
హైదరాబాద్: నగరంలో 2011 జరిగిన ఫ్యాక్షనిస్టు మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం ఆయన చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. చర్లపల్లి జైల్లో ఉన్న భానుని 2016లో చంచల్‌గూడ జైలుకు తరలించారు. భానును కట్టుదిట్టమైన భద్రతతో అతడి అనుచరులు మరో చోటికి తరలించారు. మీడియాతో మాట్లాడేందుకు భాను నిరాకరించాడు.
జైలు నుంచి మహిళా జర్నలిస్టులు విడుదల
చంచల్‌గూడ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసిన ఆరోపణలపై ఇద్దరు మహిళా యూట్యూబ్ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం రేవతి, తనీ్వయాదవ్‌లు జైలు నుంచి విడుదలయ్యారు.