Ajith Valimai Movie First Day Box Office Collections In Tamil Nadu - Sakshi
Sakshi News home page

Valimai Box Office Collections: ఒక్క తమిళనాడులోనే అన్ని కోట్లా!, ఇక తెలుగు, హిందీలో..

Published Fri, Feb 25 2022 6:55 PM | Last Updated on Fri, Feb 25 2022 7:46 PM

PRO Ramesh Bala Shares Valimai Movie First Day Collections In Tamil Nadu - Sakshi

దేశంలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టడంతో పెద్ద సినిమాలు విడుదలకు సిద్దమయ్యాయి. ఇప్పటికే పలుమార్లు విడుదలను వాయిదా వేసుకున్న చిత్రాలు.. వరుసగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలో తమిళ స్టార్‌ హీరో అజిత్‌ నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘వలిమై’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలన్ని వాయిదా పడటంతో వలిమైపై మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఈ తరుణంగా ఎన్నో అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ మూవీ హిట్‌టాక్‌ను తెచ్చుకోవడమే కాదు కలెక్షన్స్‌ పరంగా కూడా గ్రాండ్‌ ఓపెనింగ్‌ను ఇచ్చింది.

‘వలిమై’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ను అఫిషియల్‌గా ప్రకటిస్తూ సినిమా పీఆర్‌ఓ రమేష్‌ బాల ట్వీట్‌ చేశాడు. ఈ సందర్భంగా ఆయన.. బ్రేకింగ్‌.. వలిమై తొలిరోజే కలెక్షన్స్‌ సునామి సృష్టించిన తొలి సినిమాగా నిలిచిందని, తమిళనాడులో వలిమై తొలిరోజు రూ. 34కోట్లు వసూలు చేసిందని వెల్లడించాడు. కరోనా సమయంలో సైతం ఈ స్థాయిలో కలెక్షన్స్‌ ఆశ్చర్యకరం అంటున్నారు. చాలా గ్యాప్‌ తర్వాత వచ్చినప్పటికి అజిత్‌ వలిమైతో మరోసారి తన మార్క్‌ చూపించాడంటు మురిసిపోతున్నారు ఆయన అభిమానులు. అయితే ఒక్క తమిళనాడులోనే కలెక్షన్స్‌ ఈ రేంజ్‌లో ఉంటే  ఇక తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలో కలిపి 50 నుంచి 60 కోట్లు రూపాయలు దాటే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచన వేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement