
‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ నటిస్తోన్న తాజా చిత్రం ‘90 ఎం.ఎల్’. నేహా సోలంకి కథానాయిక. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ– ‘‘టైటిల్‌కి తగ్గట్టుగానే మా సినిమా వైవిధ్యంగా ఉంటుంది. వాణిజ్య అంశాలతో వినోదాత్మకంగా ఉంటుంది. అజర్ బైజాన్‌లో ఇటీవల చిత్రీకరించిన మూడు పాటలతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
అతి త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. శేఖర్‌రెడ్డి ఎర్ర మాట్లాడుతూ– ‘‘అజర్ బైజాన్ రాజధాని బాకులోని అందమైన ప్రదేశాల్లో 8 రోజులు జరిపిన షూటింగ్‌లో ‘వెళ్లిపోతుందే వెళ్లిపోతుందే..’, ‘సింగిల్ సింగిల్..’, ‘నాతో నువ్వుంటే చాలు...’ అనే పాటలను హీరో, హీరోయిన్‌తో పాటు 10 మంది డ్యాన్సర్లపై చిత్రీకరించాం. జానీ మాస్టర్ ఎక్స్‌ట్రార్డినరీగా స్టెప్స్ కంపోజ్ చేశారు. ఈ మూడు పాటలు చిత్రానికి మంచి హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. రవికిషన్, రావు రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్, ప్రగతి, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: జె.యువరాజ్.
Comments
Please login to add a commentAdd a comment