స్టార్‌ హీరో అజిత్‌పై బోనీ కపూర్‌ ప్రశంసలు | Boney Kapoor Praises Ajith Kumar For Valimai Film | Sakshi
Sakshi News home page

Boney Kapoor : హీరో అజిత్‌పై బోనీ కపూర్‌ ప్రశంసలు

Published Mon, Feb 21 2022 12:15 PM | Last Updated on Mon, Feb 21 2022 12:16 PM

Boney Kapoor Praises Ajith Kumar For Valimai Film - Sakshi

Boney Kapoor Praises Ajith Kumar For Valimai Film: నిర్మాతల ఇష్టమైన నటుడు అజిత్‌ అని బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ అన్నారు. ఈయన జి.స్టూడెంట్స్‌ సంస్థతో కలిసి (అజిత్‌ కథానాయకుడిగా) నిర్మించిన చిత్రం వలిమై. హిందీ నటి హ్యూమా ఖురేషి నాయకిగా నటించిన ఇందులో టాలీవుడ్‌ యువ నటుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడం భాషల్లో విడుదల కానుంది.

ఇది కుటుంబ అనుబంధాలతో కూడిన యాక్షన్‌ చిత్రమని నిర్మాత బోనీ కపూర్‌ వెల్లడించారు. అజిత్‌ వినమ్రత కలిగిన నిబద్ధతతో కూడిన నటుడని కితాబు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఆయన నిర్మాతల ఇష్టమైన నటుడని అన్నారు. ఈ చిత్రం తాము ఊహించిన విధంగా రూపొందడానికి అజిత్‌ సహకారమే కారణమన్నారు. దర్శకుడు హెచ్‌.వినోద్‌ శ్రమకు ప్రతిఫలం ఈ చిత్రం అని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రానికి ఓటీటీ సంస్థలు భారీ మొత్తాన్ని ఆఫర్‌ చేసినా తాము థియేటర్లోనే విడుదల చేయడానికి మొగ్గు చూపామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement