ప్రముఖ నటుడు మోహన్ బాబుకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ని న్యాయస్థానం కొట్టేసింది. అనారోగ్యంతో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు కానీ అది నెరవేరలేదు. దీంతో మోహన్ బాబుని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇకపోతే మోహన్ బాబు ఇండియాలోనే ఉన్నట్టు ఆయన న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు. తన మనవరాలును చూసేందుకు దుబాయ్ వెళ్లి తిరుపతి వచ్చినట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని న్యాయవాది రవిచందర్ చెప్పారు. మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని హైకోర్టు కోరడంతో.. కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో మెడికేషన్‌లో ఉన్నారని తెలిపారు. దీంతో పాటు జర్నలిస్ట్ స్టేట్‌మెంట్ కాపీని కూడా హైకోర్టు పరిశీలించింది.
(ఇదీ చదవండి: కూటమి పార్టీల్లో ‘బెనిఫిట్ షో’ వివాదం)
ఇంతకీ ఏం జరిగింది?
మోహన్ బాబు ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నాయి. దీంతో మనోజ్-మోహన్ బాబు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని తొలుత రూమర్స్ వచ్చాయి. అది నిజమో కాదో పక్కనబెడితే పరస్పరం పోలీసు కేసులు అయితే పెట్టుకున్నారు. కొన్నిరోజుల క్రితం ఓ మూడు నాలుగు రోజుల పాటు ఈ గొడవ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ క్రమంలోనే మోహన్ బాబు ఇంటి దగ్గరకు మీడియా ప్రతినిధులు వెళ్లగా.. జర్నలిస్టుపై మైకుతో మోహన్ బాబు దాడి చేశారు. దీంతో తలకు గాయలయ్యాయి.
ఆ తర్వతా సదరు జర్నలిస్టుకు క్షమాపణ చెప్పడంతో పాటు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి కూడా మోహన్ బాబు పరామర్శించారు. అదలా ఉంచితే దాడి జరిగిన తర్వాత రోజే అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. కొన్నిరోజుల పాటు తనని అరెస్ట్ చేయకుండా కోర్టు అనుమతి తెచ్చుకున్నారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయగా.. దాన్ని తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఒకవేళ కావాలంటే దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన)
Comments
Please login to add a commentAdd a comment