అక్రమంగా భారీ మొత్తంలో నగదు, బంగారం దాచిన కేసులో అరెస్ట్ అయిన టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది.
చెన్నై: అక్రమంగా భారీ మొత్తంలో నగదు, బంగారం దాచిన కేసులో అరెస్ట్ అయిన టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
గతేడాది డిసెంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత శేఖర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు చేసిన దాడుల్లో భారీ మొత్తంలో నగదు, డబ్బు పట్టుబడింది. దాదాపు 120 కోట్ల రూపాయలకు పైగా నగదు దొరికింది. ఐటీ అధికారులు.. శేఖర్‌రెడ్డితో పాటు ఆయన వ్యాపార భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలపైనా దాడి చేశారు. నోట్ల రద్దు ప్రకటన తర్వాత మొదటిసారిగా పెద్దమొత్తంలో నగదు, బంగారం పట్టుబడిన ఈ కేసును ఐటీ శాఖ.. సీబీఐకి సిఫారసు చేసింది. ఈ సంఘటన జరిగాక శేఖర్ రెడ్డిని టీటీడీ పాలకమండలి సభ్యుడి పదవి నుంచి ఏపీ ప్రభుత్వం తొలగించింది.