విశ్వక్‌సేన్‌ ఫ్రెండయ్యాడు.. అందుకే ఏ సీన్‌లోనూ ఇబ్బందిపడలేదు | Neha Shetty About Gangs of Godavari Movie And Team | Sakshi
Sakshi News home page

Neha Shetty: వానపాటకు కేరాఫ్‌ అడ్రస్‌.. రాధిక అని పిలుస్తుంటే..

Published Mon, May 27 2024 3:43 PM | Last Updated on Mon, May 27 2024 4:28 PM

Neha Shetty About Gangs of Godavari Movie And Team

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి". కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు.  ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మే 31వ తేదీన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నేహా శెట్టి చిత్ర విశేషాలను పంచుకున్నారు.

తీవ్ర ఎండలో..
నేను ఇప్పటివరకు ఎక్కువగా మోడ్రన్ పాత్రలే చేశాను. కానీ బుజ్జి పాత్ర అలా కాదు. అందుకే దానికి తగ్గట్టుగా హోంవర్క్ చేశాను. పైగా మాటల కంటే ఎక్కువగా కళ్ళతోనే భావాలను పలికించే పాత్ర ఇది. విశ్వక్ సేన్ తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. తీవ్ర ఎండలో కూడా షూట్ చేశాడు. మేము మంచి స్నేహితులయ్యాం. అందుకే ఎటువంటి సన్నివేశాల చిత్రీకరణలోనూ ఇబ్బంది పడలేదు. 

అంజలి నుంచి చాలా నేర్చుకోవచ్చు
అంజలి గారు చాలా సరదాగా ఉంటారు. విషాద సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నేను మౌనంగా కూర్చుంటాను. కానీ ఆమె అలా కాదు. అప్పటివరకు నవ్వుతూ ఉండి, టేక్ కి వెళ్ళగానే పాత్రకి తగ్గట్టుగా మారిపోతారు. అంజలి గారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. గోదావరి పరిసరాల్లో షూటింగ్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాం. రాజమండ్రి ప్రజలు చాలా స్వీట్ పీపుల్. మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు. అక్కడి ఫుడ్ కూడా చాలా బాగుండేది. 

వడదెబ్బ
గతేడాది వేసవి నుంచి ఈ సమ్మర్‌ వరకు సినిమా చిత్రీకరణ జరిగింది. అధిక ఎండ వల్ల ఇబ్బంది పడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఒకసారి రాజమండ్రిలో షూట్ చేస్తున్న సమయంలో మా చిత్ర బృందంలోని పలువురికి వడదెబ్బ కూడా తగిలింది.  నన్ను రాధిక అని పిలవడం సంతోషంగా అనిపిస్తుంది. మనం పోషించిన పాత్ర పేరుతో మనల్ని పిలవడం అనేది.. ఏ నటులకైనా గొప్ప ప్రశంస. పోలిక అని కాదు కానీ.. షారుఖ్ ఖాన్ గారిని బాద్‌షా అని పిలుస్తారు. అలా నేను కెరీర్ ప్రారంభంలోనే రాధిక అని పేరు తెచ్చుకోవడం హ్యాపీ..

వాన పాటలకు కేరాఫ్‌ అడ్రస్‌
ప్రేక్షకుల హృదయాల్లో ఆ పాత్ర అంతటి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. వాళ్ళు అభిమానంతో రాధిక అని పిలవడాన్ని గౌరవంగానే భావిస్తున్నాను. అప్పట్లో వాన పాటలంటే శ్రీదేవి గారు గుర్తుకొచ్చే వారు. అంత గొప్ప నటిలా.. ఇప్పుడు నాకు ఎక్కువ వాన పాటల్లో కనిపించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఒక సినిమా చేయబోతున్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement