Raja Vikramarka Movie
-
వారి కళ్లల్లో ఆ నమ్మకం కనిపిస్తోంది
‘‘దిల్ సే’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది.. ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. ఈ చిత్రంతో విజయం అందుకుంటామనే నమ్మకం యూనిట్ కళ్లల్లో కనిపిస్తోంది. అందుకు తగ్గట్టే ‘దిల్ సే’ పెద్ద విజయం సాధించాలి’’ అని డైరెక్టర్ బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర)’’ అన్నారు. రాజా విక్రమ్ హీరోగా భరత్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దిల్ సే’. శ్రీ అక్కియన్ ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీధర్ మరిసా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16 నుంచి ఓ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని బాబీ కొల్లి విడుదల చేశారు. భరత్ నరేన్ మాట్లా డుతూ– ‘‘ఈ సినిమాలో మాస్క్ వేసుకున్న అమ్మాయి (హీరోయిన్) ఎవరు? అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించడానికే చెప్పడం లేదు’’ అన్నారు. ‘‘దిల్ సే’ నా మొదటి చిత్రం’’ అన్నారు రాజా విక్రమ్. -
టైటిల్ చెప్పినప్పుడు ఆయన గుడ్ లక్ అన్నారు!: కార్తికేయ
‘‘నేనిప్పటికే యాక్షన్ సినిమాలు చేశాను కాబట్టి ఓ నమ్మకం వచ్చింది. కానీ, నేను కామెడీ చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా? అనే క్యూరియాసిటీ ఉంది. నేను బయట చాలా సరదాగా ఉంటాను కాబట్టి ‘రాజా విక్రమార్క’లో కామెడీ చేయడం కష్టం అనిపించలేదు. ట్రైలర్ విడుదలయ్యాక నా కామెడీ టైమింగ్ బావుందని చెప్పినప్పుడు సంతోషపడ్డాను’’ అని కార్తికేయ అన్నారు. శ్రీ సరిపల్లి దర్శకత్వంలో కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఆదిరెడ్డి టి. సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన విశేషాలు... శ్రీ సరిపల్లి చెప్పిన ‘రాజా విక్రమార్క’ కథ నచ్చింది.. తనతో పది నిమిషాలు మాట్లాడిన తర్వాత నిజాయతీగా చేయగలడనే నమ్మకం వచ్చింది. కథను చెప్పినట్టే చక్కగా తెరకెక్కించారు. రెండు కరోనా వేవ్స్ వచ్చినా పట్టుదలతో థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్న రామారెడ్డి, ఆదిరెడ్డిలకు థ్యాంక్స్. ∙ఈ చిత్రంలో యాక్షన్ కూడా స్టయిలిష్‌గా ఉంటుంది. ఎన్ఐఏ ఏజెంట్‌గా డ్రస్సింగ్ కూడా క్లాసీగా ఉంటుంది. రెండున్నర గంటలు ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లే చిత్రమిది. ∙ఒక రోజు శ్రీతో ‘రాజా విక్రమార్క’ టైటిల్ బావుంది.. పెట్టేద్దాం అన్నాను. ఒక రోజు టైమ్ తీసుకుని సరే అన్నాడు. టైటిల్ రిజిస్టర్ చేశాక చిరంజీవిగారికి పంపించాను. ఆయన ‘గుడ్ లక్’ అన్నారు. చిరంజీవిగారి మీద అభిమానంతో ఆయన సినిమా టైటిల్ పెట్టుకున్నాను. ∙ఇమేజ్, మార్కెట్ అంటూ భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటే తెలియకుండా ఒత్తిడిలోకి వెళ్లి కథలో బేసిక్ పాయింట్స్ మిస్ అవుతున్నాను. ఓ ప్రేక్షకుడిగా కథ వినాలని నిర్ణయించుకున్నా. నా ఫిజిక్ వల్లే ‘ఆర్ఎక్స్ 100’, ‘గ్యాంగ్ లీడర్’, ‘వలిమై’ చిత్రాల్లో అవకాశాలు ఇచ్చినట్లు ఆయా చిత్ర దర్శకులే చెప్పారు. బాడీ అలా మెయింటైన్ చేయడం కష్టమే.. అయితే అవకాశాలు వస్తున్నప్పుడు కష్టపడొచ్చు. ∙అజిత్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమా ‘వలిమై’లో విలన్‌గా చేస్తున్నాను. ఈ సినిమా కోసం కొంచెం తమిళ్ నేర్చుకున్నాను. నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాను. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌లో ఒక సినిమా చేస్తున్నాను. ఆ తర్వాత క్లాక్స్ అనే డైరెక్టర్‌తో ఓ సినిమా ఉంటుంది. శివలెంక కృష్ణప్రసాద్గారి శ్రీదేవి మూవీస్ సంస్థలో ఓ సినిమా ఓకే అయింది. ‘రాజా విక్రమార్క’ ప్రీ రిలీజ్ వేడుకలో లోహితకు ప్రపోజ్ చేసి, సర్ప్రైజ్ ఇచ్చాను. ఇన్ని రోజుల నుంచి తనతో ప్రేమలో ఉన్నా ఎప్పుడూ ప్రాపర్‌గా ప్రపోజ్ చేయలేదు. ఫోనులో ఇష్టమని చెప్పడం తప్ప ‘ఐ లవ్ యు’ అని చెప్పలేదు. జీవితాంతం మా ఇద్దరికీ ఓ అందమైన అనుభూతిగా ఉంటుందని ఆ వేదిక మీద ప్రపోజ్ చేశాను. -
నేను ఏ సినిమా చేసినా కామెడీ ఉంటుంది: శ్రీ సరిపల్లి
‘ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ)లో కొత్తగా చేరిన యువకుడి కథే ‘రాజా విక్రమార్క’. క్రమశిక్షణ లేకపోవడం వలన అతను ఎలా ఇబ్బంది పడ్డాడు? అనేది ఆసక్తిగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్, యాక్షన్... ఇలా అన్ని అంశాలు ఉంటాయి. ‘మిషన్ ఇంపాజిబుల్’ స్ఫూర్తిగా ఈ సినిమా తీశా’’ అని డైరెక్టర్ శ్రీ సరిపల్లి అన్నారు. కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఆదిరెడ్డి టి. సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీ సరిపల్లి మాట్లాడుతూ– ‘‘అమెరికాలోని యూనివర్సల్ స్టూడియోస్‌లో మాస్టర్ ఆఫ్ ఫిలిం మేకింగ్ చేసి, నాలుగేళ్లు అక్కడ ఇండిపెండెంట్ సినిమాలకు పని చేశాను. ఆ తర్వాత వీవీ వినాయక్‌గారి దగ్గర దర్శకత్వ శాఖలో చేరి ‘నాయక్’, ‘అల్లుడు శీను’ సినిమాలకు పనిచేశాను. ‘ఆర్ఎక్స్ 100’ టైమ్‌లో కార్తికేయను చూసి, ‘రాజా విక్రమార్క’ కథ చెప్పాను. తనకి నచ్చడంతో ఈ సినిమా చేశాం. ఇందులో సందర్భానుసారంగా కామెడీ ఉంటుంది కానీ క్యారెక్టర్లు జోకులు వేయవు. దేశంలోని ఓ సమస్యపై ఎన్ఐఏ పోరాటం చేయడం సినిమాలో చూపించాం. నేను ఏ జానర్ చేసినా కామెడీ ఉండేలా చూసుకుంటాను’’ అన్నారు. -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో విడుదలయ్యే చిత్రాలివే
జనాలు కరోనా భయాన్ని వీడడంతో థియేటర్లకు మళ్లీ మునుపటి రోజులు వచ్చాయి. దసరా, దీపావళి పండగలకు వరుస సినిమాలు థియేటర్ల వద్ద సందడి చేశాయి. గతవారం సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’తో పాటు పూరి ఆశాశ్ ‘రొమాంటిక్’, సంతోష్ శోభన్ ‘మంచి రోజులు వచ్చాయి’లాంటి చిత్రాలు థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరించాయి. ఇక సూర్య నటించిన ‘జైభీమ్’ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై మంచి టాక్ని సొంతం చేసుకుంది. ఇలా గతవారం స్టార్ హీరోల సినిమాలు విడుదలవ్వడంతో సినీ ప్రియులు దీపావళి పండగను మరింత ఘనంగా జరుపుకున్నారు. ఇక ఈ వారం కూడా పలు ఆసక్తికరమైన చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్దమయ్యాయి. అవేంటో చూద్దాం. రాజా విక్రమార్క యంగ్ హీరో కార్తీకేయన్ తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ నెల 12న ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీతోనే తమిళ నటి తన్యా రవిచంద్రన్ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఇందులో కార్తికేయ ఎన్ఐఏ ఏజెంట్ విక్రమ్‌గా కనిపించారు. తనికెళ్ల భరణి, సాయి కుమార్‌లు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు. పుష్పక విమానం యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం 'పుష్పక విమానం'. ఈ చిత్రం నవంబర్12న థియేటర్స్‌లో విడుదల అవుతోంది. దామోదర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శాన్వి మేఘన హీరోయిన్ .పెళ్లయిన తర్వాత భార్య వేరే వాళ్లతో వెళ్లిపోతే, సుందర్(ఆనంద్ దేవరకొండ) అనే స్కూల్ టీచర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తన భార్య ఇంట్లోనే ఉందని చెప్పడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? అనేదే పుష్పక విమానం కథ. ఈ చిత్రానికి రామ్ మరియాల సంగీతం అందించాడు. తెలంగాణ దేవుడు శ్రీకాంత్ హీరోగా నటించిన కెసిఆర్ బయోపిక్ ‘తెలంగాణ దేవుడు’ సినిమా కూడా 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించారు. జిషాన్ ఉస్మాన్ హీరోగా సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్ , తనికెళ్ల భరణి తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. 1969 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో జరిగిన పరిస్థితులను చూసి, ప్రజల కష్టాలను తీర్చిన ఒక ఉద్యమ ధీరుడి జీవిత చరిత్రతో ఈ సినిమా రూపొందించారు. ఉద్యమం చేసి, సాధించుకున్న తర్వాత తెలంగాణలో ఏర్పడిన పరిణామాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చిత్రం బృందం పేర్కొంది. వీటితో పాటు కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ నటించిన ‘కె3 కోటికొక్కడు’ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ గా 12వ తేదీన రిలీజ్ అవ్వనుంది. ‘ది ట్రిప్’ అనే చిన్న సినిమా కూడా 12వ తేదినే థియేటర్లలో రానుంది. ఆహాలో ‘3 రోజెస్’ తెలుగు ఓటిటి ఆహాలో పూర్ణ, ఈషా రెబ్బ, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్న ‘3 రోజెస్’ సీరిస్ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సిరీస్‌కి మగ్గీ దర్శకత్వం వహిస్తున్నాడు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలు.. ఒకేచోట కలిసి స్నేహితులయ్యాక.. వాళ్ల కథలు ఎటు మలుపు తిప్పాయి. అస్సలు సమాజంలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనే ఆసక్తికర అంశంతో ఈ సిరీస్ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఓటీటీలో వచ్చే చిత్రాలివే... డిస్నీ+ హాట్‌స్టార్ డోప్ సిక్(నవంబర్ 12) కనకం కామిని కలహం(నవంబరు12) జంగిల్ క్రూయిజ్(నవంబరు12) స్పెషల్ ఆప్స్(నవంబరు12) షాంగ్-చి(నవంబరు12) జీ5 అరణ్మణై 3(నవంబరు12) స్క్వాడ్ (నవంబరు12) నెట్‌ఫ్లిక్స్ రెడ్‌నోటీస్ (నవంబరు 12) -
కాబోయే భార్యకు స్టేజ్‌పై ప్రపోజ్ చేసిన హీరో కార్తికేయ
Hero Karthikeya Proposed to His Fiance Lohitha Reddy: ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా రాజా విక్రమార్క చిత్రంలో నటించాడు. శనివారం(నవంబర్7)న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో కార్తికేయ తన కాబోయే భార్యను అందరికి పరిచయం చేశాడు. ఈవెంట్లోనే భార్యకు లవ్‌ప్రపోజ్ చేశాడు. 'నేనే ముందు ప్రపోజ్ చేశా. నా లైఫ్‌లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్ తన ప్రేమ కోసం పెట్టాను. అప్పుడే చెప్పా..హీరో అయ్యాక వచ్చి మీ ఇంట్లో అడుగుతానని. అదృష్టం. ఆ అమ్మాయినే నేను ఈనెల21న పెళ్లి చేసుకోబోతున్నాను. తను నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, గాళ్ ఫ్రెండ్. ఎక్స్ గాళ్ ఫ్రెండ్. ఇక నుంచి ఒక్కటే రోల్.. వైఫ్' అంటూ కాబోయే భార్యను పరిచయం చేశాడు. కాగా కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా లోహిత కార్తికేయ కుటుంబానికి దగ్గరి బంధువు అని సమాచారం. -
ఇకపై అలాంటి కథలే ఎంచుకుంటా!
‘‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నేను చేసిన సినిమాల వల్ల నాకు యాక్టర్‌గా పేరు వచ్చింది. కానీ, నేనంటే ఇష్టపడే వారు గర్వంగా చెప్పుకునే కమర్షియల్ హిట్ మూవీ రాలేదు. ఇక నుంచి నన్ను ఇష్టపడేవారు గర్వపడేలా కథలు ఎంచుకుంటానని మాట ఇస్తున్నా’’ అని హీరో కార్తికేయ అన్నారు. శ్రీ సరిపల్లి దర్శకత్వంలో కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఆదిరెడ్డి టి. సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో కార్తికేయ మాట్లాడుతూ – ‘‘రాజా విక్రమార్క’ అనగానే చిరంజీవిగారు గుర్తొస్తారు. ఆయన అభిమానిగా ధైర్యం చేసి ఈ టైటిల్ పెట్టుకున్నాను. ‘రాజా విక్రమార్క’ సక్సెస్ అయితే శ్రీతో మరో సినిమా చేయాలని ఉంది. ఈ సినిమా సక్సెస్ నా కెరీర్‌కు ప్లస్ అవ్వడమే కాదు.. నా మీద నాకు ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది. ఈ నెల 21న లోహితతో నా పెళ్లి జరుగుతుంది’’ అన్నారు. ‘‘రాజా విక్రమార్క’ ట్రైలర్ చూడగానే కార్తికేయను అభినందించాను. ఇండస్ట్రీలోకి వచ్చేవారికి బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు. టాలెంట్ ఉంటే చాలు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ‘‘మూడు నెలల్లో ఈ సినిమా పూర్తి చేద్దామనుకున్నాం.. కరోనా వల్ల రెండేళ్లు పట్టింది’’ అన్నారు ‘88’ రామారెడ్డి. ‘‘కార్తికేయ వల్లే ‘రాజా విక్రమార్క’ నిర్మించే అవకాశం మాకు వచ్చింది’’ అన్నారు టి. ఆదిరెడ్డి. ‘‘కార్తికేయతో నా ప్రయాణం మూడేళ్ల క్రితం మొదలైంది’’ అన్నారు శ్రీ సరిపల్లి. ‘‘రాజా విక్రమార్క’ లో హీరోయిన్ తండ్రి పాత్ర పోషించాను’’ అన్నారు సాయికుమార్. ‘‘కార్తికేయలోని ఇన్నోసెన్స్ వల్ల ఎలాంటి పాత్ర అయినా చేయగలడు’’ అన్నారు హీరో సుధీర్ బాబు. ‘‘తెలుగు ఇండస్ట్రీలోని హీరోలందరూ మంచిగా మాట్లాడేది కార్తికేయ గురించే’’ అన్నారు హీరో విష్వక్ సేన్. ‘‘ఈ సినిమా హిట్ కావాలి’’ అన్నారు హీరో శ్రీవిష్ణు. హీరో కిరణ్ అబ్బవరం, సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి, పాటల రచయితలు కృష్ణకాంత్, సనారే, నటులు సుధాకర్ కోమాకుల, హర్షవర్ధన్ , నవీన్, ఎడిటర్ జస్విన్ ప్రభు పాల్గొన్నారు. -
రాజా విక్రమార్క హీరోయిన్ తాన్య రవిచంద్రన్ ఫొటోలు..
-
‘రాజా విక్రమార్క’ హీరోయిన్ తన్యా గురించి ఈ విషయాలు తెలుసా!
Here Is About Raja Vikramarka Movie Heroine Tanya Ravichandran: యంగ్ హీరో కార్తీకేయన్ తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ నెల 12న ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీతోనే తమిళ నటి తన్యా రవిచంద్రన్ తెలుగు తెరకు పరియం అవుతోంది. 2016లో ‘బల్లె వెళ్ళయ్యతేవా’ అనే తమిళ చిత్రంతో తన్యా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు 5 సినిమాల్లో నటించిన తన్యా కథల ఎన్నికల్లో ఆచీతూచి అడుగులెస్తోంది. ఇప్పుడు ‘రాజా విక్రమార్క’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తన క్యూట్ క్యూట్ స్మైల్, ఆకర్షించే అందంతో కుర్రకారు మతి పోగోడుతోంది. సినిమా విడుదల కాకముందే తన్యా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోలు నెట్టంట సందడి చేస్తున్నాయి. సినీ ఇండస్ట్రీకి వచ్చిన ఆనతి కాలంలోనే తన్యా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే ఆమె సినీ కుటుంబ నేపథ్యం నుంచి పరిశ్రమలోకి వచ్చింది. ఆమె ఓ స్టార్ హీరోకు బంధువు. ఆయన ఎవరో కాదు తమిళ సీనియర్ హీరో రవిచంద్రన్ మనవరాలు. ఆయన నట వారసురాలిగా ఆమె సినిమాల్లోకి వచ్చింది. కాగా ‘రాజా విక్రమార్క’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. సినిమా కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉండేదని, కానీ అమ్మానాన్నలు అప్పట్లోనే వద్దన్నారని చెప్పింది. ముందు చదువుపై దృష్టి పెట్టమని చెప్పారని, అయితే పీజీలో చేరిన తర్వాత దర్శకుడు మిస్కిన్ సర్ నుంచి అవకాశం వచ్చింది. కానీ తన పేరెంట్స్ ఒప్పుకోకపోయినప్పటికీ.. గొడవపడి ఒక్క సినిమా చేసి మళ్లీ చదువుకుంటానని ఒప్పించిందట. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో సినిమాలు చేశాక మళ్లీ పీజీ పూర్తి చేసినట్లు తెలిపింది. ఇక తాతయ్యా రవిచంద్రన్ గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు ఆయన ఉండుంటే ఎంత సంతోషించేవారోనని, దురదృష్టవశాత్తూ తను కెమెరా ముందుకు రాకముందే ఆయన దూరమయ్యారంటూ భావోద్వేగానికి లోనయ్యింది. ఆయన పట్టుదల, క్రమశిక్షణే తన స్ఫూర్తి అని, ఇక తమిళ సినిమా, తెలుగు సినిమా వేర్వేరుగా ఏమీ అనిపించలేదంటూ తాన్యా చెప్పుకొచ్చింది. -
ఒక్క సినిమా అంటూ మూడు చేసేశా!
‘‘రాజా విక్రమార్క కథతో పాటు నా పాత్ర కూడా బాగా నచ్చడంతో ఈ సినిమా చేశాను. ఇందులో నా పాత్ర పేరు కాంతి. తను హోమ్ మినిస్టర్ కుమార్తె అయినప్పటికీ చాలా సింపుల్‌గా ఉండే అమ్మాయి’’ అని తాన్యా రవిచంద్రన్ అన్నారు. కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ జంటగా వీవీ వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఆదిరెడ్డి టి. సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తాన్యా రవిచంద్రన్ మాట్లాడుతూ– ‘‘చిన్నతనం నుంచి నాకు సినిమాలంటే ఆసక్తి. అయితే, మా పేరెంట్స్ ‘పీజీ పూర్తి చెయ్.. ఆ తర్వాతే సినిమాలు’ అన్నారు. అయితే పీజీ చేస్తున్న టైమ్‌లో చాన్స్ రావడంతో ఒక్క సినిమా చేస్తానని చెప్పాను. కానీ వరుసగా తమిళంలో మూడు సినిమాలు చేశాను. అవి పూర్తయ్యాక పీజీ (ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ – హెచ్ఆర్) పూర్తి చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. మా తాతయ్య (తమిళ హీరో రవిచంద్రన్) చాలా హార్డ్ వర్కింగ్.. ఆయనకు అంకితభావం, క్రమశిక్షణ ఎక్కువ. ఆ మూడూ నేర్చుకున్నాను. నేను సినిమాల్లోకి వస్తా నని తెలియకముందే తాతయ్య మాకు దూరమయ్యారు. నాకు ఛాలెంజింగ్ పాత్రలంటే ఇష్టం. ప్రస్తుతం తమిళంలో ఐదు సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. -
రాజా విక్రమార్క మూవీ టీం స్పెషల్ ఇంటర్వ్యూ
-
హీరో కార్తికేయ ‘రాజా విక్రమార్క’ మూవీ స్టిల్స్
-
Raja Vikramarka: ‘రాజాగారు బయటకొస్తే ప్రమాదమే..’
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ గుమ్మకొండ కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ‘88’ రామారెడ్డి నిర్మించిన చిత్రం ‘రాజా విక్రమార్క’. మంగళవారం (సెప్టెంబరు 21)న కార్తికేయ బర్త్ డే. ఈ సందర్భంగా ‘రాజా విక్రమార్క’ థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘‘రాజాగారు బయటకొస్తే ప్రమాదమే.. ప్రయాసతో పరారు అంతే...’’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, డేవిడ్ సైమన్ పాడారు. ‘‘సినిమాలో ఉన్న నాలుగు పాటలు వేటికవే విభిన్నం. ప్రస్తుతం డబ్బింగ్ పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సినిమాలో కార్తికేయ నటన హైలైట్‌గా ఉంటుంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు ‘88’ రామారెడ్డి. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రధారులు. -
బ్యాచిలర్‌గా ఇదే నా చివరి చిత్రం : హీరో కార్తికేయ
‘‘ఇటీవల నిశ్చితార్థం (హైదరాబాద్‌కు చెందిన లోహితారెడ్డిని కార్తికేయ వివాహం చేసుకోనున్నారు) చేసుకున్నాను. బ్యాచిలర్‌గా నా చివరి చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి, జీవితంలో మరోస్థాయికి వెళితే బాగుంటుందని ఆశపడుతున్నాను. ‘రాజా విక్రమార్క’ తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు కార్తికేయ. దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ చిత్రంలో కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ హీరో హీరోయిన్లు. శ్రీ చిత్రమూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో కార్తికేయ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన సినిమా టైటిల్‌ను పెట్టుకునే అదృష్టం ఈ చిత్రం ద్వారా కలిగింది. ఈ సినిమాను మేమే నిర్మించాలనుకున్నాం. ఫైనల్‌గా రామారెడ్డి, ఆదిరెడ్డిగారు నిర్మించారు’’ అన్నారు. ‘‘ఇండస్ట్రీలో అన్ని సినిమాలు బాగుండాలి.. అందులో ‘రాజా విక్రమార్క’ ఉండాలి’’ అన్నారు సాయికుమార్. ‘‘ఈ సినిమాకు మూలస్తంభం కార్తికేయ’’ అన్నారు ‘88’ రామారెడ్డి. ‘మా చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు శ్రీ సరిపల్లి. చదవండి : ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఓ పండుగ : మంచు విష్ణు నేను పాడితే లోకమే ఆడదా.. ఉర్రూతలూగించిన షణ్ముఖప్రియ -
ఆకట్టుకుంటున్న కార్తికేయ ‘రాజా విక్రమార్క’ టీజర్
ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. యాక్షన్ ఎంటర్టైన్గా తెరకెక్కిన ఈ మూవీకి శ్రీ సరిపల్లి దర్శకత్వ వహించారు. 88 రామారెడ్డి నిర్మాత. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాను టీజర్ మెగా హీరో వరుణ్ తేజ్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ టీజర్ కార్తికేయ, తనికేళభరణి మధ్య సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. టీజర్ విషయానికొస్తే.. కార్తికేయ ఇందులో ఎన్ఐఏ ఎజెంట్‌గా కనిపించాడు. కొత్తగా అపాయింట్ అయిన కార్తికేయ ఓ సీక్రెట్ మిషన్‌లో అనుకొకుండా నిందితుడిని కాల్చి చంపుతాడు. చదవండి: ‘మా’ ఎన్నికలు : అందుకే సుధీర్, అనసూయలను తీసుకున్నాం: ప్రకాశ్ రాజ్ దీనిపై తనిళకేళ భరణికి, కార్తికేయకు మధ్య జరిగే సంభాషణలు అలరిస్తున్నాయి. అలాగే చివర్లో ‘చిన్నప్పుడు కృష్ణ గారిని.. పెద్దయ్యాక టామ్ క్రూజ్‌ని చూసి ఆవేశపడి జాబ్‌లో జాయిన్ అయిపోయా కానీ.. సరదా తీరిపోతోంది. ఇంక నావల్ల కాదు’ అంటూ హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక కార్తికేయ పాత్రకి యాక్షన్‌తో పాటు కామెడీ టచ్ కూడా ఇచ్చినట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. కాగా రాజా విక్రమార్కలో కార్తికేయకు జోడిగా తాన్యా రవిచంద్రన్ హీరోయిన్గా నటించింది. తనికెళ్ల భరణి ,సాయి కుమార్‌లు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు. చదవండి: 2 ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి ‘తలైవి’ మూవీ, మేకర్స్ భారీ ఒప్పందం! -
ఒక్క సినిమాకే పది సినిమాల అనుభవం!
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో ‘88’ రామారెడ్డి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 20) రామారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘మాది తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని కొంకుదరు గ్రామం. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డిగారిది మా ఊరే. నా స్నేహితుడు, డిస్ట్రిబ్యూటర్ వినోద్ వల్ల సినిమాలపై నాకు ఆసక్తి పెరిగింది. ‘రాజా విక్రమార్క’ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో ఎన్ఐఏ (నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ) అధికారిగా నటించారు కార్తికేయ. ప్రేమ, వినోదం, యాక్షన్ ఇలా అన్ని అంశాలు ఉన్న ఈ చిత్రం కార్తికేయ హిట్ మూవీ ‘ఆర్ఎక్స్ 100’ను మించిన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ‘రాజా విక్రమార్క్’ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అక్టోబరులో మా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాను’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారికి నేను వీరాభిమానిని. ‘ఇంద్ర’ సినిమా చూసేందుకు సైకిల్‌పై మండపేట వెళ్లి, ఆ షోకు టిక్కెట్స్ దొరక్కపోతే నెక్ట్స్ షో వరకు వెయిట్ చేసి మరీ సినిమా చూశాను. ‘రాజావిక్రమార్క’ చిరంజీవిగారి సినిమా టైటిల్. కథ ప్రకారం కుదిరందని ఈ టైటిల్ పెట్టాం. ఈ సినిమాలో చిరంజీవిగారి అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఉంది. ‘రాజా విక్రమార్క’ జర్నీలో కరోనా పరిస్థితుల వల్ల పది సినిమాలు తీసిన నిర్మాతగా అనుభవం వచ్చింది. నేను నిర్మించబోయే తర్వాతి రెండు సినిమాల వివరాలను త్వరలో వెల్లడిస్తాను. ఇక నా పేరు ‘88’ అని ఎందుకు పెట్టుకున్నానో ఓ నాలుగు సినిమాలు పూర్తి చేసుకున్న తర్వాత చెబుతాను’’ అని అన్నారు.