
Hero Karthikeya Proposed to His Fiance Lohitha Reddy: ‘ఆర్‌ఎక్స్ 100’ హీరో కార్తికేయ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా రాజా విక్రమార్క చిత్రంలో నటించాడు. శనివారం(నవంబర్7)న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో కార్తికేయ తన కాబోయే భార్యను అందరికి పరిచయం చేశాడు. ఈవెంట్‌లోనే భార్యకు లవ్‌ప్రపోజ్ చేశాడు.
'నేనే ముందు ప్రపోజ్ చేశా. నా లైఫ్‌లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్ తన ప్రేమ కోసం పెట్టాను. అప్పుడే చెప్పా..హీరో అయ్యాక వచ్చి మీ ఇంట్లో అడుగుతానని. అదృష్టం. ఆ అమ్మాయినే నేను ఈనెల21న పెళ్లి చేసుకోబోతున్నాను. తను నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, గాళ్ ఫ్రెండ్. ఎక్స్ గాళ్ ఫ్రెండ్. ఇక నుంచి ఒక్కటే రోల్.. వైఫ్' అంటూ కాబోయే భార్యను పరిచయం చేశాడు.
కాగా కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా లోహిత కార్తికేయ కుటుంబానికి దగ్గరి బంధువు అని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment