
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. ప్రీతీ ముకుందన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.
అవా ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై డా. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. కాగా ఈ మూవీలో మహదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు నటించారు. ఈ నెల 19న ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘కన్నప్ప’లోని మహదేవ శాస్త్రి పరిచయ గీతాన్ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్.