‘ఆర్‌ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ హీరోగా, మలయాళ భామ అనఘ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ఈ సినిమాతో బోయపాటి శ్రీను దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్ జంధ్యాల దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. గురువారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ ‘ఒక్క కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఆగస్ట్ 2న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. మంచి సినిమా చేశామని సంతృప్తి మాలో ఉంది. ట్రైలర్ చూసిన వారందరూ హిట్ గ్యారంటీ అని అంటున్నారు. ఇప్పటికే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింద’న్నారు.
దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ ‘నాలుగ్గోడల మధ్య ఊహించి రాసుకున్న కథతో ఈ చిత్రాన్ని తీయలేదు. విశాల ప్రపంచంలో జరిగిన యథార్థగాథ మా చిత్రానికి ముడి సరుకయ్యింది. స్క్రీన్ మీద కూడా అంతే సహజంగా ఉంటుంది. ఆ నేచురాలిటీ ప్రేక్షకుడి గుండెను తాకుతుంది’ అన్నారు.
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గుణ 369’
Published Thu, Jul 25 2019 3:48 PM | Last Updated on Thu, Jul 25 2019 3:48 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment