
‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ గుమ్మకొండ కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ‘88’ రామారెడ్డి నిర్మించిన చిత్రం ‘రాజా విక్రమార్క’. మంగళవారం (సెప్టెంబరు 21)న కార్తికేయ బర్త్ డే. ఈ సందర్భంగా ‘రాజా విక్రమార్క’ థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘‘రాజాగారు బయటకొస్తే ప్రమాదమే.. ప్రయాసతో పరారు అంతే...’’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, డేవిడ్ సైమన్ పాడారు. ‘‘సినిమాలో ఉన్న నాలుగు పాటలు వేటికవే విభిన్నం. ప్రస్తుతం డబ్బింగ్ పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సినిమాలో కార్తికేయ నటన హైలైట్‌గా ఉంటుంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు ‘88’ రామారెడ్డి. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రధారులు.
Comments
Please login to add a commentAdd a comment