ఆర్‌ఎక్స్ 100 సినిమాతో భారీ స్థాయిలో హిట్ అందుకున్నాడు కార్తికేయ. కానీ తర్వాత చేసిన ఏ సినిమా కూడా ఆ రేంజ్‌లో విజయాన్ని సాధించలేకపోయింది. ఎలాగైనా సరే తిరిగి ఫామ్‌లోకి రావాలని తెగ ప్రయత్నిస్తున్నాడీ యంగ్ హీరో. ప్రస్తుతం ఇతడు బెదురులంక సినిమా చేస్తున్నాడు. ఇందులో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. క్లాక్స్ దర్శకత్వంలో ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ ఆగస్టు 25న రిలీజ్ కానుంది.
ఈ క్రమంలో కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఆర్‌ఎక్స్ 100 సినిమాతో నాకు రొమాంటిక్ ఫేమ్ వచ్చింది. డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టికి కూడా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. అయితే ఆ సినిమాల్లోని పాత్రలకు ప్రస్తుతం చేస్తున్న సినిమాకు సంబంధం లేదు. కథలో రొమాంటిక్ సీన్ ఉంది. మా ఇద్దరికీ అప్పటికే ఓ ఇమేజ్ ఉంది, కాబట్టి మమ్మల్ని ఈ సినిమాకు తీసుకుని ఉండొచ్చు' అని చెప్పుకొచ్చాడు.
దీన్ని సోషల్ మీడియాలో కొందరు వక్రీకరిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇద్దరికీ రొమాంటిక్ ఇమేజ్ ఉంది కాబట్టే బెదురులంకలో రొమాంటిక్ సీన్స్ కావాలని పెట్టారంటూ కామెంట్లు చేశారు. దీనిపై కార్తికేయ ట్విటర్ వేదికగా స్పందించాడు. 'ఇంటర్వ్యూ మొత్తం చూసి మాట్లాడండి.. నేనసలు అలా అనలేదు. దయచేసి నటీనటుల ఇమేజ్ దెబ్బతినేలా, సినిమాపై ఎఫెక్ట్ పడేలా ఏది పడితే అది పోస్ట్ చేయకండి. థాంక్యూ' అంటూ రెండు చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీని జత చేశాడు.
చదవండి: భోళా ఎఫెక్ట్.. ముక్కు పిండి వసూలు చేస్తున్న చిరంజీవి? బేబి డైరెక్టర్ క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment