తమిళ స్టార్ అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం వలిమై. హెచ్.వినోద్ తెరకెక్కించిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మించాడు. ఈ మూవీతో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ కన్నడ, మలయాళంలో రిలీజైన వలిమై.. తమిళనాట రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది.
చదవండి: స్క్రీన్ ప్లేలో 'ప్లే'.. మరింతగా ఆడనున్న సినిమాలు
ఇదిలా ఉంటే ఇప్పుడు వలిమై ఓటీటీలో సైతం సందడి చేసేందుకు రెడీ అవుతోంది. మార్చి 25 నుంచి ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ డీల్‌కు డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అన్ని భాషల్లోని ఒకేసారి తీసుకొస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో పుష్ప మూవీ కూడా ప్రాంతాల వారీగా ఒక్కో తేదీలలో స్ట్రీమింగ్ చేయగా.. వలిమై కూడా తమిళంలో కొన్ని రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసే చాన్స్ ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment