Valimai Movie
-
ఆ స్టార్ హీరోల సినిమాను తిరస్కరించిన సాయి పల్లవి
డాక్టర్ అవ్వాల్సిన సాయిపల్లవి యాక్టర్ అయ్యారు. అయితే తన గురించి చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సాయి పల్లవి బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన నటి అని. ఈమె ఒక చానల్ నిర్వహించిన యార్ ప్రభుదేవా అనే కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాతే మలయాళంలో ప్రేమమ్ చిత్రంతో కథానాయక పరిచయం అయ్యారు. ఆ ఒక్క చిత్రం సాయిపల్లవి దశను మార్చేసింది. వెంటనే తెలుగులో అవకాశాలు తలుపుతట్టాయి. తెలుగులో ఆమె నటించిన ఫిదా, లవ్‌స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలు విజయం సాధించడంతో కోలీవుడ్ నుంచి కాలింగ్ వచ్చింది. తమిళంలో ధనుష్‌కు జంటగా మారీ–2, సూర్యతో ఎన్జీకే చిత్రాల్లో నటించారు. అయితే ఇక్కడ మారీ–2 చిత్రం మినహా ఇతర చిత్రాలేవీ ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయినా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటించడానికి సాయిపల్లవి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్ సరసన నటిస్తున్న ఒక్క చిత్రం మాత్రమే ఈమె చేతిలో ఉంది. కాగా ఇటీవల ఇద్దరు తమిళస్టార్ హీరోల సరసన నటించే రెండు అవకాశాలను సాయిపల్లవి తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరు ఎవరో కాదు నటుడు విజయ్, అజిత్ కావడం విశేషం. విజయ్ కథానాయకుడు నటించిన తాజా చిత్రం వారిసులో హీరోయిన్గా ముందు సాయిపల్లవినే అనుకున్నారట. అయితే ఆ చిత్రంలో కథానాయక పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె నో చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత నటి రష్మికను ఎంపిక చేశారు. ఆమె కూడా తన పాత్రకు ప్రాధాన్యత లేదని తెలుసిన విజయ్ సరసన నటించాలన్న కోరికతోనే వారిసు చిత్రంలో ఆమె నటించినట్లు చెప్పిన విషయం తెలిసిందే. సాయిపల్లవి నిరాకరించిన మరో చిత్రం వలిమై. అజిత్ కథానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు మొదట సాయిపల్లవినే అనుకున్నారట అయితే ఆ పాత్రకు ప్రాముఖ్యత లేకపోవడంతో ఆమె నిరాకరించినట్లు సమాచారం. నిజానికి ఈ రెండు చిత్రాల్లోనూ గ్లామర్‌కు అవకాశం లేకపోయినా నటనకు కూడా అవకాశం లేకపోవడంతో సాయిపల్లవి నో చెప్పినట్లు తెలిసింది.. -
సంక్రాంతి సంబరం... బాక్సాఫీస్ సమరం
ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా సంక్రాంతి సమరానికి బాక్సాఫీస్ ముస్తాబవుతోంది. థియేటర్ అనే గ్రౌండ్లో ప్రేక్షకులే సాక్షిగా బాక్సాఫీస్ బరిలో కలెక్షన్స్ పందేనికి కత్తులు కట్టిన కోడి పుంజుల్లా రెడీ అయ్యారు నలుగురు స్టార్ హీరోలు. వీరితో పాటు యంగ్ హీరో కూడా వస్తున్నాడు. పండగ సందర్భంగా సినిమాలు రావడం సినీ ప్రేమికులకు సంబరం... బాక్సాఫీస్‌కి వసూళ్ల సమరం. ఇక.. ఈ సంక్రాంతి పండక్కి వస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. సంక్రాంతి ఈ నెల 13న ఆరంభమవుతుంది. కానీ సినిమా సంక్రాంతి మాత్రం రెండు రోజులు ముందుగానే అంటే జనవరి 11న స్టార్ట్ అవుతుంది. తమిళ హీరోలు విజయ్ నటించిన ‘వారసుడు’ (తమిళంలో ‘వారిసు’), అజిత్ ‘తునివు’ (తెలుగులో ‘తెగింపు’) చిత్రాలు జనవరి 11నే విడుదల కానున్నాయి. విజయ్, రష్మికా మందన్నా జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వారసుడు’. ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మించారు. ఓ సంపన్న ఉమ్మడి కుటుంబంలో చోటు చేసుకునే వివిధ సంఘటనల సమాహారంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇక ‘నేర్కొండ పార్వై’ (హిందీ ‘పింక్’ తమిళ రీమేక్), ‘వలిమై’ చిత్రాల తర్వాత హీరో అజిత్, దర్శకుడు హెచ్. వినోద్, నిర్మాత బోనీ కపూర్ల కాంబినేషన్లో తెరకెక్కిన మూడో చిత్రం ‘తెగింపు’ (తమిళంలో ‘తునివు’). ఈ యాక్షన్ ఫిల్మ్ కథాంశం బ్యాంకు రాబరీ నేపథ్యంలో ఉంటుంది. బ్యాంకును హైజాక్ చేసిన ఓ వ్యక్తి, ఆ బ్యాంకు కస్టమర్లను హోస్టేజ్‌గా చేసి తన లక్ష్యాలు నెరవేరేలా ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేస్తాడు. ‘తెగింపు’ ప్రధానాంశం ఇదే అని తెలుస్తోంది. కాగా జనవరి 12న ‘వీరసింహా రెడ్డి’గా వస్తున్నారు బాలకృష్ణ. ‘అఖండ’ వంటి హిట్ తర్వాత బాలకృష్ణ, ‘క్రాక్’ వంటి హిట్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన ఈ ‘వీరసింహారెడ్డి’లో శ్రుతీహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. మరోవైపు ‘వాల్తేరు వీరయ్య’గా జనవరి 13న వస్తున్నారు చిరంజీవి. ఆయన టైటిల్ రోల్లో నటించి, హీరో రవితేజ ఓ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు కొల్లి బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకుడు. శ్రుతీహాసన్ నాయిక. శ్రీకాకుళంలో నివాసం ఉండే వాల్తేరు వీరయ్య (చిరంజీవి)కు, మరో ఏరియాలో ఉండే పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సాగర్ (రవితేజ)లకు మధ్య ఉన్న అనుబంధం, పగ అంశాలతో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని కూడా నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్లే నిర్మించారు. ఇక ప్రతి సంక్రాంతికి పెద్ద స్టార్స్ మధ్య చిన్న హీరోల సినిమాలూ రిలీజ్ అవుతాయి. ఈ సంక్రాంతికి ఈ జాబితాలో నిలిచిన మూవీ ‘కళ్యాణం కమనీయం’. సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఆళ్ల అనిల్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. శివ (సంతోష్), శ్రుతి (ప్రియా) ప్రేమ బంధం నుంచి వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. అయితే శివకు జాబ్ లేకపోవడం వారి మధ్య ఎలాంటి మనస్పర్థలకు దారి తీసింది అనేది చిత్రం ప్రధానాంశం. మరి.. ఈ సంక్రాంతి బరిలో ఏ సినిమాకు ప్రేక్షకులు ‘సంక్రాంతి హిట్’ ట్యాగ్ ఇస్తారో చూడాలి. -
జీ5లో అలరించే ఈ పోలీస్ సినిమాలు, సిరీస్‌లు చూశారా !
Top 6 Police Oriented Movies And Web Series In Zee5: తాము ఆరాధించే హీరోలను వివిధ గెటప్పుల్లో, విభిన్నమైన పాత్రల్లో చూడాలనుకుంటారు అభిమానులు. ఫ్యాన్స్‌కు కోరికలకు అనుగుణంగానే డిఫరెంట్ పాత్రల్లో నటించి మెప్పిస్తారు కథానాయకులు. ఫ్యాక్షనిస్టులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రభుత్వ అధికారులుగా, పోలీసులుగా నటించి మంచి ఆదరణ పొందారు. కథానాయకులు పోలీసులుగా నటించిన అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సరికొత్త కాన్సెప్ట్స్, జోనర్స్‌తో ఎంటర్టైన్ చేసేందుకు రెడీగా ఉంటున్నాయి ఓటీటీలు. వాటిలో జీ5 ఒకటి. ఇటీవలే 80+ సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందిస్తున్నట్లుగా ప్రకటించింది. తాజాగా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉన్న పోలీస్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లను ప్రేక్షకుల కోసం ప్రకటించింది. మరీ ఆ కాప్ సిరీస్‌లు, సినిమాలు ఏంటో చూద్దామా ! which cop makes your heart pop? 😍 pic.twitter.com/XE2OKhUvHJ — ZEE5 (@ZEE5India) May 24, 2022 చదవండి: సూపర్ థ్రిల్ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్ ఇవే.. -
వలీమై పోస్టర్‌తో జీ5 సంచలనం.. దేశంలోనే తొలిసారిగా!
వినోదాత్మక సినిమాలు, వెబ్ సిరీస్‌లు డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లతో దూసుకుపోతోంది జీ 5. ‘జీ5 ఓటిటి’ అంటే ‘వినోదం మాత్రమే కాదు, అంతకు మించి’ అన్నట్లుగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ తాజాగా ఒక యాక్షన్ మూవీని అందుబాటులోకి తెస్తోంది. తమిళ సూపర్‌స్టార్ అజిత్ నటించిన ‘వలీమై’ ఈనెల 25 నుంచి జీ5లో ప్రదర్శితం కానుంది. ఈ సందర్భంగా అజిత్ కుమార్ గౌరవార్ధం జీ5 సంస్థ చెన్నైలోని వైయంసీఏ సర్కిల్లో 10,000 అడుగుల పొడవైన అతిపెద్ద పోస్టర్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశంలో ఏ ఓటీటీ సంస్థ కూడా ఇటువంటి పెద్ద పోస్టర్‌ను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వలీమై విషయానికి వస్తే ఇందులో అజిత్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్ పాత్రలో నటించగా, హ్యుమా ఖురైషీ, కార్తికేయ ముఖ్య పాత్రల్లో నటించారు. హెచ్.వినోద్ రచనా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి బేవ్యూ ప్రాజెక్ట్ ఎల్ఎల్పికి చెందిన బోనీ కపూర్ నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు. చదవండి: మా ఇద్దరికీ ఎందుకు ముడిపెడుతున్నారు: భాగ్యశ్రీ -
ఈ వారం సందడి చేసే పెద్ద సినిమాలు ఇవే..
పుష్ప, శ్యామ్ సింగరాయ్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ చిత్రాలతో సినీ లవర్స్ పండుగ చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఆ పండుగను కొనసాగించే సమయం వచ్చేసింది. థియేటర్లలో ఒకే ఒక్క భారీ చిత్రం విడుదల కానుండగా.. ఓటీటీల్లో బడా చిత్రాలు సందడి చేయనున్నాయి. వారంలో ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటేనే ఆ సందడి మాములుగా ఉండదు. అలాంటిది థియేటర్లో, ఓటీటీల్లో నలుగురు స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఆ ఉత్సాహం అంతకుమించి అన్నట్టుగానే ఉంటుంది. అయితే ఒక మల్టీ స్టారర్ చిత్రం థియేటర్లలో దుమ్ము లేపడానికి సిద్ధంగా ఉంటే రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు ఓటీటీల్లో అదరగొట్టనున్నాయి. 1. రౌద్రం.. రణం.. రుధిరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంటి ఇద్దరు అగ్ర హీరోలతో ఓటమెరుగని దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాపై అంచనాలు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిస్టారికల్ ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మూవీ బీజీఎం తెలుగు రాష్ట్రాల్లో మారుమోగనుంది. 2. భీమ్లా నాయక్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో ఫిబ్రవరి 25న విడుదలైన చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ మూవీకి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించగా స్క్రీన్ ప్లే, సంభాషణలు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాశారు. థియేటర్లలో అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆహా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లలో మార్చి 25 నుంచి 'భీమ్లా నాయక్' స్ట్రీమింగ్ కానుంది. 3. వలిమై కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా ఫిబ్రవరి 24న రిలీజైన మూవీ 'వలిమై'. హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించి మెప్పించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా హిట్ కొట్టన 'వలిమై' కూడా మార్చి 25 నుంచి ప్రముఖ ఓటీటీ వేదికా 'జీ5'లో ప్రదర్శితం కానుంది. థియేటర్లో ఆర్ఆర్ఆర్, ఓటీటీల్లో భీమ్లా నాయక్, వలిమై సినిమాలతో మూవీ లవర్స్‌కు బంపర్ ట్రీట్ అందనుంది. ఓటీటీల్లో రిలీజయ్యే మరికొన్ని సినిమాలు: నెట్‌ఫ్లిక్స్ 1. బ్రిడ్జిటన్ (వెబ్ సిరీస్), మార్చి 25 అమెజాన్ ప్రైమ్ 2. డ్యూన్, మార్చి 25 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 3. పారలెల్స్, మార్చి 23 -
ఓటీటీలోకి అజిత్ ‘వలిమై’, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
తమిళ స్టార్ అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం వలిమై. హెచ్.వినోద్ తెరకెక్కించిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మించాడు. ఈ మూవీతో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ కన్నడ, మలయాళంలో రిలీజైన వలిమై.. తమిళనాట రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. చదవండి: స్క్రీన్ ప్లేలో 'ప్లే'.. మరింతగా ఆడనున్న సినిమాలు ఇదిలా ఉంటే ఇప్పుడు వలిమై ఓటీటీలో సైతం సందడి చేసేందుకు రెడీ అవుతోంది. మార్చి 25 నుంచి ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ డీల్‌కు డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అన్ని భాషల్లోని ఒకేసారి తీసుకొస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో పుష్ప మూవీ కూడా ప్రాంతాల వారీగా ఒక్కో తేదీలలో స్ట్రీమింగ్ చేయగా.. వలిమై కూడా తమిళంలో కొన్ని రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసే చాన్స్ ఉన్నట్లు సమాచారం. -
‘వలిమై’ క్రేజ్ మామూలుగా లేదుగా, 3 రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి..
Ajith Valimai Box Office Collections: తమిళ నాట హీరో అజిత్‌కు ఉండే క్రేజ్ గరించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆయన నటించిన ‘వలిమై’ చిత్రం ఫస్ట్‌డే తమిళ నాడు దాదాపు రూ. 36 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం చూస్తుంటే ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రెంజ్ ఉందో అర్థమవుతోంది. వినోద్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన వలిమై ఫిబ్రవరి 24న తమిళ, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైంది. బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రం వీకెండ్లో సైతం అదే జోరుతో వసూళు చేసింది. చదవండి: సాయి పల్లవి యాడ్ రిజెక్ట్ చేయడంపై స్పందించిన సుకుమార్ ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా 100 కోట్లకిపైగా వసూళ్లను సాధించిందని చెబుతున్నారు. అక్కడ మరికొన్ని రోజుల పాటు ఈ సినిమా హవానే కొనసాగుతుందని అంటున్నారు. ఎందుకంటే దగ్గరలో పెద్ద సినిమాలేవీ లేవు. ఇక తెలుగులో కూడా ఈ సినిమాను అదే టైటిట్‌తో విడుదల చేశారు. కానీ ఇక్కడ అంతగా రెస్పాన్స్ కనిపించడం లేదు. అందుకు కారణంగా అందరి దృష్టి 'భీమ్లా నాయక్' పై ఉండటమే.. ఆ సినిమాకి హిట్ టాక్ రావడమే కారణం. చదవండి: మెగా ఫ్యాన్స్‌కు షాక్, అది ఫేక్ అట! -
'వలిమై' రన్‌టైం తగ్గించిన మేకర్స్.. ఎందుకంటే
వలిమై చిత్ర నిడివిని యూనిట్ కొంత మేరకు కుదించింది. వివరాలు.. అజిత్ కథానాయకుడిగా జీ సినిమాతో కలిసి బోనీ కపూ ర్ నిర్మించిన చిత్రం ఇది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి నాయకిగా నటించారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో గురువారం విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. చిత్రంలో పోరాట దృశ్యాలు, బైక్ ఛేజింగ్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. అజిత్ అభిమానులు భలే ఖుషీ అవుతున్నారు. అయితే చిత్ర నిడివి ఎక్కువైందనే భావన సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనిపై స్పందించిన యూనిట్ వెంటనే 14 నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలను తొలగించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే చిత్ర నిర్మాత బోనీకపూర్ చెన్నైలో వలిమై చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లను విజిట్ చేస్తున్నారు. ఆయనపై అజిత్ అభిమానులు పూల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పడుతున్నారు. -
అజిత్ ‘వలిమై’ ఫస్ట్‌డే కలెక్షన్స్.. ఒక్క తమిళనాడులోనే అన్ని కోట్లా!
దేశంలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టడంతో పెద్ద సినిమాలు విడుదలకు సిద్దమయ్యాయి. ఇప్పటికే పలుమార్లు విడుదలను వాయిదా వేసుకున్న చిత్రాలు.. వరుసగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘వలిమై’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలన్ని వాయిదా పడటంతో వలిమైపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఈ తరుణంగా ఎన్నో అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ మూవీ హిట్‌టాక్‌ను తెచ్చుకోవడమే కాదు కలెక్షన్స్ పరంగా కూడా గ్రాండ్ ఓపెనింగ్‌ను ఇచ్చింది. ‘వలిమై’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ను అఫిషియల్‌గా ప్రకటిస్తూ సినిమా పీఆర్ఓ రమేష్ బాల ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన.. బ్రేకింగ్.. వలిమై తొలిరోజే కలెక్షన్స్ సునామి సృష్టించిన తొలి సినిమాగా నిలిచిందని, తమిళనాడులో వలిమై తొలిరోజు రూ. 34కోట్లు వసూలు చేసిందని వెల్లడించాడు. కరోనా సమయంలో సైతం ఈ స్థాయిలో కలెక్షన్స్ ఆశ్చర్యకరం అంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత వచ్చినప్పటికి అజిత్ వలిమైతో మరోసారి తన మార్క్ చూపించాడంటు మురిసిపోతున్నారు ఆయన అభిమానులు. అయితే ఒక్క తమిళనాడులోనే కలెక్షన్స్ ఈ రేంజ్లో ఉంటే ఇక తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలో కలిపి 50 నుంచి 60 కోట్లు రూపాయలు దాటే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచన వేస్తున్నారు. #BREAKING : Actor #AjithKumar 's #Valimai takes All-Time No.1 Day 1 Opening in TN.. TN Day 1 Gross - ₹ 34 Crs.. — Ramesh Bala (@rameshlaus) February 25, 2022 -
Viral Video: వలిమై నిర్మాత కారును ఫ్యాన్స్ ఎలా చేశారో చూడండి!
-
వలిమై నిర్మాత కారును ఫ్యాన్స్ ఎలా చేశారో చూడండి!
'మన ఊరి పాండవులు' హిందీ రీమేక్ 'హమ్ హై పాంచ్' సినిమాతో నిర్మాతగా కెరీర్ ఆరంభించాడు బోనీ కపూర్. తాజాగా ఆయన నిర్మించిన వలిమై సినిమా ఫిబ్రవరి 24న విడుదలైంది. అజిత్ హీరోగా, కార్తికేయ విలన్‌గా నటించిన ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను నటి హ్యూమా ఖురేషితో కలిసి చెన్నైలో ఫస్ట్ డే ఫస్ట్ షో వీక్షించాడు బోనీ కపూర్. ఈ క్రమంలో తన కారును థియేటర్ బయట పార్క్ చేశాడు. విషయం తెలుసుకున్న కొందరు క్రేజీ ఫ్యాన్స్ వలిమై నిర్మాత కారుకు పాలాభిషేకం చేశారు. పాలు, పెరుగుతో నిర్మాత కారుకు అభిషేకం చేశారు. సినిమా చూసి బయటకు వచ్చిన బోనీ కపూర్ తన కారు స్థితిని చూసి కొంత ఆశ్చర్యపోయినప్పటికీ అదే కారులో తిరిగి వెళ్లిపోయాడు. -
‘వలిమై’మూవీ రివ్యూ
టైటిల్ :వలిమై నటీనటులు :అజిత్, కార్తికేయ, హ్యూమా ఖురేషీ తదితరులు నిర్మాణ సంస్థలు : బే వ్యూ ప్రాజెక్ట్స్, జి.స్టూడియోస్ నిర్మాత: బోనీ కపూర్ దర్శకత్వం :హెచ్.వినోద్ సంగీతం : యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం: జిబ్రాన్ సినిమాటోగ్రఫీ :నీరవ్ షా విడుదల తేది : ఫిబ్రవరి 24, 2022 దేశంలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టడంతో పెద్ద సినిమాలు విడుదలకు సిద్దమయ్యాయి. ఇప్పటికే పలుమార్లు విడుదలను వాయిదా వేసుకున్న చిత్రాలు.. వరుసగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాయి.తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వలిమై’చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ఇటీవల కాలంలో పెద్ద సినిమాలేవి థియేటర్స్‌లో విడుదల కాకపోవడంతో ‘వలిమై’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ గురువారం(ఫిబ్రవరి 24)ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్ పాన్ ఇండియా మూవీ ‘వలిమై’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘వలిమై’కథేటంటే వైజాగ్ కేంద్రంగా ‘సైతాన్ స్లేవ్స్’పైరుతో నేర సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు నరేన్(కార్తికేయ). ఆన్లైన్ వేదికగా జరిగే ఈ చట్ట విరుద్ద కార్యక్రమానికి నిరుద్యోగ యువతనే టార్గెట్‌గా చేసుకుంటాడు. వారిని డ్రగ్స్ బానిసలుగా మార్చేసి, చైన్ స్నాచింగ్, హత్యలు వంటి చట్ట వ్యతిరేక పనులు చేయిస్తుంటాడు. టెక్నాలజీని ఉపయోగించి పోలీసుల చేతికి చిక్కకుండా జాగ్రత్త పడతాడు. వైజాగ్‌లో రోజు రోజుకి బైక్ రేసర్ల దొంగతనాలు, హత్యలు పెరిగిపోవడంతో.. వాటిని అరికట్టడానికి రంగంలోకి దిగుతాడు అసిస్టెంట్ కమిషనర్ అర్జున్(అజిత్). ఈ ఇద్దరు హేమాహేమీల మధ్య జరిగిన పోరులో ఎవరు విజయం సాధించారు? నేరస్తులను పట్టుకునే క్రమంలో అర్జున్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతని ఫ్యామిలీని టార్గెట్ చేసిన నరేన్‌కు అర్జున్ ఎలా బుద్ది చెప్పాడు? చివరకు ఆన్లైన్ వేదిక ‘సైతాన్ స్లేవ్స్’ని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే ఏసీపీ అర్జున్ పాత్రలో అజిత్ ఒదిగిపోయాడు.స్వతగా అజిత్ మంచి బైక్ రేసర్ కావడంతో యాక్షన్స్ సీన్స్‌లో అద్భుతంగా నటించగలిగాడు.ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్స్‌లో అజిత్ అదరగొట్టేశాడు. ఇక ఈ చిత్రంతో కోలివుడ్ ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ.. విలన్‌గా మెప్పించాడు. యాక్షన్స్ సీన్స్‌లో అజిత్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ హెడ్ సోఫియా పాత్రలో హ్యుమా ఖురేషి జీవించేసింది. సినిమాలో తనది కీలక పాత్ర అనే చెప్పాలి. ఇక ఏసీపీ అర్జున్ తమ్ముడు బుజ్జిగా రాజ్ అయ్యప్ప తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వీరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే... వలిమై పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం. డ్రగ్స్ సరఫరా, చైన్ స్నాచింగ్, హత్యలు, పోలీసుల ఇన్వెస్టిగేషన్ చుట్టూ కథ సాగుతోంది. ఆన్లైన్ వేదికగా నేరాలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్‌ని, ఆ గ్యాంగ్ లీడర్ని పోలీసులు ఎలా అంతం చేశారనేదే ఈ సినిమా కథ. రోటీన్ కథనే ఎంచుకున్న దర్శకుడు వినోద్.. అజిత్‌కి తగ్గట్లుగా భారీ యాక్షన్ సీన్స్‌ని, బైక్ రేసింగ్ నేపథ్యాన్ని తీసుకొని సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు ప్రధాన బలం అజిత్, కార్తికేయ మధ్య వచ్చే బైక్ ఛేజ్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలే. యాక్షన్ స్టంట్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయి. అయితే సినిమాలో కొత్తదనం లేకపోవడం, నిడివి ఎక్కువ ఉండడం మైనస్. సినిమా మొత్తం చేసింగ్ సీన్లే ఉంటాయి. మధ్య మధ్యలో మదర్ సెంటిమెంట్ చొప్పించే ప్రయత్నం చేసినా.. అది వర్కౌట్ కాలేదు. అంతేకాదు ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ బోరింగ్‌గా అనిపిస్తాయి. ఉన్నంతలో ఫస్టాఫ్ అంతో ఇంతో మెప్పిస్తుంది. ఇక సెకండాఫ్ బోరింగ్‌గా సాగుతుంది. క్లైమాక్స్ కూడా పాత సినిమాల మాదిరి ఉంటుంది. ఓ ఫ్యాక్టరీలో హీరో ఫ్యామిలీని విలన్ బంధించి ఉంచడం.. హీరో వచ్చి ఫైట్ చేసి వారిని విడిపించడం.. ఇలాంటి క్లైమాక్స్ సీన్స్ గతంలో చాలా సినిమాల్లో వచ్చాయి. ఎడిటింగ్ బాలేదు. పాటలు, నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'వలిమై' థియేటర్‌పై పెట్రోల్ బాంబ్ దాడి
కోయంబత్తూరు (తమిళనాడు): కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా, టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించిన తాజా చిత్రం వలిమై. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురువారం(ఫిబ్రవరి 24న) థియేటర్లలో రిలీజైంది. అజిత్ సినిమా ఫస్ట్ డే చూసేందుకు థియేటర్‌కు తరలివచ్చిన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటుండగా ఈ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. కోయంబత్తూరులోని గంగవల్లి మల్టీప్లెక్స్ థియేటర్ ముందు పెట్రోల్ బాంబ్ దాడి జరిగింది. బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వలిమై సినిమా నడుస్తున్న థియేటర్ ఎదుట బాంబుతో దాడి చేశారు. అక్కడే ఉన్న అభిమానులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు బైక్‌పై పరారయ్యారు. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉంటే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజైన వలిమైకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అజిత్, కార్తికేయల నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. -
ఆ ఇద్దరూ చాలా ఫోకస్డ్గా ఉంటారు: బోనీ కపూర్
‘‘బాపూగారు దర్శకత్వం వహించిన ‘మన ఊరి పాండవులు’ సినిమాను హిందీలో ‘హమ్ హై పాంచ్’గా రీమేక్ చేశాను. ఈ రీమేక్‌తోనే నిర్మాతగా నా కెరీర్ ప్రారంభమైంది’’ అన్నారు బోనీ కపూర్. అజిత్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వలిమై’. కీలక పాత్రలో హ్యూమా ఖురేషీ, విలన్‌గా కార్తికేయ నటించారు. బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రం నేడు(ఫిబ్రవరి 24) విడుదలవుతోంది. తెలుగులో ఇనుమూరి గోపీచంద్ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బోనీ కపూర్ మాట్లాడుతూ – ‘‘అజిత్, వినోద్ చాలా ఫోకస్డ్గా ఉంటారు. వీరి కాంబినేషన్లో మూడో సినిమా చేస్తున్నాను. కార్తికేయ ఆఫ్ స్క్రీన్‌లో కూల్‌గా ఉంటాడు కానీ ఆన్ స్క్రీన్‌పై షేర్లా యాక్ట్ చేస్తాడు. నా కుమార్తె జాన్వీ కపూర్ దక్షిణాది భాషల్లో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంది. తెలుగులో యాక్ట్ చేసేందుకు మంచి కథ కోసం ఎదురుచూస్తోంది’’ అన్నారు. ‘‘శ్రీదేవిగారి బ్యానర్ (శ్రీదేవి భర్త బోనీ కపూర్)లో యాక్ట్ చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు కార్తికేయ. -
‘వలిమై’ మూవీ ట్విటర్ రివ్యూ
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం వలిమై. గతంలో అజిత్‌కు నేర్కొండ పార్వై లాంటి సూపర్ హిట్ మూవీని అందించిన హెచ్.వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జి.స్టూడియోస్ సంస్థతో కలిసి బే వ్యూ ప్రాజెక్ట్స్‌పై బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.హిందీ నటి హ్యూమా ఖురేషి నాయకిగా నటించిన ఇందులో టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు.జనవరి 13న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో ఈ సినిమాని శుక్రవారం(ఫిబ్రవరి 24) థియేటర్స్‌లో విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా ట్రైలర్లో చూపించిన యాక్షన్ సన్నివేశాలు అయితే అదిరిపోయాయి.ఇప్పటికే పలు చోట్ల ప్రిమియర్ షోస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.అవేంటో చూద్దాం. #Ajith sir Nailed it🔥🥵💥 Blockbuster On the Card 🔥🔥💥#ValimaiReview || #Valimai || #ValimaiDay — Praveen 🇮🇳 (@_praveen_16) February 24, 2022 వలిమై చిత్రానికి నెటిజన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా అద్భుతంగా ఉంది. వలిమై కోసం అజిత్ వంద శాతం ఎఫర్ట్ పెట్టి పని చేశారని కొంతమంది కామెంట్ చేయగా, రొటీన్ స్క్రీన్ ప్లే, ఫ్యాన్స్‌ను మెప్పించే సీన్స్ లేవని మరికొంతమంది అంటున్నారు. #ValimaiReview #ValimaiFDFS To simply put it Block Buster. Please do not believe any fake -ve reviews. This is a Vinoth movie than the Ajith movie but Thala Ajith put his 100% sincere effort to make it happen. Congratulations. — Karthik (@meet_tk) February 23, 2022 అలాగే సినిమా రన్ టైమ్ మూడు గంటలు ఉండడం కూడా ఇబ్బందిగా ఉందని కామెంట్ చేస్తున్నారు.ఇండియన్ సినిమాల్లో కొత్త హిస్టరీ. ఒక్క మాటలో చెప్పాలంటే మ్యాజిక్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Valimai Strength : First half stunts,Ajith screen presence.✨💯 Weakness : Too much cinematic liberty taken in the second hlf and lacks patience and punch which was quite gud in 1st half. Overall nice message. Cud've been crispier 😏 — Akash Anand (@akashba) February 24, 2022 ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ యావరేజ్ అని అంటున్నారు.నో డౌట్ సినిమా బ్లాక్ బస్టర్. అజిత్ కుమార్ చేసిన యాక్షన్ ఎలిమెంట్స్ అద్భుతమని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. Valimai review 1st half for Ajith fans 2nd half for Vijay Fans 🤭#Beast pic.twitter.com/4nsE0nH0os — صخري (@RakeshBR55) February 24, 2022 2nd half Vera Level 💥💥👌👌 Rendu varusha uzhaippu jeichuteenga #Valimai Team #AK https://t.co/jkwRkF9c73 — இயக்கம் (@Iyakkamm) February 24, 2022 #Valimaireview Good first half, below average second half, weakest script from vinoth, ajith looks very tired in most scenes. Emotion scenes didn't work even a bit. Disappointed 🙏🏻👍 #Valimai #ValimaiFDFS𓃵 — BlastingTamilCinema (@BLSTG2) February 24, 2022 BIGGEST BLOCKBUSTER OF INDIAN CINEMA!!!! Complete action thriller 🔥🔥🔥 #AjithKumar #AK #Thala #ValimaiBlockbuster #Valimai — Dharmaraj K (@dharmagk) February 24, 2022 After watched the movie you all will understand the reason behind emerald design for #Valimai title HVinod is really a man of master mind 🔥 pic.twitter.com/nDuF96JT2R — PRO V2 (@ProdigeV2) February 23, 2022 Just watched now in England. Vera level Vera Mari 😍 love u Thala #Valimai — புங்கை முகிலன் (@muhilansv) February 23, 2022 1st half wathaaa vera marri🔥🔥🔥🔥🔥#ValimaiFDFS𓃵 #Valimai #ValimaiReview pic.twitter.com/qQRwfYHb41 — 𝚅𝚊𝚊𝚍𝚒 𖤍 𝚅𝚊𝚊𝚜𝚊𝚕 ° ᭄° (@VaadiVaasal23) February 24, 2022 The New story of Indian cinema History.. #Valimai Interval... One Word review , Magic Magic Magic...💥 Interval scene fully Goosebumps...🩸#ValimaiFDFS #ValimaiReview pic.twitter.com/Nq8mHXMqIg — 💗💗SUPERSTAR BAKTHAN💗💗 (@AJITAJI2) February 24, 2022 Hats off Stunt Making @dhilipaction Team, Camera Team & Sfx mixing Team 👏👏💥💥 vera level Theaterical Experience 💪 (watch Normal days experience SFX feel) #Valimai — Manibharathi Selvaraj (@smbmanibharathi) February 24, 2022 -
ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి అజిత్
-
Valimai Pre Release Event: వలిమై ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
స్టార్ హీరో అజిత్‌పై బోనీ కపూర్ ప్రశంసలు
Boney Kapoor Praises Ajith Kumar For Valimai Film: నిర్మాతల ఇష్టమైన నటుడు అజిత్ అని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ అన్నారు. ఈయన జి.స్టూడెంట్స్ సంస్థతో కలిసి (అజిత్ కథానాయకుడిగా) నిర్మించిన చిత్రం వలిమై. హిందీ నటి హ్యూమా ఖురేషి నాయకిగా నటించిన ఇందులో టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడం భాషల్లో విడుదల కానుంది. ఇది కుటుంబ అనుబంధాలతో కూడిన యాక్షన్ చిత్రమని నిర్మాత బోనీ కపూర్ వెల్లడించారు. అజిత్ వినమ్రత కలిగిన నిబద్ధతతో కూడిన నటుడని కితాబు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఆయన నిర్మాతల ఇష్టమైన నటుడని అన్నారు. ఈ చిత్రం తాము ఊహించిన విధంగా రూపొందడానికి అజిత్ సహకారమే కారణమన్నారు. దర్శకుడు హెచ్.వినోద్ శ్రమకు ప్రతిఫలం ఈ చిత్రం అని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రానికి ఓటీటీ సంస్థలు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినా తాము థియేటర్లోనే విడుదల చేయడానికి మొగ్గు చూపామన్నారు. -
మళ్లీ అలా చేయొద్దని ప్రామిస్ చేసుకున్నా: యంగ్ హీరో
‘‘హీరో క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ విలన్ రోల్స్‌కు హద్దులు ఉండవు. విలన్ రోల్స్‌ను ఎంజాయ్ చేస్తూ చేయవచ్చు. హీరోగా చేస్తున్నప్పుడు మార్కెట్, ప్రమోషన్స్, మూవీ అవుట్‌పుట్ ఇలా కాస్త ఒత్తిడిగా ఉంటుంది. అయితే సినిమా హిట్ అయినప్పుడు హీరో పడిన కష్టానికి మంచి ఫలితం వస్తుంది’’ అని అన్నారు కార్తికేయ. అజిత్ హీరోగా కార్తికేయ విలన్ పాత్రలో నటించిన చిత్రం ‘వలిమై’. బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో కార్తికేయ చెప్పిన విశేషాలు. ► ‘వలిమై’ చిత్రదర్శకుడు హెచ్. వినోద్‌గారు కథ వినిపించి, నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని చెప్పారు. అప్పటికే ఆయన దర్శకత్వంలో కార్తీ హీరోగా చేసిన ‘ఖాకీ’ సినిమా చూశాను. పైగా ‘వలిమై’లో అజిత్గారు హీరో అనగానే హ్యాపీ ఫీలయ్యాను. అంత పెద్ద స్టార్‌తో నటిస్తే కెరీర్ పరంగా నాకు ఫ్లస్ అవుతుందని భావించి ‘వలిమై’ ఒప్పుకున్నాను. ► ఈ సినిమాలో నేను చేసిన నెగటివ్ క్యారెక్టర్‌కి డిఫరెంట్ షేడ్స్ అండ్ లేయర్స్ ఉన్నాయి. పెర్ఫార్మెన్స్కు మంచి స్కోప్ ఉంది. ఈ సినిమా కోసం నేను తమిళం నేర్చుకున్నాను. భాషపై అవగాహన ఉన్నప్పుడే యాక్టర్‌గా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలమని నమ్ముతాను. ► అజిత్గారు ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో గాయపడినా లొకేషన్‌ను విడిచి వెళ్లలేదు. యూనిట్ ఇబ్బంది పడకూడదని భావించి గాయంతోనే షూటింగ్లో పాల్గొన్నారు. అంత పెద్ద స్టారే అలా చేస్తున్నప్పుడు మనం ఇంకెంతో కష్టపడాలి అనిపించింది. ► ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌లో ప్రశాంత్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను. శ్రీదేవి మూవీస్‌లో ఓ సినిమా చేస్తున్నాను. ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్‌లో మూవీ కమిటయ్యాను. దర్శకుడు అజయ్ భూపతితో మళ్లీ సినిమా ఉంటుంది. అయితే ఇది ‘ఆర్ఎక్స్100’కు సీక్వెల్ కాదు.. లవ్‌స్టోరీ. ఇక సుకుమార్ రైటింగ్స్‌లో నేను చేయాల్సిన సినిమా సందిగ్ధంలో ఉంది. ప్రస్తుతం సుకుమార్‌గారు ‘పుష్ప: ది రైజ్’తో బిజీగా ఉన్నారు. ► నేను నటించిన కొన్ని సినిమాలు సరైన ఫలితం ఇవ్వలేదు. కానీ ఓ యాక్టర్‌గా నా ప్రయత్న లోపం మాత్రం లేదు. అలాగే ఫ్లాప్ అయిన సినిమా నుంచి నా తప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దుకున్నాను. చేసిన తప్పు మళ్లీ చేయకూడదని నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను. -
ఆ స్టార్ హీరోతో కలిసి నటించడం నా అదృష్టం: యంగ్ హీరో
వలిమై చిత్రం విడుదల కోసం చాలా ఎక్సైటింగ్‌గా ఎదురుచూస్తున్నానని నటుడు కార్తికేయ అన్నారు. తెలుగులో హీరోగా రాణిస్తున్న ఈ యువ నటుడు వలిమై చిత్రంతో అజిత్‌కు విలన్‌గా తమిళ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో బోని కపూర్ నిర్మించిన చిత్రం వలిమై. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి నాయిక. ఈ నెల 24వ తేదీ పాన్ ఇండియా చిత్రంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా కార్తికేయ చెన్నైలో విలేకరులతో ముచ్చటించారు. అజిత్‌తో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇందులో తనది హీరోకు సమానంగా ఉన్న పవర్ఫుల్ పాత్ర అని చెప్పారు. దర్శకుడు వినోద్ కథ చెప్పి అజిత్‌కు విలన్‌గా చేయాలని చెప్పగానే ఓకే చెప్పేశానని తెలిపారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానన్నారు. ఈ చిత్రం కోసం తమిళ్లో మాట్లాడటం కూడా తెలుసుకున్నానన్నారు. -
అజిత్ కొత్త సినిమా టీజర్ రిలీజ్ చేసిన మహేష్
-
సమ్మర్ రేసులో మరిన్ని భారీ చిత్రాలు.. ఏ సినిమాకు మీ ఓటు?
విక్రమాదిత్య, ప్రేరణ ప్రేమకథకు డేట్ సెట్ అయింది. సన్నాఫ్ ఇండియా చేసిన పోరాటం చూసే డేట్ సెట్ అయింది. కరోనా కరుణిస్తే పక్కా కమర్షియల్ చూసే డేట్ సెట్ అయింది. ఇంతేనా... ఇంకా బుధవారం బోలెడన్ని డేట్స్ సెట్ అయ్యాయి. పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ్, హిందీ చిత్రాల రిలీజ్ డేట్ సెట్ అయింది. ఇక ప్రేక్షకులు ఏ రోజు సినిమా చూడాలో... డేట్ సెట్ చేసుకోవడమే ఆలస్యం. విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకావ్యంగా రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్’. విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజా హెగ్డే జంటగా ఇటలీ నేపథ్యంలో సాగే ప్రేమకథాగా ఈ చిత్రం రూపొందింది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ నెలలోనే ‘సన్నాఫ్ ఇండియా’ తెరపైకి వచ్చే తేదీ షురూ అయింది. సమాజాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేసే పవర్ఫుల్ వ్యక్తిగా మోహన్‌బాబు టైటిల్ రోల్ చేసిన చిత్రం ఇది. ఈ సినిమాకు మోహన్‌బాబు స్క్రీన్‌ప్లే సమకూర్చడం విశేషం. ‘డైమండ్’ రత్నబాబు దర్శకత్వంలో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌తో కలసి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు మంచు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. మరోవైపు మూడు నెలల తర్వాత రానున్న డేట్‌ని ‘పక్కా కమర్షియల్’ టీమ్ ప్రకటించింది. కరోనా కరుణిస్తే... అనుకున్న తేదీకి పక్కాగా వస్తాం అంటూ ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. గోపీచంద్ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌తో కలిసి జీఏ2 పిక్చర్స్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు పలు మీడియమ్, స్మాల్ బడ్జెట్ చిత్రాల రిలీజ్ డేట్ కూడా ఖరారైంది. మార్చి 4న ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా తెరకు రానుంది. ఈ తేదీని ప్రకటించి, టీజర్‌ని రిలీజ్ చేశారు. మూడు పదుల వయసున్న అర్జున్ కుమార్‌కి పెళ్లి ఎందుకు కాలేదు? చివరకి పెళ్లి కోసం అర్జున్ కుమార్ అండ్ ఫ్యామిలీ ఏం చేశారు? అనే విషయాలతో ఈ సినిమా సాగుతుంది. విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘రాజావారు రాణిగారు’ చిత్రదర్శకుడు రవి కిరణ్ కోలా కథ–మాటలు–స్క్రీన్‌ప్లే అందించారు. ఇక ఫిబ్రవరి 18న విడుదలకు రెడీ అయిన సినిమా ‘సురభి 70 ఎంఎం’ (హిట్టు బొమ్మ ). గంగాధర వై.కె. అద్వైత దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సినిమా అనేది ప్రతి తెలుగువాడి నరనరాల్లో ఉన్న ఎమోషన్, సినిమా థియేటర్ని కాపాడుకోవాలి అనే కథతో గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. బాబీ ఫిలిమ్స్ సమర్పణలో కేకే చైతన్య నిర్మించిన ఈ చిత్రంలో అక్షత శ్రీనివాస్, వినోద్, అనిల్, చందు, మహేశ్, ఉషాంజలి, శ్లోక తదితరులు నటించారు. ఆచార్య ఏప్రిల్ 29, సర్కారు వారి పాట మే 12కు రిలీజ్ అవుతున్నాయి. హిందీలోనూ... బాలీవుడ్‌లోనూ రిలీజ్‌ల హడావిడి కనబడుతోంది. ఆలియా భట్ టైటిల్ రోల్ చేసిన ‘గంగూబాయి కతియావాడి’ ఈ నెల 25న విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ చేసిన ‘ఝుంద్’ మార్చి 4న, ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ‘అనేక్’ మే 13న, కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించిన ‘భూల్ భులెయ్యా 2’ మే 20న రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఇంకా రిలీజ్ లిస్ట్‌లో పలు చిత్రాలు ఉన్నాయి. కోలీవుడ్‌లోనూ... తమిళ పరిశ్రమ కూడా సినిమా విడుదల తేదీలను ఖరారు చేసుకుంటోంది. రిలీజ్ కానున్న చిత్రాల్లో అజిత్ కుమార్ ‘వలిమై’, సూర్య ‘ఎదర్కుమ్ తునిందవన్’ ఉన్నాయి. అజిత్ హీరోగా బోనీ కపూర్ నిర్మించిన ‘వలిమై’ ఈ నెల 24న విడుదల కానుంది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ అనువాదరూపంలో అదే తేదీన ఈ చిత్రం తెరకు రానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. తెలుగు హీరో కార్తికేయ ఈ చిత్రంలో విలన్ పాత్ర చేయడం విశేషం. ఇక ఈ కరోనా కాలంలో సూర్య హీరోగా నటించిన రెండు చిత్రాలు ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలయ్యాయి. అది సూర్య ఫ్యాన్స్‌ని కాస్త నిరాశపరిచింది. అయితే సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఎదర్కుమ్ తునిందవన్’ చిత్రం థియేటర్స్‌లో రానుండటం వారికి ఆనందాన్నిచ్చే విషయం. మార్చి 10న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో అనువదించి, అదే తేదీన విడుదల చేయనున్నారు. డబుల్ డేట్! ఒక పని చేయడానికి ఓ ప్లాన్ అనుకుంటాం. అది ప్లాన్ ‘ఎ’. ఆ ప్లాన్ ప్రకారం జరగకపోతే అనే ఆలోచనతో ప్లాన్ ‘బి’ కూడా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు తెలుగులో ‘ప్లాన్ బి’ ట్రెండ్ నడుస్తోంది. సినిమా రిలీజ్‌కి ‘డబుల్ డేట్’ ప్రకటించి, ఆ తర్వాత ఓ డేట్‌కి ఫిక్స్ అవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో ఈ ట్రెండ్ మొదలైందని చెప్పొచ్చు. ఓ పది రోజుల క్రితం ‘‘మా ‘ఆర్ఆర్ఆర్’ని ఈ ఏడాది మార్చి 18న లేదా ఏప్రిల్ 28న విడుదల చేస్తాం’’ అని ఈ చిత్రబృందం ప్రకటించింది. చివరికి మార్చి 25న విడుదల చేయనున్నట్లు సోమవారం ఓ తేదీని ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఆర్ఆర్ఆర్’ తరహాలోనే ‘భీమ్లా నాయక్’ రెండు విడుదల తేదీలను ప్రకటించింది. పవన్ కల్యాణ్–రానా హీరోలుగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘మా చిత్రాన్ని ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తాం.. లేకపోతే ఏప్రిల్ 1న చిత్రం థియేటర్స్‌కు వస్తుంది’’ అని సోమవారం ప్రకటించారు. మంగళవారం రవితేజ ‘రామారావు: ఆన్ డ్యూటీ’, వరుణ్ తేజ్ ‘గని’.. ఈ రెండు చిత్రాలకు సంబంధించి ‘డబుల్ డేట్’ ప్రకటన వచ్చింది. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. దివ్యాంశా కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘‘మార్చి 25న మా సినిమాను విడుదల చేయాలనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి మార్చి 25 కుదరకపోతే ఏప్రిల్ 15న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం’’ అని నిర్మాతలు ప్రకటించారు. మరోవైపు వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గని’. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించారు. ‘‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్స్‌లో ఫిబ్రవరి 25 కూడా ఉంది. ఆ చిత్రం ఫిబ్రవరి 25కి రాకపోతే అదే రోజున ‘గని’ విడుదలవుతుంది.. ‘భీమ్లా నాయక్’ 25నే రిలీజ్ అయితే ‘గని’ మార్చి 4న రిలీజవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
కోలీవుడ్ స్టార్‌తో కార్తికేయ సినిమాపై కీలక అప్డేట్
Ajith, Karthikeyas Valimai Movie All Set To Release: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లెటెస్ట్ మూవీ 'వాలిమై'. హెచ్ వినోద్ దర్శకత్వంతో వహిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం అటూ కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు అజిత్ తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని మార్చి4న విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాను తమిళం, తెలుగుతో పాటు హిందీలోనూ ఒకే రోజున విడుదల చేయనున్నారు. -
మళ్లీ ఆ దర్శకుడి వైపే అజిత్ చూపు.. ముచ్చటగా మూడోసారి!
Ajith AK 61 Movie: వలిమై చిత్ర కాంబో రిపీట్ కానున్నట్లు సమాచారం. తమిళ స్టార్ హీరో అజిత్ ఒకే దర్శకుడితో ఒకే నిర్మాణ సంస్థకు వరుసగా చిత్రాలు చేయడం పరిపాటిగా మారింది. ఇంతకుముందు బోనీ కపూర్ నిర్మాతగా హెచ్. వినోద్ దర్శకత్వంలో నేర్కొండ పార్వై చిత్రంలో నటించారు. ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఆ తరువాత వెంటనే ఇదే కాంబినేషన్లో వలిమై చిత్రంలో నటించారు. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి నాయికగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీనిపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా మరోసారి ఈ కాంబో రిపీట్ కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయని తెలిసింది. ఇది పంచ్ డైలాగ్స్‌తో భారీ యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. చిత్ర షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర వర్గాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.