక యూకే యూనివర్శిటీ నుంచి మెకాట్రానిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది. 2008లో విడాకులకు ముందు అత్యధిక వేతనంతో ఉద్యోగం కూడా చేసింది. వైవాహిక జీవితంలో సమస్యలు రావడంతో ఆమె తన భర్త నుంచి విడిపోయారని, ఆ తర్వాత ఆధ్యాత్మిక బాట పట్టినట్లు కామరాజ్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆమె ఈశా ఫౌండేషన్‌లో యోగా తరగతులకు హాజరుకావడం ప్రారంభించింది. కొంత కాలానికి ఐటీ ఉద్యోగం చేసిన నా చిన్న కుమార్తె సైతం ఈశా ఫౌండేషన్‌లో చేరింది. చివరికి శాశ్వతంగా ఆశ్రమంలోనే నివసించాలని నిర్ణయించుకున్నారు.న్యాయం చేయండిఇప్పుడు ఇంటికి రావడం లేదని, తన కుమార్తెల జీవితాన్ని జగ్గీ వాసుదేవ్ నాశనం చేశారని పిటిషనర్ కామరాజ్ తెలిపారు. కుమార్తెల జీవితం నాశనం అవ్వడంతో తన భార్య అనారోగ్యానికి గురయ్యారని, తనకు న్యాయం చేయాలని కోరారు. తన కుమార్తెలతో పాటు ఎందరో తల్లిదండ్రులకు దూరంగా ఈశా ఫౌండేషన్‌లో చేరి వారి జీవితాల్ని నాశనం చేసుకున్నట్లు చెప్పారు.క్రిమినల్ కేసులు నమోదుఇప్పటికే ఈశా ఫౌండేషన్‌లో పనిచేస్తున్న వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదైన విషయాన్ని పిటిషనర్ పిటిషన్లో ప్రస్తావించారు. ఇటీవల అదే సంస్థలో పనిచేస్తున్న ఓ వైద్యుడు ఆదివాసీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 12 మంది బాలికలను వేధించాడని,ఆయనపై పోక్సో కింద క్రిమినల్ కేసు నమోదయ్యాయని, అందుకు గల ఆధారాల్ని కోర్టుకు అందించారు. హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణరిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై ప్రతిస్పందనగా విచారణ మొదలైంది. తన ఇద్దరు కుమార్తెలను కేంద్రంలో వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఉంచారని కామరాజ్ పేర్కొన్నారు. ఇషా ఫౌండేషన్ వ్యక్తుల బ్రెయిన్‌వాష్ చేసి, వారిని సన్యాసులుగా మారుస్తోందని, వారి కుటుంబాలతో సంబంధాలు కొనసాగించకుండా అడ్డుకుంటున్నదని కామరాజ్ ఆరోపించారు.ప్రతి స్పందనగా ఇషా ఫౌండేషన్ తరపు న్యాయవాది కె.రాజేంద్ర కుమార్, ఫౌండేషన్‌ను సమర్థించారు. ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించడంతోపాటు వారి జీవితాల గురించి వారి సొంత ఎంపికలు చేసుకునే హక్కు పెద్దలకు ఉందని నొక్కి చెప్పారు. ఈశా ఫౌండేషన్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు కామరాజ్ ప్రయత్నించారని, తమ సంస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాదించారు. ఇరు పక్షాల వాదనలు హైకోర్టు ఎస్ఎం సుబ్రమణ్యం,వి.శివజ్ఞానం న్యాయమూర్తులు ఈశా ఫౌండేషన్‌లోని పద్ధతులపై ప్రశ్నలను లేవనెత్తారు. జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెకు వివాహం చేసి స్థిరపడేలా చేశారని, కానీ యువతులను సన్యాసులుగా జీవించమని ఎందుకు ప్రోత్సహించారని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలు.. ఈశా ఫౌండేషన్‌లో సోదాలుఅనంతరం, జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈశా ఫౌండేషన్‌పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో కోయంబత్తూర్ రూరల్ డిస్ట్రిక్ అసిస్టెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కే. కార్తికేయన్ నేతృత్వంలో ముగ్గురు డిప్యూటీ సూపరింటెండెంట్లు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు 150 మంది పోలీసు అధికారుల బృందం కోయంబత్తూరులోని తొండముత్తూర్లోని మంగళవారం వెల్లియంగిరి పాదాల వద్ద ఉన్న ఈశా ఫౌండేషన్ ఆశ్రమంలో విచారణ చేపట్టారు.ఈ సోదాలపై ఈశా యోగా సెంటర్ ప్రతినిధులు అధికారికంగా స్పందించారు. ‘కోర్టు ఆదేశాల మేరకు..ఎస్పీలు ఇషా యోగా సెంటర్లో సాదారణంగా తనిఖీలు నిర్వహించారు. యోగా సెంటర్లో ఉండే వారిని, వాలంటీర్లను వారి జీవన విధానం ఎలా ఉంటుంది? ఎక్కడ నుంచి వచ్చారు? ఇక్కడ ఎలా ఉంటున్నారు?’ అని ప్రశ్నలు వేసినట్లు చెప్పారు. -
అజిత్ ‘వలిమై’ ఫస్ట్‌డే కలెక్షన్స్.. ఒక్క తమిళనాడులోనే అన్ని కోట్లా!
దేశంలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టడంతో పెద్ద సినిమాలు విడుదలకు సిద్దమయ్యాయి. ఇప్పటికే పలుమార్లు విడుదలను వాయిదా వేసుకున్న చిత్రాలు.. వరుసగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘వలిమై’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలన్ని వాయిదా పడటంతో వలిమైపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఈ తరుణంగా ఎన్నో అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ మూవీ హిట్‌టాక్‌ను తెచ్చుకోవడమే కాదు కలెక్షన్స్ పరంగా కూడా గ్రాండ్ ఓపెనింగ్‌ను ఇచ్చింది. ‘వలిమై’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ను అఫిషియల్‌గా ప్రకటిస్తూ సినిమా పీఆర్ఓ రమేష్ బాల ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన.. బ్రేకింగ్.. వలిమై తొలిరోజే కలెక్షన్స్ సునామి సృష్టించిన తొలి సినిమాగా నిలిచిందని, తమిళనాడులో వలిమై తొలిరోజు రూ. 34కోట్లు వసూలు చేసిందని వెల్లడించాడు. కరోనా సమయంలో సైతం ఈ స్థాయిలో కలెక్షన్స్ ఆశ్చర్యకరం అంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత వచ్చినప్పటికి అజిత్ వలిమైతో మరోసారి తన మార్క్ చూపించాడంటు మురిసిపోతున్నారు ఆయన అభిమానులు. అయితే ఒక్క తమిళనాడులోనే కలెక్షన్స్ ఈ రేంజ్లో ఉంటే ఇక తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలో కలిపి 50 నుంచి 60 కోట్లు రూపాయలు దాటే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచన వేస్తున్నారు. #BREAKING : Actor #AjithKumar 's #Valimai takes All-Time No.1 Day 1 Opening in TN.. TN Day 1 Gross - ₹ 34 Crs.. — Ramesh Bala (@rameshlaus) February 25, 2022 -
తమిళనాడుతో హిమాచల్ ప్రదేశ్ ఫైనల్ పోరు... ధావన్ మళ్లీ మెరిసేనా!
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తొలిసారి చాంపియన్‌గా అవతరించాలనే పట్టుదలతో హిమాచల్‌ప్రదేశ్... ఆరోసారి విజేతగా నిలవాలనే లక్ష్యంతో తమిళనాడు... జైపూర్‌లో నేడు జరిగే టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత క్రికెటర్ రిషి ధావన్ నాయకత్వంలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఫైనల్ చేరిన హిమాచల్ ప్రదేశ్ ఆఖరి అడ్డంకిని అధిగమిస్తుందో లేదో చూడాలి. ఇటీవల ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీ టైటిల్ నెగ్గిన తమిళనాడు మరో టైటిల్‌పై గురి పెట్టింది. బాబా అపరాజిత్, వాషింగ్టన్ సుందర్లతోపాటు చివర్లో మెరుపులు మెరిపించే షారుఖ్‌ఖాన్ సూపర్ ఫామ్‌లో ఉండటం తమిళనాడుకు సానుకూల అంశం. ఉదయం 9 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. చదవండి: IND-19 Vs PAK-19: పాక్‌పై చివరి బంతికి ఓడిన భారత్.. -
దీపావళి పండుగ ముగింపు... ఒక వింతైన ఆచారం
గుమటాపుర: చాలా ప్రాంతాలలో పండుగల సందర్భంగా కొన్ని వింతైన ఆచారాలు ఉంటాయి. వాటి వెనుక ఎంతో కొంత ప్రయోజనాల దృష్ట్య కూడా మన పూర్వీకులు ఇలాంటి వాటిని మన దైనందిన జీవితంలో భాగం చేస్తారని చెప్పక తప్పదు. అదేవిధంగా కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఉన్న గుమటాపుర గ్రామంలో దీపావళి పండుగ ముగింపు సందర్భంగా ఒక వింతైన ఆచారం ఉంది. (చదవండి: అమ్మ బాబోయ్ వీడేంట్రా వేడి వేడి నూనెలో డైరెక్ట్‌గా చేతులు పెట్టేస్తున్నాడు!) అంతేకాదు వారు మొదట ఆలయానికి వెళ్లి గుడిలోని పూజారితో ఆశీర్వాదం తీసుకునేముందు స్థానిక చుట్టుపక్కల గ్రామాలలోని ఇళ్లలో నుంచి పెద్ద ఎత్తున ఆవుపేడను ట్రాక్టర్ల సాయంతో దేవలయానికి తరలిస్తారు. ఆ తర్వాత అబ్బాయిలంతా జరగబోయే కార్యక్రమానికి కావల్సిన బాణసంచా వంటి మందు గుండు సామాగ్రిని సిద్ధం చేసుకుంటారు. ఈ మేరకు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా మగవాళ్లంతా ఒకరి నొకరు ఆవుపేడతో కొట్టుకుంటారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి సుదూర నగరాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున గుమటాపురానికి తరలి వస్తుంటారు. అంతేకాదు ఈ వేడుక చిన్న పాటి యుద్ధ వాతావరణాన్ని తలపించేలా సరదా సరదాగా సాగుతుంటుంది. పైగా ఆ గ్రామంలోని ప్రజలు ఇది ఆరోగ్య ప్రయోజని నిమిత్తం ఇలా చేస్తుంటామని చెబుతుండం విశేషం. ఈ మేరకు ఆ గ్రామంలోని రైతు ఈ ఆవు పేడతో ఇలా కొట్టించుకుంటే ఏదైనా వ్యాధి ఉన్న అది త్వరగా తగ్గిపోతుందని చెబుతున్నారు. (చదవండి: పునీత్‌కు పద్మ శ్రీ ఇవ్వాల్సిందే !!) #WATCH | Villagers of Gumatapura on the Tamil Nadu-Karnataka border throw cow dung on each other as part of Deepavali celebrations, marking the end of the festival. (06.11.2021) pic.twitter.com/w1fhrp0na5 — ANI (@ANI) November 8, 2021 -
కోలుకుంటున్న ‘నోటా’ హీరోయిన్, మూడు నెలలుగా ఆసుపత్రిలోనే..
ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన హీరోయిన్ యాషికా ఆనంద్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ప్రమాదం జరిగి మూడు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఆమె ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. తమిళనాడు గత నెల జులై 24న జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆమె స్నేహితురాలు పావని మృతి చెందగా యాషికకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయడిన ఆమె కనీసం నడవలేని, నిలబడలేని స్థితిలో ఉన్నారు. దీంతో మూడు నెలలుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న యాషిక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆమె ఒక్కో అడుగు వేస్తూ నడిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను యాషిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా.. ‘ఆసుపత్రి వైద్యుల సాయంతో నడవడం ప్రాక్టీస్ చేస్తున్నా’ అని ఆమె తెలిపారు. అంతేగాక తగిలిన గాయాలను, పడుతోన్న బాధ గురించి వివరిస్తూ ఆమె కన్నీటీ పర్యంతరం అయ్యారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ యాక్సిడెంట్ కేసులో పోలీసులు ఆమెను త్వరలోనే విచారించనున్నారు. కాగా విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘నోటా’ సినిమాతో పాటు తమిళంలో పలు చిత్రాల్లో కూడా ఆమె హీరోయిన్గా నటించారు. View this post on Instagram A post shared by Y A S H 🌛🧿🐾❤️🔥 (@yashikaaannand) View this post on Instagram A post shared by Y A S H 🌛🧿🐾❤️🔥 (@yashikaaannand) -
ఫోర్డ్ చెన్నై యూనిట్‌పై టాటా మోటార్స్ కన్ను?!
చెన్నై: చెన్నైలోని మరాయ్ నగర్లో ఉన్న ఫోర్డ్ ఇండియా యూనిట్‌ను స్వాధీనం చేసుకునే అవకాశంపై తమిళనాడు ప్రభుత్వం టాటా గ్రూప్ తో చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. టాటా మోటార్స్, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, రాష్ట్ర పరిశ్రమల మంత్రి తంగం తెన్నారసుతో సమావేశం అయినట్లు సమాచారం. రెండు వారాల వ్యవధిలో రెండవసారి జరిగిన ఉన్నత స్థాయి చర్చల సమావేశం ఇది. సెప్టెంబర్ 27న టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ సీఎంను కలిశారు.(చదవండి: ఎయిరిండియా గెలుపుపై రతన్ టాటా ఆసక్తికర ట్వీట్!) అయితే, ఈ సమావేశాల వివరాలు వెల్లడించలేదు. ముఖ్యమంత్రి వాటికి అధ్యక్షత వహించినప్పటి నుంచి తుది నిర్ణయానికి సంబంధించిన ప్రకటన కూడా ముఖ్యమంత్రి నుంచి వస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. టాటా మోటార్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. చంద్రశేఖరన్ తమిళనాడు ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు, మిగిలినవన్నీ ఊహాగానాలు అన్నారు. ఫోర్డ్ మరాయిమలాయి నగర్ ప్లాంట్ 2.40 లక్షల కార్లు, 3.40 లక్షల ఇంజిన్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. 30 దేశాలకు ఈ కార్లను ఎగుమతి చేయాలని ఫోర్డ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకున్నది. యుఎస్ కార్ల తయారీసంస్థ ఈ ప్లాంట్‌లో 1 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. (చదవండి: ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.. మొబైల్ కొంటె రూ.6000 క్యాష్‌బ్యాక్!) ఫోర్డ్ ఇండియాకు గుజరాత్ లో సనంద్ వద్ద ఒక కర్మాగారం కూడా ఉంది. ఫోర్డ్ భారతదేశం నుంచి నిష్క్రమించినట్లు ప్రకటించిన తర్వాత పరోక్షంగా 4 వేల మంది జీవితాలపై ప్రభావం పడనుందని తెలుస్తున్నది. ఈ యూనిట్ గనుక టాటా మోటార్స్ కొనుగోలు చేస్తే ఆ యూనిట్లో పని చేస్తున్న 2600 మంది ఉద్యోగులకు ఉపశమనం లభించినట్లే అవుతుంది. అయితే, ఈ విషయం ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం వెలువడా లేదు. కంపెనీ భారతదేశంలో సుమారు 170 డీలర్ భాగస్వాములను కలిగి ఉంది. ఈ డీలర్లకు తగు పరిహారం అందేలా సహాయం చేయాలని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ, కేంద్ర ప్రభుత్వానికి కోరుతోంది. డీలర్ల కోసం ఫోర్డ్ ఇండియా తయారు చేస్తున్న పరిహార ప్రణాళికను పర్యవేక్షించేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. -
తమిళనాడులో లాక్డౌన్ పొడిగింపు..
సాక్షి, చెన్నై: ఆగస్టు 31వ తేదీతో ముగుస్తున్న లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు పొడిగిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. 5వ తేదీ నుంచి ఆదివారాల్లో అన్ని బీచ్‌లలో ఇకపై సందర్శకుల ప్రవేశంపై నిషేధం విధించారు. వారాంతపు మూడురోజులు (శుక్ర, శని, ఆది) అన్ని ప్రార్థనాలయాలు మూసివేసే ప్రక్రియను కొనసాగిస్తారు. కేరళలో రోజుకు 30వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తమిళనాడు–కేరళ సరిహద్దు ప్రాంతాలైన కోయంబత్తూరు, కన్యాకుమారీ, తెన్‌కాశీ, తేనీ జిల్లాల్లోని చెక్‌పోస్టులను కట్టుదిట్టం చేయాలని, కేరళ నుంచి వచ్చే పౌరులకు కరోనా పరీక్షలు చేసిన తరువాతనే అనుమతించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. చదవండి: ప్రియుడి కోసం బిడ్డను హింసించిన తల్లి.. అరెస్ట్ చేసిన పోలీసులు -
పెళ్లిలో వధువు అద్భుత విన్యాసాలు: వావ్ అంటున్న నెటిజన్లు!
చెన్నై: సాధారణంగా పెళ్లంటే ఆటలు, పాటలు... బంధువులు, స్నేహితుల సందడి ఉంటుంది. వధూవరుల కుటుంబాలు పరస్పరం ఆటపట్టించుకోవడాలు జరుగుతుంటాయి. కానీ తమిళనాడులో ఓ వధువు మాత్రం తనలో దాగున్న నైపుణ్యాన్ని వెలికితీసి అతిథులను, గ్రామస్తులను ఆకట్టుకుంది. మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలను ప్రదర్శించి పెళ్లికి హజరైనవారితో ఔరా అనిపించుకుంది. వివరాలు.. తమిళనాడులోని తిరుకోలూర్ గ్రామానికి చెందిన నిషాకు ఆదే గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌తో వివాహం నిశ్చియించారు. అయితే, తమ వివాహ వేడుక సాదాసీదాగా కాకుండా సమాజానికి ఎంతోకొంత ఉపయోగంగా ఉండాలని భావించాడు వరుడు రాజ్‌కుమార్. కాబోయే భార్యతో గ్రామంలో మార్షల్ ఆర్ట్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యాడు. వధూవరులు చేసిన పనిని బంధువులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు. కాగా.. నిషా.. తన తల్లి ప్రోత్సహంతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. పెళ్లి సమయంలో సంప్రదాయ వస్త్రధారణ, ఆభరణాలను ధరించి మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించింది. నిషా మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన వివాహ వేడుకలో హైలెట్‌గా నిలిచిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్‌పై డైరెక్టర్ భారతీరాజా ఫైర్
సాక్షి, చెన్నై: తమిళనాడులో ది ప్యామిలీమెన్ 2 వెబ్‌సిరీస్‌పై నిరసనల సెగలు రగులుతున్నాయి. నటి సమంతను శ్రీలంకకు చెందిన తమిళ యువతి పాత్రలో నెగటివ్‌గా చూపించిన ఈ వెబ్‌సిరీస్‌పై తమిళనాట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెబ్ సిరీస్‌ను నిషేధించాలంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, పలు రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఇలా ఉండగానే వెబ్‌సిరీస్ ఈ నెల 4న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది. ఈ చర్యలను నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ తీవ్రంగా ఖండించారు. తాజాగా సీనియర్ దర్శకుడు భారతీరాజా ఈ వెబ్‌సిరీస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తమిళ జాతికి వ్యతిరేకంగా రూపొందిన ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్‌సిరీస్‌ను ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించకపోవడం బాధాకరమన్నారు. తమిళ ద్రోహులు రూపొందించిన వెబ్‌సిరీస్‌గా పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి నిషేధం విధించాలని కోరారు. ప్రసారాన్ని ఆపకుంటే అమెజాన్ సంస్థపై పోరాటం చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. -
తుపాను గాలికి బయటపడ్డ 5 అస్థి పంజరాలు
రామనాథపురం: యాస్ తుపాను గాలుల తీవ్రతకు తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో పాతిపెట్టిన రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. రోజుల తరబడి బలమైన గాలులు వీచడంతో తీరంలో ఉన్న ఇసుక రేణువులు కొట్టుకుపోయి .. అందులో నుంచి ఐదు అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఇంతకీ ఈ అస్థి పంజరాలు ఎవరివి, ఎలా ఇక్కడకు వచ్చాయి. ఇవి సాధారణ మరణాలా లేక హత్యలా అనేది తేలాల్సి ఉంది. రామనాథపురం జిల్లాలో తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో వలినొక్కం గ్రామం ఉంది. బంగాళాఖాతం తీరంలో ఉన్న ఈ గ్రామంలో ఐదు వందల మత్స్యకార జనాభా జీవిస్తున్నారు. అయితే తుపాను సందర్భంగా గ్రామ సమీపంలో ఐదు అస్థిపంజరాలను స్థానికులు కనుక్కొన్నారు. ఇటీవల వీచిన గాలుల తీవ్రతకు ఇసుక కొట్టుకుపోయి తొలుత ఒక అస్థి పంజరం కనిపించింది. ఆ తర్వాత వరుసగా ఒకదాని వెంట ఒకటిగా ఐదు అస్థిపంజరాలను గ్రామస్తులకు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విచారణకు ఆదేశం సముద్ర తీరంలో వెలుగు చూసి ఐదు మృతదేహాలు స్థానికులవా లేక పొరుగు గ్రామాలకు చెందినవా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానికులు క్షేమంగా ఉన్నారా ? లేదా అనే కోణంలో పోలీసులు ఆరా తీశారు. ఆ తర్వాత సమీప పోలీస్ స్టేషన్లలో పాత మిస్సింగ్ కేసుల రికార్డులు పరిశీలిస్తున్నారు. అస్థిపంజరాల నమూనాలను ఫొరెన్సిక్, డీఎన్ఏ ల్యాబ్‌లకు పంపించాలని నిర్ణయించారు. మరోవైపు ఈ ప్రాంతంలో ఉన్న సైకో కిల్లర్ల్స్ కదలికలపైనా నిఘా పెట్టారు. అయితే ఇప్పటి వరకు పోలీసులకు బలమైన క్లూలు ఏవీ లభించలేదు. మరోవైపు ఈ అస్థిపంజరాల వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించింది తమిళనాడు ప్రభుత్వం. -
Tamil Nadu: మాతృభాషలో ఇంజినీరింగ్ విద్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ విద్యలో తమిళ మీడియంను ప్రవేశపెట్టి పాఠ్యాంశాలను బోధించేందుకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అనుమతిచ్చింది. తమిళం సహా 8 మాతృభాషలో బోధనకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. జాతీయ విద్యావిధానంలోని కొన్ని అంశాలను పలువురు వ్యతిరేకించారు. అందులో మాతృభాషలో విద్యాబోధన జరగాలని కూడా ఉంది. మాతృభాషలో విద్యాబోధనను అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టడం ప్రారంభించింది. ఇంజినీరింగ్ విద్యను ఆయా రాష్ట్రాల మాతృభాషల్లో బోధించేందుకు కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ అంగీకరించింది. ఈ నేపథ్యంలో విధివిధానాల రూపకల్పన పనులను ఏఐసీటీఈ చేపట్టింది. మాతృభాషలో ఇంజినీరింగ్ విద్యా బోధన వల్ల గ్రామీణ, కొండప్రాంత హరిజన, గిరిజనుల కలలు నెరవేరుతాయని నమ్ముతున్నారు. జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, జపాన్, చైనా దేశాలు తమ మాతృభాషల్లోనే పూర్తిగా విద్యా విధానాన్ని అమలు చేస్తున్నాయి. అదే రీతిలో ఏఐసీటీఈ సైతం ఆంగ్ల భాషలోని పాఠాలను 22 భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు సమాయత్తమైంది. తమిళనాడుకు సంబంధించి ఇంజినీరింగ్ విద్యను విద్యార్థులు ఇంగ్లిష్ లేదా తమిళంలో అభ్యసించడంపై ఏఐసీటీఈ అభిప్రాయ సేకరణ చేపట్టింది. అందులో 42 శాతం మంది మాతృభాష తమిళంలోనే బోధనకు మద్దతు పలికారు. ఈ కారణంగా తమిళం, మరాఠీ, హిందీ, బెంగాలీ, తెలుగు, గుజరాతీ, కన్నడం, మలయాళం. ఈ 8 భాషల్లో ఇంజినీరింగ్ పాఠాలను తర్జుమా చేసేందుకు ఏఐసీటీఈ నిర్ణయించుకుంది. దీని గురించి ఏఐసీటీఈ అధ్యక్షుడు అనిల్ సహస్రబుదే మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యను మాతృభాషలో బోధించేందుకు పలు మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. మాతృభాషలో పాఠ్యాంశాల బోధన వల్ల విద్యార్థులు పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు. తొలి దశలో 8 భాషల్లో సిలబస్‌ను తర్జుమా చేస్తున్నామని, గరిష్టంగా 142 పాఠ్యాంశాలు, తమిళంలో 94 పాఠ్యాంశాల సిలబస్‌ను తర్జుమా సాగుతోందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మాతృభాషలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేందుకు ఏఐసీటీఈ అనుమతిచ్చిందన్నారు. తర్వాత మరో 11 భాషల్లోకి తర్జుమా చేస్తామని చెప్పారు. అన్నాయూనివర్సిటీ (చెన్నై) సహా అదే వర్సిటీకి చెందిన 12 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ తరగతులను 2010 నుంచి తమిళంలో నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. -
వివాదాల సుడిగుండం లో కమల్ హాసన్
-
కొత్త పార్టీ స్థాపన దిశగా అళగిరి
సాక్షి, చెన్నై: కలైంజర్ డీఎంకే పేరుతో కొత్త పార్టీ స్థాపనకు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి కసరత్తు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ నెల 20న మద్దతుదారులతో భేటీ కానుండడం ప్రాధాన్యతకు దారి తీసింది. డీఎంకే నుంచి తన పెద్దకుమారుడు అళగిరిని కరుణానిధి గతంలో బహిష్కరించిన విష యం తెలిసిందే. కరుణానిధి మరణం తదుపరి డీఎంకేలో చేరడానికి అళగిరి ప్రయత్నాలు చేసినా స్టాలిన్ ఆసక్తి చూపలేదు. చదవండి: బిహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి డీఎంకే అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం 2021 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా స్టాలిన్ ముందుకెళుతున్నారు. అదే సమయంలో పార్టీలోకి తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను తీసుకురావడం, ప్రాధాన్యత ఇవ్వడంతో డీఎంకే సీనియర్లలో కొందరు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో అళగిరి కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరగడం డీఎంకేలో చర్చకు దారి తీసింది. మద్దతుదారులతో భేటీ రాజకీయాలకు అళగిరి దూరంగా ఉంటున్నా తన మాటలతో వార్తల్లో నిలుస్తున్నారు. నటుడు రజనీకాంత్ పార్టీ పెడితే ఆయన వెంట నడిచేందుకు అళగిరి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం కూడా సాగింది. అయితే రజనీ పార్టీపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 20న మదురైలోని దయ కల్యాణ మండపంలో తన మద్దతుదారులతో భేటీ కానుండడం ప్రాధాన్యను సంతరించుకుంది. చదవండి: కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా గుర్తించడం లేదు.. దక్షిణ తమిళనాడులో అళగిరికి మద్దతు గణం అధికంగా ఉండడం, ప్రస్తుత డీఎంకేలో అసంతృప్తితో ఉన్న నేతలకు రహస్యంగా పిలుపు వెళ్లడం వెరసి అళగిరి ఏ ప్రకటన చేస్తారో అన్న ఆసక్తి నెలకొంది. అయితే కలైంజర్ డీఎంకే ఏర్పాటుకు గతంలో తమ నేత సిద్ధంగా ఉన్నట్టుగా మద్దతుదారులు ప్రకటించిన నేపథ్యంలో అదే నినాదాన్ని అందుకుని డీఎంకేలో చీలిక దిశగా అళగిరి వ్యూహాలు ఉండవచ్చన్న చర్చ ఊపందుకుంది. మద్దతుదారుల అభిప్రాయం మేరకు కొత్త పార్టీనా లేదా బీజేపీతో జతకట్టడమా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. -
డీఎంకేతో పొత్తు.. కమల్ క్లారిటీ
చెన్నై : మనుస్మృతి చెలామణిలో లేనప్పుడు దానిపై చర్చ అవసరం లేదని మక్కల్ నీధి మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ అన్నారు. లోక్‌సభ ఎంపీ, విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) వ్యవస్థాపకుడు థోల్ తిరుమవళ్వన్ వీడియో క్లిప్ వైరల్ కావడంతో తమిళనాడులో మనుస్మృతి వాగ్వాదం చెలరేగింది. తిరుమవళ్వన్ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా, హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపిస్తూ హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే తాజా వివాదంపై కమల్ హాసన్ స్పందించారు. మనుస్మృతి ప్రస్తుతం చెలామణిలో లేనందున దాని గురించి అనవసరమన్నారు. మనుస్మృతి సమాజానికి ప్రవర్తనా నియమావళిని చూపించే పురాతన గ్రంథంమని, ఇది కుల వ్యవస్థ ప్రతిపాదకుడిగా విమర్శలకు గురైందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం చెన్నైలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజాలు చెప్పడం నా రాజకీయ వ్యూహమని పేర్కొన్నారు. తమిళనాడులో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టామని తెలిపారు. ఎంఎన్ఎం పార్టీ రాష్ట్రంలో మూడో అతిపెద్ద పార్టీ కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తాను చేయబోయే మొదటి పని లోక్‌పాల్ చట్టం తీసుకురావడమని వివరించారు. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ డీఎంకేతో కలిసి పోటీ చేస్తామని వస్తున్న వార్తలు అవాస్తమనన్నారు. -
చిన్నమ్మకు చెక్ పెట్టినట్టేనా..
అన్నాడీఎంకే కుర్చీ వివాదానికి తెర పడింది. సామరస్య పూర్వకంగా నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. సీఎం పళనిస్వామికి పట్టం కట్టారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పళనిస్వామి అని బుధవారం ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం స్వయంగా ప్రకటించారు. అలాగే, పార్టీకి 11 మందితో కూడిన మార్గదర్శక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందు లో చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా మొదటి నుంచి గళం విప్పుతున్న వాళ్లే ఉండడం గమనార్హం. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీఎం ఎవరో, మార్గదర్శక కమిటీలో ఎవరెవరు ఉండాలో అన్న అంశాలపై అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి నివాసాల్లో బుధవారం వేకువజామున మూడు గంటల వరకు సీనియర్ మంత్రుల మంతనాలు వేర్వేరుగా సాగడంతో ఉత్కంఠ తప్పలేదు. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించే రీతిలో రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సమావేశం సాగింది. ఈ సమావేశం నిమిత్తం ముందుగా పన్నీరు సెల్వం అక్కడికి వచ్చారు. ఎంజీఆర్, జయలలిత విగ్రహాల వద్దకు చేరుకుని అంజలి ఘటించి లోనికి వెళ్లారు. ఆ తర్వాత పళనిస్వామి రావడంతో ఆయన మద్దతుదారుల హంగామా అంతా ఇంతా కాదు. పూల వర్షంలో ఆయన కాన్వాయ్ తడిసి ముద్దయింది. ముందుగా మార్గదర్శక కమిటీ.. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పన్నీరు, పళని హాజరు కాగా, సంయుక్త కన్వీనర్లు, ఎంపీలు వైద్యలింగం, కేపీ మునుస్వామి నేతృత్వం వహించారు. ముందుగా పళనిస్వామి అన్నాడీఎంకే మార్గదర్శక కమిటీని ప్రకటించారు. ఇందులో మంత్రులు దిండుగల్ శ్రీనివాసన్, తంగమణి, ఎస్పీ వేలుమణి, జయకుమార్, సీవీ షణ్ముగం, ఆర్ కామరాజ్‌లకు చోటు కల్పించారు. పార్టీ నిర్వాహక కార్యదర్శులు జేసీడీ ప్రభాకర్, మాజీ ఎంపీ పీహెచ్ మనోజ్‌పాండియన్, మాజీ మంత్రి మోహన్, మాజీ ఎంపీ గోపాలకృష్ణన్, చోళవందాన్ ఎమ్మెల్యే మాణిక్యంలకు అవకాశం కల్పించారు. సీఎం అభ్యర్థి పళని.. పన్నీరుసెల్వం ప్రసంగిస్తూ అన్నాడీఎంకే 2021 ఎన్నికలకు సిద్ధమైందని, పార్టీ నేతృత్వంలో కూట మి ఏర్పాటు అంటూ, సీఎం అభ్యర్థిగా పళనిస్వామి ని ఏకగ్రీవంగా ఎంపిక చేశామని ప్రకటించారు. సంబరాల్లో సేన.. పళనిస్వామి సీఎం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ, ఏకగ్రీవ ఎంపిక ప్రకటనను పన్నీరు చేశారో లేదో, రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగాయి. అన్నాడీఎంకే కార్యాలయం పరిసరాల్లో బాణసంచా పేల్చుతూ, స్వీట్లు పంచారు. పళనిస్వామిని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ నేతలు పుష్పగుచ్ఛాలతో బారులు తీరారు. సమావేశాన్ని ముగించుకున్న నేతలందరూ మెరీనా తీరం వైపుగా కదిలారు. అక్కడి ఎంజీఆర్, జయలలిత సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించారు. సీఎం ఎడపాడి పళనిస్వామి బుధవారం సాయంత్రం పన్నీరు సెల్వం ఇంటికెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నమ్మకు చెక్ పెట్టినట్టేనా.. జైలు నుంచి బయటకు వచ్చే శశికళ అన్నాడీఎంకేను కైవసం చేసుకోవడం ఖాయం అన్న ప్రచారానికి మార్గదర్శక కమిటీతో చెక్ పెట్టినట్టున్నారు. శశికళ వ్యతిరేకులకు ఈ కమిటీలో చోటు దక్కడం గమనార్హం. పార్టీలో, ప్రభుత్వంలో తటస్థంగా వ్యవహరించే మంత్రులు జయకుమార్, కామరాజ్ కమిటీలో ఉన్నారు. వీరూ చిన్నమ్మ వ్యతిరేకులే. మిగిలిన నలుగురు మంత్రులు సీఎం మద్దతుదారులు. పన్నీరు మద్దతుదారులుగా ఓ ఎమ్మెల్యే, నలుగురు మాజీలు ఈ కమిటీలో ఉన్నారు. వీరంతా మొదటి నుంచి చిన్నమ్మకు వ్యతిరేకంగా అన్నాడీఎంకేలో గళాన్ని స్వరాన్ని వినిపిస్తున్న వాళ్లే. ఇక, ఈ కమిటీలో పదవి కోసం మహిళా నేతలు ప్రయత్నించినా ఫలితం శూన్యం. అలాగే, మంత్రి ఓఎస్.మణియన్, సెల్లూరు రాజుతో పాటు మరో ఇద్దరు, అన్వర్‌రాజా వంటి సీనియర్ల ప్రయత్నాలు చేసినా, వీరు అప్పుడప్పుడు పరోక్షంగా చిన్నమ్మకు అనుకూలంగా నోరు జారిన వాళ్లే కావడం గమనార్హం. -
ఐఐటీ–మద్రాస్ నెంబర్ 1
సాక్షి, న్యూఢిల్లీః 2020 సంవత్సరానికి గాను ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంహెచ్ఆర్డీ) ర్యాంకులను ప్రకటించింది. ఇండియా ర్యాంకింగ్స్–2020ను ఆ శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ గురువారం ఇక్కడ విడుదల చేశారు. మొత్తం పది కేటగిరీల్లో ఈ ర్యాంకులను ప్రకటించారు. దేశంలో ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు ప్రకటించడం ఇది వరుసగా ఐదోసారి. కొత్తగా ఈసారి ర్యాంకుల కేటగిరీల్లో దంత వైద్య విభాగం కూడా చేర్చారు. ఓవరాల్‌గా, అలాగే ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ–మద్రాస్ తొలి స్థానంలో నిలిచింది. ఈ కేటగిరీలో ఐఐటీ–హైదరాబాద్‌కు ఎనిమిదో స్థానం దక్కింది. యూనివర్శిటీల విభాగంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు తొలిస్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ ఆరోస్థానంలో నిలిచింది. మేనేజ్మెంట్ కేటగిరీలో ఐఐఎం–అహ్మదాబద్, వైద్య విభాగంలో ఎయిమ్స్ తొలిస్థానంలో నిలిచాయి. కళాశాలల విభాగంలో మిరండా కాలే జ్ వరసగా మూడో ఏడాది తొలిస్థానంలో నిలిచింది. లా విభాగంలో హైదరాబాద్ నల్సార్ మూడో ర్యాంకు సాధించగా, ఫార్మసీ కేటగిరీలో హైదరాబాద్ నైపర్ ఐదో స్థానంలో నిలిచింది. (అత్యధిక కేసులున్నా అదుపులోనే వైరస్!) కార్యక్రమంలో కేంద్ర మంత్రి రమేష్ పొఖ్రియాల్ మాట్లాడుతూ ర్యాంకులు ప్రకటించడం వల్ల విద్యార్థులకు విద్యా సంస్థల ఎంపిక సులువవుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే ఉన్నత విద్యా సంస్థల మధ్య పోటీతత్వం పెరుగుతుందని వివరించారు. టీచింగ్, లెర్నింగ్ అండ్ రీసోర్సెస్(టీఎల్ఆర్), రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్(ఆర్పీ), గ్రాడ్యుయేషన్ ఔట్‌కమ్స్(జీవో), ఔట్రీచ్ అండ్ ఇంక్లూజివిటీ(ఓఐ), పర్సెప్షన్(పీఆర్) వంటి పారామీటర్ల ఆధారంగా మార్కులు కేటాయించి ర్యాంకులు ప్రకటించారు. మొత్తం 3771 విద్యా సంస్థలు ఓవరాల్ ర్యాంకుల కోసం ప్రతిపాదనలు పంపాయి. అలాగే కేటగిరీ వారీగా కూడా ప్రతిపాదనలు పంపాయి. 294 విశ్వవిద్యాలయాలు, 1071 ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూషన్స్, 630 మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూషన్స్, 334 ఫార్మసీ ఇనిస్టిట్యూషన్స్, 97 న్యాయ విద్యా సంస్తలు, 118 వైద్య విద్య సంస్థలు, 48 ఆర్కిటెక్చర్ సంస్థలు, 1,659 డిగ్రీ కళాశాలలు ర్యాంకుల కోసం ప్రతిపాదనలు పంపాయి. 100 ఓవరాల్ ర్యాంకులు, ఇంజినీరింగ్ విభాగంలో 200 ర్యాంకులు, యూనివర్శిటీలు, కళాశాలల విభాగంలో 100 చొప్పున, మేనేజ్మెంట్, ఫార్మసీ విభాగాల్లో 75 చొప్పున, వైద్య విద్యలో 40 ర్యాంకులు, ఆర్కిటెక్చర్, న్యాయ విద్యలో 20 ర్యాంకులు, దంత వైద్య విద్యలో 30 ర్యాంకులు ప్రకటించారు. (అందుబాటు ధరలో కరోనా టెస్టింగ్ కిట్) టాప్–10 ఇండియా ర్యాంకులు (ఓవరాల్ కేటగిరీ) ఇనిస్టిట్యూట్ పేరు ర్యాంకు ఐఐటీ–మద్రాస్ 1 ఐఐఎస్సీ–బెంగళూరు 2 ఐఐటీ–ఢిల్లీ 3 ఐఐటీ–బాంబే 4 ఐఐటీ–ఖరగ్‌పూర్ 5 ఐఐటీ–కాన్పూర్ 6 ఐఐటీ–గౌహతి 7 జేఎన్‌యూ–ఢిల్లీ 8 ఐఐటీ–రూర్కీ 9 బనారస్ హిందూ వర్శిటీ 10 యూనివర్శిటీ కేటగిరీలో టాప్–10 ర్యాంకులు ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూరు 1 జేఎన్‌యూ, న్యూఢిల్లీ 2 బనారస్ హిందూ యూనివర్శిటీ, వారణాసి 3 అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూరు 4 జాదవ్‌పూర్ యూనివర్శిటీ, కోల్‌కతా 5 యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ 6 కలకత్తా యూనివర్శిటీ, కోల్‌కతా 7 మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్ 8 సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్శిటీ, పూణే 9 జామియామిలియాఇస్లామియా, న్యూఢిల్లీ 10 ఇంజినీరింగ్ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఐఐటీ–మద్రాస్ 1 ఐఐటీ–ఢిల్లీ 2 ఐఐటీ–బాంబే 3 ఐఐటీ–కాన్పూర్ 4 ఐఐటీ–ఖరగ్‌పూర్ 5 ఐఐటీ–రూర్కీ 6 ఐఐటీ–గౌహతి 7 ఐఐటీ–హైదరాబాద్ 8 ఐఐటీ–తిరుచిరాపల్లి 9 ఐఐటీ–ఇండోర్ 10 మేనేజ్మెంట్ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఐఐఎం–అహ్మదాబాద్ 1 ఐఐఎం–బెంగళూరు 2 ఐఐఎం–కలకత్తా 3 ఐఐఎం–లక్నో 4 ఐఐటీ–ఖరగ్‌పూర్ 5 ఐఐఎం–కోజికోడ్ 6 ఐఐఎం–ఇండోర్ 7 ఐఐటీ–ఢిల్లీ 8 ఎక్స్ఎల్ఆర్ఐ 9 మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్(గురుగ్రామ్) 10 కళాశాలల కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు మిరండా హౌజ్ 1 లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ విమెన్, ఢిల్లీ 2 హిందూ కాలేజ్, ఢిల్లీ 3 సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ఢిల్లీ 4 ప్రెసిడెన్సీ కాలేజ్, చెన్నై 5 లయోలా కాలేజ్, చెన్నై 6 సెయింట్ జేవియర్స్ కాలేజ్, కోల్‌కతా 7 రామకృష్ణ మిషన్ విద్యామందిర, హౌరా 8 హన్స్‌రాజ్ కాలేజ్, ఢిల్లీ 9 పీఎస్జీఆర్ కృష్ణమ్మల్ ఫర్ విమెన్, కోయంబత్తూర్ 10 ఫార్మసీ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు జామియా హమ్దర్ద్, న్యూఢిల్లీ 1 పంజాబ్ యూనివర్శిటీ, చంఢీగఢ్ 2 నైపర్, మోహలీ 3 ఐసీటీ, ముంబై 4 నైపర్, హైదరాబాద్ 5 బిట్స్, పిలానీ 6 మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మా సైన్సైస్, ఉడిపి 7 నైపర్, అహ్మదాబాద్ 8 జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఊటీ 9 జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మైసూర్ 10 మెడికల్ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఎయిమ్స్, న్యూఢిల్లీ 1 పీజీఐఎంఈఆర్, చంఢీగఢ్ 2 క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వెల్లూర్ 3 ఆర్కిటెక్చర్ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఐఐటీ, ఖరగ్‌పూర్ 1 ఐఐటీ, రూర్కీ 2 ఎన్ఐటీ, కాలికట్ 3 న్యాయ విద్య కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు నేషనల్ లా స్కూల్, బెంగళూరు 1 నేషనల్ లా యూనివర్శిటీ, న్యూఢిల్లీ 2 నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా, హైదరాబాద్ 3 దంత విద్య కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు మౌలానా ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఢిల్లీ 1 మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఉడిపి 2 డాక్టర్ డీవై పాటిల్ విద్యాపీఠం, పూణే 3 -
‘చిన్నమ్మ’కు ఇక నో ఎంట్రీ
సాక్షి, చెన్నై: వేదనిలయంతో చిన్నమ్మ శశికళకు ఇక, బంధం తెగినట్టే. ఆ గృహాన్ని ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకోవడంతో, అటువైపు వెళ్ల లేని పరిస్థితి. ఈ దృష్ట్యా, చిన్నమ్మ కోసం మరో షెల్టర్ సిద్ధం చేయడానికి తగ్గ కసరత్తులపై అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు దృష్టి పెట్టారు. చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని దివంగత సీఎం, అమ్మ జయలలితకు చెందిన వేదనిలయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల చర్చలకు, ఎందరో ప్రతినిధులతో సంప్రదింపులు, భేటీలకు వేదికగా ఒకప్పుడు ఈ భవనం నిలిచింది. అమ్మ జయలలిత ఆశీర్వచనాల కోసం బారులు తీరిన వాళ్లు ఎందరో. (షూటింగ్‌లకు త్వరలోనే అనుమతి) అయితే, ఇప్పుడు అమ్మ లేని దృష్ట్యా, ఆ పరిసరాలే నిర్మానుష్యం అయ్యాయి. అయితే, ఈ భవనంతో చిన్నమ్మ శశికళకు ప్రత్యేక అనుబంధమే ఉంది. జయలలిత నెచ్చెలిగా రెండున్నర దశాబ్దాలకు పైగా చిన్నమ్మ శశికళ ఈ భవనంలో ఉన్నారు. జయలలిత తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక చిన్నమ్మ హస్తం ఉండేది. ఈ ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు చిన్నమ్మకే ఎరుక. అమ్మ మరణం తర్వాత పరిణామాలతో చిన్నమ్మ శశికళ ఈ నివాసానికి నాయకిగా అవతరించినా, అమ్మకు దక్కిన గౌరవాన్ని ఈ నివాసం వేదికగా తనకు దక్కించుకున్నా, చివరకు అక్రమాస్తుల కేసు రూపంలో పరప్పన అగ్రహార చెరలో ఊచలు లెక్కించక తప్పలేదు. (ఆగస్టులోగా అంతర్జాతీయ విమానాలు!) ఇక అనుమతి లేనట్టే.. చిన్నమ్మ జైలు జీవితం తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందుకు కొనసాగింపుగా ప్రస్తుతం వేదనిలయంలోకి చిన్నమ్మ అడుగు పెట్ట లేని పరిస్థితి. ఈ నివాసాన్ని అమ్మ స్మారక మందిరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించినా, న్యాయ చిక్కులతో జాప్యం తప్పలేదు. ఎట్టకేలకు ప్రత్యేక చట్టం ద్వారా ఆ భవనాన్ని తన గుప్పెట్లోకి ప్రభుత్వం తీసుకుంది. ఈ దృష్ట్యా, ఇక, చిన్నమ్మ ఆ ఇంటి వైపుగా కన్నెత్తి చూడలేని పరిస్థితి. గతంలో ఓమారు పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో న్యాయ వివాదాల కారణంగా పోయెస్‌గార్డెన్‌కు చిన్నమ్మ వెళ్ల లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చెన్నైలోని తన బంధువు ఇంట్లో ఉండక తప్పలేదు. ఆమె జైలు జీవింతం ముగించి బయటకు రాగానే, పోయెస్‌గార్డెన్ మీదే గురి పెట్ట వచ్చన్న సంకేతాలు మొదటి నుంచి ఉంటున్నాయి. మరికొన్ని నెలల్లో చిన్నమ్మ జైలు జీవితం ముగిసే అవకాశాలు ఉన్నాయి. 2021లో జైలు జీవితం ముగించి బయటకు వచ్చే చిన్నమ్మ గార్డెన్‌లోకి అడుగు పెట్టలేని రీతిలో నో ఎంట్రీ బోర్డుగా ఈ ప్రత్యేక చట్టానికి సంబంధించిన బోర్డును అక్కడ పెట్టడం గమనార్హం. ఈ చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర వేయగానే, ఆ ఇంట్లో ఉన్న అన్ని రకాల వస్తువులు, స్థిర, చర ఆస్తుల్ని గుప్పెట్లోకి తీసుకుని వేద నిలయాన్ని అమ్మ స్మారకంగా మార్చేందుకు సీఎం పళనిస్వామి నేతృత్వంలోని ట్రస్టు పరుగులు తీస్తుండడం గమనార్హం. ఈ పరిణామాల దృష్ట్యా, చిన్నమ్మ కోసం కొత్త షెల్టర్‌పై అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం దృష్టి పెట్టింది. ఇప్పటికే చిన్నమ్మ ప్రతినిధిగా ఉన్న దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకోసం రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయానికి కూత వేటు దూరంలో బ్రహ్మాండంగా భవనం తీర్చిదిద్దారు. ఈ దృష్ట్యా, చిన్నమ్మ కోసం పోయెస్‌గార్డెన్ పరిసరాల్లోనే మరో భవనం షెల్టర్ కోసం ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. -
కుండపోతతో విద్యాసంస్థల మూత..
చెన్నై : తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతతో స్కూళ్లు, కాలేజీలను మంగళవారం మూసివేశారు. రామనాథపురం,కోయంబత్తూరు, కన్యాకుమారి సహా పలు జిల్లాల కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాలతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్ధంభించింది. కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను రాష్ట్ర యంత్రాంగం ఆదేశించింది. నీలగిరి, కోయంబత్తూర్, థేని, దిండిగల్ జిల్లాల్లో రెడ్అలర్ట్ ప్రకటించారు. రానున్న అయిదు రోజుల్లో తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
మళ్లీ 40 ఏళ్ల తర్వాతే దర్శనం
కాంచీపురం అత్తివరదరాజస్వామి తిరిగి కోనేటిలోకి వెళ్లిపోయారు. మళ్లీ 40ఏళ్లకే ఆయన భక్తులకు దర్శమిస్తారు. 48రోజుల్లో దాదాపు 2కోట్లమంది అత్తివరదర్ పెరుమాళ్‌ని దర్శించుకున్నారని అంచనా. కాంచీపురం అత్తి వరదరాజస్వామి మళ్లీ కోనేటి ప్రవేశం చేశారు. 48రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చి... కోనేటి గర్భంలోకి వెళ్లిపోయారు. మళ్లీ 40ఏళ్లకు బయటకు వస్తారు. ఈ 48 రోజుల్లో తొలి 38 రోజులు శయనస్థితిలోనూ, మిగిలిన 10 రోజులు నిలబడినట్లు భక్తులకు దర్శనమిచ్చారు అత్తివరదర్ పెరుమాళ్. దక్షిణాపథంలోని ఏకైక మోక్షపురంగా ప్రసిద్దిగాంచిన కంచిలో ఉన్న వెయ్యికి పైగా ఆలయాల్లో శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఒకటి. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా ఈ క్షేత్రం విరాజిల్లుతుంది. ఈ ఆలయంలోనే బంగారు, వెండి బల్లులు ఉంటాయి. వరదరాజస్వామి విగ్రహాం అత్తిచెక్కతో నిర్మితమైంది. 9 అడుగుల పొడవు ఉండే ఈ విగ్రహాన్ని బ్రహ్మదేవుడు ఆదేశంతో దేవశిల్పి విశ్వకర్మ రూపొందించినట్టు పురాణాలు చెబుతున్నాయి. 16వ శతాబ్దంలో కాంచీపురంపై జరిగిన మహమ్మదీయుల దండయాత్రలో కంచి దేవాలయం దోపిడీకి గురైందని, ఆ సమయంలో విగ్రహాన్ని కాపాడేందుకు వెండి పెట్టెలో పెట్టి ఆనంద పుష్కరిణిలో నీరాళి మండపం పక్కన అడుగుభాగంలో భద్రపరిచారని పెద్దలు చెబుతారు. పరిస్థితులు చక్కబడ్డాక పుష్కరిణిలో దాచిపెట్టిన విగ్రహ ఆనవాళ్లు తెలియకపోవడంతో.. గర్భాలయంలో వేరొక దివ్యమూర్తిని ప్రతిష్ఠించారు. మూలవిరాట్ లేకపోవడంతో వేరే విగ్రహాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్టించారు. కొన్నాళ్ల తర్వాత కోనేరు ఎండిపోవడంతో వెండి పెట్టెలోని ప్రధాన విగ్రహం బయటపడింది. అత్తితో చేసిన ఆ విగ్రహం ఎన్నో ఏళ్లు నీటిలో ఉన్నా చెక్కచెదరకపోవడంతో దానిని తిరిగి ప్రతిష్టించారు. 48 రోజులపాటు క్రతువులు నిర్వహించి మళ్లీ కోనేటిలో భద్రపరిచారు. కాలానుగుణంగా ఇదే సంప్రదాయంగా మారింది. అప్పటినుంచి కోనేరులో భద్రపరిచిన విగ్రహాన్ని 40 ఏళ్లకోసారి తీసి 48 రోజులపాటు పూజలు చేసి మళ్లీ కోనేరులో భద్రపరుస్తున్నారు. 1854 నుంచి ఇలా చేస్తున్నట్లు ఆధారాలున్నాయి. ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్ట్ 17 వరకూ ఈ మహాక్రతువు నిర్వహించారు. జూలై 1 నుంచి సుమారు రెండు కోట్లమంది భక్తులు అత్తివరదరాజస్వామిని దర్శించుకున్నారు. సాధారణ భక్తులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు పెరుమాళ్ సేవలో పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ప్రధాని దేవేగౌడ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సూపర్‌స్టార్ రజనీకాంత్ దంపతులు, నటి నయనతార తదితరులు అత్తివరదరాజ్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదవండి: 40 ఏళ్లకోసారి దర్శనం.. పోటెత్తిన భక్తులు -
హిందీ రగడ : తమిళనాడు బాటలో బెంగాల్
కోల్‌కతా : ఎనిమిదవ తరగతి వరకూ హిందీని తప్పనిసరిగా బోధించాలన్న జాతీయ విద్యా విధాన ముసాయిదాను వ్యతిరేకించే రాష్ట్రాల్లో తాజాగా పశ్చిమ బెంగాల్ చేరింది. హిందీ బోధనపై తమిళనాడు భగ్గుమంటుంటే బెంగాల్లోనూ ఈ ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమపై ఏ భాషను బలవంతంగా రుద్దాలని చూసినా ప్రతిఘటన తప్పదని బెంగాలీ విద్యావేత్తలు, రచయితలు హెచ్చరించారు. హిందీని అనివార్యంగా నేర్చుకోవాలన్న నిబంధనను రవీంద్ర భారతి యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రతిభా సర్కార్ పేర్కొన్నారు. హిందీని ఒకటవ తరగతి నుంచే నేర్చుకోవాలన్న నిబంధన సరైంది కాదని, ఇది చిన్నారులపై ఒత్తిడి పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ఏ భాష నేర్చుకోవాలన్నది విద్యార్ధులు స్వచ్ఛందంగా తీసుకోవాల్సిన నిర్ణయమని ప్రముఖ బెంగాలీ రచయిత శీర్షేందు ముఖోపాధ్యాయ్ అన్నారు. మరోవైపు హిందీని తమపై రుద్దాలని కేంద్రం ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని డీఎంకే చీఫ్ స్టాలిన్ హెచ్చరించారు. కేంద్రం తీరు భాషా యుద్ధానికి దారితీస్తుందని తమళ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా విద్యావేత్తలు, భాషాకారుల నిరసనలతో దిగివచ్చిన కేంద్రం ఏ భాషను ఎవరిపై రుద్దే ఉద్దేశం తమకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. -
ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్
పెరంబూరు: నటుడు సూపర్‌స్టార్ శ్రీనివాసన్‌కు ఓటర్లు షాక్ ఇచ్చారు. ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్‌గా మార్చేశారు. సినిమా క్రేజ్ ఉంది కదా అని అందరూ రాజకీయ నాయకులైపోయి ఏలేద్దాం అనుకుంటే కుదరదు. అలా ఆశపడిన హాస్యనటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్ ఓటర్ల చేతిలో ఘోరంగా భంగపడ్డారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున దక్షిణ చెన్నై స్థానానికి పోటీ చేశారు. తన విజయం ఖాయమని, లక్షకు పైగా మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి కంటే తక్కువ ఓట్లు పొందారు. కేవలం 670 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్ అని అభిమానులు ఎగతాలి చేస్తున్నారు. -
రాశి బాగుంది
తమిళసినిమా: ఏ రంగంలోనైనా ప్రతిభకు గుర్తింపు ఉంటుంది. సినిమా రంగంలోనూ కాస్త వెనుకా ముందుగా గుర్తిస్తారు. అలా ఏళ్ల తరబడి పోరాడి గెలిచిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ప్రతిభను పక్కన పెడితే అదృష్టం కలిసొస్తే విజయాలతో పాటు ఆవకాశాలు తన్నుకొస్తాయి. ఇక్కడ సెంటిమెంట్, రాశిని ఎక్కువగా ఫాలో అవుతారు. నటీనటులు అద్భుతంగా నటించినా ఆ చిత్రం సక్సెస్ కాకపోతే ఆ నటీనటులపై లక్కు లేనివారనే ముద్ర పడుతుంది. అలా చాలా మంది ప్రతిభావంతులు మరుగున పడిపోయారు. ఇక అసలు విషయానికి వస్తే తన పేరులోనే రాశిని చేర్చుకున్న నటి రాశీఖన్నాకు కోలీవుడ్‌లో అదృష్టం వెంటాడుతోందనే చెప్పాలి. ఈమెలో ప్రతిభ లేదా? అంటే అది నిరూపించుకునే అవకాశం రాలేదనే చెప్పాలి. ఇమైకా నొడిగళ్ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ హైదరాబాదీ బ్యూటీ, అంతకుముందు తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించింది. అసలు నటనకు శ్రీకారం చుట్టింది బాలీవుడ్లో.. టాలీవుడ్లో అవకాశాలు మందగిస్తున్న తరుణంలో కోలీవుడ్ నుంచి కాలింగ్ వచ్చింది. అలా నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఇమైకా నొడిగళ్ చిత్రంలో హీరోయిన్గా పరిచయం అయిన రాశీఖన్నాకు నిజానికి ఆ చిత్రంలో షో కేస్ బొమ్మ పాత్రనే పోషించింది. అయితేనేం ఆ చిత్రం హిట్. లక్కీ హీరోయిన్ ముద్ర వేసేశారు. ఆ తరువాత జయంరవికి జంటగా నటించే మరో లక్కీఛాన్స్‌ను కొట్టేసింది. అందులోనూ హీరోయిన్గా నామమాత్రపు పాత్రనే. అది సక్సెస్ అయ్యింది. ఇక ఇటీవల విశాల్‌తో అయోగ్య చిత్రంలో జత కట్టింది. ఇందులోనూ పరిమిత పాత్రలోనే కనిపించింది. అయోగ్య చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అలా లక్కుతో రాశీఖన్నా హీరోయిన్గా లాగించేస్తోంది. ప్రస్తుతం విజయ్‌సేతుపతితో సంఘ తమిళన్ చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. దీనిపైనా మంచి అంచనాలు నెలకొన్నాయి. కారణం హీరో విజయ్‌సేతుపతి. నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ లాంటి ప్లస్ పాయింట్స్ ఉండటమే. అలా రాశీఖన్నా రాశి చాలా జోష్‌లో పరుగులు తీస్తోందన్న మాట. -
ఆయన వాడుకొని వదిలేసే రకం!
తమిళసినిమా: నటుడు విశాల్ తనకు అవసరమైన వారిని వాడుకుని వదిలేస్తారు. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ అంతేనని నటుడు, నిర్మాత ఆర్కే.సురేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాల్ అవకాశవాది అని,ఆయన చర్యలు సరికాదని ఆరోపించారు. ఆర్కే.సురేశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కొచ్చిన్ షాది అట్ చెన్నై 03. తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్య ఆది ఇంటర్నేషనల్ మూవీస్ పతా కంపై అబ్దుల్ లతీఫ్ వడుకోట్ నిర్మిస్తున్నారు. నటి అర్చిత శ్రీధర్, నేహా సక్సెనా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మంజి దివాకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దీని ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ బుధవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.ఈ సందర్భంగా చిత్ర కథానా యకుడు ఆర్కే.సురేశ్ నడిగర్ సంఘం వ్యవహా రంపై స్పందిస్తూ తాను సంఘంలో సభ్యుడిగా చేరి నాలుగేళ్లయ్యిందని, అయినా ఎలాంటి పదవికీ పోటీ చేయలేని పరిస్థితి ఉందన్నారు. నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్‌కు మినహా అందరికీ తన మద్దతు ఉంటుందన్నారు. నటుడు ఉదయ నడిగర్ సంఘ నిర్వాహనికి ఒక జట్టును తయారు చేస్తున్నారని,వారికి తన మద్దుతు ఉంటుందన్నారు. ఆరోపణలు చేయలేదు నటుడు విశాల్‌పై తాను ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయలేదని, ఆయన అలాంటి వారు కాదని అన్నారు. అయితే ఆయన తనకెవరూ అవసరమో వారిని వాడుకుని ఆ తరువాత వదిలేస్తారని అన్నారు. విశాల్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనతో నటుడు, మాజీ ఎంపీ రితీష్ కూడా ఉన్నారని, ఆ తరువాత ఆయన విడిపోయారని అన్నారు. విశాల్‌తో ఉన్న నటుడు ఉదయ ఇప్పుడు ఆయనతో విభేదించి బయటకు వచ్చారని, ఆయన మేనేజర్ మురుగరాజ్ విశాల్‌తో లేడని అన్నారు. నటి వరలక్ష్మీది అదే పరిస్థితి అని పేర్కొన్నారు. విశాల్ ఎందుకిలా చేస్తున్నారన్నది అర్థం కావడం లేదన్నారు. కాగా తాను నటుడు ఎస్వీ.శేఖర్ జట్టులో చేరలేదని, అసలు ఆయన ఏ జట్టులో ఉన్నారన్నదీ తనకు తెలియదని అన్నారు. పెద్ద నిర్మాతలెవరూ ఇప్పుడు లేరని, వారంతా నెలసరి వేతనాన్ని పొందుతున్నారని అన్నారు. దక్షిణ భారత నటీనటుల సంఘం పేరును తమిళ్ నడిగర్ సంఘంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. విశాల్ గురించి మాట్లాడు తూ ఆయన్ని నటించనీయండి, చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి అని ఆర్కే.సురేశ్ పేర్కొన్నారు. -
వితంతు వైద్యురాళ్లే టార్గెట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తాను అభ్యుదయవాదిని వితంతు వైద్యురాళ్లకి జీవితాన్ని ఇస్తానని నమ్మబలికి కోట్లాది రూపాయలు మోసం చేసిన యువకుడిని తిరువణ్ణామలై పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తిరువణ్ణామలైకు చెందిన చక్రవర్తి అనే యువకుడు మ్యాట్రిమోనియంలలో తన పేరు అజయ్, విజయ్, విజయ్‌కుమార్, విదు, శరవణ్ ఇలా అనేక పేర్లతో నమోదు చేసుకున్నాడు. భర్తను కోల్పోయిన వైద్యురాళ్లనే లక్ష్యంగా చేసుకుని సంతానం ఉన్నా సరే పెళ్లి చేసుకునేందుకు అభ్యంతరం లేదని నమ్మిస్తాడు. అతని వలలో పలువురు వైద్యురాళ్లుపడ్డారు. చెన్నైకి చెందిన ఒక వైద్యురాలు అతడికి రూ. 50 లక్షలు అప్పగించింది. అలాగే, లాల్కుడికి చెందిన మరో వైద్యురాలు రూ. 20 లక్షలు ఇచ్చి తనూ మోసపోయింది. అయితే, అతను పెళ్లి చేసుకోకుండా మోసం చేయడంతో లాల్‌కుడి వైద్యురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చక్రవర్తిని పోలీసులు అరెస్టు చేశారు. లైంగికవేధింపులు, మోసం, హత్యా బెదిరింపులు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. -
ఫ్లయింగ్ స్క్వాడ్‌తో నమిత వాగ్వాదం
పెరంబూరు: ఫ్లయింగ్ స్క్వాడ్‌తో నటి నమిత వాగ్వాదానికి దిగింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. వివరాల్లోకి వెళితే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ నాయకులు ఓట్లకు నోట్లు విరజిమ్మడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఎన్నికల అధికారులు అలాంటి వాటిని అరికట్టడానికి చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను దింపారు. వారు 24 గంటలు అనుమానం కలిగిన వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. రూ. 50 వేల కంటే ఎక్కువ డబ్బు, నగలను కలిగిన వారి నుంచి తగిన ఆధారాలు లేకుంటే ఆ డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే అలా కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. కాగా సేలం జిల్లాలో 33 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, మరో 33 ప్రత్యేక పోలీస్ బృందాలను ఎన్నికల బృందం తనిఖీలకు నియమించింది. వారు ఆ జిల్లా వ్యాప్తంగా జల్లెడ పట్టి తనిఖీలు చేపట్టారు. వారు ఇప్పటి వరకూ రూ.50 కోట్ల విలువైన నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం సేలం, కొండాలాంపట్టి సమీపంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఆనంద్ విజయ్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన నటి నమిత కారును నిలిపి తనిఖీ చేయాలని చెప్పగా నమితతో పాటు ఆమె కారులో ఉన్న మరి కొందరు అందుకు అడ్డు చెప్పారు. దీంతో అక్కడ నమితకు ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాము తనిఖీలు చేస్తున్నామని, అందుకు సహకరించాలని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి చెప్పడంతో నటి నమిత వర్గం అంగీకరించారు. అయితే తనిఖీల్లో నమిత కారులో నగదు, ఇతర విలువైనవి లభించలేదు. దీంతో ఫ్లయింగ్‌స్క్వాడ్ ఆమె కారుని పంపేశారు. -
గాంధీ మార్గంలో ఒంటరి యాత్ర
ఆమె ప్రవాస భారతీయురాలు. స్వదేశం అంటే ప్రేమ. మాతృభూమి కోసం తనవంతుగా కొంతైనా చేయాలనుకున్నారు. స్వచ్ఛతా యాత్ర మొదలు పెట్టారు. గాంధీ 150.. క్లీన్ ఇండియా.. సేఫ్ ఇండియా.. అనే నినాదంతో ఒంటరిగా ఇండియా అంతా పర్యటించి గిన్నిస్ రికార్డు సృష్టించబోతున్నారు. ఆమే... సంగీతా శ్రీధర్. సంగీతా శ్రీధర్ (52) తమిళనాడులోని కోయంబత్తూరు నివాసి. ఆమె పూర్వీకులు తెలుగువారే. సంగీత ఎంసీఏ పూర్తి చేసి, ఈ–గవర్నెన్స్ స్టాటజిక్ కౌన్సిలర్ గా అబుదాబిలో స్థిరపడ్డారు. ఆమె భర్త ఆయిల్ కంపెనీలో ఉద్యోగి. అబుదాబిలో ఉంటున్నా జన్మభూమిపై మమకారం, దేశాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దాలనే గాంధీజీ ఆశయాలు ఆమెలో స్పూర్తిని రగిలించి, భారతయాత్రకు సన్నద్ధం చేయించాయి. గాంధిజీ 150వ జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని భారతదేశంలోని 150 నగరాలను ఒంటరిగా చుట్టిరావాలని సంగీత నడుం బిగించారు. అనుకున్నదే తడవుగా గతేడాది ఆగస్ట్ 12న ముంబైలోని ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ నుండి తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛతపై అవగాహన కల్పించడమే ధ్యేయంగా దేశంలో కనీసం రెండు లక్షల మంది కలవాలని కూడా ఆమె నిర్ణయించుకున్నారు. అందుకోసం బ్యాంకులో ఐదు లక్షల రుణాన్ని తీసుకుని, టాటా సన్స్ కంపెనీ అందించిన హెక్సా కారులో యాత్రకు బయల్దేరారు. రోజుకు 250 నుండి 300 కిలోమీటర్లు కారులో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న సంగీత తను చేరుకున్న ప్రతి గ్రామంలో అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో స్వచ్ఛతపై పరిస్థితులను బుక్ లో రికార్డు చేసుకుంటున్నారు. ఆ వివరాలను యాత్ర పూర్తయ్యాక త్వరలోనే ఐక్యరాజ్య సమితికి ఒక నివేదికగా అందించనున్నారు. అన్ని రాష్ట్రాలలో స్వచ్ఛతపై పరిశీలన జరిపిన సంగీత.. తెలుగు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో మరుగుదొడ్లు వాడుతున్నా, వాటి పర్యవేక్షణ సరిగా లేదని, ప్రభుత్వాలు వాటిపై శ్రద్ధ తీసుకోవటంలేదని గ్రహించారు. ఇప్పటి వరకు ఆమె 181 రోజుల్లో 29 రాష్ట్రాల్లో 270 నగరాలలో ప్రయాణించి 24 సరిహద్దు ప్రాంతాలను చేరుకున్నారు. 27 యునెస్కో వారసత్వ భవనాలను తిలకించారు. రోజుకు 8 నుండి 12 గంటలపాటు ప్రయాణం చేస్తూ, ఎక్కడా ఎవరి ఆశ్రయమూ తీసుకోకుండా తన కారులోనే రాత్రి వేళల్లో నిద్రిస్తున్నారు. ఉదయాన్నే యోగాతో ఆమె దినచర్య ప్రారంభం అవుతుండగా.. స్థానికంగా దొరికే పండ్లు, కూరగాయలు వంటివి మాత్రమే తీసుకుంటూ ఆమె తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా పలు అవాంతరాలను కూడా సంగీత ఎదుర్కొన్నారు. కశ్మీర్‌లోని లేహ్ సరస్సు సమీపంలో 18 వేల అడుగుల ఎత్తులో మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో తాను నడుపుతున్న వాహనం మంచులో చిక్కుకుపోవటంతో రోజంతా ఒంటరిగా అక్కడే గడిపిన భయానక పరిస్థితులు కూడా ఆమెకు ఎదురయ్యాయి. ఆ సంఘటనను కళ్లారా చూసిన కశ్మీరీ మహిళలు ఆమెను ఐరన్ లేడి అని ప్రశంసించడం యాత్రలో ఆమెను ఉత్తేజపరిచిన ఒక సందర్భం. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ, పర్యాటక మంత్రి ఆల్ఫోన్స్ వంటి మంత్రులు ప్రత్యేకంగా అభినందించడం కూడా తన యాత్ర దిగ్విజయంగా పూర్తవడానికి దోహదపడ్డాయని సంగీత తెలిపారు. సంగీత మంచి ఫొటోగ్రాఫర్ కూడా. జాతీయస్థాయిలో పలు అవార్డులు కూడా అందుకున్నారు. అమెరికాలోని కొన్ని జర్నల్స్ ఆమె ఫొటోలు ప్రచురించాయి. యాత్రలో ఇటీవలి వరకు ఆమె ప్రయాణించిన మొత్తం దూరం 41 వేల కిలోమీటర్లు! అంటే కశ్మీర్ లోని శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు పదకొండు సార్లు రోడ్డు మార్గంలో ప్రయాణించినంత దూరం. దేశంలో అన్ని రాష్ట్రాలనూ ఇప్పటికే చుట్టేసిన సంగీత యాత్ర.. కేరళ, కర్నాటక మీదుగా.. ఎక్కడైతే మొదలైందో అక్కడే ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఈ మార్చి 15న పూర్తి కానుంది. అది పూర్తవగానే గిన్నిస్ ఆమె పేరు నమోదు అవుతుంది. యాత్రలో భాగంగా ఇటీవల చెన్నైలో తనను కలిసిన పాత్రికేయులతో ఆమె ఈ వివరాలను పంచుకున్నారు. సంజయ్ గుండ్ల, సాక్షి టీవీ, చెన్నై బ్యూరో -
‘రఘును చంపిందెవరు..?’
సాక్షి, కోయంబత్తూరు : ‘రఘును చంపిందెవరు..?’ 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ రఘుపతిని బలిగొన్న కోయంబత్తూరు రహదారిపై రాసిన ఈ ప్రశ్న అందరినీ నిలదీస్తోంది. తాను పెళ్లాడబోయే వధువును కలుసుకునేందుకు అమెరికా నుంచి ఎన్నో ఆశలతో వచ్చిన ఈ యువకుడిని శుక్రవారం ఉదయం రహదారి మింగేయడంతో ఆగ్రహం, ఆవేదనతో ఇద్దరు యువకులు రోడ్డుపైనే ఇలా రాయడం అందరినీ ఆలోచింపచేస్తోంది. కోయంబత్తూరు, తమిళనాడులు ఈ విషాదాన్ని మర్చిపోలేవని ఈ అక్షరాలు విస్పష్ట సంకేతాలు పంపుతున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ దారుణ ఘటన విషయానికి వస్తే..వివాహబంధంతో ఒక్కటవనున్న తన భాగస్వామిని కలిసేందుకు అమెరికా నుంచి కోయంబత్తూరుకు రెక్కలు కట్టుకుని వాలిన రఘు యాత్రా స్థలం పళనికి దైవదర్శనం కోసం వెళ్లేందుకు బస్సు ఎక్కాలని బస్ స్టాప్‌కు బైక్‌పై బయలుదేరాడు. ఈ క్రమంలో తన వైపు వేగంగా దూసుకొస్తున్న లారీని తప్పించుకునేందుకు తన బైక్‌ను ఎడమవైపుకు మళ్లించాడు. అయితే చీకట్లో అక్కడే ఉన్న భారీ హోర్డింగ్‌ను గమనించకపోవడంతో బైక్ హోర్డింగ్‌ను ఢీ కొట్టింది. దీంతో రోడ్డుపై పడిపోయిన రఘు మీది నుంచి లారీ దూసుకుపోవడంతో క్షణాల్లో మృత్యువు కబళించింది. డిసెంబర్ 3న జరిగే ఓ కార్యక్రమం కోసం ఏఐఏడీఎంకే ఈ భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేసింది. హోర్డింగ్ ఉందనే సంకేతాలు ఇచ్చి రోడ్డుపై వెళ్లే బైకర్లు, వాహనదారులను అప్రమత్తం చేసే సూచికలను సైతం ఏర్పాటు చేయలేదు. ఈ హోర్డింగ్ ఏకంగా 40 శాతం రోడ్డును ఆక్రమించింది. తన తప్పును సమర్ధించుకునేందుకు ఏఐఏడీఎంకే అడ్డంగా వాదిస్తూ ప్రమాద సమయంలో రఘు మద్యం సేవించాడనే ప్రచారానికి తెరలేపింది. మరికొందరేమో అతనిపై లారీ దూసుకుపోవడంతోనే మరణించాడని, హోర్డింగ్‌కు ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తున్నారు. అయితే అది ఆరు లేన్ల రహదారి కావడంతో ఎడమ వైపున హోర్డింగ్ లేకుంటే రఘు సులభంగా తనవైపు దూసుకొచ్చిన లారీని తప్పించుకునేవాడనే విషయాన్ని విస్మరిస్తున్నారు. ఇక రఘు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే విషాదం చోటుచేసుకుందని మరికొందరు వేలెత్తిచూపుతున్నారు. ఈ వాదనలో కొంత హేతుబద్ధత ఉన్నా ఏఐఏడీఎంకే తప్పిదాన్ని కప్పిపుచ్చలేరు. దారుణ ఘటనకు బాధ్యులను గుర్తించి, శిక్షించాల్సిన కార్పొరేషన్ అధికారులు చోద్యం చూస్తుంటే పోలీసులు తమ రాతలతో వ్యవస్థను నిలదీసిన యువకులను ప్రశ్నించడం గమనార్హం. వారికి ఏమైనా రాజకీయ పార్టీలతో సంబంధం ఉందా అని ఆరాతీసిన పోలీసులకు అలాంటిదేమీ లేదనే సమాచారం లభించింది. రాజకీయ హంగామా కోసం బహిరంగ ప్రదేశాలను, రహదారులను ఆక్రమించి ప్రచార ఆర్భాటాలతో రెచ్చిపోవడం ఏఐఏడీఎంకేకు అలవాటేననే విమర్శలు ఎదురవుతున్నాయి. డిసెంబర్ 2015లో జనరల్ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా చెన్నై నగరాన్ని ఆ పార్టీ హోర్డింగ్‌లతో ముంచెత్తింది. నగరంలోని పేవ్మెంట్స్నూ ఆక్రమించింది. పాదచారులకు ఇబ్బందికరంగా ఉన్న హోర్డింగ్‌లను తొలగించేందుకు ప్రయత్నించిన అవినీతిపై పోరాడే ఎన్జీవో అరప్పోర్ ఇయకం కార్యకర్తలను ఏఐఏడీఎంకే శ్రేణులు అడ్డుకుని దాడులకు తెగబడటంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేసి చెన్నై సెంట్రల్ జైలుకు తరలించడం, పార్టీ కార్యకర్తలపై ఈగ వాలనీయకపోవడం విస్మయం కలిగించింది. ఇక జయలలిత అధికారంలో ఉండగా ఫుట్‌పాత్‌లపై హోర్డింగ్‌లను తొలగించినందుకు సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామిపై కేసు నమోదైంది. కోయంబత్తూర్‌లో హోర్డింగ్‌ల ఏర్పాటుపై మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోలేదు. మున్సిపల్ మంత్రి ఎస్పీ వేలుమణి స్వయంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ హోర్డింగ్‌లను ఏర్పాటు చేయించడం గమనార్హం. హోర్డింగ్ ఏర్పాటుకు ఆదేశించిన వారిపై ఇంతవరకూ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీనిపై కేవలం విపక్ష డీఎంకే మాత్రమే గళమెత్తింది. పార్టీలు రాచరిక వ్యవస్థను తలపించేలా అహంభావపూరితంగా వ్యవహరించరాదని డీఎంకే స్పష్టం చేసింది. అయినా సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు ఈ అంశంపై ఇప్పటివరకూ నోరుమెదపలేదు. జీవించి ఉన్న వ్యక్తుల కటౌట్లు ఏర్పాటు చేయరాదని నెల కిందట మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో పళనిస్వామి, పన్నీర్‌సెల్వంల నిలువెత్తు కటౌట్ల స్ధానంలో వారి ఫోటోలతో కూడిన భారీ బెలూన్లను ఎగురవేశారు. రఘు దుర్మరణం పాలైన కొద్దిరోజుల్లోనే థానే జిల్లాలోనూ ఇటువంటి హోర్డింగ్‌లు దర్శనమిచ్చాయి. రఘు మరణంపై ప్రజల్లో నిరసన పెల్లుబుకుతోంది. ఈ విషాదాన్ని హైలైట్ చేసేందుకు, బాధ్యులపై చర్యలు చేపట్టేందుకు ఒత్తిడి పెంచేలా ఛేంజ్.ఓఆర్జీలో పిటిషన్లపై ఉద్యమ స్ఫూర్తితో సంతకాలు జరుగుతున్నాయి. ఈ తరహా దారుణ ఘటనలకు చరమగీతం పాడాలని, రఘు వంటి అమాయకుల ప్రాణాలను ఇక తమిళనాడు త్యాగం చేయబోదనే గట్టి సందేశం బలంగా వినిపించాలనే ఆకాంక్ష సర్వత్రా వ్యక్తమవుతోంది. -టీఎస్ సుధీర్ -
అసెంబ్లీలోకి గుట్కాలు తెచ్చారంటూ....
చెన్నైః డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, విపక్ష నేత ఎంకే స్టాలిన్‌కు తమిళనాడు అసెంబ్లీ సభా హక్కుల కమిటీ నోటీసులు జారీ చేసింది. నిషేధిత గుట్కాను జులై 19న సభలోకి తీసుకువచ్చినందుకు స్టాలిన్ సహా 20 మంది డీఎంకే ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.గుట్కా విక్రయాలను నిరోధించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తూ స్టాలిన్ సభలో గుట్కాలను ప్రదర్శించారు. అయితే నిషేధిత వస్తువును అసెంబ్లీ ప్రాంగణంలోకి తీసుకురావడం, ప్రదర్శించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని స్పీకర్ పీ ధన్పాల్ రూలింగ్ ఇస్తూ సభా హక్కుల కమిటీకి ఈ అంశాన్ని నివేదించారు. దీనిపై వారంలోగా వివరణ ఇవ్వాలని స్టాలిన్ సహా 20 మంది డీఎంకే ఎమ్మెల్యేలకు సభా హక్కుల కమిటీ నోటీసులు జారీ చేసింది. గుట్కాలు మార్కెట్లో ఎంత సులభంగా లభిస్తున్నాయో వెల్లడించేందుకే తామలా చేశామని డీఎంకే ఎమ్మెల్యేలు చెబుతున్నారు. -
సరిహద్దులో డ్యాం రచ్చ
– నాలుగు గంటలు హైవే దిగ్బంధం, రైల్ రోకోలు చెన్నై : కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాలుగు గంటలపాటు జాతీయ రహదారిని నిరసనకారులు దిగ్బంధం చేశారు. రైల్ రోకోలకు దిగారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుని కేరళ వైపు దూసుకెళ్లడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తోపులాట, వాగ్వివాదాల నడుమ డీఎంకేతోపాటు పలు పార్టీల, సంఘాల నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. భవాని నదిపై డ్యాం కట్టేందుకు కేరళ చేస్తున్న ప్రయత్నాలు పశ్చిమ తమిళనాడులోని మూడు జిల్లాల్లో ఆక్రోశాన్ని రగిల్చింది.ఈ జలాశయంలోకి నీటి రాక కరవైన పక్షంలో కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్‌తోపాటు కరూర్ జిల్లాల్లో తాగు, సాగు నీటి కష్టాలు తప్పవన్న ఆందోళన బయలుదేరింది. కేరళ చర్యల్ని నిరసిస్తూ ఆదివారం డీఎంకే, కాంగ్రెస్, వీసీకే, తమిళ మానిల కాంగ్రెస్, మనిద నేయ మక్కల్ కట్చి, కొంగు మక్కల్ కట్చిలతోపాటు 40 పార్టీలు, ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు సరిహద్దుల్లో ఉద్రిక్తతకు దారితీసింది. డీఎంకే మాజీ మంత్రులు సుబ్బలక్ష్మి జగదీశన్, పొంగలురు పళని స్వామి, వెల్ల కోవిల్ స్వామినాథన్, ఎంఎంకే నేత జవహరుల్లా, కొంగు మక్కల్ కట్చి నేత ఈశ్వర్‌లతో పాటు వేలాదిగా నాయకులు, కార్యకర్తలు కేరళ సరిహద్దులో కోయంబత్తూరు– పాలక్కాడు జాతీయ రహదారిని దిగ్బంధించారు. అక్కడి టోల్గేట్ వద్ద నాలుగు గంటల పాటు రహదారిని దిగ్బంధించడంతో పోలీసులు నిరసనకారుల్ని రెండుగా విడదీసి ఓ వైపు ఉన్న వాళ్లు మరో వైపు రాకుండా అడ్డుకున్నారు. దీంతో మరో వైపు ఉన్న వాళ్లు ఆగ్రహించి కేరళ వైపు పరుగులు తీశారు. వాగ్వాదాలు, తోపులాటల మధ్య నాయకుల్ని అరెస్టు చేశారు. కేరళ చర్యలకు నిరసనగా కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూర్‌లలో సీపీఐ నేతృత్వంలో రైల్ రోకోలు సాగాయి. కోయంబత్తూరు ఉత్తర స్టేషన్లో ఓ రైలును ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్ నేతృత్వంలో కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈరోడ్‌లో మాజీ కార్యదర్శి టీ పాండియన్ నేతృత్వంలో నిరసన సాగగా ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. -
పన్నీర్ సెల్వం రాయని డైరీ
గవర్నర్‌కి ఏదో అయిందన్నట్లుగా అంతా వెళ్లి ఆయన్ని కలిసొస్తున్నారు! గవర్నర్ కూడా తనకేదో అయిందన్నట్లుగా అందర్నీ రాజ్‌భవన్‌కి పిలిపించుకుంటున్నారు. తమిళనాడులో ఇప్పుడిది గవర్నర్ పదవీ విరమణలా ఉంది కానీ, తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు జరుగుతున్న బల నిరూపణలా లేదు! సాయంత్రం గవర్నర్‌ని కలిశాను. తీక్షణంగా నా వైపు చూశారు! నేను చీఫ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఆయనలో అంత లోతైన చూపు లేదు. అంత ఘాటైన భావన లేదు. ‘ఉన్న దాన్ని ఊడదీసుకుని, మళ్లీ ఇప్పుడొచ్చి నన్ను తగిలించమంటే ఎలా?’ అన్నట్లు చిరాగ్గా చూశారు. ‘మీరు మునుపటిలా లేరు’ అనబోయి ఆగిపోయాను. ఆయన మునుపటిలానే ఉన్నారు గవర్నర్‌గా! నేనే.. మునుపటిలా లేను ముఖ్యమంత్రిగా! అందుకే ఆగిపోయాను. ‘మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు’ అని మొదలుపెట్టాను. మళ్లీ ఆయన చిరాగ్గా చూశారు. ‘ఏంటి చూసేది! నువ్వే అన్నీ చూపిస్తున్నావు’ అన్నారు. హర్ట్ కాబోయి ఆగిపోయాను. హర్ట్ అయినప్పుడు నాకు కన్నీళ్లు వస్తాయి. కన్నీళ్లొస్తే తుడుచుకోమని చెప్పడానికి ఇప్పుడు అమ్మ లేదు. తుడుచుకోమని అమ్మ చెప్పందే తుడుచుకునే అలవాటు నాకూ లేదు. అందుకే ఆగిపోయాను. ‘ఉత్తి పుణ్యానికి నా నెత్తిన బండెత్తేశావు కదయ్యా సెల్వం. నా ఫ్యామిలీ టూర్ మొత్తం పాడు చేసేశావ్. కాసేపలా కూర్చో, ఏం చేయాలో ఆలోచిద్దాం’ అన్నారు ఆనరబుల్ గవర్నర్. ఆయన చెప్పినట్లే కూర్చున్నాను. కానీ ఆయనే.. ఏం చేయాలో ఆలోచిస్తున్నట్లు లేదు! ‘ఒక్క చాన్సివ్వండి’ అని అడగబోయి ఆగిపోయాను. మూడుసార్లు ముఖ్యమంత్రిని అయ్యానన్న గౌరవం లేకుండా, ఎంత మాట పడితే అంత మాట అనేసేలా ఉంది ఆయన వాలకం! అందుకే ఆగిపోయాను. నేనక్కడ ఉండగానే గవర్నర్‌ను కలవడానికి చీఫ్ సెక్రెటరీ గిరిజా వైద్యనాథన్ వచ్చారు. ఆమె అక్కడ ఉండగానే గవర్నర్‌ను కలవడానికి పోలీస్ చీఫ్ రాజేందర్ వచ్చాడు. వాళ్లిద్దరూ అక్కడ ఉండగానే గవర్నరును కలవడానికి చీఫ్ జస్టిస్ కౌల్ వచ్చారు. వాళ్ల ముగ్గురూ అక్కడ ఉండగానే గవర్నరును కలవడానికి శశికళ వస్తోందన్న కబురొచ్చింది! అంతా కలిసి శశికళను రాజ్‌భవన్ నుంచే ఊరేగింపుగా తీసుకెళ్లరు కదా!! ‘ఎక్స్‌క్యూజ్‌మీ సర్..’ అనుకుంటూ కుర్చీలోంచి లేచి నిలబడ్డాను. ‘సార్.. ముందు నాకే అవకాశం ఇస్తారు కదా.. బల నిరూపణకు’ అన్నాను. ‘నీకే ఇస్తానయ్యా పన్నీర్ సెల్వం’ అన్నారు గవర్నర్. ‘మరి.. వాళ్లెందుకొచ్చారు సార్’ అని అడిగాను. గవర్నర్ మళ్లీ చిరాగ్గా చూశారు. ‘మీ ఇద్దరిలో ఎవరు బలాన్ని నిరూపించు కున్నా.. తర్వాత నేనే కదయ్యా లా అండ్ ఆర్డర్లో నా బలాన్ని నిరూపించుకోవలసింది’ అన్నారు! - మాధవ్ శింగరాజు -
తమిళనాడు సిఎం ముఖ్యమంత్రిపై కావేరి దాడి