తెలంగాణ హైకోర్టులో సినీనటుడు మోహన్ బాబుకు మరోసారి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
మోహన్‌బాబు పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు దుబాయ్ వెళ్తున్నారని ప్రతివాదుల తరఫున న్యాయవాది ఆరోపించారు. అయితే అలాంటిదేం లేదంటూ మోహన్ బాబు లాయర్ కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఇరు వర్గాలను ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..
మోహన్ బాబు, ఆయన తనయుడు మనోజ్‌కు మధ్య వివాదం తలెత్తింది. జల్‌పల్లిలోని ఇంట్లోకి తనను రానివ్వలేదంటూ మంచు మనోజ్ మీడియా తీసుకుని ఆ ఇంటివద్దకు వెళ్లారు. అదే సమయంలో సెక్యూరిటీ మనోజ్ దంపతులను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలోనే మనోజ్ గేటు బద్దలుకొట్టి ఇంట్లోకి వెళ్లారు. అక్కడే ఉన్న మోహన్‌బాబును ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఆయన ఆగ్రహాని గురయ్యారు. అతని మైక్‌తోనే మీడియా ప్రతినిధిని కొట్టారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే తనపై నమోదైన కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు. ఇవాళ విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment