kartikeya
-
‘శివరాజ్ సింగ్ భారీ గెలుపుతో.. ఢిల్లీ మొత్తం తలవంచింది’
భోపాల్: లోక్‌సభ ఎన్నికల్లో తన తండ్రి, కేంద్ర వ్యవసాయం శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌పై గెలుపుతో ఢిల్లీ మొత్తం తలవంచిందని కార్తికేయ సింగ్ అన్నారు. ఆయన శుక్రవారం బుధ్నీ అసెంబ్లీ స్థానంలో నిర్వహించిన ఓ సభలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఢిల్లీ నుంచి వచ్చాను. అయతే మన నేత(శివరాజ్ సింగ్ చౌహన్) ఒక ముఖ్యమంత్రిగా చాలా పాపులర్. అయిన ఇప్పుడు సీఎం కాకున్నా మరింత పాపుల్ అయ్యారు. మన నేత భారీ విజయం సాధించారు. దీంతో ఢిల్లీ మొత్తం ప్రస్తుతం మన నేత ముందు తలవంచంది. ఢిల్లీ మొత్తానికి ఆయనేంటో తెలుసు. అదేవిధంగా ఆయనకు గుర్తింపు, గౌరవం ఇస్తుంది. ఒక్క ఢిల్లీనే కాదు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన్ను గౌరవిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద నేతల జాబితాలో శివరాజ్‌సింగ్ ఒకరుగా నిలుస్తారు’అని తండ్రిపై ప్రశంసలు కురిపించారు.లోక్‌సభ ఎన్నికల విదిశ పార్లమెంట్ స్థానంలో బీజేపీ తరఫున బరిలోకి దిగిన మాజీ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ 8.20 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. దీంతో ఆయన కేంద్ర కేబినెట్లో చోటుదక్కించుకొని వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఇక.. తన తండ్రిపై కార్తికేయ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. కార్తికేయ సింగ్ వ్యాఖ్యలతో ఢిల్లీకి అసమ్మతి భయం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.‘కేంద్ర మంత్రి కుమారుడు (యువరాజు) కార్తికేయ ఢిల్లీ భయంతో ఉందని ఉంటున్నారు. ఇది 100 శాతం నిజం. ఎందుకంటే దేశం భయంతో ఉన్న ఓ నియంతను నిశితంగా పరిశీలిస్తోంది. పార్టీలో వ్యక్తం అవుతున్న అసమ్మతి స్వరం. రెబెల్ అవుతున్న పెద్ద నేతలు. సంకీర్ణ ప్రభుత్వ సమన్వయం. ప్రభుత్వానికి మద్దతు తగ్గటం వల్ల భయంతో అధికార పీఠం కదులుతోంది’అని జితూ పట్వారీ అన్నారు. మరోవైపు.. శివరాజ్ సింగ్ కేంద్రమంత్రి కావటంతో బుధ్నీ అసెంబ్లీ నియోజకర్గం నుంచి పోటీ చేయడానికి ఆయన కుమారుడు కార్తికేయ సింగ్ చౌహాన్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. -
'భజే వాయు వేగం' ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
Song: సెట్టయ్యిందే.. నీ వల్లే లైఫ్ సెట్టయ్యిందే..
కార్తికేయ హీరోగా నటించిన ‘భజే వాయు వేగం’ చిత్రం విడుదల తేదీ ఖరారు అయింది. ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వంలో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. అలాగే ఈ సినిమాలోని ‘సెట్ అయ్యిందే...’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: రధన్, సహ–నిర్మాత: అజయ్ కుమార్ రాజు .పి. -
బన్నీని కలిసిన కార్తికేయ.. అవార్డు గెలిచినందుకు విషెస్
కార్తికేయ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన 'బెదురులంక 2012' సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ ఆనందంలో ఉన్న కార్తికేయ.. నేషనల్ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ ని కలిశాడు. తన తరఫున విషెస్ చెప్పాడు. (ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటుడు ఎంగేజ్మెంట్.. డాక్టర్‌బాబు సందడి) ఈ సందర్భంగా హీరో కార్తికేయ బన్నీని కలవడానికి వెళ్లగా, బన్నీ- కార్తికేయ ఒకరికొకరు అభినందనలు చెప్పుకొన్నారు. 'బెదురులంక' సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందని, త్వరలో తన ఫ్యామిలీతో కలిసి మూవీ చూస్తానని బన్నీ చెప్పడం కార్తికేయ తెగ ఆనందపడుతున్నాడు. క్లాక్స్ దర్శకత్వంలో లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. రొటీన్‌కి భిన్నంగా ఉండే కథ కథనాలు ఆద్యంతం అలరించడంతో పాటు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ముఖ్యంగా చిత్రంలోని చివరి 40 నిముషాలు థియేటర్లు నవ్వులతో నిండిపోతున్నాయని సినిమా చూసినవాళ్లు అంటున్నారు. (ఇదీ చదవండి: సారీ చెప్పిన హీరో లారెన్స్.. ఆ గొడవపై కామెంట్స్!) Congratulated our Icon Star @alluarjun garu for winning the Iconic National Award 😇 As always, he humbly congratulated me for the Blockbuster success of #Bedurulanka2012 😍 pic.twitter.com/nEEipuk9Na — Kartikeya (@ActorKartikeya) August 27, 2023 -
నేనలా అనలేదు, ఇమేజ్ దెబ్బ తీయొద్దు.. కార్తికేయ ట్వీట్ వైరల్
ఆర్ఎక్స్ 100 సినిమాతో భారీ స్థాయిలో హిట్ అందుకున్నాడు కార్తికేయ. కానీ తర్వాత చేసిన ఏ సినిమా కూడా ఆ రేంజ్లో విజయాన్ని సాధించలేకపోయింది. ఎలాగైనా సరే తిరిగి ఫామ్‌లోకి రావాలని తెగ ప్రయత్నిస్తున్నాడీ యంగ్ హీరో. ప్రస్తుతం ఇతడు బెదురులంక సినిమా చేస్తున్నాడు. ఇందులో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. క్లాక్స్ దర్శకత్వంలో ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఆర్ఎక్స్ 100 సినిమాతో నాకు రొమాంటిక్ ఫేమ్ వచ్చింది. డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టికి కూడా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. అయితే ఆ సినిమాల్లోని పాత్రలకు ప్రస్తుతం చేస్తున్న సినిమాకు సంబంధం లేదు. కథలో రొమాంటిక్ సీన్ ఉంది. మా ఇద్దరికీ అప్పటికే ఓ ఇమేజ్ ఉంది, కాబట్టి మమ్మల్ని ఈ సినిమాకు తీసుకుని ఉండొచ్చు' అని చెప్పుకొచ్చాడు. దీన్ని సోషల్ మీడియాలో కొందరు వక్రీకరిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇద్దరికీ రొమాంటిక్ ఇమేజ్ ఉంది కాబట్టే బెదురులంకలో రొమాంటిక్ సీన్స్ కావాలని పెట్టారంటూ కామెంట్లు చేశారు. దీనిపై కార్తికేయ ట్విటర్ వేదికగా స్పందించాడు. 'ఇంటర్వ్యూ మొత్తం చూసి మాట్లాడండి.. నేనసలు అలా అనలేదు. దయచేసి నటీనటుల ఇమేజ్ దెబ్బతినేలా, సినిమాపై ఎఫెక్ట్ పడేలా ఏది పడితే అది పోస్ట్ చేయకండి. థాంక్యూ' అంటూ రెండు చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీని జత చేశాడు. చదవండి: భోళా ఎఫెక్ట్.. ముక్కు పిండి వసూలు చేస్తున్న చిరంజీవి? బేబి డైరెక్టర్ క్లారిటీ -
Bedurulanka Team In Vijayawada Photos: విజయవాడలో ‘బెదురులంక 2012’ మూవీ టీమ్ సందడి (ఫోటోలు)
-
మాస్ మల్టీస్టారర్
-
కార్తికేయ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి కొత్త సినిమా (ఫోటోలు)
-
‘వలిమై’ మూవీ ట్విటర్ రివ్యూ
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం వలిమై. గతంలో అజిత్‌కు నేర్కొండ పార్వై లాంటి సూపర్ హిట్ మూవీని అందించిన హెచ్.వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జి.స్టూడియోస్ సంస్థతో కలిసి బే వ్యూ ప్రాజెక్ట్స్‌పై బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.హిందీ నటి హ్యూమా ఖురేషి నాయకిగా నటించిన ఇందులో టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు.జనవరి 13న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో ఈ సినిమాని శుక్రవారం(ఫిబ్రవరి 24) థియేటర్స్‌లో విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా ట్రైలర్లో చూపించిన యాక్షన్ సన్నివేశాలు అయితే అదిరిపోయాయి.ఇప్పటికే పలు చోట్ల ప్రిమియర్ షోస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.అవేంటో చూద్దాం. #Ajith sir Nailed it🔥🥵💥 Blockbuster On the Card 🔥🔥💥#ValimaiReview || #Valimai || #ValimaiDay — Praveen 🇮🇳 (@_praveen_16) February 24, 2022 వలిమై చిత్రానికి నెటిజన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా అద్భుతంగా ఉంది. వలిమై కోసం అజిత్ వంద శాతం ఎఫర్ట్ పెట్టి పని చేశారని కొంతమంది కామెంట్ చేయగా, రొటీన్ స్క్రీన్ ప్లే, ఫ్యాన్స్‌ను మెప్పించే సీన్స్ లేవని మరికొంతమంది అంటున్నారు. #ValimaiReview #ValimaiFDFS To simply put it Block Buster. Please do not believe any fake -ve reviews. This is a Vinoth movie than the Ajith movie but Thala Ajith put his 100% sincere effort to make it happen. Congratulations. — Karthik (@meet_tk) February 23, 2022 అలాగే సినిమా రన్ టైమ్ మూడు గంటలు ఉండడం కూడా ఇబ్బందిగా ఉందని కామెంట్ చేస్తున్నారు.ఇండియన్ సినిమాల్లో కొత్త హిస్టరీ. ఒక్క మాటలో చెప్పాలంటే మ్యాజిక్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Valimai Strength : First half stunts,Ajith screen presence.✨💯 Weakness : Too much cinematic liberty taken in the second hlf and lacks patience and punch which was quite gud in 1st half. Overall nice message. Cud've been crispier 😏 — Akash Anand (@akashba) February 24, 2022 ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ యావరేజ్ అని అంటున్నారు.నో డౌట్ సినిమా బ్లాక్ బస్టర్. అజిత్ కుమార్ చేసిన యాక్షన్ ఎలిమెంట్స్ అద్భుతమని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. Valimai review 1st half for Ajith fans 2nd half for Vijay Fans 🤭#Beast pic.twitter.com/4nsE0nH0os — صخري (@RakeshBR55) February 24, 2022 2nd half Vera Level 💥💥👌👌 Rendu varusha uzhaippu jeichuteenga #Valimai Team #AK https://t.co/jkwRkF9c73 — இயக்கம் (@Iyakkamm) February 24, 2022 #Valimaireview Good first half, below average second half, weakest script from vinoth, ajith looks very tired in most scenes. Emotion scenes didn't work even a bit. Disappointed 🙏🏻👍 #Valimai #ValimaiFDFS𓃵 — BlastingTamilCinema (@BLSTG2) February 24, 2022 BIGGEST BLOCKBUSTER OF INDIAN CINEMA!!!! Complete action thriller 🔥🔥🔥 #AjithKumar #AK #Thala #ValimaiBlockbuster #Valimai — Dharmaraj K (@dharmagk) February 24, 2022 After watched the movie you all will understand the reason behind emerald design for #Valimai title HVinod is really a man of master mind 🔥 pic.twitter.com/nDuF96JT2R — PRO V2 (@ProdigeV2) February 23, 2022 Just watched now in England. Vera level Vera Mari 😍 love u Thala #Valimai — புங்கை முகிலன் (@muhilansv) February 23, 2022 1st half wathaaa vera marri🔥🔥🔥🔥🔥#ValimaiFDFS𓃵 #Valimai #ValimaiReview pic.twitter.com/qQRwfYHb41 — 𝚅𝚊𝚊𝚍𝚒 𖤍 𝚅𝚊𝚊𝚜𝚊𝚕 ° ᭄° (@VaadiVaasal23) February 24, 2022 The New story of Indian cinema History.. #Valimai Interval... One Word review , Magic Magic Magic...💥 Interval scene fully Goosebumps...🩸#ValimaiFDFS #ValimaiReview pic.twitter.com/Nq8mHXMqIg — 💗💗SUPERSTAR BAKTHAN💗💗 (@AJITAJI2) February 24, 2022 Hats off Stunt Making @dhilipaction Team, Camera Team & Sfx mixing Team 👏👏💥💥 vera level Theaterical Experience 💪 (watch Normal days experience SFX feel) #Valimai — Manibharathi Selvaraj (@smbmanibharathi) February 24, 2022 -
మళ్లీ అలా చేయొద్దని ప్రామిస్ చేసుకున్నా: యంగ్ హీరో
‘‘హీరో క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ విలన్ రోల్స్‌కు హద్దులు ఉండవు. విలన్ రోల్స్‌ను ఎంజాయ్ చేస్తూ చేయవచ్చు. హీరోగా చేస్తున్నప్పుడు మార్కెట్, ప్రమోషన్స్, మూవీ అవుట్‌పుట్ ఇలా కాస్త ఒత్తిడిగా ఉంటుంది. అయితే సినిమా హిట్ అయినప్పుడు హీరో పడిన కష్టానికి మంచి ఫలితం వస్తుంది’’ అని అన్నారు కార్తికేయ. అజిత్ హీరోగా కార్తికేయ విలన్ పాత్రలో నటించిన చిత్రం ‘వలిమై’. బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో కార్తికేయ చెప్పిన విశేషాలు. ► ‘వలిమై’ చిత్రదర్శకుడు హెచ్. వినోద్‌గారు కథ వినిపించి, నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని చెప్పారు. అప్పటికే ఆయన దర్శకత్వంలో కార్తీ హీరోగా చేసిన ‘ఖాకీ’ సినిమా చూశాను. పైగా ‘వలిమై’లో అజిత్గారు హీరో అనగానే హ్యాపీ ఫీలయ్యాను. అంత పెద్ద స్టార్‌తో నటిస్తే కెరీర్ పరంగా నాకు ఫ్లస్ అవుతుందని భావించి ‘వలిమై’ ఒప్పుకున్నాను. ► ఈ సినిమాలో నేను చేసిన నెగటివ్ క్యారెక్టర్‌కి డిఫరెంట్ షేడ్స్ అండ్ లేయర్స్ ఉన్నాయి. పెర్ఫార్మెన్స్కు మంచి స్కోప్ ఉంది. ఈ సినిమా కోసం నేను తమిళం నేర్చుకున్నాను. భాషపై అవగాహన ఉన్నప్పుడే యాక్టర్‌గా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలమని నమ్ముతాను. ► అజిత్గారు ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో గాయపడినా లొకేషన్‌ను విడిచి వెళ్లలేదు. యూనిట్ ఇబ్బంది పడకూడదని భావించి గాయంతోనే షూటింగ్లో పాల్గొన్నారు. అంత పెద్ద స్టారే అలా చేస్తున్నప్పుడు మనం ఇంకెంతో కష్టపడాలి అనిపించింది. ► ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌లో ప్రశాంత్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను. శ్రీదేవి మూవీస్‌లో ఓ సినిమా చేస్తున్నాను. ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్‌లో మూవీ కమిటయ్యాను. దర్శకుడు అజయ్ భూపతితో మళ్లీ సినిమా ఉంటుంది. అయితే ఇది ‘ఆర్ఎక్స్100’కు సీక్వెల్ కాదు.. లవ్‌స్టోరీ. ఇక సుకుమార్ రైటింగ్స్‌లో నేను చేయాల్సిన సినిమా సందిగ్ధంలో ఉంది. ప్రస్తుతం సుకుమార్‌గారు ‘పుష్ప: ది రైజ్’తో బిజీగా ఉన్నారు. ► నేను నటించిన కొన్ని సినిమాలు సరైన ఫలితం ఇవ్వలేదు. కానీ ఓ యాక్టర్‌గా నా ప్రయత్న లోపం మాత్రం లేదు. అలాగే ఫ్లాప్ అయిన సినిమా నుంచి నా తప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దుకున్నాను. చేసిన తప్పు మళ్లీ చేయకూడదని నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను. -
ఆ స్టార్ హీరోతో కలిసి నటించడం నా అదృష్టం: యంగ్ హీరో
వలిమై చిత్రం విడుదల కోసం చాలా ఎక్సైటింగ్‌గా ఎదురుచూస్తున్నానని నటుడు కార్తికేయ అన్నారు. తెలుగులో హీరోగా రాణిస్తున్న ఈ యువ నటుడు వలిమై చిత్రంతో అజిత్‌కు విలన్‌గా తమిళ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో బోని కపూర్ నిర్మించిన చిత్రం వలిమై. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి నాయిక. ఈ నెల 24వ తేదీ పాన్ ఇండియా చిత్రంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా కార్తికేయ చెన్నైలో విలేకరులతో ముచ్చటించారు. అజిత్‌తో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇందులో తనది హీరోకు సమానంగా ఉన్న పవర్ఫుల్ పాత్ర అని చెప్పారు. దర్శకుడు వినోద్ కథ చెప్పి అజిత్‌కు విలన్‌గా చేయాలని చెప్పగానే ఓకే చెప్పేశానని తెలిపారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానన్నారు. ఈ చిత్రం కోసం తమిళ్లో మాట్లాడటం కూడా తెలుసుకున్నానన్నారు. -
నేను ఏ సినిమా చేసినా కామెడీ ఉంటుంది: శ్రీ సరిపల్లి
‘ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ)లో కొత్తగా చేరిన యువకుడి కథే ‘రాజా విక్రమార్క’. క్రమశిక్షణ లేకపోవడం వలన అతను ఎలా ఇబ్బంది పడ్డాడు? అనేది ఆసక్తిగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్, యాక్షన్... ఇలా అన్ని అంశాలు ఉంటాయి. ‘మిషన్ ఇంపాజిబుల్’ స్ఫూర్తిగా ఈ సినిమా తీశా’’ అని డైరెక్టర్ శ్రీ సరిపల్లి అన్నారు. కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఆదిరెడ్డి టి. సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీ సరిపల్లి మాట్లాడుతూ– ‘‘అమెరికాలోని యూనివర్సల్ స్టూడియోస్‌లో మాస్టర్ ఆఫ్ ఫిలిం మేకింగ్ చేసి, నాలుగేళ్లు అక్కడ ఇండిపెండెంట్ సినిమాలకు పని చేశాను. ఆ తర్వాత వీవీ వినాయక్‌గారి దగ్గర దర్శకత్వ శాఖలో చేరి ‘నాయక్’, ‘అల్లుడు శీను’ సినిమాలకు పనిచేశాను. ‘ఆర్ఎక్స్ 100’ టైమ్‌లో కార్తికేయను చూసి, ‘రాజా విక్రమార్క’ కథ చెప్పాను. తనకి నచ్చడంతో ఈ సినిమా చేశాం. ఇందులో సందర్భానుసారంగా కామెడీ ఉంటుంది కానీ క్యారెక్టర్లు జోకులు వేయవు. దేశంలోని ఓ సమస్యపై ఎన్ఐఏ పోరాటం చేయడం సినిమాలో చూపించాం. నేను ఏ జానర్ చేసినా కామెడీ ఉండేలా చూసుకుంటాను’’ అన్నారు. -
హీరో కార్తికేయ ‘రాజా విక్రమార్క’ మూవీ స్టిల్స్
-
ఎన్.ఐ.ఏ. ఆఫీసర్‌గా కార్తికేయ
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. తాన్యా రవిచంద్రన్ కథానాయిక. సుధాకర్ కోమాకుల ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. టి. ఆదిరెడ్డి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీ సరిపల్లి మాట్లాడుతూ– ‘‘కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఇందులో కార్తికేయ ఎన్.ఐ.ఏ. ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆయన పాత్ర ఫుల్ ఎనర్జీతో ఉంటుంది. ఈ సినిమాలో నాలుగు పాటలు ఉంటాయి. ‘మెంటల్ మదిలో’, ‘దొరసాని’, ’అంతరిక్షం’ చిత్రాలకు స్వరాలందించిన ప్రశాంత్ ఆర్. విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు’’ అన్నారు. రామారెడ్డి మాట్లాడుతూ – ‘‘వీవీ వినాయక్ శిష్యుడైన శ్రీ సరిపల్లిని మా చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. చాలా మంచి కథ ఇది. కార్తికేయ పాత్ర చాలా బాగుంటుంది. ఈ నెలాఖరు వరకు హైదరాబాద్‌లో జరిపే షెడ్యూల్‌తో 90 శాతం సినిమా పూర్తవుతుంది. మిగిలిన 10 శాతాన్ని మారేడుమిల్లిలో చిత్రీకరిస్తాం’’ అన్నారు. చదవండి: ఆ ఆలోచనను విరమించుకున్న ‘సర్కారు వారి పాట’ టీమ్ కపిల్ శర్మ గురించి ఈ నిజాలు తెలుసా? -
హీరో కార్తికేయకు ఊహించని షాకిచ్చిన పోలీసులు
హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా'. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో కార్తికేయ శవాలు మోసే బస్తీ బాలరాజు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం సైబరాబాద్ పోలీసులు హీరో కార్తికేయ(బస్తీ బాలరాజు)కు ఫన్నీగా వార్నింగ్ ఇచ్చారు. చావు కబురు చల్లగా సినిమాలోని కార్తికేయ, లావణ్య త్రిపాఠి బైక్‌పై వెళ్తున్న సన్నివేశానికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ..'హెల్మెట్ పెట్టుకుని, సరిగ్గా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పని లేదు బస్తీ బాలరాజు గారు' అంటూ ట్వీట్ చేశారు. దీన్ని కార్తికేయ, లావణ్య త్రిపాఠిలకు ట్యాగ్ చేశారు. హెల్మెట్లు పెట్టుకొని, సరిగ్గా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పని లేదు బస్తీ బాలరాజు గారు @ActorKartikeya @Itslavanya @Koushik_psk #ChaavuKaburuChallaga pic.twitter.com/XPDTfV3bm0 — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) March 19, 2021 ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచించే సైబరాబాద్ పోలీసులు..లేటెస్ట్గా చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సినిమా పోస్టర్‌ను వాడి హెల్మెట్ ఆవశ్యకత గురించి చెప్పడం నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. కౌశిక్ పెగల్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమాలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో నటించగా, లావణ్య..నర్సుగా నటించింది. సీనియర్ నటి ఆమని కీలక పాత్ర పోషించగా, యాంకర్ అనసూయ స్పెషల్ సాంగ్‌లో అలరించింది. చదవండి : ‘చావు కబురు చల్లగా’ మూవీ రివ్యూ (చిల్లర ట్రిక్స్ ప్లే చేయొద్దు: బన్నీ వాసు ఫైర్) -
‘చావు కబురు చల్లగా’ మూవీ రివ్యూ
టైటిల్ : చావు కబురు చల్లగా జానర్ : రొమాంటిక్ కామెడీ డ్రామా నటీనటులు : కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం తదితరులు నిర్మాణ సంస్థ : జీఏ2 పిక్చర్స్ నిర్మాత : బన్నీవాసు దర్శకత్వం : కౌశిక్ పెగళ్లపాటి సంగీతం : జాక్స్ బిజోయ్ సినిమాటోగ్రఫీ : కర్మ్ చావ్లా ఎడిటర్ : జీ సత్య విడుదల తేది : మార్చి 19, 2021 'ఆర్ఎక్స్100’ సినిమాతో టాలీవుడ్లోకి దూసుకొచ్చిన యువకెరటం కార్తికేయ. ఆ ఒక్క సినిమాతో కార్తికేయ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తొలి నుంచి వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నాడు. నటుడిగా తనని తాను నిరూపించుకోవడానికి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అయితే ఈ యంగ్ హీరో ఇటీవల చేసిన ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఆర్ఎక్స్ 100 తర్వాత చేసిన హిప్పీ, గుణ 369, 90 ఎంఎల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ‘చావు కబురు చల్లగా..’ అనే వెరైటీ టైటిల్, కొత్త గెటప్‌తో శుక్రవారం (మార్చి 19)ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచేశాయి. ఇక మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో హైప్ క్రియేట్ అయింది. ఓ కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కార్తికేయను హిట్ ట్రాక్ ఎక్కించిందా? తొలి ప్రయత్నంలో కౌశిక్ పెగళ్లపాటి ఏ మేరకు ఆకట్టుకున్నాడు? రివ్యూలో చూద్దాం. కథ బస్తీ బాలరాజు (కార్తికేయ) శవాలను మోసుకెళ్లే వాహన డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. సిటీలో ఎవరైనా చనిపోతే తన వాహనంలో స్మశానానికి తీసుకెళ్లి, వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుంటాడు. అతని తల్లి గంగమ్మ(ఆమని) మార్కెట్లో మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది. ఇదిలా ఉంటే ఒక రోజు ఒక శవాన్ని శ్మనానవాటికకు తరలించాలని బాలరాజుకు ఫోన్ కాల్ వస్తుంది. అక్కడికి వెళ్లిన బాలరాజు భర్తను కొల్పోయిన యువతి మల్లిక(లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు. అంత్యక్రియల సమయంలోనే మల్లికను పెళ్లి చేసుకుంటానని వారి బంధువుల ముందే చెప్తాడు. కానీ దానికి మల్లికతో పాటు ఆమె అత్తమామలు కూడా నిరాకరిస్తారు. అయినప్పటకీ బాలరాజు మల్లిక వెంటపడుతూనే ఉంటాడు. కట్ చేస్తే.. టీవీలు రిపేరు చేసే మోహన్(శ్రీకాంత్ అయ్యంగార్)తో గంగమ్మ చనువుగా ఉండటం చూసి బాలరాజు బాధపడతాడు. ఈ వయసులో తన తల్లి మరో వ్యక్తితో వివాహయేతర సంబంధం కొనసాగించడం నచ్చక తల్లిపై కోపం పెంచుకుంటాడు. తన తల్లి కంటే భర్తను కోల్పోయిన మల్లిక చాలా గొప్పది అని భావిస్తాడు. అసలు గంగమ్మ మరో వ్యక్తితో ఎందుకు చనువుగా ఉంది? భర్తను కోల్పోయిన మల్లిక ప్రేమను బస్తీ బాలరాజు ఎలా దక్కించుకున్నాడు? అనేదే మిగతా కథ. నటీనటులు బస్తీ బాలరాజు అనే ఊరమాస్ క్యారెక్టర్లో కార్తికేయ ఒదిగిపోయాడు. చదువు సంద్యాలేక, బస్తీల్లో ఉండే యువకులు ఎలా ప్రవర్తిస్తారో బాలరాజు క్యారెక్టర్ గుర్తు చేస్తుంది. సినిమా భారాన్ని తన భుజాల మీద వేసుకొని మెప్పించాడు. ఎమోషనల్ సీన్లలో కూడా అద్భుతంగా నటించాడు. ఇక భర్తను కోల్పోయిన మల్లిక పాత్రలో లావణ్య త్రిపాఠి అద్భుతంగా నటించింది. పూర్తి డీ గ్లామరైజ్డ్ పాత్ర ఆమెది. ఓ కొత్త పాత్రలో లావణ్య త్రిపాఠిని చూడొచ్చు. ఇక కార్తికేయ తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర ఆమనిది. గంగమ్మ పాత్రలో ఆమె నటించడం కంటే జీవించేశారని చెప్పొచ్చు. గంగమ్మ క్యారెక్టరైజేషన్ సినిమాకు చాలా ఫ్లస్ పాయింట్. కోడలి మేలు కోరే మామ పాత్రలో మురళీశర్మ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం తదితరులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు. విశ్లేషణ చావు నుంచి తప్పించుకోలేమనేది జగమెరిగిన సత్యం. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు చావక తప్పదు. అలా అని చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి రోజు బాధపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భర్తను కోల్పోయిన మహిళలు అయితే ఇక తమ జీవితం ఇంతే అనుకుంటూ అదే బాధలో ఉంటారు. కానీ అదే జీవితం కాదు. పోయినవారిని ఎలాగో తీసుకురాలేము. ఉన్నవారిని సంతోషంగా చూసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలి. అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. ఇదే విషయాన్ని ‘చావు కబురు చల్లగా’సినిమాతో చెప్పాలనుకున్నాడు దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి. తొలి చిత్రంతోనే ఓ కొత్త కాన్సెప్ట్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. కానీ దర్శకుడు అనుకున్న కథను మాత్రం తెరపై చూపించడంలో విఫలమయ్యాడు. సినిమా కథలో బలమున్నా..స్క్రీన్‌ప్లేను శక్తివంతంగా రాసుకోలేకపోయాడు. స్ర్కీన్‌ప్లే రొటీన్‌గా సాగుతుంది. ఫస్టాఫ్ అంతా రోటీన్ కామెడీతో నడిపించి ప్రేక్షకుడికి సహనానికి పరీక్ష పెట్టాడు. బాలరాజు మల్లిక వెనుకపడే సన్నివేశాలు కూడా నత్తనడకగా, రొటీన్‌గా అనిపిస్తాయి. ఇక సెకండాఫ్ మాత్రం పర్వాలేదనిపిస్తుంది. హీరో తల్లి మరో వ్యక్తితో ఎందుకు చనువుగా ఉందో వివరించిన తీరు ప్రశంసనీయం. కొన్ని ఎమోషనల్ సీన్లు బాగా పండించారు. అలాగే భర్తను కోల్పోయిన యువతని హీరో ప్రేమించడం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే బలంగా రాసుకుని ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. జోక్స్, బిజోయ్ సంగీతం బాగుంది. సినిమాలోని పాటలు అలరించడంతో పాటు ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఎడిటర్ జీ సత్య తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్ చేస్తే బాగుండనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని నటన పాటలు సెకండాఫ్ మైనస్ పాయింట్స్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ స్లోనేరేషన్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
భర్త చనిపోయిన అమ్మాయిని హీరో ప్రేమిస్తే..
‘‘ఈ సినిమాలో భర్త చనిపోయిన ఓ యువతిని హీరో ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఈ కథను సెంటిమెంటల్‌గా దర్శకుడు ఎలా ముందుకు తీసుకువెళ్లాడు? అన్నది సినిమాలో తెలుస్తుంది. బస్తీ బాలరాజుగా కార్తికేయ బాగా చేశాడు. ఈ సినిమా సక్సెస్ ఫంక్షన్ చేసుకుంటామన్న నమ్మకం ఉంది. అలాగే అక్టోబరు నుంచి డేట్స్ ఉంచమని కార్తికేయకు ఫోన్ చేసి చెప్పాను.. థ్యాంక్స్ సార్ అన్నాడు’’ అని అన్నారు అల్లు అరవింద్. కార్తికేయ, లావణ్యా త్రిపాఠీ జంటగా కౌశిక్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘చావు కబురు చల్లగా...’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా జ్యూక్‌బాక్స్ విడుదల కార్యక్రమంలో కార్తికేయ మాట్లాడుతూ– ‘‘హిట్, ఫ్లాప్ గురించి ఆలోచించకుండా బస్తీ బాలరాజు క్యారెక్టర్ చేయాలనుకున్నాను. బన్నీ (అల్లు అర్జున్) కంటే అరవింద్‌గారే యూత్‌ఫుల్‌గా ఉన్నారనిపిస్తుంటుంది నాకు’’ అన్నారు కార్తికేయ. ‘‘ఓ కొత్త దర్శకుడికి ఇంతకన్నా మంచి లాంచ్ దొరకదని నేను అనుకుంటున్నాను’’ అన్నారు కౌశిక్. ‘‘మాస్ డైరెక్టర్ల మధ్య తిరిగే క్లాస్ కథ ఈ సినిమా. కార్తికేయ యాక్టింగ్ నేచురల్‌గా అనిపించింది. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందని కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా మాకు తెలి సింది. అరవింద్‌గారికి సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉన్నప్పటికీ ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఆలోచిస్తాం. డబ్బులు కన్నా సినిమాలు థియేటర్స్‌లో విడుదలైతేనే బాగుంటుందని నమ్ముతాం మేం. ఇండస్ట్రీ బాగుండాలి. అందరి సినిమాలు ఆడాలని కోరుకుంటాం. ఆహ్లాదకరమైన పోటీ మంచిదే. కానీ అనవసర రాజకీయాలు చేయొద్దు’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాసు. ఈ కార్యక్రమంలో ఆమని, లావణ్యా త్రిపాఠీ పాల్గొన్నారు. సక్సెస్ ఫంక్షన్ చేసుకుంటామనే నమ్మకం ఉంది – నిర్మాత అల్లు అరవింద్ -
‘చావు కబురు చల్లగా’ శివర్రాతి గిఫ్ట్ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ కుర్ర హీరో కార్తికేయ, హీరోయిన్ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా' మూవీ టీం శివరాత్రి గిఫ్ట్ ఇచ్చేసింది. ఈ సినిమాలోని నాలుగోపాటను గురువారం రిలీజ్ చేసింది. బుల్లితెర బ్యూటీ అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజా గా ఈ సినిమాకి సంభిందించి ‘ఫిక్స్ అయిపో’ ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తనదైన స్టయిల్లో ఆలపించిన ఈ గీతం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, మూడు పాటలు ఈ సినిమాపై భారీ హైప్‌నే క్రియేట్ చేశాయి. (ఏం సక్కగున్నావ్రో.. అందరి కళ్లు బన్నీ పైనే!) కౌశిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమని, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం, మహేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాలో కార్తికేయ స్వర్గపురి వాహనం డ్రైవర్‌గా, లావణ్య నర్సుగా కనిపిచనున్నారు. ఈ సినిమా మార్చి 19న విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. -
అది ఐటెం సాంగ్ కాదమ్మ.. అనసూయ కౌంటర్
అనసూయ భరద్వాజ్.. పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెర, వెండి తెర మీద యాంకర్‌గా, నటిగా తన సత్తా చాటుతున్నారు అనసూయ. ఓ పక్క ‘క్షణం’, ‘రంగస్థలం’ వంటి చిత్రాల్లో నటనకు ప్రాధన్యమున్న పాత్రలు చేస్తూనే.. మరో వైపు ప్రత్యేక గీతాల్లో కనిపిస్తున్నారు. ఇక బుల్లి తెర మీద యాంకర్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా చావు కబురు చల్లగా చిత్రంలో అనసూయ ప్రత్యేక గీతంలో కనిపించారు. పైన పటారం.. లోన లోటారం అంటూ సాగే ఈ పాటలో అనసూయ, కార్తికేయతో కలిసి చిందేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ట్విట్టర్ యూజర్ అనసూయను ఉద్దేశించి ‘‘ఐటెం సాంగ్స్ చేయను అన్నారు కదా.. మరి ఇదేంటి అండి.. అయినా ఆ లిరిక్స్ ఏంది’’ అంటూ అనసూయను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. సదరు యూజర్‌కి అనసూయ స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. ‘‘నా కెరీర్ నా నమ్మకాల మీద, చాయిసెస్ మీద నిర్మితమై ఉంటుంది తప్ప.. ఎవరో రాసిన దాని మీద కాదు’’ అంటూ రిపై ఇచ్చారు. ఈ మేరకు అనసూయ ‘‘అది ఐటెం సాంగ్ కాదు.. అసలు ఐటెం సాంగ్ అంటూ ఏది లేదమ్మ. ఒక పాటకున్న క్యాస్ట్ కాకుండా.. స్పెషల్‌గా ఎవరన్న కావాలి అనుకున్నప్పుడు స్పెషల్ సాంగ్ వస్తుంది. ఒకప్పుడు అమ్మాయిని వస్తువుగా భావించే వాళ్లు ఇచ్చిన పేరు అది. అంతేకాదు ఆ లిరిక్స్ వల్లనే నేను ఈ స్పెషల్ సాంగ్ ఒప్పుకున్నాను’’ అన్నారు. అంతేకాదు ‘‘నేను స్పెషల్ సాంగ్ చేయ్యను అని ఎక్కడా అనలేదు. దయచేసి ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా నన్నే అడగండి. నా గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా .. నన్ను అడగండి. ఇప్పుడు చేసినంత వెటకారంగా కాకపోయినా.. నిజాయతీగా ఏమన్నా తెలుసుకోవాలంటే నేను తప్పకుండా సమాధానం చెప్తాను. అంతేకాని ‘‘సమాచారం ప్రకారం’’ అంటూ రాసే వార్తలను నమ్మకండి. నా కెరీర్ నా నమ్మకాలు, చాయిస్‌ల మీద కొనసాగుతుంది తప్ప ఎవరో రాసినదాని మీద కాదు’’ అంటూ ట్వీట్ చేశారు అనసూయ. దీనిపై నెటిజనుల చాలా బాగా చెప్పారు అంటూ కామెంట్ చేస్తున్నారు. కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావుకబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. Hello!!😊Adi “item” song kadu..asalu “item” song anedi edi ledamma..oka paata ki unna cast kakunda special ga evaranna kavali anukunnappudu “special” song ostundi Okappudu ammai ni vastuvu la treat chesevallu ichina peru adi And aa Lyrics valle nenu ee special song oppukunnanu 😊 https://t.co/JP2Ak0ZeVB — Anasuya Bharadwaj (@anusuyakhasba) March 2, 2021 చదవండి: అనసూయ మాస్ సాంగ్.. దుమ్ములేపేసింది! ఓ మై గాడ్! ఇది మీకెక్కడ దొరికింది?: అనసూయ -
'ఆయన ఫ్యాన్స్ కోసం ఏమైనా చేస్తాడు'
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ తాజాగా నటిస్తున్న చిత్రం 'చావు కబురు చల్లగా'. మర్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. వరస విజయాలతో దూసుకుపోతున్న ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. బుల్లితెర యాంకర్ అనసూయ భరధ్వాజ్ స్పెషల్ సాంగ్‌లో అలరించనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ‘చావు కబురు చల్లగా’ ప్రమోషన్లలో టాలీవుడ్ స్టార్ హీరో భాగం కానున్నాడు. మార్చి 9న జరగబోయే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా సినిమా నిర్మాత బన్నివాస్ అల్లు అర్జున్‌కు ఇష్టమైన మిత్రుడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఉన్న స్నేహం కారణంగానే బన్నీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు రానున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎవరు అతిథిగా వస్తున్నారనే దానిపై హీరో, హీరోయిన్ ఇతర నటులతో కలిసి ఓ వీడియోను రూపొందించారు. ఇందులో ఆయన వస్తున్నాడా.. నిజంగా ఒప్పుకున్నాడా.. అయినా ఫ్యాన్స్ కోసం ఏమైనా చేస్తాడులే.. ఇప్పుడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించినట్లు అనిపిస్తుందని వీరంతా ఎగ్జాయిట్గా ఫీల్ అవుతున్నారు. దీంతో అల్లు అర్జున్ రావడం ఖాయం అయిపోయింది. ఈ క్రమంలో ‘ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విచ్చేస్తున్న అల్లు అర్జున్‌కు మా బాలరాజు గాడి నుంచి చాలా చాలా థ్యాంక్యూ’ అంటూ హీరో కార్తీకేయ మంగళవారం ట్వీట్ చేశాడు. ఇక చాల రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న కార్తీకేయకు ఈ సినిమా కీలకంగా మారనుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ చేతుల మీదుగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగబోతుంది. ఇంకేముందీ.. బన్నీ అడుగుపెట్టాక సినిమాపై హైప్ పెరగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. మరి అల్లు అర్జున్ రాక కార్తికేయకు ఏమేరకు కలిసి వస్తుందో చూడాలి. Na movie pre-release event ki he is coming..."AA" oohe chala baundi..❤️❤️#ChaavuKaburuChallaga https://t.co/EXE1bEpt1l — Kartikeya (@ActorKartikeya) March 1, 2021 చదవండి: ‘జయమ్మ’కు బంపర్ ఆఫర్: స్టార్ హీరో మూవీలో! అనసూయ మాస్ సాంగ్.. ఇరగదీసింది! -
అనసూయ మాస్ సాంగ్.. దుమ్ములేపేసింది!
సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే(ఆర్ఎక్స్ 100) యూత్‌ను అట్రాక్ట్ చేశాడు యంగ్ హీరో కార్తికేయ. ఆ తర్వాత గుణ 369, 90 ఎంఎల్, హిప్పీ లాంటి డిఫరెంట్ సినిమాలు చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అనంతరం నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’లో విలన్‌గా నటించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ‘చావుకబురు చల్లగా’ అనే సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో కార్తికేయకు జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుండగా.. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ ఓ స్పెషల్ సాంగ్‌లో అలరించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను చిత్రయూనిట్ విడుదల చేసింది. పైనపటారం..ఈడ లోన లొటారం..విను బాసు చెబతాను లోకం వయ్యారం’ అంటూ సాగే ఈ సాంగ్‌లో అనసూయ ఫుల్ అవుడ్ అండ్ అవుట్ మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. ఇక ఈ సినిమాను మార్చి19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక సినిమాలో లావణ్య త్రిపాఠి నర్సుగా నటిస్తుండగా, బస్తీ బాలరాజు పాత్రలో మార్చురీ వ్యాన్ నడిపే డ్రైవర్‌గా కార్తికేయ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన హీరో, హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లకు విశేష స్పందన లభించింది. చదవండి: ఓ మై గాడ్! ఇది మీకెక్కడ దొరికింది?: అనసూయ క్రేజీ ఆఫర్: స్టార్ హీరోతో అనసూయ! -
అవసరమైతే వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు..!
అనసూయ భరద్వాజ్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ బుల్లితెరను మెప్పిస్తున్న అనసూయ వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరుస్తోంది. అక్కడ విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ముఖ్యంగా సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ మూవీలో రంగమ్మత్తగా అందరిని మెప్పించింది. ఈ సినిమాతో ఆమె క్రేజీ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. రంగమ్మత్త వంటి పాత్రలు పోషిస్తూనే అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్‌తో అందాలు ఆరబోస్తోంది అనసూయ. ఇప్పటికే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విన్నర్లో సూయ సూయ అంటూ తన పేరుతో సాగే ఐటెం సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. అలాగే ‘సోగ్గాడు చిన్నినాయన’ మూవీలో కూడా టైటిల్ సాంగ్‌లో టాలీవుడ్ ‘మన్మథుడు’ నాగార్జు అక్కినేనితో చిందులేసింది. తాజాగా ‘చావురు కబురు చల్లగా’ మూవీలో కూడా ఓ స్పెషల్ సాంగ్ చేసేందుకు సిద్ధమైంది ఈ రంగమ్మత్త. మాస్ నేపథ్యంలో సాగే ఈ పాటలో అనసూయ హీరో కార్తికేయతో కలిసి డ్యాన్స్ చేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా తానే సోమవారం ప్రకటించింది. దీనికి ‘అవసమరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు’ అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేస్తూ కమ్మింగ్ సూన్ అంటూ ఈ పాటలో తన లుక్‌ను షేర్ చేసింది. అలాగే ‘మీ ప్రజేన్స్‌తో మా సినిమాను మరింత ప్రత్యేకం చేసినందుకు ధన్యవాదాలు అనసూయ గారు.. ఈ స్పెషల్ సాంగ్ చూడాలంటే కొద్ది రోజులు వేచి చూడండి’ అంటూ హీరో కార్తికేయ కూడా ట్వీట్ చేశాడు. కాగా కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది. నిర్మాత అల్లు అరవింద్ గీతాఆర్ట్స్-2 బ్యానర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ‘చావు కబురు చల్లగా’ టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. “అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు.” #comingSoon https://t.co/k1x6ZVd3bY — Anasuya Bharadwaj (@anusuyakhasba) February 15, 2021 (చదవండి: అరుదైన గౌరవం..మురిసిపోతున్న అనసూయ) (నోరుపారేసుకున్న నెటిజన్.. అనసూయ గట్టి కౌంటర్) (మరోసారి వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి) -
‘చావుకబురు చల్లగా’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావుకబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో ‘బస్తీ బాలరాజు’గా కార్తికేయ, ‘మల్లిక’ పాత్రలో లావణ్యా త్రిపాఠి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, డైలాగ్ టీజర్ విడుదలకాగా, తాజాగా మొదటి పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్ర బృందం. ' మైనేమ్ ఈజ్ రాజు... చస్తే ఏటైపోతుంది’అంటూ సాగే ఈ పాట మూవీలో హీరో క్యారెక్టర్ ఏంటో తెలియజేసేలా ఉంది. ప్రముఖ సింగర్ రేవంత్ ఆలపించిన ఈ పాటకు కరుణాకర్ అడిగర్ల సాహిత్యం అందించారు. సినిమాలో బస్తీబాలరాజు అనే క్యారెక్టర్ లో కార్తికేయ లుక్స్ కి, నేపథ్యానికీ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పుడు మై నేమ్ రాజు పాట కూడా సినీ అభిమానుల్ని కచ్ఛితంగా ఆకట్టుకుంటుందని చిత్రం బృందం భావిస్తోంది. -
ఆ రోజే ‘చావుకబురు చల్లగా’..
కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావుకబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో ‘బస్తీ బాలరాజు’గా కార్తికేయ, ‘మల్లిక’ పాత్రలో లావణ్యా త్రిపాఠి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కావడంతో తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర బృందం. మార్చి 19వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో లావణ్య, కార్తికేయ బెక్‌పై కూర్చొని ఉన్నారు. బైక్ వెనకాల కూర్చున్న లావణ్యను టచ్ కాకుండా.. కార్తికేయ బైక్ ట్యాంక్ పై కూర్చొని నవ్వుతూ డ్రైవ్ చేస్తున్నాడు. మరి కార్తికేయ అలా ఎందుకు బైక్ నడపాల్సివచ్చిందో తెలియాలంటే మార్చి 19 వరకు ఆగాల్సింది. ఇక ఈ పోస్టర్ని హీరో కార్తికేయ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ 'ఈ మార్చి 19కి చావు కబురు చల్లగా చెప్పడానికి బాలరాజు గాడు, మల్లిక థియేటర్లలోకి వస్తున్నారు. బిగ్ బ్యానర్ గీత ఆర్ట్స్‌లో ఈ సినిమా చేయడం, బ్యూటిఫుల్ రాక్షసి లావణ్య త్రిపాఠితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది' అని ట్వీట్ చేశాడు. ‘చావు కబురు చల్లగా’ విడుదల అవుతున్న నెలలోనే శర్వానంద్ ‘శ్రీకారం’( మార్చి 11), ‘జాతి రత్నాలు’(మార్చి 11), ‘గాలి సంపత్’(మార్చి 11), ‘రంగ్ దే(మార్చి 26)’, అరణ్య(మార్చి26) సినిమాలు విడుదలవుతుండటంతో భారీ పోటీ నెలకొందనే చెప్పాలి. -
ఆకట్టుకుంటున్న ‘చావు కబురు చల్లగా’ టీజర్
‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ, ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠిలు జంటగా దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి రూపొందిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ చిత్రంలో కౌశిక్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్, టైటిల్‌కు ప్రేక్షకుల నుంచి అనుకొని రీతిలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజా టీజర్ విడుదల చేసింది. ‘మీ ఆస్పత్రి సిస్టర్’ అంటగా అని సాగే డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ లావణ్య త్రిపాఠి వెంట పడుతూ తనని ఏడుపిస్తున్న కొన్ని సీన్లతో ఉన్న ఈ టీజర్‌తో దర్శకుడు యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కాగా అల్లు ఆరవింద్ గీతా ఆర్ట్స్-2 బ్యానర్లో బన్ని వాసు నిర్మిస్తున్న ‘చావు కబురు చల్లగా’ మూవీ వేసవిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. -
హీరో కార్తికేయ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
‘చావుకబురు చల్లగా’ మొదలైంది
-
'చావుకబురు చల్లగా’ చెప్పిన కార్తికేయ
‘ఆర్ఎక్స్100’ సినిమాతో టాలీవుడ్లోకి దూసుకొచ్చిన యువకెరటం కార్తికేయ. తొలి నుంచి వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. నటుడిగా తనని తాను నిరూపించుకోవడానికి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అయితే ఈ యంగ్ హీరో ఇటీవలే చేసే ప్రయోగాలు ప్రేక్షకులను మెపించలేకపోతున్నాయి. ఆర్ ఎక్స్ 100 తర్వాత చేసిన హిప్పీ, గుణ 369, 90 ఎంఎల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో వెరైటీ టైటిల్, కొత్త గెటప్‌లో తెరముందుకు రాబోతున్నాడు కార్తికేయ. ఆ వెరైటీ టైటిలే 'చావుకబురు చల్లగా'. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ గురువారం మొదలైంది. కౌశిక్ అనే యువదర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో 'బస్తీ బాలరాజు' పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. ఆయన లుక్ కి సంబంధించిన పోస్టర్ ను కూడా గురువారం విడుదల చేశారు. శవాలను స్మశానానికి తీసుకెళ్లే వాహనంపై నుంచుని దమ్ముకొడుతూ ఆయన కనిపిస్తున్నాడు. గళ్ల షర్టు పైకి మడిచి .. లుంగీ పైకి కట్టి పూర్తి మాస్ లుక్ తో ఆయన వున్నాడు. ఈ సినిమాకి జాక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. -
ఈ సినిమాతో క్లారిటీ వచ్చింది – కార్తికేయ
‘‘90 ఎంఎల్’ కథ ఎంపిక చేసుకున్నప్పుడు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అనుకున్నా. ప్రేక్షకులు నన్ను వైవిధ్యంగా చూడటానికి ఇష్టపడుతున్నా రని ఈ సినిమాతో క్లారిటీ వచ్చేసింది’’ అని కార్తికేయ అన్నారు. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో కార్తికేయ, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘90 ఎంఎల్’. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్లో కార్తికేయ మాట్లాడుతూ– ‘‘శుక్రవారం విడుదలైన మా సినిమా సక్సెస్ అయ్యిందని సోమవారంతో పూర్తిగా అర్థమైంది. ప్రతి సినిమాతో ప్రేక్షకుల్ని అలరించడానికి వంద శాతం కష్టపడతా’’ అన్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బి,సి సెంటర్ల నుంచి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు శేఖర్ రెడ్డి. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, కథానాయిక నేహా సోలంకి పాల్గొన్నారు -
90 ఎంఎల్ : మూవీ రివ్యూ
టైటిల్: 90ఎంల్ నటీనటులు: కార్తికేయ, నేహా సోలంకి, రవికిషన్, రోల్‌రైడా, కాలకేయ ప్రభాకర్, రావూ రమేష్,అలీ, పోసాని కృష్ణమురళి, సత్యరాజ్ సంగీతం: అనూప్ రూబెన్స్ దర్శకుడు: ఎర్ర శేఖర్‌రెడ్డి నిర్మాణ సంస్థ: కార్తికేయ క్రియేటివ్ వర్క్ ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్లోకి దూసుకెచ్చిన యువకెరటం కార్తికేయ. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ కావడంతో కార్తికేయకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత హిప్పీ, గుణ 369 వంటి సినిమాలు చేసిన ఈ యంగ్ హీరో సరైన సక్సెస్‌ను అందుకోలేదు. ఈ క్రమంలో ‘90ఎంఎల్’ అంటూ డిఫరెంట్ టైటిల్‌తో తెరమీదకు వచ్చాడు కార్తీకేయ. రోజుకు మూడుపూటల మందు వేస్తే తప్ప మనుగడ సాగించని ఓ యువకుడి కథ అంటూ ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకులపైకి వదిలారు. ఇంతకు ఈ మందుబాబు కథేంటో తెలుసుకుందాం పదండి.. కథ: పార్వతీనగర్‌కు చెందిన దేవదాస్ (కార్తికేయ).. ఓ అరుదైన వ్యాధి వల్ల రోజూ మూడుపూటలు 90 ఎంఎల్ లిక్కర్ తాగాల్సిన విచిత్రమైన స్థితి అతనిది. ఈ వ్యాధి వల్ల కన్న తల్లిదండ్రులే మద్యం తాగమని అతన్ని బతిలాడుతుంటారు. అలాంటి దేవ్‌దాస్ సాహసాన్ని సోషల్ మీడియా ద్వారా చూసిన సువాసన (నేహా సోలంకి) అతన్ని ఇష్టపడుతుంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. సువాహన కుటుంబానికి మద్యం అంటేనే పరమ అసహ్యం. ఆమె తండ్రి ట్రాఫిక్ పోలీసు. మరోవైపు జాన్విక్ (రవికిషన్) కూడా మద్యం వ్యసనపరుడే. మద్యం తాగి ఓసారి జాన్విక్ ఇంటికి వెళ్లిన దేవ్‌దాస్ కొన్ని కారణాల వల్ల అతన్ని చితకబాదుతాడు. ఈ క్రమంలో సువాహనకు దేవ్‌దాస్ మద్యం తాగే విషయం తెలిసి అతనితో బ్రేకప్ చేసుకుంటుంది. అతను ఎందుకు మద్యం తాగుతున్నాడో సువాహనకు తెలుసుకోదు. ఇంకోవైపు మద్యంలో మత్తులో ఉన్నప్పుడు తనను ఎవరు కొట్టారు? ఎందుకు కొట్టారు? తెలుసుకునేందుకు జాన్విక్ ప్రయత్నిస్తుంటాడు. అసలు జాన్విక్-దేవ్దాస్కు మధ్య ఏం జరిగింది? ఒక్క పూట 90 ఎంఎల్ తాగకుంటే చచ్చిపోయే స్థితిలోని దేవదాస్ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు. ఈ క్రమంలో జాన్విక్, అతని గ్యాంగ్ నుంచి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడన్నది మిగతా కథ. విశ్లేషణ: కొత్త దర్శకుడు యెర్ర శేఖర్‌రెడ్డి ఒకింత భిన్నమైన కథతో కమర్షియల్ హంగులతో మాస్, యూత్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ మాస్‌మసాలా కథను సిద్ధంచేసినట్టు కనిపిస్తోంది. సినిమాటిక్‌గా, కామెడీపరంగా సినిమా బావుంది. కామెడీ సీన్లు నవ్వించేలా ఉన్నాయి. హీరోహీరోయిన్లు కార్తికేయ, సోలంకీ చాలా ఎనర్జీటిక్గా యాక్ట్ చేశారు. సినిమాటోగ్రఫి, నేపథ్య సంగీతం, పాటలు బావున్నాయి. రవికిషన్, కాలకేయ ప్రభాకర్, రావూ రమేశ్, సత్యరాజ్, పోసాని కృష్ణమురళి, రోల్‌రైడా తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. నిర్మాణ విలువులు చిత్రస్థాయికి తగ్గట్టు ఉన్నాయి. కానీ, బలమైన కథ, కథనాలు సినిమాలో లేకపోవడం, ఎక్కువగా సినిమాటిక్‌గా, సెకండాఫ్ కొంత బోర్ కొట్టించడం మైనస్ పాయింట్‌గా అనిపిస్తుంది. ఈ సినిమా మూలకథనే మద్యం మీద ఆధారపడి ఉంది. ఒకప్పుడు దేవదాసు సినిమాలో ప్రేమలో విఫలమై గుండెల్ని పిండేసే బాధను దిగమింగలేక మద్యానికి బానిసై.. జగమే మాయా, బతుకే మాయ అని పాడుకుంటే ప్రేక్షకులు కూడా ఆ పాత్రలో లీనమై దుఃఖించారు. కథపరంగా చూసుకుంటే ఈ సినిమాలోని హీరోది పెద్ద సమస్యే. ఒక్క పూట మద్యం తాగకపోయినా చచ్చిపోయే పరిస్థితి ఉండటం హీరో పట్ల సానుభూతి కల్పించేదే. కానీ, సినిమాలో కమర్షియల్ పంథాలో మాస్ అంశాలను దృష్టిలో పెట్టుకొని మద్యం సేవించడాన్ని కొంత గ్లోరిఫై చేసినట్టు కనిపిస్తుంది. సమాజం మీద ఎంతో విషప్రభావం చూపుతున్న మద్యం నేపథ్యంగా సినిమాను తీసినప్పుడు దర్శకుడు కమర్షియల్, మాస్ అంశాలే కాకుండా ఇంకాస్త సెన్సిబుల్‌గా ఆలోచించి.. సమాజానికి ఏదైనా చెబితే బాగుండేనేమోనని ప్రేక్షకులకు అనిపించవచ్చు. ఎందుకంటే సినిమా వినోద సాధనమే కాదు బలమైన మాద్యమం కూడా. సినిమా తెర నిండా ‘పొగ త్రాగుట, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం’ అన్న ట్యాగ్ తప్ప.. మద్యం వల్ల జరిగే ఏ చెడు గురించి సినిమా పెద్దగా ఫోకస్ చేసినట్టు కనిపించదు. సినిమాలో ‘రేప్’ మీద జోక్ వినిపించడం ఇన్సెన్సిటివ్గా అనిపిస్తుంది. బలాలు హీరోహీరోయిన్ల నటన కామెడీ చిత్ర నిర్మాణ విలువలు బలహీనతలు బలమైన కథ, కథనాలు లేకపోవడం మరీ సినిమాటిక్‌గా ఉండటం - శ్రీకాంత్ కాంటేకర్ -
‘90 ఎంఎల్’ ప్రీ రిలీజ్ వేడుక
-
సర్వోత్తమం సుబ్రహ్మణ్య షష్టి
లోకసంరక్షణార్ధం తారకుడనే రాక్షసుని సంహరించడానికి దేవతల కోరిక మేరకు లోకనాయకుడు పరమశివుడి అంశతో మార్గశిర శుద్ధ షష్టి నాడు జన్మించాడు సుబ్రహ్మణ్య స్వామి. దీనికే ‘సుబ్రహ్మణ్య షష్టి‘ లేదా ‘స్కంద షష్టి‘ అని పేరు. సుబ్రహ్మణ్యస్వామి పేర్లు ►కుమారస్వామి నామాలు, వాటి వివరణ ►షణ్ముఖుడు –– ఆరు ముఖాలు కలవాడు. ►స్కందుడు పార్వతీదేవి పిలిచిన పేరు. ►కార్తికేయుడు కృత్తికానక్షత్రాన జన్మించినందుకు ►వేలాయుధుడు శూలాన్ని ఆయుధంగా కలిగిన వాడు. ►శరవణుడు –శరవణం (రెల్లు వనం) లో జన్మించాడు కాబట్టి. ►సేనాపతి – దేవతలకు సేనాధిపతి. ►స్వామినాథుడు ––శివునకు ప్రణవ మంత్ర అర్ధాన్ని చెప్పినాడు కనుక. ►సుబ్రహ్మణ్యుడు –బ్రహ్మజ్ఞానం కలిగినవాడు. ►మురుగన్ ఈ తమిళ నామానికి ‘అందమైన వాడు‘ అని అర్థం. తారకాసుర సంహారం కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిని చేసారు. కుమారస్వామి తారకాసురుని సంహరించేందుకు ఆరు రోజుల పాటు భీకర యుద్ధం చేసి వధించి లోకాన్ని, దేవతలను కాపాడి అందరి మన్ననలు పొంది దేవసేనాపతిగా కీర్తింపబడ్డారు. సుబ్రహ్మణ్య కావడి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారే లేచి శిరస్నానమారించి పాలు, పంచదారలతో నిండిన కావడులను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాలను దర్శించి భక్తిశ్రద్ధలతో అష్టోత్తర శతనామ పూజలు చేస్తారు. భక్తులు కావడులతో తెచ్చిన పంచదార, పాలను స్వామికి సమర్పించుకుంటారు. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కులను బట్టి ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆచారం తమిళనాడు రాష్ట్రంలో విశేషంగా ఆచరణలో ఉంది. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య కల్యాణం స్కంద షష్టి నాడు సుబ్రహ్మణ్య దేవాలయాలలో ‘శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి‘ కళ్యాణం నిర్వహిస్తుండడం పరిపాటి. ఈ వివాహాన్ని వీక్షిస్తే అవివాహిత యువతీ యువకులకు ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయని, సత్సంతానం కలుగుతుందని పెద్దల మాట. నేడు పాటించాల్సిన నియమాలు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నదీస్నానం ఆచరించాలి (సమీపాన నది ఉంటే) లేదా శిరఃస్నానం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలు లేదా పాలు నైవేద్యంగా సమర్పించాలి. సుబ్రహ్మణ్య స్వామి విజయ గాథలు చదవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కీర్తనలు ఆలాపించాలి. దగ్గరలోని స్వామి ఆలయాలను సందర్శించి పూజలు చేయాలి. వీలైనంత దానధర్మాలు చేయాలి. రోజంతా ఉపవాస దీక్ష ఆచరించాలి. పూజ ఫలితం విశేషించి ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, కావడి సమర్పించినా సత్సంతానప్రాప్తి, వారి కుటుంబంలోనూ, రాబోయో తరాలవారికి కూడా వంశవృద్ధి జరుగుతుందని విశ్వాసం. అందుకే సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలను ఎక్కువగా సందర్శిస్తుంటారు. స్కంద షష్ఠినాడు సుబ్రహ్మణ్య కళ్యాణం జరిపించే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి దేశం నలుమూలలా దేవాలయాలున్నాయి. వాటిలో తిరుచానూరు పద్మావతీ దేవి ఆలయ పుష్కరిణికి సమీపంలోని ఆలయం, మోపిదేవిలో, మంగళగిరి వద్ద గల నవులూరులోనూ, వరంగల్ జిల్లా పరకాలలోని ఆలయం, హైదరాబాద్ పద్మారావు నగర్‌లోని ఆలయాలు సుప్రసిద్ధమైనవి. ఇక తమిళనాట గల ఆలయాల సంగతి సరేసరి. ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని; పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం. భక్తులకు స్వామి అనుగ్రహం లభించాలని కోరుకుందాం. – కృష్ణకార్తీక జాతకంలో సర్పదోషం, నాగదోషం, కాలసర్పదోషం ఉన్న వారు దోష పరిహారం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. రాహుకేతు దోషాన్నే కాలసర్పదోషంగా పరిగణించి ఈ రెండు గ్రహాలకు పూజలు చేయడం పరిపాటి. జాతకంలో గ్రహాలన్నీ లగ్నంతో సహా రాహు కేతుగ్రహాల మధ్య ఉంటే కాలసర్పదోషంగా చెబుతారు. మరలా ఇందులో అధోముఖ కాలసర్ప, ఊర్థ్వముఖ కాలసర్పదోషమని రకాలుంటాయి. సర్పానికి రాహువును నోరుగా, కేతువును తోకగా భావిస్తారు. అందువల్ల ఈ రెండింటి మధ్య జాతక చక్రంలో గ్రహాలు ఎంత శుభస్థితిలో ఉన్నా, ఉచ్చంలో ఉన్నా ఆ శుభ ఫలాలు జీవితంలో కనిపించవని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ఈ దోష నివారణకు రాహు కేతు గ్రహాలకు ప్రత్యేక పూజలు చేసుకోవాలి. ఈ పూజలకు కాళహస్తి, మోపిదేవి, చిన కాకాని, కర్ణాటకలో కుక్కి ప్రశస్తం. సుబ్రహ్మణ్య షష్ఠినాడు ఈ దోష నివారణ పూజలు మరింత సత్ఫలితాలు ఇస్తాయి. స్వామిని సర్పరూపంలో పూజించి నాగులను చంపిన పాపాలు, వాటి పట్ల చేసిన దోషాలు పోవాలని ప్రార్థించాలి. సుబ్బారాయుని గుడిలోనే కాక గ్రామాలలో ఉన్న పాముల పుట్టల దగ్గర కూడా పూజలు చేయడం కొన్ని ప్రాంతాలలో ఆచారం ఉంది. – గుమ్మా రామలింగస్వామి, జ్యోతిష శాస్త్ర నిపుణులు -
‘నా మందు తాగి నన్నే కొడతాడా.. వదలను’
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘90 ఎంఎల్’. నేహా సోలంకి కథానాయిక. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వం వహించారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, సాంగ్స్ సినీ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘నాతో నువ్వుంటే చాలు’ అనే సాంగ్ యూత్‌కు ముఖ్యంగా లవర్స్‌కు తెగ కనెక్ట్ అయింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది. తాజాగా మూవీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘నీతో కలిసి చచ్చేంత ప్రేమ నాలో ఉంది.. నాతో కలిసి బతకాలన్న ఆలోచనే నీలో లేదు.. ఐ హేట్ యూ’అంటూ ట్రైలర్లో హీరోయిన్ పలికే మాటలు ప్రేమికుల మనసులను కదిలించేలా ఉంది. ‘కొందరకి మందు తాగడం సరదా.. మరికొందరికి అది వ్యసనం.. కానీ మీ బాబుకు అది అవసరం, ఏ జన్మలో ఏ యాగం చేశారో ఈ రాజావారు ఈ జన్మలో ఈ యోగంతో పుట్టారు’ఈ డైలాగ్‌లతో ఈ సినిమాకు 90 ఎంఎల్ అని టైటిల్ ఎందుకు పెట్టారో అర్థమవుతోంది. అదేవిధంగా స్టోరీ కూడా తెలిసిపోతోంది. ఇక తనకున్న వీక్నెస్తో ప్రేమలో పడిన కష్టాలు, అమ్మాయి కుటుంబసభ్యులతో ఎదురైన సంఘటనలు చూస్తుంటే సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఇక హీరోయిన్ హీరోను వదిలి వెళ్లిపోతుంటే ‘కన్నులు వదిలి కల వెళుతుందే.. గుండెను వదిలి లయ వెళుతుందే.. గుడినే వదిలి దేవత వెళుతుందే’ వచ్చే సాంగ్ సూపర్బ్. చివర్లో ‘నా మందు తాగి నన్నే కొడతాడా.. వదలను’అని విలన్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు నెటిజన్లు ఫిదా అవడంతో తెగ వైరల్ అవుతోంది. ఇక ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ సృష్టించిన కార్తికేయ తరువాత ఆ స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాడు. ఇటీవల గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రతినాయక పాత్రలో సక్సెస్ అయిన ఈ యంగ్ హీరో ‘90 ఎంఎల్’పై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. రవి కిషన్, రావూ రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నాడు. -
సింగిలే అంటున్న కార్తికేయ..
హైదరాబాద్ : ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ హీరోగా సరస్వతి శుక్లా సమర్పణలో కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై తెరకెక్కుతున్న 90 ఎంఎల్ మూవీ నుంచి మూడో పాట శనివారం విడుదలైంది. సింగిలుసింగిలు అంటూ సాగే ఈ పాట యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాణ సారథ్యంలో యర్రా శేఖర్‌రెడ్డి నిర్ధేకత్వంలో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపొందుతోంది. ఆర్ఎక్స్ 100 తరహాలో బోల్డ్ మూవీగా యూత్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను మేకర్లు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. కార్తికేయ సరసన నేహ సోలంకి నటిస్తున్న 90 ఎంఎల్ పూర్తి కమర్షియల్ హంగులను అద్దుకుని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ఒక్క అడుగు నాతో వేస్తే చాలు’
‘ఒకసారి చూస్తే చాలు.. ఒకసారి నవ్వితే చాలు.. ఒక అడుగు నాతో వేస్తే చాలు.. ఒక రిప్లై ఇస్తే చాలు.. ఒక స్మైలీ పెడితే చాలు.. ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. నాతో నువ్వుంటే చాలు.. కోరుకోను ఇంకేం వరాలు’అంటూ సాగే ఈ పాట లవర్స్‌కు బాగా కనెక్ట్ అవుతోంది. అంతేకాకుండా వాట్సప్ స్టేటస్, కాలర్ ట్యూన్, రింగ్ ట్యూన్స్‌లలో ఈ పాట మార్మోగటం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగులో లవ్ సాంగ్స్ స్పెషలిస్ట్‌గా పేరు గాంచిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ పాటకు ట్యూన్ కట్టగా.. చంద్రబోస్ లిరిక్స్‌ను అందించాడు. ఈ పాటకు వీరిద్దరు ఒకెత్తయితే అద్నాన్ సమీ వాయిస్ ఈ పాటకు మరింత హైలెట్‌గా నిలిచింది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ నటిస్తోన్న ‘90 ఎం.ఎల్’ సినిమాలోని మరో లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట యూత్‌ను ముఖ్యంగా లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. చంద్రబోస్ అందించిన హార్ట్ టచింగ్ లిరిక్స్‌తో పాటు అద్నాన్ సమీ వాయిస్ ఎక్స్ట్రార్డినరీగా నిలిచింది. ఇక జానీ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ కూడా కొత్తగా ఉంది. ఓవరాల్‌గా అన్ని హంగులు జోడించి విడుదల చేసిన ఈ లిరికల్ సాంగ్ వీడియో నెట్టింట్లో రచ్చ చేస్తోంది. ఇక ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా సోలంకి కథానాయికగా కనిపించనుంది. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ ఈ సినిమా నిర్మిస్తున్నారు. వాణిజ్య అంశాలతో వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే సినిమా విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా ఈ చిత్రంలో రవికిషన్, రావు రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్, ప్రగతి, ప్రవీణ్ తదితరులు నటించారు. -
నాతో నువ్వుంటే చాలు
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ నటిస్తోన్న తాజా చిత్రం ‘90 ఎం.ఎల్’. నేహా సోలంకి కథానాయిక. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ– ‘‘టైటిల్‌కి తగ్గట్టుగానే మా సినిమా వైవిధ్యంగా ఉంటుంది. వాణిజ్య అంశాలతో వినోదాత్మకంగా ఉంటుంది. అజర్ బైజాన్‌లో ఇటీవల చిత్రీకరించిన మూడు పాటలతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. శేఖర్‌రెడ్డి ఎర్ర మాట్లాడుతూ– ‘‘అజర్ బైజాన్ రాజధాని బాకులోని అందమైన ప్రదేశాల్లో 8 రోజులు జరిపిన షూటింగ్లో ‘వెళ్లిపోతుందే వెళ్లిపోతుందే..’, ‘సింగిల్ సింగిల్..’, ‘నాతో నువ్వుంటే చాలు...’ అనే పాటలను హీరో, హీరోయిన్‌తో పాటు 10 మంది డ్యాన్సర్లపై చిత్రీకరించాం. జానీ మాస్టర్ ఎక్స్ట్రార్డినరీగా స్టెప్స్ కంపోజ్ చేశారు. ఈ మూడు పాటలు చిత్రానికి మంచి హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. రవికిషన్, రావు రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్, ప్రగతి, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: జె.యువరాజ్. -
‘90ఎంఎల్’ అంటోన్న యంగ్‌హీరో
‘ఆర్ఎక్స్ 100’తో సెన్సేషన్ క్రియేట్చేసిన కార్తికేయ.. ‘హిప్పీ’ చిత్రంతో నిరాశపరిచాడు. అయితే మళ్లీ ‘గుణ 369’ అంటూ ప్రయత్నించినా.. సరైన విజయాన్ని అందుకోలేకపోయాడు. ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాలని.. మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి సంబంధించిన తాజాగా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. పాలసీసాలో కూడా మందును పోసినట్టు డిజైన్చేసి రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తిని రేకిత్తించగా.. కాసేపటి క్రితమే ఫస్ట్ లుక్, టైటిల్‌ను రిలీజ్ చేశారు. టైటిల్ చూస్తుంటే మరో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. -
పాలసీసాలో మందు..!
ఆర్ఎక్స్ 100 మూవీతో ఫేమస్ అయిన హీరో కార్తికేయ. ఈ మూవీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ హీరోకు యూత్‌లో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే హిప్పీతో పలకరించి నిరాశచెందాడు. ఈ మూవీ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా కార్తీకేయ తన స్వంత బ్యానర్లో మరో చిత్రాన్ని నిర్మించడానికి సిద్దమయ్యాడు. ప్రేమతో మీ కార్తీక్ అంటూ మొదటి చిత్రాన్ని నటించి నిర్మించినా.. అంతగా పేరు తీసుకురాలేదు. అయితే తాజాగా తన సొంత బ్యానర్లో రెండో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. జీవితం పాలసీసాతో మొదలై.. మందుసీసాతో ముగిసిపోతుందా? అని అనిపించేట్టు డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్, టైటిల్‌ను సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించనున్నాడు. -
‘నానీస్ గ్యాంగ్‌లీడర్’ విలేకరుల సమావేశం
-
సక్సెస్ సందడి
సాక్షి, ఒంగోలు మెట్రో: స్థానిక రవి ప్రియా మాల్లో ‘గుణ 369’ చిత్ర బృందం బుధవారం సాయంత్రం సందడి చేసింది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ హీరో కార్తికేయ నటించిన ‘గుణ 369’ సినిమా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ సినిమా విజయం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, సినిమా షూటింగ్ దాదాపుగా ఒంగోలులోనే చేయటం శుభపరిణామమన్నారు. తర్వాత చిత్రం సొంత బ్యానర్లోనే తీస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సినిమా దర్శకుడు అర్జున్ జంధ్యాల, కమెడియన్ మహేష్, చిత్ర యూనిట్ పాల్గొనగా, మాల్ చైర్మన్ కంది రవి శంకర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. సాయినాథ్, మాల్ డైరెక్టర్ కె. విష్ణువర్ధన్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గుణ 369’
‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ హీరోగా, మలయాళ భామ అనఘ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ఈ సినిమాతో బోయపాటి శ్రీను దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్ జంధ్యాల దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్జీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. గురువారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ ‘ఒక్క కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఆగస్ట్ 2న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. మంచి సినిమా చేశామని సంతృప్తి మాలో ఉంది. ట్రైలర్ చూసిన వారందరూ హిట్ గ్యారంటీ అని అంటున్నారు. ఇప్పటికే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింద’న్నారు. దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ ‘నాలుగ్గోడల మధ్య ఊహించి రాసుకున్న కథతో ఈ చిత్రాన్ని తీయలేదు. విశాల ప్రపంచంలో జరిగిన యథార్థగాథ మా చిత్రానికి ముడి సరుకయ్యింది. స్క్రీన్ మీద కూడా అంతే సహజంగా ఉంటుంది. ఆ నేచురాలిటీ ప్రేక్షకుడి గుండెను తాకుతుంది’ అన్నారు. -
ఊహించడం అంత వీజీ కాదు
‘‘ప్రతి ఒక్కరి జీవితంలో బ్యాడ్‌టైమ్ ఉంటుంది. నా జీవితంలోనూ బ్యాడ్‌టైమ్ గడిచింది. అందుకే డైరెక్టర్‌గా గ్యాప్ వచ్చింది’’ అన్నారు దర్శకుడు టి.ఎన్. కృష్ణ. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో కలైపులి యస్. థాను నిర్మించిన చిత్రం ‘హిప్పీ’. ఈ చిత్రంలో దిగంగనా సూర్యవన్షీ, జజ్బాసింగ్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు టి.ఎన్. కృష్ణ చెప్పిన విశేషాలు. ►‘హిప్పీ’ సినిమాను ముందు తమిళ భాషలో తీద్దాం అనుకున్నాం. ఆ టైమ్‌లో ‘ఆర్ఎక్స్ 100’ తమిళ రీమేక్ ఆఫర్ వచ్చింది నాకు. తెలుగు ‘ఆర్ఎక్స్ 100’ చూశాను. హీరోగా కార్తికేయ బాగా నటించాడు. ఇక రీమేక్ ఎందుకు? అనిపించి స్ట్రయిట్ తెలుగు సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాం. ‘హిప్పీ’ కథను కార్తికేయకు చెప్పాం. నచ్చింది అన్నారు. అలా ‘హిప్పీ’ ప్రయాణం మొదలైంది. జాన్ మిల్టన్ అనే బ్రిటిష్ కవి ప్రస్తావించిన ప్యారడైజ్ లాస్, ప్యారడైజ్ గెయిన్ అనే అంశాల ఇన్స్పిరేషన్తో ఈ సినిమా చేశాను. ►కార్తికేయ బాగా నటించాడు. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి క్యారెక్టర్ పాజిటివ్‌గా ఉంటుంది. నిర్మాత థానుగారు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇది యూత్‌ఫుల్ ఫిల్మ్. నేటి యువత రిలేషన్‌షిప్స్‌ను ఎలా డీల్ చేస్తున్నారు? రిలేషన్షిప్స్లో వారికి ఎదురయ్యే సమస్యలు ఏంటి? అనే అంశాలను ప్రస్తావించాం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. నెక్ట్స్ సీన్ ఏంటి? అని ఆడియన్స్ అంత వీజిగా ఊహించలేరు. ఇది కంప్లీట్ లవ్ ఫిల్మ్. ఫ్యామిలీ ఆడియన్స్‌కూ నచ్చుతుంది. ►సోషల్ మీడియా వచ్చిన తర్వాత కల్చలర్ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతోంది. నేటి టెక్నాలజీకి అందరూ ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఇండస్ట్రీలో అయినా అంతే. అప్డేట్ కావాలి. ►ఈ సినిమాలో నా పర్సనల్ లైఫ్ సీన్స్, నా స్నేహితులవి కొన్ని ఉన్నాయి. పర్సనల్ లైఫ్‌లో లవ్‌ని ఫీల్ అవ్వలేనివారు లవ్‌స్టోరీ తీయలేరని నా నమ్మకం. తెలుగు ఇండస్ట్రీ నాకు బాగా నచ్చింది. ఒక్కో లాంగ్వేజ్‌లో ఒక్కో బ్యూటీ ఉంటుంది. ►‘సిల్లున్ను ఒరు కాదల్’ (‘నువ్వు నేను ప్రేమ’) (2006) సినిమా తర్వాత ఓ సినిమా స్టార్ట్ చేశాం. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు నేను చేసిన ‘నెడుంజాలై’ రిలీజైంది. ‘హిప్పీ’ నా మూడో సినిమా. నెక్ట్స్ థానుగారే నా డైరెక్షన్లో ఓ సినిమా నిర్మించబోతున్నారు. అలాగే పీఫుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో ఓ తెలుగు సినిమా చేయబోతున్నాను. -
నాన్‌స్టాప్ గ్యాంగ్
ఓ కొత్త ప్లాన్‌తో నాని అండ్ గ్యాంగ్ రంగంలోకి దిగారు. ఆ ప్లాన్ డిౖటైల్స్ ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో వెండితెరపై లీక్ అవుతాయి. మనం, 24 వంటి డిఫరెంట్ చిత్రాలతో ప్రేక్షకుల మెప్పు పొందిన విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న సినిమా ‘గ్యాంగ్‌లీడర్’. కథానాయిక ప్రియాంకా మోహన్ నటిస్తున్న ఈ సినిమాలో ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెల 8న హైదరాబాద్‌లో స్టార్ట్ కానుంది. ఆ రోజు నుంచి సినిమా పూర్తయ్యేవరకూ నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరపడానికి ప్లాన్ చేశారు. జూలై 5కల్లా గుమ్మడికాయ కొట్టాలని టీమ్ ప్లాన్ వేసింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 30న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా కాకుండా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ అనే సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు నాని. ఇందులో సుధీర్‌బాబు హీరో. -
రాహుల్‌గాంధీపై సీఎం కొడుకు దావా
భోపాల్/ఇండోర్: పనామా పేపర్ల అవినీతి కేసులో తనపై రాహుల్ అసత్య ఆరోపణలు చేశారని, తన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ కొడుకు కార్తికేయ మంగళవారం రాహుల్‌పై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. సోమవారం జబువాలో రాహుల్ ఎన్నికల ప్రచారం చేస్తూ సీఎంపై ఈ ఆరోపణలు చేశారు. అనంతరం తన ఆరోపణలు వెనక్కు తీసుకున్నారు. ‘నేను కొంత గందరగోళానికి గురయ్యాను, శివరాజ్‌సింగ్ కుమారుడికి ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు’ అని అనంతరం రాహుల్ వివరణ ఇచ్చారు. అయితే రాహుల్ ఉద్దేశపూర్వకంగానే తనపై ఆరోపణలు చేశారని, తన పరువుకు భంగం కలిగించారని కార్తికేయ తన లాయర్ శిరీష్ శ్రీవాస్తవ ద్వారా ప్రత్యేక కోర్టు అదనపు జిల్లా జడ్జి ఎదుట దావా వేశారు. ఒకవేళ పరువు నష్టం దావా నిరూపితమైతే భారత శిక్షాస్మృతి ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. కోర్టు కార్తికేయ వాదనను విన్న తరువాత కేసును నవంబర్ 3కు వాయిదా వేసింది. -
నాగ్ గురించి వికీపీడియా తప్పు చెబుతోందా?
టాలీవుడ్ మన్మథుడు, నిత్య యవ్వనుడిగా కనిపిస్తూ యంగ్ హీరోలకు అసూయపుట్టేలా చేస్తున్నాడు కింగ్ నాగార్జున. వయసు ఆరుపదులకు దగ్గరవుతున్నా.. ఇంకా పాతికేళ్ల కుర్రాడిలానే ఉన్నాడు నాగ్. గురువారం రిలీజైన దేవదాస్ మూవీలో దేవ పాత్రలో నాగ్ నటన అందరినీ మెప్పించింది. అయితే నాగ్ ఫిట్‌నెస్‌పై యంగ్‌హీరో కార్తికేయ (ఆర్ఎక్స్ 100 ఫేమ్) చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘వికీపీడియా తప్పు చూపిస్తోందా? ఈ మనిషికి 59 సంవత్సరాలని చూపిస్తోంది. ఆయన ఫిట్నెస్తో యంగ్ హీరోలకు చాలెంజ్ విసిరుతున్నాడు. ఏమ్ ఉన్నాడ్రా బాబు’ అంటూ దేవదాస్లోని నాగ్ పిక్‌ను పోస్ట్చేశాడు. ఆర్ఎక్స్ 100తో విజయం సాధించిన కార్తికేయ.. తదుపరి చిత్రంగా ‘హిప్పీ’ని పట్టాలెక్కిస్తున్నాడు. Is wikipedia wrong ?coz it says this man is 59yrs old .#Devadasu .@iamnagarjuna sir 🙏🙏🙏 challenging actors in 20s with his fitness levels.Em unnadra babu🙏🙏 pic.twitter.com/5D1tcZ75t8 — Kartikeya (@ActorKartikeya) 27 September 2018 -
పెద్ద మనసు చాటుకున్న ఆర్ఎక్స్ 100 చిత్రయూనిట్
-
RX100 రైడెర్స్
-
హృదయ బాష
ఉదయం ఐదు గంటలకు అతను తన అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చాడు. అపార్ట్మెంట్ చాలా చిన్నది. పైగా గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే ఉంది. ఒక హాల్, ఒక బెడ్రూమ్, ఒక వంట గది, టాయిలెట్, బాత్రూమ్.. ఆ ఇంటిలోని భాగాలు. తలుపులు మూసి గొళ్లెం వేసి తాళం వేశాడు. బయట ఇంకా చీకటిగానే ఉంది. చేతికర్ర ఆసరాగా శబ్దం లేకుండా వడివడిగా అడుగులు వేస్తున్నాడు. అతని భుజానికో కాన్వాసు బుట్టా సంచి కూడా ఉంది. అతని పేరేంటో అక్కడెవరికీ తెలియదు. ఆ అపార్ట్మెంట్ అతని సొంతమే. అయితే అతణ్ని అందరూ ఏమని పిలుస్తారు? అందరూ అతణ్ని పిలవరు. అతని గురించి అసలు చర్చించుకోవడం కూడా జరగదు. ఎవరికీ ఇంతవరకూ అతణ్ని పిలవాల్సిన అవసరం రాలేదు కూడా. అయితే అతని వయసు అరవై పైనా డెబ్బయ్కి అటూ ఇటూ ఉండవచ్చు. అతనెలా ఉంటాడంటే.. ఆ వయసుకి తగ్గవాడిలాగే, అతి సాధారణంగా ఉంటాడు. కానీ, ఎప్పుడూ ఒకేలా ఉండడు. ఒకరోజు మీసం ఉంటే కొన్నాళ్ల తర్వాత అది ఉండదు. ఒకరోజు గుండు తల. మరికొన్నాళ్లకు సాధువులా పొడుగాటి వెంట్రుకలు.అతని వేషధారణ బహు విచిత్రం. పైజామా, లాల్చీ వేసుకుని తలపై ఫారిన్ క్యాప్ ధరిస్తాడు. ఒక్కోసారి ధోవతి ధరించి అంగవస్త్రం కప్పుకుంటాడు. మరోసారి అయ్యవారిలా నామాలు పెట్టుకుంటాడు. సరే.. ఇప్పుడతను ఎటు వెళుతున్నాడు? తిన్నగా పబ్లిక్ గార్డెన్ వైపుకే నడుస్తున్నాడు. అతణ్ని చూసి హెచ్చరికగా మొరగడానికి అక్కడ కుక్కలు లేవు. అతను వెళ్లే దారిలో ఉన్న కుక్కలన్నింటినీ మునిసిపాలిటీ వాళ్లు తీసుకెళ్లిపోయారు. అయితే అది కేవలం అతని కంప్లయింట్ల వల్లనే అని ఆ మునిసిపల్ అధికార్లకి కూడా తెలియదు. అదిగో.. ఎదురుగా పేపర్ అబ్బాయిలు చాలా ఫాస్ట్‌గా సైకిళ్లు తొక్కుతూ వచ్చేస్తున్నారు. ‘అదిగో అద్దాల్ని తీసుకుని వెళుతున్నారు. అద్దాలలో ముఖాలు చూసుకోకపోతే జనాలకి ఏం అర్థం కాదు.. పాపం’ అనుకున్నాడతను. అతనంతే.. పేపర్ని ‘అద్దం’ అని పిలుచుకుంటాడు. ప్రజల మనోభావాలకు అద్దం పట్టేవి. ప్రపంచంలో జరుగుతున్న విచిత్ర సంఘటనలను అద్దంలా చూపించేవి ఆ దిన పత్రికలే కాబట్టి వాటికి ఆ పేరు పెట్టుకున్నాడు. అతని వ్యవహారమే అంత! అంతా కోడ్ భాషలో ఉంటుంది. అతను రాసుకునే డైరీ కూడా కోడ్‌లో ఉంటుంది. అయితే ఈ అలవాటు అతనికెలా అయిందో ఎవరూ చెప్పలేదు. అతను వీధుల్లో నడవడు. అంతా మెయిన్‌రోడ్ల మీదే. అది కూడా మార్నింగ్ వాక్ లాగానూ, జాగింగ్ లాగానూ, రెండూ మిక్స్ చేసిన విధంగానూ ఉంటుంది. అతనిలా ఎన్నాళ్లనుంచి ఎన్నేళ్ల నుంచి చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. అప్పుడే ఆ మసీదు పక్క మెయిన్‌రోడ్డుపై కాఫీ హోటల్ తెరుస్తున్నారు. తెరిచేశారు కూడా. ‘‘మనం ఇంటి దగ్గర కషాయం తాగక ఎన్నిరోజులైందో కదూ.. వెళ్లి కాస్త పుచ్చుకుందాం’’ అని అంది అతని ఆత్మ. అంతరాత్మ.. హోటల్‌కి పెట్టిన పేరు.. అందులో కూర్చున్నాడు. బేరర్ రాగానే ‘‘కషాయం’’ అన్నాడు. బేరర్‌కి తెలుగు సరిగా రాదు. ఏంటి? అన్నట్టు చేత్తో సైగ చేశాడు. అతను గోడపై తగిలించిన పదార్థాల పట్టిక వద్ద వెళ్లి కాఫీ అన్న చోట వేలు పెట్టి చూపించాడు. ‘‘ఓహో.. కాఫీ..’’ అంటూ నవ్వుకుంటూ వెళ్లాడతను. కాఫీ తాగడమయ్యాక గవ్వలు ఇచ్చేసి బయటికొచ్చాడు. గవ్వలంటే డబ్బులు. జేబులో చిల్లిగవ్వలేదంటుంటారు. అందుకే డబ్బుల్ని గవ్వలంటాడతను. మళ్లీ నడక ప్రారంభించాడు. కొందరు యువకులు టీ షర్టులు, షాట్స్ ధరించి జాగింగ్ చేస్తూ వస్తున్నారు. అతను చిన్నగా నవ్వుకున్నాడు. ఆ నవ్వుకర్థం ఏమిటో అతనికే తెలియదు. ఒకప్పుడు తానూ వాళ్ల మాదిరిగానే నవయవ్వనంలో తుళ్లిపడే కోడెగిత్తలా పరుగెత్తేవాడిననీ, నేడిలా ‘నీడ’ అంటే వయసుపైబడి అలా పరుగెత్తలేకపోతున్నానని ఒక భావం. రేపు మీరు కూడా ఏదో ఒకనాడు నీడ కమ్ముకోగా నాలాగే అవుతారనే ఎద్దేవాభావం.. ఒకటీ అయి ఉండవచ్చు. పబ్లిక్ గార్డెన్‌కి చేరాడతను. లోపలికి అడుగుపెట్టగానే ఎంత కమ్మని సంగీతం! సంగీతం అక్కడ.. ఆ సమయంలోనా? ఆశ్చర్యపోకండి. ప్రశాంతతకి అతని గ్రామర్‌లో మారుపేరు సంగీతం. ప్రశాంతతకి మించిన కమ్మని సంగీతం ఏదీ ఉండదని అతని గట్టి అభిప్రాయం. పూల చెట్ల మధ్యలో నుంచి వేసిన బండల దారిపై నడుస్తున్నాడు. ‘‘ఈ అమ్మాయిలంతా ఇంకా నిద్దుర లేవలేదు.. పడుకొండి. నిదరపోండి కమ్మగా.. కలలు కనండి హాయిగా. ఓ మైడియర్ స్వీట్గాల్స్’’ అన్నాడతను వాటిని చూసి. అవును మరి.. పూలూ, అమ్మాయిలూ ఒకటే కదా.. ఆ రసాస్వాదకుని హృదయం భాషలో... మరైతే అమ్మాయిలనేమని పిలుస్తాడో అని మీకు సందేహం కదూ? అదిగో.. ఒక చోట ఇద్దరు అమ్మాయిలు స్కిప్పింగ్ చేస్తున్నారు. ‘‘హాయ్ చాక్లేట్స్’’ అన్నాడతను. వాళ్లు ముసి ముసిగా నవ్వుకున్నారు. అమ్మాయిలు చాక్లేట్స్ని ఇష్టపడతారు. అదే వారికతను పెట్టిన తియ్యని పేరు. అప్పటికే అతనికి నడచినడచి కాళ్లు తీపులు పుడుతున్నట్లుగా అనిపించింది. ఒక మంచంపై కూర్చున్నాడు. గార్డెన్‌లోని రాతి సోఫీలన్నీ అతనికి మంచాలు. కళ్లు మూసుకుని కాసేపు ధ్యానంలోకి వెళ్లిపోయాడు. ఆరుగంటలయింది. వెలుగు కిరణాలు పరిసరాల్ని ఆరబెడుతున్నాయి. పది నిమిషాల అనంతరం కళ్లు తెరచి అక్కడినుంచి లేచాడతను. మళ్లీ నడక. తోటలో తిరుగుతూ ఏదో పాట పాడుకుంటున్నాడు. పక్కనే నడుస్తున్న యాభై ఏళ్ల వనిత ఆసక్తిగా అతని కూని రాగాలని వింటోంది. వెన్నే పాయసమూ.. పాయసమే ప్రవాహ అమృతమూ.. వెన్నే పాయసమూ... ఆవిడకేమీ అర్థం కాలేదు. కానీ అది ‘‘అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం..’’ అనే పాత పాటకి పేరడీగా భావించి నోటికి చేయి అడ్డం పెట్టుకుని నవ్వుతూ, చకచకా అతణ్ని దాటుకుంటూ వెళ్లిపోయింది. అందం వెన్నలాంటిది.. కరిగిపోతుంటుంది. ఆనందం పాయసంలాంటి అనుభూతి. జీవితం ఒక ప్రవాహం మకరందం అమృతం. ఇవన్నీ ఆయన మనసులోని పదకోశం వివరణలు. తెల్లగా తెల్లవారింది. చలాకీగా నడుస్తున్న అతను ఒక్క క్షణం షాక్ తగిలినట్లుగా ఛాతీపై చేయి వేసుకుని అలాగే శిలలా నిలబడిపోయాడు. అతని గుండెలో ఎవరో పదునైన బల్లెంతో గుచ్చిన అనుభూతి. అది హార్ట్ అటాక్ స్ట్రోక్. మొదటిసారిగా అనుభవిస్తున్నాడు. అతనికి నుదుటిపై చెమట పట్టేసింది. ఒళ్లంతా కరెంట్ ప్రసరిస్తున్న భావన. శరీరం మొద్దుబారిపోతోంది. అలాగే కుప్పకూలిపోయాడు. ఎవరో అతని మొహంపై నీళ్లు చిలకరించి, లేపి కూర్చోబెట్టారు. ఆయన కళ్లు తెరచి ఎదురుగా ఉన్న నడి వయస్కుని మొహంలోకి కృతజ్ఞతగా చూశాడు. ‘‘ధార... ధార..’’ అన్నాడు. ‘‘ఏంటి?’’ అడిగాడా రక్షకుడు. అతని చేతిలోని వాటర్ బాటిల్కేసి చూస్తూ ‘‘ధార’’ అన్నాడు. అర్థం చేసుకున్న వాడిలా ఆ బాటిల్ ఎత్తి నీళ్లని అతని నోట్లో ఉంచసాగాడాయన. గుటకలు వేస్తూ నీళ్లు మింగి తెప్పరిల్లాడు. తన ప్రాణాలు కాపాడిన ఆ మహనీయునికి చేతులెత్తి నమస్కరిస్తూ ‘‘రత్నాలు’’ అన్నాడు. కృతజ్ఞతలు రత్నాలవంటివని ఆ ఎదుటి మనిషికి తెలియక.. ఇతడిని పిచ్చివాడిని చూసినట్టు చూసి తలాడిస్తూ నవ్వాడతను. మన కథానాయకుడు చేతికర్ర ఊతంగా అలాగే లేచి నిలుచున్నాడు. ఆగంతకుడు ముందుకు సాగిపోయాడు. మళ్లీ నడక మొదలు. అయితే మరింత ఎక్కువసేపు నడవలేదతను. ఒక ఆటో ఆపి, ఎక్కి ‘పద’ అన్నట్లు సైగ చేశాడు. ‘‘ఎక్కడికి?’’ అతను తన జేబులోని విజిటింగ్ కార్డు చూపించాడు. అందులో అతని పేరు లేదు. అది నీలిమా టవర్స్‌కి సంబంధించిన అడ్రస్కార్డు. కాకపోతే పైన ఒక మూలకు పెన్నుతో నెం. 101 అని మాత్రం రాసి ఉంది. ఓ పది నిమిషాల్లో ఆటో అపార్ట్మెంట్ ముందు ఆగగానే, అతను డబ్బులు చెల్లించి తన గదికేసి నడిచాడు. తలుపులు తెరచి లోనికి వెళ్లాలనుకున్నాడు. అంతలో ఏదో గుర్తుకొచ్చింది. వెంటనే వెనక్కి తిరిగాడు. అక్కడికి కాస్త దూరంలో ఉన్న టీ హోటలుకేసి నడిచాడు. హోటలు పక్కనే టెలీఫోన్ బూత్ ఉంది. గ్లాస్ డోర్ నెట్టి లోనికి వెళ్లి కూర్చున్నాడు . ఆయాసంతో అతని ఒళ్లు చిన్నగా కంపిస్తోంది. జేబులో చెయ్యి పోనిచ్చి ఏవో కాగితాలు బయటికి తీశాడు. అందులో ఒక ఫోన్ నంబర్ని చూసి ఎదురుగా ఉన్న అమ్మాయిని చూపించాడు. ఆ పిల్ల ఆ నంబర్ని కాగితంపై నోట్ చేసుకుంది. రింగ్ చేసింది. ఆయన ఏదో గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. సాధ్యం కాలేదు. వెంటనే తన విజిటింగ్ కార్డ్ తీసి ఆమెకిచ్చి ‘‘ఈ అడ్రసుకి తొమ్మిది గంటలకు రమ్మని చెప్పు’’ అన్నట్లు సైగ చేశాడు. ఆ పిల్ల అతణ్ని అర్థం చేసుకుంది. ఫోన్ రింగవుతోంది. క్షణం తర్వాత ‘హలో’ అందా పాప. అతను ఆమెవైపే చూస్తున్నాడు. ‘‘హలో.. ఈ ఫోన్ నంబర్ ఎవరిదండీ.. లాయర్ పరమహంసగారిదా? ఇక్కడ నీలిమా టవర్స్, నంబర్ 101కి చెందిన ఒక పెద్దాయన ఫోన్ చేస్తున్నారు. తొమ్మిది గంటలకి తన ఇంటికి రమ్మంటున్నారు.’’ అవతల్నుంచి ‘‘అలాగే’’ అని చెప్పడంతో అమ్మాయి ఫోన్ పెట్టేసి ‘‘వస్తానని చెప్పారు’’ అంది. అతను డబ్బులు తీసి ఆమె చేతిలో పెట్టి ‘‘రత్నాలు, వజ్రాలు’’ అని చెప్పి బయటకొచ్చాడు. ఆ పిల్ల అతనికేసి వింతగానూ, అనూహ్యంగానూ, భయంగానూ, ఇంట్రస్ట్గానూ చూస్తూనే ఉంది. అతను ఇల్లు చేరి తాళం తెరచి లోనికి వెళ్లి తలుపేసుకున్నాడు. లాయరు తప్పక వస్తాడని అతనికి తెలుసు. నిజానికి ఇప్పుడతనికి ఎంతో టెన్షన్‌గా, కంగారుగా ఉంది. తనకు మొదటిసారిగా గుండెనొప్పి వచ్చింది. మళ్లీ ఒకటి రెండు సార్లు వస్తే బతకడం అబద్ధం. అందుకే లాయరుతో పని! చేయవలసిన ముఖ్యమైన పనిని తొందరగా ముగించాలి. అదే అతని ఆత్రుత. సమయం ఎక్కువగా లేదు. తొమ్మిది గంటలకి లాయర్ వస్తాడు. ఈలోగా గుండె నొప్పి మరోసారి రావచ్చు. అందుకే త్వరగా తాను రాయదల్చుకున్నది రాయాలి. కానీ, ఏం రాయాలి? టైం చూశాడు. గోడ గడియారంలో ఎనిమిది అవుతోంది. మరోగంట.. ఈలోగా మరోసారి స్ట్రోక్ వచ్చినా రావచ్చు. అతనిప్పుడు ఎక్కువగా ఆలోచించలేకపోతున్నాడు. లాయర్‌తో మాట్లాడాలి. అందుకే అతని రాక కోసం ఎదురుచూస్తున్నాడు. క్షణాలు బరువుగా.. నత్తలా నడుస్తున్నాయి. అతను తన పాత ట్రంక్ పెట్టె మూత తీసి, తన పాత జ్ఞాపకాలను స్పృశిస్తున్నాడు. ఏవేవో ఫోటోలు చూస్తున్నాడు. ఏవేవో ఉత్తరాలను గుండెకి హత్తుకుని వలవలా కన్నీళ్లు కారుస్తున్నాడు. టైం గడుస్తోంది. తొమ్మిది గంటలవుతోంది. లాయర్ పరమహంస స్కూటర్ స్టాండ్ వేసి 101 కాలింగ్ బెల్ నొక్కాడు. సమాధానం రాలేదు. డోర్ తెరుచుకోలేదు. ఐదు నిమిషాలు ఆగి తలుపు తోశాడు. అది సునాయాసంగా తెరుచుకుంది. లోపలికి వెళ్లేసరికి వాలుకుర్చీలో కూర్చుని అరమోడ్పు కన్నులతో ఎగశ్వాస పీలుస్తూ అతను... ‘‘హలో సార్..’’ పరమహంస అతని భుజం పెట్టాడు. ‘‘రత్నాలు, వైఢూర్యాలు’’ అంటూ పరమహంస చేతిని అందుకుని, అతను కనురెప్పలు వాల్చాడు. అంతే.. అతనింక కదల్లేదు. పరమహంస బరువుగా నిట్టూర్చాడు. తనని చూశాకగానీ ఈ ముసలాయన తుది శ్వాస విడవలేదు. పాపం.. ఇప్పటివరకూ తన ప్రాణాల్ని ఎలా ఉగ్గబట్టుకున్నాడో! సుమారు రెండు గంటల తర్వాత అక్కడ అనేకమంది పత్రికా విలేకరులూ, టీవీ చానల్స్ ప్రతినిధులూ హాజరై లాయర్ పరమహంస నుండి వివరణల కోసం ఎదురుచూస్తున్నారు. ‘‘ఏంటి సార్.. ఈయన విచిత్రమైన కథ? అసలు ఎవరీయన?’’ ప్రశ్నల పరంపర బిగినైంది. పరమహంస ఒక్క క్షణం భారంగా నిట్టూర్పు విడిచి చెప్పటం ప్రారంభించాడు. ‘‘ఈయన పేరు కార్తికేయ. ఆయనకి తెలియని భారతీయ భాష లేదు. యూనివర్సిటీ నుంచి ఎన్ని యం.ఎ. పట్టాలు పుచ్చుకున్నాడో ఎవరికీ తెలియదు. ఇతని పుట్టుక ఎక్కడా? ఎవరితో గడిపాడో తెలియదు. కానీ, నిరంతరం భాషల గురించి అ«ధ్యయనం చేయడం ఈయన ప్రవృత్తి. ముఖ్యంగా ఈయన జీవితంలో అది తప్ప వేరే ఆశయం లేనట్లుంది. ఇతను నాకు పది సంవత్సరాల క్రితం వైజాగ్‌లో పరిచయమయ్యాడు. అప్పటికి తాను భాషల గురించి ఎన్నో ముఖ్యమైన సంగతులు సేకరించాననీ, అవన్నీ ఒక పుస్తక రూపంలో తెస్తాననీ అన్నాడు. అయితే వీటన్నింటికీ చెందని కొత్త భాషనొకదానిని తాను కనిపెట్టాలనుకున్నట్లు నాతో చెప్పాడు. అంటే... ఒక పదానికి దాని అర్థంతో సరిపోయే మాటని కొత్తగా చేర్చాలని అతని ఆశయం. ఉదాహరణకి కాఫీని కషాయం అనడం, అంటే జన జీవనంలో నిజమైన అర్థాలనే ప్రాతిపదికగా, ఈ కొత్త భాష ఉండాలని అతగాడి కోరిక. ‘అల్లుడు’ అంటే పరాన్నజీవి అనీ అమ్మాయి అంటే ‘చాక్లెట్’ అని ఇలా వేలాది పదాలకి కొత్త పేర్లు పెట్టేశారు. కానీ, చివరికి తాను చేసిన ప్రయోగమే తనకు విషమ సమస్యగా తయారైంది. ఏ పదం ఏ వస్తువు కోసం వాడుతున్నాడో, ఏ పదం ఏ భావం కోసం మార్చుకున్నాడో.. తానే మర్చిపోయే స్థితికొచ్చాడు. ఒరిజినల్ పదాలు అతనికి గుర్తే లేకుండా పోయాయి. మీరు ‘కుర్చీ’ అంటే అతనికి ‘పదవి’ గుర్తుకొస్తుంది. అతను ‘ధార’ అంటే మనకు ‘నీళ్లు’ అని తెలియదు. ఇలా అతని మెదడంతా విభిన్న పదాలతోనే నిండిపోయింది. ప్రతిక్షణం ఒరిజినల్ పదం కోసం గుర్తు చేసుకుంటూ.. అది స్ఫురణకి రాక బుర్ర బద్ధలు కొట్టుకుంటూ నానా ఇబ్బంది పడసాగాడు. తాను ఏ పదం దేనికి వాడుతున్నాడో మరిచిపోయి బాధపడుతున్నాడు. చివరిగా.. ఈ రోజు అతనికి గుండెనొప్పి వచ్చింది. అతణ్ని ప్రత్యేక శ్రద్ధతో ఏళ్ల తరబడి పరిశీలించడం వల్ల అతని హృదయ భాష కొంతలో కొంత అర్థం చేసుకోగలను కానీ, ఇప్పుడు అతను తన విల్లును కూడా తన ప్రత్యేక భాషలోనే రాసి కన్ను మూశాడు. ఈ విల్లును ఎలా అధ్యయనం చేయాలో అర్థం కావడం లేదు. ఇతని తుది కోరికకి ఎలా న్యాయం చేయాలో అంతకంటే అర్థం కావటం లేదు..’’ అన్నాడు పరమహంస ఎంతో ఆవేదనగా. అంతలో ఒక విలేకరి ముందుకు వచ్చి... ‘‘సార్... ఇంతకీ ఈ విచిత్ర వ్యక్తిత్వం గల మనిషి చరిత్ర ద్వారా ప్రజలకి ఏమైనా చెప్పదలచుకున్నారా? ఈయన కృషికి అర్థం ఉందా?’’ అని అడిగాడు. ‘‘యూ ఆర్ రైట్. మనిషి మేధావి. ఆ మేధస్సుకు పరిమితుల్లేవు. కానీ, ఒక నూతన పరిశోధన ఎప్పుడూ జనానికి ప్రయోజనాత్మకంగా, వారి జీవితాలలో వెలుగుని తెచ్చేదిగా ఉండాలి. అంతే తప్ప పనికిరాని ప్రయోగాలతో కార్తికేయలా ఎవ్వరూ కూడా తమ మేధా సంపత్తిని వృథా చేసుకోరాదం’’టూ ముగించాడు లాయర్ పరమహంస. జనం కరతాళ ధ్వనులతో అతని అభిప్రాయాన్ని ఆమోదించారు. కానీ పరమహంస మాత్రం కార్తికేయ హృదయ భాష గురించే ఆలోచిస్తూ వేదనా భరిత హృదయుడై ఉన్నాడు. -
లైంగిక దాడి కేసులో సినీ డైరెక్టర్‌కు రిమాండ్
బోడుప్పల్: వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన ఓ సినిమా డైరెక్టర్‌ను శుక్రవారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అమీర్‌పేట మధురానగర్‌కు చెందిన కార్తికేయ సినిమా డైరెక్టర్‌గా పని చేసేవాడు. ఇతనికి వైజాగ్‌కు చెందిన ఓ వివాహిత పేస్ బుక్‌లో పరిచయం కావడంతో ఇద్దరు కలిసి సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సదరు వివాహిత ల్యాండ్ డాక్యుమెంట్లను కుదువ పెట్టి డబ్బులు తీసుకున్న అతను వాటితో సినిమా తీద్దామని చెప్పాడు. అయితే సినిమా తీయకపోగా వివాహితకు మాయమాటలు చెప్పి మణికొండలోని అపార్టుమెంట్‌కు పిలిపించి కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత ఆమెను ఫొటోలు తీశాడు. వాటిని అడ్డుపెట్టుకుని పలుమార్లు తనపై లైంగిక దాడికి పాలుపడినట్లు బాధితురాలు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. -
ర్యాపిడ్ చెస్ చాంప్స్ గౌతమ్, కార్తికేయ
సాక్షి, హైదరాబాద్: ఇన్విటేషనల్ ఓపెన్, చిల్డ్రన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో గౌతమ్ రామారావు విజేతగా నిలిచాడు. మణికొండలో జరిగిన ఈ టోర్నీలో ఓపెన్ విభాగంలో గౌతమ్, ముదబ్బిర్, జె.బి సత్య వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. చిల్డ్రన్ కేటగిరీలో అండర్-15 విభాగంలో కార్తికేయ టైటిల్‌ను కై వసం చేసుకున్నాడు. ఇతర విభాగాల్లో అభినవ్ (అండర్-14), సాద్విక్ (అండర్-13), లలిత్ (అండర్-12), స్ఫూర్తి (అండర్-11), చిరాయు (అండర్-10), ఎన్. తరుణ్‌తేజ (అండర్-9), తేజస్ (అండర్-8), శ్వేశిత్ (అండర్-7), లోహిత్ (అండర్-6) విజేతలుగా నిలిచారు. పోటీల అనంతరం అంతర్జాతీయ ఆర్బిటర్ జె.ఎన్. పద్మారావు విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. -
ఈ ఫొటోనే సాక్ష్యం
అభీష్ట, కార్తికేయలతో లోకేష్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్ వెంట ఇద్దరు అధికారులను అమెరికా పంపించిన విషయం బయటకు పొక్కకుండా ఎంతగా జాగ్రత్త పడినా సాధ్యం కాలేదు. ముఖ్యమంత్రి ఓఎస్డీ సీతేపల్లి అభీష్ట, పరిశ్రమల శాఖ డెరైక్టర్ కార్తికేయ మిశ్రాలను కేవలం లోకేష్‌కు తోడుగా అమెరికా పంపించారన్న విషయం బయటపడింది. లోకేష్ ఈ నెల 3 నుంచి 12 వరకు అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. లోకేష్‌కు తోడుగా చంద్రబాబు తన ఓఎస్డీ అభీష్ట, కార్తికేయ మిశ్రాలను ప్రభుత్వ ఖర్చులతో ప్రత్యేకంగా అమెరికా పంపించారు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా అభీష్ట కోసం ఒక జీవో (జీవో 1326), కార్తికేయ మిశ్రా కోసం మరో జీవో (నంబర్ 1336) జారీ చేశారు. ఇద్దరూ 3 వ తేదీ నుంచి 12 వరకు అమెరికాలో పర్యటిస్తారని, ఇద్దరికీ అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని జీవోల్లో పేర్కొంది. లోకేష్ పర్యటనకు వీరిద్దరి పర్యటనకు సంబంధం లేదని చెప్పడానికి చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వారు ముగ్గురూ ఒకే విమానంలో అమెరికా బయలుదేరగా వెళ్లిన రోజు నుంచి అంతా కలిసే తిరుగుతున్నారు. తాజాగా శాన్ఫ్రాన్సిస్కోలో వారు ముగ్గురూ కలిసి దిగిన ఫోటోలు మీడియాకు చిక్కాయి. -
విజువల్ వండర్‌గా...
పౌరాణిక నేపథ్యంతో మోక్ష శ్రీమయి సమర్పణలో సింహవాహిని చలనచిత్ర పతాకంపై రూపొందుతున్న ‘వైవస్వత’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. వరుణ్-కార్తికేయల జంట దర్శకత్వంలో ఎస్. నాగరాజు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. పౌరాణిక కథల్లో ఇప్పటివరకూ వెండితెరకు రాని ఓ కథతో ఈ చిత్రం ఉంటుందని వరుణ్-కార్తికేయ తెలిపారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్‌పరంగా అద్భుతంగా ఉంటుందని, సాంకేతికంగా భారతీయ సినిమా ఆశ్చర్యపోయే రీతిలో ఈ చిత్రం ఉంటుందని దర్శకులు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: రఘు చతుర్వేదుల, ఆర్ట్: ఎన్. ఇళయరాజా, కెమెరా: ప్రవీణ్ కె బంగారి. -
చార్మినార్ చూసేందుకు రూ.65వేలతో రైలెక్కాడు..
-
చార్మినార్ చూసేందుకు రూ.65వేలతో రైలెక్కాడు..
హైదరాబాద్ : చార్మినార్ చూడాలనే కోరిక నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలుడిని హైదరాబాద్ తీసుకొచ్చింది. తన కోరికను నెరవేర్చుకోవడం కోసం ఇంట్లో ఎవరికి చెప్పకుండా 65వేల డబ్బుతో నగరానికి చేరుకున్నాడు. బాలుడు నాంపల్లి రైల్వేస్టేషన్లో తిరుగుతుండగా.. రైల్వే పోలీసులు అనుమానం వచ్చి ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. డబ్బును, బాలుడ్ని అదుపులో తీసుకోని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా కనిగిరి స్థానిక శివనగర్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు కొత్తపల్లి వెంకట కార్తికేయ ...చార్మినార్ చూడాలని కోరిక కలిగింది. దాంతో ఇంట్లో ఉన్న రూ.65వేల నగదుతో హైదరాబాద్ రైలు ఎక్కేశాడు. నగదుతో పాటు కుమారుడు అదృశ్యం కావటంతో అతని తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. మరోవైపు నాంపల్లి రైల్వేస్టేషన్లో ఉన్న కార్తికేయ...రైల్వే ఎస్ఐ ఇబ్రహీం కంటపడ్డాడు. అసలు విషయం ఆరా తీస్తే...చార్మినార్ చూసేందుకు హైదరాబాద్ వచ్చానని, తన దగ్గర నగదు ఉన్నట్లు చెప్పటంతో ఎస్ఐ...ఈ విషయాన్ని కనిగిరి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో హైదరాబాద్ చేరుకున్న కార్తికేయ తల్లిదండ్రులకు కుమారుడితో పాటు, నగదును అప్పగించారు. -
మేకింగ్ ఆఫ్ 'కార్తికేయ'
-
ధైర్యం చేస్తే దక్కిన తీయటి ఫలితం!
- నిఖిల్ ‘‘ప్రయోగాత్మకంగా రూపొందే చిన్న చిత్రాలకు డబ్బులు రావంటారు. కానీ, ధైర్యం చేసి ‘స్వామి రారా’ చేశాను. మంచి ఫలితం వచ్చింది. ఆ ప్రేరణతోనే ఇప్పుడు ‘కార్తికేయ’ చేశాను. ఇది నా కెరీర్లోనే మైలురాయిలా నిలిచింది. ప్రస్తుతం చేస్తున్న ‘సూర్య వర్సెస్ సూర్య’ కూడా వాణిజ్య విలువలతో కూడిన ప్రయోగాత్మకమే’’ అని నిఖిల్ అన్నారు. ఆయన హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన ‘కార్తికేయ’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో నిఖిల్ మాట్లాడుతూ-‘‘సినిమా చూద్దామని నేను, దర్శకుడు చందు కలిసి థియేటర్కెళ్లాం. టికెట్లు దొరకలేదు. బాధ అనిపించినా, తర్వాత భలే ఆనందపడ్డాం. మూడోవారంలోనూ తరగని వసూళ్లతో దూసుకుపోతోందీ సినిమా’’ అన్నారు. చందు ఏది నమ్మాడో అదే తీశాడనీ, ఈ సక్సెస్‌కి కారణం అదే అనీ నిర్మాత అన్నారు. సినిమా హిట్ అవుతుందని ముందే అనుకున్నామనీ, కానీ సూపర్‌హిట్ చేశారని దర్శకుడు ఆనందం వెలిబుచ్చారు. ఇప్పటికి 20 కోట్ల గ్రాస్ వసూలు చేసిందీ సినిమా అని నిర్మా తల్లో ఒకరైన మార్కాపురం శివకుమార్ అన్నారు. జోగి నాయుడు తదితరులు మాట్లాడారు. -
డబుల్ హ్యాపీగా ఉన్నా: శేఖర్‌చంద్ర
‘‘నా కెరీర్లోనే పెద్ద బ్రేక్ ‘కార్తికేయ’. ఈ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించక ముందే ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ రూపంలో మరొకటి నా తలుపు తట్టింది. వరుస విజయాలు ఎంతో ఆనందానిస్తున్నాయి. డబుల్హ్యాపీగా ఉన్నా’’ అని సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘‘చిన్నప్పట్నుంచీ సంగీతమంటే ప్రాణం. అందుకే కీబోర్డ్ నేర్చుకున్నాను. చెన్నైలో కర్ణాటక సంగీతం అభ్యసించాను. సంగీత దర్శకత్వం వహించాలని మాత్రం అనుకోలేదు. కీరవాణి, కోటి నన్ను సంగీత దర్శకునిగా ప్రోత్సహించారు. రవిబాబు ‘అనసూయ’ చిత్రంతో సంగీత దర్శకుణ్ణి చేశారు’’ అని శేఖర్‌చంద్ర గుర్తు చేసుకున్నారు. ఇంకా మాట్లాడుతూ-‘‘రవిబాబుతో అనసూయ, నచ్చావులే, మనసారా, నువ్విలా, అవును.. చిత్రాలు చేశాను. అవన్నీ నాకు మంచి శిక్షణగా ఉపయోగపడ్డాయి. ‘కార్తికేయ’కు గొప్పగా సంగీతం చేశానని అంటున్నారంటే కారణం అదే. ప్రస్తుతం ‘అవును-2’, నక్కిన త్రినాథరావు రూపొందిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాలు చేస్తున్నాను’’ అని చెప్పారు. ఎస్.డి.బర్మన్, ఆర్.డి.బర్మన్, ఇళయరాజా, రెహ్మాన్, దేవిశ్రీ ప్రసాద్‌లు తనకు ప్రేరణ అనీ, పాప్ సంగీతాన్ని కూడా గమనిస్తుంటాననీ శేఖర్‌చంద్ర పేర్కొన్నారు. సామాజిక స్పృహతో కూడిన మ్యూజిక్ ఆల్బమ్‌ని రూపొందించనున్నాననీ, ఆ వివరాలు త్వరలో చెబుతానని శేఖర్‌చంద్ర చెప్పారు. -
ఇలాంటి సినిమాలు తక్కువ వస్తాయి!
‘‘ఈ చిత్రం ఆరంభం నుంచి చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది. నాకు ఈ తరహా స్క్రీన్‌ప్లే, క్లైమాక్స్‌తో తక్కువ సినిమాలు వస్తాయి. విభిన్న అంశాలను మేళవించి తీసిన చిత్రం ఇది. చేస్తున్నప్పుడే చాలా థ్రిల్ అయ్యాను. రషెస్ చూసి, చాలా సంతృప్తిపడ్డాను’’ అని నవదీప్ అన్నారు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో నవదీప్, నవీన్ చంద్ర హీరోలుగా శ్రీకాంత్ దంతులూరి సమర్పణలో శిరువూరి రాజేష్ వర్మ నిర్మించిన చిత్రం ‘భమ్ బోలేనాథ్’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ దర్శకుడు చందు మొండేటి ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలందజేశారు. అనంతరం కార్తీక్ వర్మ మాట్లాడుతూ -‘‘చందు దర్శకత్వంలో వహించిన ‘కార్తికేయ’కు స్క్రీన్‌ప్లే ఇచ్చాను. ఆ సినిమా ముగింపు దశలో ఉన్నప్పుడు రాజేష్‌గారికి ఈ కథ చెప్పాను. ఇదొక క్రైమ్, కామెడీ థ్రిల్లర్. కథను నమ్మి ఆయన ఈ అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈ సినిమా చేశాను’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘కార్తీక్ వర్మ ఏదైతే చెప్పాడో దాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. ఒక కొత్త కథతో తీసిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ నెలాఖరుకి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఓ మంచి స్క్రిప్ట్‌తో చేసిన చిత్రమిదని నవీన్‌చంద్ర తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: శరణ్ కొప్పిశెట్టి, కార్తీక్ వర్మ దండు, సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: భరణి కె. ధరన్. -
సాధారణ ప్రేమకథ
ప్రేమలో పడటం తప్పు కాదని, అయితే అదే ప్రపంచంగా బతికేయకుండా కెరీర్‌ని కూడా దృష్టిలో పెట్టుకోవాలనే కథాంశంతో జి. శ్రీ చందన, ఎస్. కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘సింపుల్ లవ్‌స్టోరి’. కార్తీక్, కార్తికేయ, కిరణ్, అమితారావు, మధులగ్నదాస్, అన్విక ముఖ్య తారలు. రవివర్మ ఎమ్. దర్శకుడు. టాకీపార్ట్ పూర్తయ్యింది. ఈ 10 నుంచి అరకు లోయ, కేరళల్లో పాటలు చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రేమ, వినోదంతో పాటు చక్కని సందేశం ఉన్న చిత్రం ఇది. భానుచందర్‌గారు చేసిన కీలక పాత్ర సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. రమేష్ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నెల మూడో వారంలో పాటలు విడుదల చేస్తాం’’ అని చెప్పారు. కలర్ఫుల్గా సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: పాండు, సమర్పణ: డా. జి. ప్రవీణ్. -
కార్తికేయతో సక్సెస్‌ని కొనసాగిస్తా – నిఖిల్
‘‘నా జీవితంలో ఎంతో ముఖ్యమైన సినిమా ‘స్వామి రారా’. ఆ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తున్నావ్.. అని చాలామంది అడిగారు. ఆ విజయాన్ని మరో విజయంతో కొనసాగించాలని ‘కార్తికేయ’ చేశాను’’ అని నిఖిల్ అన్నారు. ‘స్వామి రారా’తో హిట్ పెయిర్ అనిపించుకున్న నిఖిల్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్న చిత్రం ‘కార్తికేయ’. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిఖిల్ ఇంకా మాట్లాడుతూ-‘‘ట్విట్టర్ ద్వారా ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది. దర్శకుడు సినిమాను జనరంజకంగా తీర్చిదిద్దాడు. ప్యాచ్ వర్క్ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది’’ అని తెలిపారు. రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, యూత్ సినిమాలకు భిన్నంగా డెప్త్ ఉన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాత చెప్పారు. ఉత్కంఠకు లోను చేసే సినిమా ఇదని దర్శకుడు అన్నారు. ఇంకా రావురమేష్, జోగినాయుడు, కార్తిక శ్రీనివాస్, కెమెరామెన్ కార్తీక్ ఘట్టమనేని కూడా పాల్గొన్నారు. -
ప్రజలు సహకరిస్తే కర్ఫ్యూ ఎత్తివేత : కాంతిలాల్ దండే
విజయనగరం: ప్రజలు సహకరిస్తే కర్ఫ్యూ ఎత్తివేస్తామని విజయనగరం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే చెప్పారు. రేపు ఉదయం 7గంటల నుంచి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలిస్తామన్నారు. ఈరోజు కర్ఫ్యూ సడలింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పారు. రేపు మరో గంట అదనంగా కర్ఫ్యూ సడలిస్తామన్నారు. ప్రజలు ఇలాగే సహకరిస్తే త్వరలోనే కర్ఫ్యూ ఎత్తివేస్తామని కలెక్టర్ చెప్పారు. ఈరోజు రాత్రి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకపోతేనే రేపు సడలింపు సమయం అమలౌతుందని ఎస్పి కార్తికేయ చెప్పారు. ఆస్తుల విధ్వంసం, పోలీసు వాహనాల ధ్వంసంకు సంబంధించి 110 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. మరో 50 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్పి చెప్పారు. -
విజయనగరం ఘటనలో110 మంది అరెస్ట్: ఎస్పీ
రాష్ట్ర విభజన నేపథ్యంలో విజయనగరం పట్టణంలో చోటు చేసుకున్న ఆస్తుల విధ్వంసం, పోలీసులపై రాళ్ల దాడుల కేసులో ఇప్పటివరకు 110 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ కార్తికేయ మంగళవారం విజయనగరంలో వెల్లడించారు. ఆ దాడుల్లో మరికొంత మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. ఆ దాడులకు పాల్పడిన అల్లరిముకలను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఆ బృందాలు తమ విచారణను ముమ్మరం చేశాయని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా అల్లరిముకలను అరెస్ట్ చేస్తామని కార్తికేయ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా పీసీసీ అధ్యక్షుడు, రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన జోడు పదవులకు రాజీనామా చేయకపోవడంతో ఆయన సొంత జిల్లా అయిన విజయనగరంలో జిల్లావాసుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఆ నేపథ్యంలో బొత్సకు చెందిన ఆస్తులపై దాడికి తెగబడ్డారు. అందులోభాగంగా బొత్స బంధువులను కూడా వదలలేదు. ఆ క్రమంలో విజయనగరం పట్టణం అటుడికింది. పరిస్థితి చేయి దాటుందని భావించిన ప్రభుత్వం ప్రత్యేక పోలీసు బలగాలను విజయనగరానికి హుటాహుటిన తరలించింది. దాంతో ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించి నిరవధిక కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.