తెలంగాణలో వైఎస్సార్ సీపీ బలోపేతం
Published Mon, Aug 29 2016 12:09 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
కాజీపేట రూరల్ : తెలంగాణలోæ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా పరిశీలకుడు వేముల శేఖర్ రెడ్డి అన్నారు. హన్మకొండ వైస్సార్ సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం జిల్లా స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో శేఖర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని వైఎస్సార్‌సీపీ బలోపేతానికి గ్రామ స్థాయి నుండి ప్రతి కార్యకర్త సైనికునివలే పని చేయాలని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి రాజన్న పాలన గురించి వివరించాలని అన్నారు. అక్టోబర్ నెలలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్ రెడ్డితో వరంగల్ ముఖ్య నాయకులతో సమావేశం హైదరాబాద్‌లో ఉంటుందని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సిఎం కేసీఆర్ పాలనతో ప్రజలు విస్తుపోతున్నారని అన్నారు. తెరమీదికి తీసువచ్చిన హన్మకొండ, వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లా మాత్రమే ఉండాలని జనగాంను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీన జరిగే మహానేత దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి వర్థంతిని జిల్లా స్థాయిలో నాయకులు, కార్యకర్తలు జరుపాలని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన అన్నారు.
శేఖర్‌రెడ్డి, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి సమక్షంలో 26 మంది వైఎస్సార్ సీపీ మండల పార్టి అధ్యక్షుల ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. అంతకు ముందు మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సంగాల ఇర్మియా, రాష్ట్ర కార్మిక కార్యదర్శి గౌని సాంబయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దోపతి సుదర్శన్‌రెడ్డి, జిల్లా యూత్ ప్రెసిడెంట్ అప్పం కిషన్, జిల్లా అధికార ప్రతినిధి అమరేందర్ రెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు అచ్చిరెడ్డి, మహిళ విభాగం అధ్యక్షురాలు బీంరెడ్డి స్వప్న, క్రిస్టియన్ మైనార్టి జిల్లా అధ్యక్షుడు జన్ను విల్సన్ రాబర్ట్, జిల్లా నాయకులు కమలాకర్‌రెడ్డి, ప్రభాకర్, చందా హరికృష్ణ, మైలగాని కళ్యాణ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొచ్చురవి, గాంధీ, సుమన్ గౌడ్, సుమిత్ గుప్తా, మండల అధ్యక్షుడు వీరారెడ్డి, సైదులు, భాస్కర్, రత్నాకర్, రవి, గజపతి, రమేష్, శ్రీను, జంపయ్య, ఆంజనేయులు, సుమన్, నర్సన్న, లింగన్న, సుజాత, సౌమ్యనాయక్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement