
‘‘దిల్ సే’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది.. ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. ఈ చిత్రంతో విజయం అందుకుంటామనే నమ్మకం యూనిట్ కళ్లల్లో కనిపిస్తోంది. అందుకు తగ్గట్టే ‘దిల్ సే’ పెద్ద విజయం సాధించాలి’’ అని డైరెక్టర్ బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర)’’ అన్నారు. రాజా విక్రమ్ హీరోగా భరత్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దిల్ సే’.
శ్రీ అక్కియన్ ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీధర్ మరిసా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16 నుంచి ఓ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని బాబీ కొల్లి విడుదల చేశారు. భరత్ నరేన్ మాట్లా
డుతూ– ‘‘ఈ సినిమాలో మాస్క్ వేసుకున్న అమ్మాయి (హీరోయిన్) ఎవరు? అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించడానికే చెప్పడం లేదు’’ అన్నారు. ‘‘దిల్ సే’ నా మొదటి చిత్రం’’ అన్నారు రాజా విక్రమ్.
Comments
Please login to add a commentAdd a comment