Tanya Ravichandran: Raja Vikramarka Movie Heroine Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Tanya Ravichandran: తన్యా ఓ సౌత్‌ స్టార్‌ హీరో మనవరాలు, ఆయనెవరంటే..

Published Sat, Nov 6 2021 12:19 PM | Last Updated on Sat, Nov 6 2021 2:26 PM

Raja Vikramarka Movie Heroine Tanya Ravichandran Photos Goes Viral - Sakshi

Here Is About Raja Vikramarka Movie Heroine Tanya Ravichandran: యంగ్‌ హీరో కార్తీకేయన్‌ తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ నెల 12న ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీతోనే తమిళ నటి తన్యా రవిచంద్రన్‌ తెలుగు తెరకు పరియం అవుతోంది. 2016లో ‘బల్లె వెళ్ళయ్యతేవా’ అనే తమిళ చిత్రంతో తన్యా కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు 5 సినిమాల్లో నటించిన తన్యా కథల ఎన్నికల్లో ఆచీతూచి అడుగులెస్తోంది.

ఇప్పుడు ‘రాజా విక్రమార్క’ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. తన క్యూట్‌ క్యూట్‌ స్మైల్‌, ఆకర్షించే అందంతో కుర్రకారు మతి పోగోడుతోంది. సినిమా విడుదల కాకముందే తన్యా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోలు నెట్టంట సందడి చేస్తున్నాయి. సినీ ఇండస్ట్రీకి వచ్చిన ఆనతి కాలంలోనే తన్యా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది.

అయితే ఆమె సినీ కుటుంబ నేపథ్యం నుంచి పరిశ్రమలోకి వచ్చింది. ఆమె ఓ స్టార్‌ హీరోకు బంధువు. ఆయన ఎవరో కాదు తమిళ సీనియర్‌ హీరో రవిచంద్రన్‌ మనవరాలు. ఆయన నట వారసురాలిగా ఆమె సినిమాల్లోకి వచ్చింది.  కాగా ‘రాజా విక్రమార్క’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.  

 సినిమా కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉండేదని, కానీ అమ్మానాన్నలు అప్పట్లోనే వద్దన్నారని చెప్పింది. ముందు చదువుపై దృష్టి పెట్టమని చెప్పారని, అయితే పీజీలో చేరిన తర్వాత దర్శకుడు మిస్కిన్‌ సర్‌ నుంచి అవకాశం వచ్చింది. కానీ తన పేరెంట్స్‌ ఒప్పుకోకపోయినప్పటికీ.. గొడవపడి ఒక్క సినిమా చేసి మళ్లీ చదువుకుంటానని ఒప్పించిందట.

ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో సినిమాలు చేశాక మళ్లీ పీజీ పూర్తి చేసినట్లు తెలిపింది. ఇక తాతయ్యా రవిచంద్రన్‌ గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు ఆయన ఉండుంటే ఎంత సంతోషించేవారోనని, దురదృష్టవశాత్తూ తను కెమెరా ముందుకు రాకముందే ఆయన దూరమయ్యారంటూ భావోద్వేగానికి లోనయ్యింది. ఆయన పట్టుదల, క్రమశిక్షణే తన స్ఫూర్తి అని, ఇక తమిళ సినిమా, తెలుగు సినిమా వేర్వేరుగా ఏమీ అనిపించలేదంటూ తాన్యా చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement