మొక్కలు నాటడం సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే పైళ్ల
మొక్కలు నాటడం సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే పైళ్ల
Published Sat, Jul 23 2016 6:33 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
భూదాన్‌పోచంపల్లి : మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. హరితహార కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని కనుముకుల గ్రామంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ సార సరస్వతీ బాలయ్యగౌడ్, జెడ్పీటీసీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, తహíసీల్దార్ డి.కొమురయ్య, ఎంపీడీఓ గుత్తా నరేందర్‌రెడ్డి, ఏఈ బండ వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ పాక కవితావెంకటేశం, వీఆర్వో చాంద్‌పాష, ఉపసర్పంచ్ నిర్మల మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కె.భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
పీఏసీఎస్ ఆధ్వర్యంలో..
మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మొక్కలను నాటారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మర్రి నర్సింహారెడ్డి, ఏఓ ఏజాజ్ అలీఖాన్, డైరెక్టర్లు కె. బాల్‌రెడ్డి, వారాల యాదిరెడ్డి, గుర్రం మణెమ్మ,మాధవరెడ్డి, పెద్దల సత్తమ్మ, పగిళ్ల సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి బాల్‌రెడ్డి, శ్రీధర్, శేఖర్‌రెడ్డి, నర్మద తదితరులు పాల్గొన్నారు.
Advertisement