
వలిమై చిత్ర నిడివిని యూనిట్ కొంత మేరకు కుదించింది. వివరాలు.. అజిత్ కథానాయకుడిగా జీ సినిమాతో కలిసి బోనీ కపూ ర్ నిర్మించిన చిత్రం ఇది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి నాయకిగా నటించారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో గురువారం విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. చిత్రంలో పోరాట దృశ్యాలు, బైక్ ఛేజింగ్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.
అజిత్ అభిమానులు భలే ఖుషీ అవుతున్నారు. అయితే చిత్ర నిడివి ఎక్కువైందనే భావన సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనిపై స్పందించిన యూనిట్ వెంటనే 14 నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలను తొలగించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే చిత్ర నిర్మాత బోనీకపూర్ చెన్నైలో వలిమై చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లను విజిట్ చేస్తున్నారు. ఆయనపై అజిత్ అభిమానులు పూల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment