Sri Saripalli: Director Talk About Raja Vikramarka Movie - Sakshi
Sakshi News home page

నేను ఏ సినిమా చేసినా కామెడీ ఉంటుంది: శ్రీ సరిపల్లి

Published Tue, Nov 9 2021 7:55 AM | Last Updated on Tue, Nov 9 2021 9:41 AM

Director Sri Saripalli Talk About Raja Vikramarka - Sakshi

‘ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ)లో  కొత్తగా చేరిన యువకుడి కథే ‘రాజా విక్రమార్క’. క్రమశిక్షణ లేకపోవడం వలన అతను ఎలా ఇబ్బంది పడ్డాడు? అనేది ఆసక్తిగా ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్‌... ఇలా అన్ని అంశాలు ఉంటాయి. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ స్ఫూర్తిగా ఈ సినిమా తీశా’’ అని డైరెక్టర్‌ శ్రీ సరిపల్లి అన్నారు. కార్తికేయ, తాన్యా రవిచంద్రన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఆదిరెడ్డి టి. సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా శ్రీ సరిపల్లి మాట్లాడుతూ– ‘‘అమెరికాలోని యూనివర్సల్‌ స్టూడియోస్‌లో మాస్టర్‌ ఆఫ్‌ ఫిలిం మేకింగ్‌ చేసి, నాలుగేళ్లు అక్కడ ఇండిపెండెంట్‌ సినిమాలకు పని చేశాను. ఆ తర్వాత వీవీ వినాయక్‌గారి దగ్గర దర్శకత్వ శాఖలో చేరి ‘నాయక్‌’, ‘అల్లుడు శీను’ సినిమాలకు పనిచేశాను. ‘ఆర్‌ఎక్స్‌ 100’ టైమ్‌లో కార్తికేయను  చూసి, ‘రాజా విక్రమార్క’ కథ చెప్పాను. తనకి నచ్చడంతో ఈ సినిమా చేశాం. ఇందులో సందర్భానుసారంగా కామెడీ ఉంటుంది కానీ క్యారెక్టర్లు జోకులు వేయవు. దేశంలోని ఓ సమస్యపై ఎన్‌ఐఏ పోరాటం చేయడం సినిమాలో చూపించాం. నేను ఏ జానర్‌ చేసినా కామెడీ ఉండేలా చూసుకుంటాను’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement