కార్తికేయ హీరోగా నటించిన ‘భజే వాయు వేగం’ చిత్రం విడుదల తేదీ ఖరారు అయింది. ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వంలో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. అలాగే ఈ సినిమాలోని ‘సెట్ అయ్యిందే...’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.
ఐశ్వర్యా మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: రధన్, సహ–నిర్మాత: అజయ్ కుమార్ రాజు .పి.
Comments
Please login to add a commentAdd a comment