shekar reddy
-
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు
-
అప్పుడు ఉగిపోయావు కదా.. మరి ఇప్పుడేమైంది.. పవన్ మూగబోయావ్
-
KSR Live Show: బాబు ఒక అప్పుల అప్పారావు.. ఏపీ మరో శ్రీలంక కాబోతుంది.. కూటమిపై శేఖర్ రెడ్డి ఫైర్
-
వలంటీర్ లపై ప్రతిపక్షాల వ్యూహం ఓటమికి చంద్రబాబు సిద్ధం
-
బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులు.. 23 ఎకరాల ప్రాజెక్ట్ విషయంలో..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేతల నివాసాల్లో మూడో రోజు కూడా ఐటీ అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి సహా లైఫ్‌స్టైల్ మధుసూదన్ రెడ్డి నివాసంలోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. కాగా, ఐటీ శాఖ అధికారులు మధుసూదన్ రెడ్డి భార్య, కుమారుడిని ప్రశ్నిస్తున్నారు. రియల్ ఎస్టేట్ భాగస్వామ్యం, వ్యాపార లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బీఆర్ఎస్ నేతలతో మధుసూదన్‌రెడ్డి లావాదేవీలపైనా విచారణ చేస్తున్నారు. ఎల్బీనగర్లో 23 ఎకరాల ప్రాజెక్ట్ విషయంలో భారీగా నగదు చేతులు మారినట్టు ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో భారీ ప్రాజెక్ట్ చేపట్టిన సంస్థతో ఒప్పందాలపై దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల రియల్ ఎస్టేట్ సిండికేట్పైనా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక, గురువారం కూడా వారి కంపెనీల లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆరా తీశారు. కంపెనీల ఆదాయం, ఐటీ రిటర్న్స్ వ్యత్యాసాలపై పత్రాలను పరిశీలిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, లాకర్స్ వివరాలను అధికారులు సేకరించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. ఐటీ సోదాలు ముగిసిన అనంతరం అధికారులు.. గురువారం రోజున ఎంపీ ప్రభాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. అవసరమైనప్పుడు విచారణకు సహకరించాలని అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని కావాలి: బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు -
ముగిసిన సోదాలు.. బీఆర్ఎస్ ఎంపీకి నోటీసులిచ్చిన ఐటీ అధికారులు
సాక్షి, మెదక్: తెలంగాణ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ దాడులు పొలిటికల్‌గా కలకలం సృష్టించాయి. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న బీజేపీపై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. మరోవైపు.. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. ఇక, ఐటీ సోదాలు ముగిసిన అనంతరం అధికారులు.. ఎంపీ ప్రభాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. అవసరమైనప్పుడు విచారణకు సహకరించాలని అధికారులు తెలిపారు. మరోవైపు, పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి నివాసాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా, కంపెనీల లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆరా తీస్తున్నారు. కంపెనీల ఆదాయం, ఐటీ రిటర్న్స్ వ్యత్యాసాలపై పత్రాలను పరిశీలిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, లాకర్స్ వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన నివాసం, భువనగిరి, హైదరాబాద్ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలోని కార్యాలయాలతో పాటు 12 చోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎమ్మెల్యేతో పాటుగా ఆయన మామ మోహన్‌రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ తనిఖీల్లో భాగంగా భారీగా నగదు, కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. కాగా, కొత్త ప్రభాకర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. మెయిన్ ల్యాండ్స్ డిజిటల్ టెక్నాలజీ సంస్థకు డైరెక్టర్‌గా శేఖర్ రెడ్డి భార్య పైళ్ల వనిత రెడ్డి ఉన్నారు. ఇదే కంపెనీకి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి భార్య మంజులత కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, పన్నులు చెల్లింపులలో అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఇది కూడా చదవండి: వచ్చే ఎన్నికల్లో తుపాను రాబోతోంది.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు -
ఐటీ దాడులు: పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట భారీ నగదు, డాక్యుమెంట్స్ సీజ్!
సాక్షి, హైదరాబాద్/ సూర్యాపేట: బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసం, భువనగిరి, హైదరాబాద్ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలోని కార్యాలయాలతో పాటు 12 చోట్ల 12 గంటలుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేతో పాటుగా ఆయన మామ మోహన్‌రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ తనిఖీల్లో భాగంగా భారీగా నగదు, కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. కాగా, కొత్త ప్రభాకర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. మెయిన్ ల్యాండ్స్ డిజిటల్ టెక్నాలజీ సంస్థకు డైరెక్టర్‌గా శేఖర్ రెడ్డి భార్య పైళ్ల వనిత రెడ్డి ఉన్నారు. ఇదే కంపెనీకి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి భార్య మంజులత కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, పన్నులు చెల్లింపులలో అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంటి వద్ద ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఐటీ దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఇక, ఐటీ దాడులపై ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కక్షసాధింపు కోసమే.. కేంద్రంలో ఉన్నా బీజేపీ తమ ఇంటిపై ఐటీ సోదాలు చేయించింది. ఆ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, తాను పూర్తిగా వైట్ పేపర్ అని స్పష్టం చేశారు. నేను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. 1986 నుంచి వ్యాపారం చేస్తున్నానని, అప్పటి నుంచే పాన్‌కార్డు తీసుకున్నానని, నాటి నుంచి నేటి వరకు మా వ్యాపారం పూర్తిగా వైటే అని తెలిపారు. హైదరాబాద్‌లోని ఇంట్లో ఉన్న తన కూతురు ఐటీ అధికారులకు సెర్చ్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చిందన్నారు. అయితే అక్కడ ఎలాంటి ఆధారాలు వారికి లభించలేదన్నారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరుగుతున్న ఐటీ దాడులపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ, ఈడీ దాడులతో బీఆర్ఎస్ నేతలను బీజేపీ భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోంది. ఇలాంటి దాడులకు మేం భయపడే ప్రసక్తే లేదు. రాజకీయ కక్షలో భాగమే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంటిపై దాడులు. శేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే వ్యాపారవేత్త. రాజకీయంగా శేఖర్ రెడ్డిని ఇబ్బందులకు గురిచేయడం పిరికి పందల చర్య అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు.. 70 బృందాలతో -
నాతో నువ్వుంటే చాలు
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ నటిస్తోన్న తాజా చిత్రం ‘90 ఎం.ఎల్’. నేహా సోలంకి కథానాయిక. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ– ‘‘టైటిల్‌కి తగ్గట్టుగానే మా సినిమా వైవిధ్యంగా ఉంటుంది. వాణిజ్య అంశాలతో వినోదాత్మకంగా ఉంటుంది. అజర్ బైజాన్‌లో ఇటీవల చిత్రీకరించిన మూడు పాటలతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. శేఖర్‌రెడ్డి ఎర్ర మాట్లాడుతూ– ‘‘అజర్ బైజాన్ రాజధాని బాకులోని అందమైన ప్రదేశాల్లో 8 రోజులు జరిపిన షూటింగ్లో ‘వెళ్లిపోతుందే వెళ్లిపోతుందే..’, ‘సింగిల్ సింగిల్..’, ‘నాతో నువ్వుంటే చాలు...’ అనే పాటలను హీరో, హీరోయిన్‌తో పాటు 10 మంది డ్యాన్సర్లపై చిత్రీకరించాం. జానీ మాస్టర్ ఎక్స్ట్రార్డినరీగా స్టెప్స్ కంపోజ్ చేశారు. ఈ మూడు పాటలు చిత్రానికి మంచి హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. రవికిషన్, రావు రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్, ప్రగతి, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: జె.యువరాజ్. -
ఎవరికి బినామీ?
-
ఏపీలో చర్చనీయాంశమైన శేఖర్‌రెడ్డి కేసు
-
‘ఆ నోట్ల విషయం ఆర్బీఐకి కూడా తెలియదా?’
సాక్షి, చెన్నై: టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు, తమిళనాడు ఇసుక కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డికి రూ. 2000 కొత్త నోట్లు ఎలా వచ్చాయో తెలియదని ఆర్బీఐ చెప్పింది. దీనిపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ మాట్లాడుతూ.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విధంగా చెప్పడం ఆశ్యర్యకరమని అన్నారు. ఆ కొత్త నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియక పోవడం వల్లనే కేసు విచారణలో జాప్యం జరుగుతున్నదని సీబీఐ చెప్పడం దిగ్ర్భాంతికరమన్నారు. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంల అక్రమార్జనకు శేఖర్ రెడ్డి బినామీ కథానాయకుడనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనని చెప్పారు. కరెన్సీ ముద్రణాలయాలు, బ్యాంకులు ఆర్బీఐ అదుపాజ్ఞల్లో పనిచేస్తాయి. వీటి నుంచి శేఖర్‌రెడ్డికి భారీ మొత్తంలో సొమ్ము ముట్టిన సంగతి తమకు తెలియదని ఆర్బీఐ చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవని ఆయన వ్యాఖ్యానించారు. సీబీఐ కోరిన వివరాలు అందజేయాలని ఆర్బీఐని ఆయన కోరారు. శేఖర్‌రెడ్డి కేసు నీరుగారిపోకుండా చూడాలని గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆర్బీఐకి స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. సంబంధిత వార్త శేఖర్‌రెడ్డి కేసులో చేతులెత్తేసిన ఆర్బీఐ -
శేఖర్‌రెడ్డి కేసులో చేతులెత్తేసిన ఆర్బీఐ
సాక్షి, చెన్నై : ఆదాయపు పన్ను శాఖ చరిత్రలోనే సంచలనం రేకెత్తించిన తమిళనాడుకు చెందిన కాంట్రాక్టర్, టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి కేసులో ప్రతిష్టంభన నెలకొంది. పెద్ద నోట్లు రద్దయిన తరువాత కేవలం నెల రోజుల్లో రూ.33.6 కోట్ల కొత్త కరెన్సీ శేఖర్‌రెడ్డికి ఎలా వచ్చిందనే వివరాలపై రిజర్వు బ్యాంకు చేతులెత్తేయగా, ఈ చిక్కుముడిని ఛేదించలేక, చార్జిషీటు దాఖలు చేయలేక సీబీఐ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసినట్లు గత ఏడాది నవంబరు 8వ తేదీ రాత్రి ప్రధానమంత్రి మోదీ అకస్మాత్తుగా ప్రకటించారు. వీటికి బదులుగా రిజర్వు బ్యాంకు కొత్తగా రూ.2వేలు, రూ.500 నోట్లను విడుదల చేఽసి బ్యాంకుల్లో పాత నోట్లు చెల్లించి కొత్త నోట్లను పొందే వెసులుబాటును పరిమితులతో కల్పించింది. అ సమయంలో కొందరు వ్యక్తులు బ్యాంకుల నుంచి అక్రమ మార్గంలో రూ.2000 కొత్త నోట్లను పొందినట్లు కేంద్రానికి ఫిర్యాదులు అందడంతో ఆదాయపు పన్ను శాఖాధికారులు దేశవ్యాప్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్ఆర్ఎస్ కంపెనీ పేరున తమిళనాడువ్యాప్తంగా ఇసుక క్వారీలు నడిపే కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో గత ఏడాది డిసెంబరు 8న ఐటీ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా రూ.170 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తంలో రూ.33.6 కోట్ల విలువైన రూ.2000 కొత్త నోట్లను అధికారులు గుర్తించారు. సీబీఐకు విచారణ బాధ్యత కేసు తీవ్రత దృష్ట్యా విచారణ బాధ్యతను సీబీఐ చేపట్టింది. పెద్ద నోట్ల రద్దు తరువాత కేవలం నెల రోజుల వ్యవధిలో రూ.33.6 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఏ బ్యాంకు ద్వారా వచ్చాయని శేఖర్‌రెడ్డిని విచారించినా సరైన ఆధారాలు రాబట్టలేకపోయారు. ఒకే సీరియల్లో రూ.33.6 కోట్ల కొత్త కరెన్సీ శేఖర్‌రెడ్డికి ఎలా లభించిందని ఆర్బీఐనీ సీబీఐ ప్రశ్నించింది. కరెన్సీని ముద్రించే నాసిక్, మైసూర్ తదితర ప్రాంతాల నుంచి తమకు కొత్త నోట్లు చేరుతాయి.. వాటిని యథాతథంగా బ్యాంకులకు పంపుతాం.. సీరియల్ నంబర్లను రికార్డుల్లో నమోదు చేసే అలవాటు లేదు అని ఆర్బీఐ అధికారులు బదులిచ్చారు. సమస్యలు ప్రారంభమైన నాటినుంచి మాత్రమే సీరియల్ నంబర్లు నమోదు ప్రారంభించామని తెలిపారు. ఈ కారణంగా రూ.33.6 కోట్ల కొత్త కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చిందో వివరాలు ఇవ్వలేమని ఆర్బీఐ అధికారులు చేతులెత్తేశారు. చార్జిషీటు దాఖలు చేయలేక అవస్థలు అరెస్టు చేసిన 90 రోజుల్లో శేఖర్‌రెడ్డిపై చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంది. అయితే కీలకమైన ఆధారాలు దొరక్కపోవడంతో చార్జిషీటు దాఖలు చేయలేకపోయారు. రూ.33.6 కోట్ల కొత్త కరెన్సీ గురించి బ్యాంకులు, రిజర్వు బ్యాంకు వద్ద విచారణ కొనసాగుతున్నందున నిర్ణీత కాలంలో చార్జిషీటు దాఖలు చేయలేకపోయామని సీబీఐ అధికారులు న్యాయస్థానానికి చెప్పుకున్నారు. దీంతో శేఖర్‌రెడ్డి తదితరులకు బెయిల్ మంజూరైంది. పట్టుబడిన నగదు, బంగారానికి పన్ను చెల్లించామని, 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్సుగా రూ.31 కోట్లు చెల్లించామని, ఇదంతా నిబంధనలకు లోబడి వ్యాపారం ద్వారా ఆర్జించినదేనని శేఖర్‌రెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో వాదిస్తున్నారు. సీరియల్ నంబర్ల చిక్కుముడి వీడితేగాని కేసు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. -
శేఖర్ రెడ్డికి బెయిల్ మంజూరు
చెన్నై: అక్రమంగా భారీ మొత్తంలో నగదు, బంగారం దాచిన కేసులో అరెస్ట్ అయిన టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గతేడాది డిసెంబర్లో పెద్ద నోట్ల రద్దు తర్వాత శేఖర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు చేసిన దాడుల్లో భారీ మొత్తంలో నగదు, డబ్బు పట్టుబడింది. దాదాపు 120 కోట్ల రూపాయలకు పైగా నగదు దొరికింది. ఐటీ అధికారులు.. శేఖర్‌రెడ్డితో పాటు ఆయన వ్యాపార భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలపైనా దాడి చేశారు. నోట్ల రద్దు ప్రకటన తర్వాత మొదటిసారిగా పెద్దమొత్తంలో నగదు, బంగారం పట్టుబడిన ఈ కేసును ఐటీ శాఖ.. సీబీఐకి సిఫారసు చేసింది. ఈ సంఘటన జరిగాక శేఖర్ రెడ్డిని టీటీడీ పాలకమండలి సభ్యుడి పదవి నుంచి ఏపీ ప్రభుత్వం తొలగించింది. -
బస్సు ప్రమాదంలో అన్నదమ్ముల విషాదగాథ
-
వందల కోట్లు ఏం చేద్దాం?
-
వందల కోట్లు ఏం చేద్దాం?
► అంత డబ్బు ఎలా కాపాడుకోవాలంటూ శేఖర్‌రెడ్డితో ఫోన్లో రామ్మోహన్రావు మంతనాలు ► అప్పటికే శేఖర్‌రెడ్డి సెల్‌ఫోన్‌పై నిఘా ► పక్కా ఆధారాలతో 13 చోట్ల ఐటీ దాడులు ► తమిళనాడు సీఎస్ రామ్మోహన్రావు సస్పెన్షన్.. ► అతని కుమారుడు వివేక్, స్నేహితుని ఇంటిపైనా దాడులు ► ఆరుగురు మంత్రులపై ఐటీ కన్ను.. ఆంధ్రప్రదేశ్ సంబంధాలపై ఆరా ► శేఖర్‌రెడ్డితో పరిచయం ఉన్న వారిపై త్వరలో దాడులకు రంగం సిద్ధం చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ అధికారులు బుధ, గురు వారాల్లో నిర్వహించిన దాడులు దేశవ్యాప్తంగా కలకలం రేపగా, శేఖర్‌రెడ్డితో గంటల కొద్దీ జరిపిన సంభాషణే ఆయన్ను పట్టించినట్లు స్పష్టమైంది. దీంతో ఆయనపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. చెన్నై అన్నానగర్‌లోని రామ్మోహన్రావు నివాసం, తిరువాన్మియూర్లోని ఆయన కుమారుని ఇల్లు సహా మొత్తం 13 చోట్ల ఐటీ అధికారులు బుధవారం తెల్లవారుజాము 5.30 గంటలకు ప్రారంభించిన దాడులు గురువారం ఉదయం వరకు కొనసాగాయి. రామ్మోహన్రావు పీఏలైన శేఖర్, కుమార్‌లను కూడా ఐటీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసును శేఖర్‌రెడ్డి కేసుతో కలపాలా.. లేక వేరుగా విచారించాలా అని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ దాడుల్లో రామ్మోహన్రావు ఇంటి నుంచి రూ.30 లక్షల కొత్త కరెన్సీ, రూ.5 కోట్ల విలువైన బంగారం, రూ.100 కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆయన కుమారుడు వివేక్ ఇంటి నుంచి 10 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వలసరవాక్కంలో నివసించే వివేక్ స్నేహితుడు, న్యాయవాది అమలనాథన్ ఇంటిపై కూడా గురువారం ఐటీ దాడులు జరిగాయి. ఆరుగురితో కూడిన అధికారుల బృందం సోదాలు చేపట్టింది. వివేక్ స్నేహితుడి ఇంట్లో ఏమి స్వాధీనం చేసుకున్నారో వివరాలు వెల్లడి కాలేదు. డబ్బులెలా కాపాడుకోవాలంటూ దొరికిపోయారు.. అక్రమార్జనను కాపాడుకోవడం కోసం జరిపిన సెల్‌ఫోన్ సంభాషణే రామ్మోహన్‌రావును పట్టించింది. శేఖర్‌రెడ్డి ఆస్తులపై దాడుల అనంతరం బినామీ పెద్దలెవరో తెలపాలని విచారణలో ఐటీ అధికారులు అడగ్గా, విధిలేని పరిస్థితుల్లో రామ్మోహన్రావు పేరు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తి ఇంటిపై కేవలం ఒకరి వాంగ్మూలంతో దాడులు చేసేందుకు వీలుకాదని తొలుత సంశయించారు. మరేదైనా బలమైన ఆధారం కోసం అన్వేషించగా ఇసుక క్వారీల అనుమతిపై భారీ ఎత్తున రాయితీలకు రామ్మోహన్రావు సిఫార్సు చేసినట్లు పర్యావరణ అధికారులు స్పష్టం చేశారు. ఆధారాలతో కూడిన డాక్యుమెంట్లను కూడా సమర్పించారు. మరో కోణంలో కూడా ఆధారాల కోసం ఆరా తీశారు. ఇందులో భాగంగా ఇసుక తదితర వ్యాపార లావాదేవీలతో సమకూరిన సొమ్ముపై శేఖర్‌రెడ్డితో గంటల కొద్దీ సాగించిన సంభాషణే రామమోహన్‌రావును రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది. జయలలిత మరణించిన మరుసటి రోజున వారిద్దరూ ఫోన్ ద్వారా ‘మన వద్ద ఉన్న కొన్ని వందల కోట్ల రూపాయలను ఎలా కాపాడుకోవాలి’ అంటూ మాట్లాడుకున్నారు. ముఖ్యమంత్రి మరణించి రాష్ట్రంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న అధికారి.. అంత్యక్రియల ఏర్పాట్లను చూడకుండా, డబ్బును దాచుకోవడం ఎలా అనే కంగారును ప్రదర్శించడం తమను విస్మయానికి గురి చేసిందని ఐటీ శాఖలోని ఒక ఉన్నతాధికారి చెప్పారు. శేఖర్‌రెడ్డి ఫోన్‌పై నిఘా పెట్టి, ఇద్దరి మధ్య సాగిన సంభాషణలను నిర్ధారించుకున్న తర్వాతే దాడులు జరిపామని ఆయన తెలిపారు. ఇసుక క్వారీల ద్వారా ఏడాదికి రూ.15 వేల కోట్ల లావాదేవీలు సాగుతుండగా, తద్వారా వచ్చిన రూ.17 కోట్ల ఆదాయాన్ని శేఖర్‌రెడ్డి నుంచి రామ్మోహన్రావు పొందినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అయితే రామ్మోహన్రావు పేరున స్థిరాస్తులు పెద్దగా లేనట్లు తేలింది. సుమారు రెండు వారాల క్రితమే ఐటీ అధికారులు దాడులకు సిద్ధమైనా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందడంలో జాప్యమైంది. ఈ జాప్యం వల్ల రామ్మోహన్‌రావుకు విషయం లీకయింది. దీంతో ఆయన జాగ్రత్త పడ్డట్లు సమాచారం. రెండు వారాల క్రితమే దాడులు జరిపి ఉంటే రామ్మోహన్రావు, బంధువుల ఇళ్ల నుంచి భారీగా ఆస్తులు, నగదు పట్టుబడి ఉండేవని అంటున్నారు. సస్పెన్షన్ వేటు ఐటీ దాడుల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావుపై సస్పెన్షన్ వేటు పడింది. అతన్ని వేకెన్సీ రిజర్వు(వీఆర్)కు పంపారు. ఐటీ దాడుల నేపథ్యంలో ఆయన్ను పదవి నుంచి తొలగించడం ఖాయమని బుధవారం నుంచే ప్రచారం జరుగుతున్న తరుణంలో గురువారం తెల్లారేసరికి ఆయనను సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం పన్నీర్ సెల్వం గురువారం మంత్రులతో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్ ఉత్తర్వులను పోస్టుద్వారా రామ్మోహన్రావు ఇంటికి పంపారు. కాగా, ఐఏఎస్ అధికారుల్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా తీవ్రంగా స్పందించే ఐఏఎస్ సంఘం రామ్మోహన్రావు విషయంలో మౌనం పాటిస్తోంది. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కాకుండా రామ్మోహన్రావు ఒక వీవీఐపీగా కొందరు మంత్రులతో రహస్య సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, వివిధ శాఖల నిర్మాణ పనులు ఆయన కనుసన్నల్లోనే సాగాలనే ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఇలా సర్వాధికారిగా మారడాన్ని సహించలేని కొందరు అధికారులే ఐటీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. సచివాలయంలో సీఎస్ చాంబర్లో ఐటీ దాడులను ఐఏఎస్ అధికారులు అవమానకరంగా భావిస్తూనే మరోవైపు సంతోషాన్ని వ్యక్తం చేశారు. త్వరలో మరిన్ని దాడులు ఇదిలా ఉండగా త్వరలో రాష్ట్రంలో మరికొన్ని దాడులు జరుపనున్నట్లు ఐటీ అధికారి ఒకరు తెలిపారు. తమిళనాడుతో పాటూ ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఎవరెవరితో వ్యాపార లావాదేవీలు జరిపారో విచారిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడు ప్రభుత్వంలోని ఆరుగురు మంత్రులతో శేఖర్‌రెడ్డి, రావులకు వ్యాపార సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నామని ఆయన అన్నారు. దాడుల్లో పట్టుబడిన సొమ్ములో ఈ ఆరుగురు మంత్రులకు వాటా ఉన్నట్లు తెలుసుకున్నామని చెప్పారు. కొందరు పారిశ్రామికవేత్తలు సైతం వీరి మనుషులుగా తేలిందన్నారు. శేఖర్‌రెడ్డితో పరిచయం ఉన్న అందరు వ్యక్తులపై తమకు సందేహాలు ఉన్నాయని, అవసరమైతే అందరి ఇళ్లపై దాడులు చేస్తామని చెప్పారు. శేఖర్‌రెడ్డి, రామ్మోహన్రావులకు కొత్త కరెన్సీని చేరవేసిన బ్యాంకు అధికారుల జాబితాను సైతం సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
పసుపు పార్టీ ‘నల్ల’ న్యాయం
డేట్లైన్ హైదరాబాద్ తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సభ్యుడు శేఖరరెడ్డి దగ్గర నూట ఇరవై కోట్ల రూపాయల నల్లధనం, వంద కిలోలకు మించి బంగారు కడ్డీలు దొరికాయి. కేసు నమోదైంది. దొరికిన నగదులో చాలావరకు కొత్త నోట్లు. అవి రిజర్వు బ్యాంక్ నుంచి నేరుగా శేఖరరెడ్డి ఇంటికి తరలి వచ్చాయా? అన్న అనుమానం మొదట్లో కలిగినా, విచారణ తరువాత రెండు బ్యాంక్‌ల శాఖల నుంచి ఆ డబ్బు వచ్చిందని వెల్లడైంది. సరే, బ్యాంకుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఆలోచించుకుంటుంది. శేఖరరెడ్డికి ఎలాంటి శిక్ష పడుతుందో భవిష్యత్తులో తెలుస్తుంది. దేశమంతటా ఇటువంటి కొందరు ‘నల్ల’దొరలు ఈ ఐదువారాలలో దొరికారు. వారి వారి సామర్థ్యాన్ని బట్టి డబ్బు కూడా దొరికింది. ఈ మొత్తం కొత్త నోట్లు వాళ్లకు ఎట్లా వస్తున్నాయన్నది ప్రశ్న. కచ్చితంగా ఈ నేరం బ్యాంకు అధికారులదే అనడంలో సందేహం లేదు. శేఖరరెడ్డి బడా కాంట్రాక్టర్. వేల కోట్ల రూపాయలలోనే ఉంటుందట కాంట్రాక్టుల వ్యవహారం. తమిళనాడులో అధికార పక్షం అన్నా డీఎంకేకి అత్యంత సన్నిహితుడు, దివంగత ముఖ్యమంత్రి జయలలితకూ, ఆమె ప్రియసఖి శశికళకూ, కొత్త ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకూ కూడా శేఖరరెడ్డి అత్యంత సన్నిహితుడనే వార్తలు వచ్చాయి. జయ భవనంలోకి అలవోకగా వెళ్లగల పలుకుబడి కలవాడని సమాచారం. శేఖరరెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించాల్సిందిగా తమిళనాడు అధికారపక్షం నుంచి ఒత్తిడి వచ్చిందని ఆయన నల్లధనం బయటపడిన తరువాత ఆంధ్రప్రదేశ్ అధికారపక్షం వాదించడం ఆరంభించింది. ఎవరో చెబితే ఆయనను బోర్డు సభ్యుడిగా నియమించాల్సి వచ్చిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. టీటీడీ బోర్డులో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఒక్కొక్క సభ్యుడిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సుల మేరకు నియమిస్తారు, కాబట్టి మాకేం సంబంధం? అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పించుకోజూస్తున్నది. సరే, ఆయనను బోర్డు నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఇంతటితో చంద్రబాబు బాధ్యత తీరినట్టేనా? శేఖరరెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా తొలగించి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? ఇది బాధ్యతా రాహిత్యం కాదా? వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల అధ్యక్షులుగా, బోర్డుల సభ్యులుగా తమ వారిని నియమించుకునే అధికారం ప్రభుత్వ పక్షానికి ఎప్పుడూ ఉంటుంది. అయితే ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రభుత్వ అధినేత ఇటువంటి నియామకాలు చేసేటప్పుడు సదరు అభ్యర్థుల నేపథ్యం గురించి కొంతైనా ఆలోచించకుండా, రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు తీసుకోవడం సాధారణమైపోయింది. ఆర్థికబలం, రాజకీయ పలుకుబడి కలిగినవారే ఎక్కువ భాగం ఈ నామినేటెడ్ పదవులను దక్కించుకుంటూ ఉంటారు. అయితే ధార్మిక కార్యకలాపాలకు సంబంధించిన టీటీడీ బోర్డు వంటి వాటిల్లో నియామకాలనైనా రాజకీయాలకూ, అవినీతికీ దూరంగా ఉంచితే బాగుండేది. అలాంటిదేమీ జరగకపోగా, ‘ఎవరో చెప్పారు నేను నియమించాను!’ అని ముఖ్యమంత్రే చెప్పడం బాధ్యతారాహిత్యం. శేఖరరెడ్డి వంటి వారిని టీటీడీ బోర్డు వంటి సంస్థలలో సభ్యులుగా నియమించేటప్పుడు వారి గత చరిత్ర ఏమిటో చూసుకోవాల్సిన అవసరం లేదని భావించేంతగా చంద్రబాబు మీద ఏ రకమయిన ఒత్తిడి వచ్చిందో ఆయన స్వయంగా ప్రకటిస్తేనే బాగుంటుంది. శేఖరరెడ్డి నేపథ్యం ఎలాంటిదో చంద్రబాబునాయుడుకు తెలియకుండానే ఈ నియామకం జరిగిందంటే మాత్రం ఎవరూ నమ్మరు. ఈ అవినీతి వ్యవహారం బయటపడ్డాక ఆయనను బోర్డు నుంచి తొలగించి చేతులు దులుపుకున్నానని భావిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చిన్నదో పెద్దదో ఇంకో అవినీతి బురద పూసుకున్న తెలంగాణ టీడీపీ శాసనసభ్యుడు వెంకటవీరయ్యను అదే టీటీడీ బోర్డులో సభ్యుడిగా ఎందుకు కొనసాగిస్తున్నట్టు? సండ్రను ఎందుకు ఉపేక్షిస్తున్నట్టు? తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికలలో ఒక శాసనసభ్యుడిని డబ్బుతో కొనేందుకు ప్రయత్నించిన కేసులో మరో శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి సహ నిందితుడు సండ్ర వెంకటవీరయ్య. ఆ కేసులో ఆయన కూడా కొద్దిరోజులు జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకొచ్చారు. మరి శేఖరరెడ్డిని బోర్డు నుంచి తొలగించిన తెలుగుదేశం ప్రభుత్వం వెంకటవీరయ్యను ఎందుకు ఉపేక్షిస్తున్నట్టు? రెండు రోజులక్రితం ఢిల్లీలో ఓటుకు కోట్లు కేసు విషయంలో విలే కరులు అడిగిన ప్రశ్నకు ఇందులో మాట్లాడటానికి ఏముందని చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో ఏమీలేదని చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అక్కడి అధికార పక్షం వారి వారి కారణాల వల్ల భావించుకోవచ్చు కానీ, జరిగిన బాగోతం అంతా చరిత్రలో రికార్డు అయ్యే ఉంది. బహుశా అందులో ఏమీ లేదనుకున్నారు కాబట్టే వెంకటవీరయ్యను టీటీడీ బోర్డు నుంచి తొలగించకుండా ఉంచేసుకున్నట్టున్నారు చంద్రబాబు. బహుశా తన ప్రోద్బలం మీదనే ఓటుకు కోట్లు వ్యవహారం నడిచింది కాబట్టి వెంకటవీరయ్య విషయంలో చూసీచూడనట్టు ఉండిపోయారేమో! ఇటువంటి వారా దేవుడి వ్యవహారాలు చక్కబెట్టేది అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. విపక్షనేతను లాగడం ఎందుకు? ‘తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు’ అన్న రీతిలో నడుస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడానికి కొద్దిమాసాల ముందు స్వచ్ఛందంగా సంపద ప్రకటించే ఒక పథకాన్ని తెచ్చింది. ఆ పథకం కింద ఆదాయాన్ని ప్రకటించే వారి పేర్లు గోప్యంగా ఉంటాయి. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి ఒకరు రూ. 10 వేల కోట్లు ప్రకటించినట్టు వార్తలు వెలువడ్డాయి. వెంటనే చంద్రబాబునాయుడు విలేకరులను సమావేశపరచి, ఆ 10 వేల కోట్ల రూపాయల ప్రకటన వెనుక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి ఉన్నారన్నట్టు ధ్వనించే రీతిలో మాట్లాడారు. ఆయన మాటల నుంచి స్ఫూర్తి పొందిన ఆయన మంత్రివర్గ సభ్యుడొకరు పేరుతో సహా ప్రతిపక్ష నాయకుడి మీద ఆరోపణ చేశారు. ఈ వ్యవహారం మొన్న బయటపడింది. ఆ వ్యక్తి పేరు లక్ష్మణరావు. ఆ లక్ష్మణరావు ఇంటి మీద ఆదాయ పన్ను శాఖ దాడులు చేస్తే ఆయనకు అంత సీన్ లేదనీ, అదంతా బోగస్ అనీ తేలింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, మంత్రుల స్థాయి వ్యక్తులూ ఇట్లా నిరాధారమైన ప్రకటనలు చేస్తుంటే ప్రజలు ఏమనుకుంటారు? ఇక ఇంకో అధికార పక్ష నేత, మంత్రి ఇంకో అడుగు ముందుకు వేసి ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలోని బంకర్లలో వేల కోట్లు దాచి ఉంచారని బాధ్యతారహితంగా మాట్లాడతారు. అధికారంలో ఉన్నదెవరు? చంద్రబాబు సీఎం కాదా? ఆయన పార్టీ అధికారంలో లేదా? నిజంగానే ఇడుపులపాయలో వేల కోట్లు దాచి ఉంటే మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అధికారికంగానే దాడి చేసి వాటిని బయటపెట్టి ఉండొచ్చు కదా! శేఖరరెడ్డి, సండ్ర వెంకటవీరయ్యల విషయంలో వ్యవహరించిన తీరు చూసినా, లక్ష్మణరావు విషయంలో నోళ్ళు జారిన విషయమైనా, ఇడుపులపాయ బంకర్ల గురించి అవాకులూ చవాకులూ పేలినా అందరికీ అర్థమవుతున్నది ఒక్కటే– అధికార పక్షం అయోమయంలో పడి దిక్కుతోచని మాటలు మాట్లాడుతున్నది. వాళ్ల మైండ్‌సెట్ మారాల్సిందే... మొన్న ఢిల్లీలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, ‘నా ప్రభుత్వమంతా నా కంప్యూటర్లోనే ఉంది, నేను దేన్నయినా మేనేజ్ చెయ్యగలను’ అన్నారు. ఆయన దేన్నయినా మేనేజ్ చెయ్యగలరేమో కొంతకాలం. కానీ, ప్రభుత్వం ఆయన కంప్యూటర్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇవ్వాళ ఇట్లా ఉండేది కాదేమో! ఆ కంప్యూటర్ నుంచి కాస్త దృష్టి మళ్లించి చూస్తే వాస్తవ పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాదు, ప్రజల మైండ్‌సెట్ మారాలని తనకు చాలా ఇష్టమైన పాత డైలాగ్‌నే తిరిగి చెప్పారాయన. నిజమే, తాను మోదీకి లేఖ రాసి పెద్ద నోట్లు రద్దు చేయిస్తే దాని ఫలితంగా బ్యాంకుల ముందు బారులు తీరి, రోజుల తరబడి గడుపుతూ తమకు వచ్చిన కష్టానికి బాధ్యులు ఎవరా అని ఆలోచిస్తున్న ప్రజల మైండ్‌సెట్ మారాల్సిందే. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
నల్ల కుబేరుడిపై ఐటీ సోదాలు
-
నల్లకుబేరుడు..శేఖర్ రెడ్డి పదవి పోయే
చెన్నై: ఐటీ దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారంతో పట్టుబడ్డ శేఖర్ రెడ్డిని టీటీడీ పాలకమండలి సభ్యుడి పదవి నుంచి ఏపీ ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత శేఖర్‌రెడ్డిని టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించిన విషయం తెలిసిందే. మరో వైపు శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు శనివారం కూడా కొనసాగాయి. ఐటీ అధికారుల దాడుల నేపథ్యంలో రూ. 24 కోట్ల కొత్త కరెన్సీని వేరే చోటుకి తరలించాలని ప్రయత్నిస్తుండగా వేలూరులో అధికారులు పట్టుకున్నారు. శేఖర్ రెడ్డి నివాసం వద్ద ఆగివున్న కారులో 12 బాక్సుల్లో ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒకో బాక్సులో రూ.2 కోట్లు మేరకు కొత్త కరెన్సీ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే శేఖర్‌రెడ్డితో పాటు ఆయన వ్యాపార భాగస్వాములు ప్రేమ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కిరణ్‌రెడ్డికి చెందిన చెన్నై, వేలూరు జిల్లాల్లోని ఇళ్లు, కార్యాలయాలపై గురువారం నుంచి జరిపిన దాడుల్లో పెద్ద 170 కోట్ల నగదు , 130 కిలోల బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు ప్రకటన తర్వాత మొదటిసారిగా పెద్దమొత్తంలో నగదు, బంగారం పట్టుబడిన ఈ కేసును ఐటీ శాఖ.. సీబీఐకి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. -
తెలంగాణలో వైఎస్సార్ సీపీ బలోపేతం
కాజీపేట రూరల్ : తెలంగాణలోæ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా పరిశీలకుడు వేముల శేఖర్ రెడ్డి అన్నారు. హన్మకొండ వైస్సార్ సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం జిల్లా స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో శేఖర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని వైఎస్సార్సీపీ బలోపేతానికి గ్రామ స్థాయి నుండి ప్రతి కార్యకర్త సైనికునివలే పని చేయాలని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి రాజన్న పాలన గురించి వివరించాలని అన్నారు. అక్టోబర్ నెలలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డితో వరంగల్ ముఖ్య నాయకులతో సమావేశం హైదరాబాద్‌లో ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సిఎం కేసీఆర్ పాలనతో ప్రజలు విస్తుపోతున్నారని అన్నారు. తెరమీదికి తీసువచ్చిన హన్మకొండ, వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లా మాత్రమే ఉండాలని జనగాంను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీన జరిగే మహానేత దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి వర్థంతిని జిల్లా స్థాయిలో నాయకులు, కార్యకర్తలు జరుపాలని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన అన్నారు. శేఖర్‌రెడ్డి, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి సమక్షంలో 26 మంది వైఎస్సార్ సీపీ మండల పార్టి అధ్యక్షుల ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. అంతకు ముందు మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సంగాల ఇర్మియా, రాష్ట్ర కార్మిక కార్యదర్శి గౌని సాంబయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దోపతి సుదర్శన్‌రెడ్డి, జిల్లా యూత్ ప్రెసిడెంట్ అప్పం కిషన్, జిల్లా అధికార ప్రతినిధి అమరేందర్ రెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు అచ్చిరెడ్డి, మహిళ విభాగం అధ్యక్షురాలు బీంరెడ్డి స్వప్న, క్రిస్టియన్ మైనార్టి జిల్లా అధ్యక్షుడు జన్ను విల్సన్ రాబర్ట్, జిల్లా నాయకులు కమలాకర్‌రెడ్డి, ప్రభాకర్, చందా హరికృష్ణ, మైలగాని కళ్యాణ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొచ్చురవి, గాంధీ, సుమన్ గౌడ్, సుమిత్ గుప్తా, మండల అధ్యక్షుడు వీరారెడ్డి, సైదులు, భాస్కర్, రత్నాకర్, రవి, గజపతి, రమేష్, శ్రీను, జంపయ్య, ఆంజనేయులు, సుమన్, నర్సన్న, లింగన్న, సుజాత, సౌమ్యనాయక్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటడం సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే పైళ్ల
భూదాన్‌పోచంపల్లి : మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. హరితహార కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని కనుముకుల గ్రామంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ సార సరస్వతీ బాలయ్యగౌడ్, జెడ్పీటీసీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, తహíసీల్దార్ డి.కొమురయ్య, ఎంపీడీఓ గుత్తా నరేందర్‌రెడ్డి, ఏఈ బండ వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ పాక కవితావెంకటేశం, వీఆర్వో చాంద్‌పాష, ఉపసర్పంచ్ నిర్మల మోహన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కె.భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో.. మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మొక్కలను నాటారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మర్రి నర్సింహారెడ్డి, ఏఓ ఏజాజ్ అలీఖాన్, డైరెక్టర్లు కె. బాల్‌రెడ్డి, వారాల యాదిరెడ్డి, గుర్రం మణెమ్మ,మాధవరెడ్డి, పెద్దల సత్తమ్మ, పగిళ్ల సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి బాల్‌రెడ్డి, శ్రీధర్, శేఖర్‌రెడ్డి, నర్మద తదితరులు పాల్గొన్నారు.