
వలిమై చిత్రం విడుదల కోసం చాలా ఎక్సైటింగ్‌గా ఎదురుచూస్తున్నానని నటుడు కార్తికేయ అన్నారు. తెలుగులో హీరోగా రాణిస్తున్న ఈ యువ నటుడు వలిమై చిత్రంతో అజిత్‌కు విలన్‌గా తమిళ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో బోని కపూర్ నిర్మించిన చిత్రం వలిమై. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి నాయిక. ఈ నెల 24వ తేదీ పాన్ ఇండియా చిత్రంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా కార్తికేయ చెన్నైలో విలేకరులతో ముచ్చటించారు.
అజిత్‌తో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇందులో తనది హీరోకు సమానంగా ఉన్న పవర్‌ఫుల్ పాత్ర అని చెప్పారు. దర్శకుడు వినోద్ కథ చెప్పి అజిత్‌కు విలన్‌గా చేయాలని చెప్పగానే ఓకే చెప్పేశానని తెలిపారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానన్నారు. ఈ చిత్రం కోసం తమిళ్‌లో మాట్లాడటం కూడా తెలుసుకున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment