సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడిని డైరెక్టర్ సుకుమార్ పరామర్శించారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన సుకుమార్.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మా తరఫున బాలుడి కుటుంబానికి అవసరమైన సాయాన్ని అందిస్తామని సుకుమార్ హామీ ఇచ్చారు. అయితే అంతకుముందే సుకుమార్ భార్య తబిత బాలుడికి కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. డిసెంబర్ 9వ తేదీన శ్రీతేజ్ తండ్రికి రూ.5 లక్షల సాయం చేశారు.
అసలేం జరిగిందంటే..
ఈనెల 5న అల్లు అర్జున్ మూవీ పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. అయితే ముందురోజే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు ప్రదర్శించారు మేకర్స్. డిసెంబర్ 4న సినిమా వీక్షించేందుకు అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లారు. అదే సమయంలో అభిమాన హీరోను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆ బాలుడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అల్లు అర్జున్‌పై కేసు..
సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చారు. అంతేకాకుండా బన్నీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు కూడా తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో మరుసటి రోజు ఉదయమే జైలు నుంచి విడుదలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment