Dil Se movie
-
వారి కళ్లల్లో ఆ నమ్మకం కనిపిస్తోంది
‘‘దిల్ సే’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది.. ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. ఈ చిత్రంతో విజయం అందుకుంటామనే నమ్మకం యూనిట్ కళ్లల్లో కనిపిస్తోంది. అందుకు తగ్గట్టే ‘దిల్ సే’ పెద్ద విజయం సాధించాలి’’ అని డైరెక్టర్ బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర)’’ అన్నారు. రాజా విక్రమ్ హీరోగా భరత్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దిల్ సే’. శ్రీ అక్కియన్ ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీధర్ మరిసా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16 నుంచి ఓ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని బాబీ కొల్లి విడుదల చేశారు. భరత్ నరేన్ మాట్లా డుతూ– ‘‘ఈ సినిమాలో మాస్క్ వేసుకున్న అమ్మాయి (హీరోయిన్) ఎవరు? అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించడానికే చెప్పడం లేదు’’ అన్నారు. ‘‘దిల్ సే’ నా మొదటి చిత్రం’’ అన్నారు రాజా విక్రమ్. -
ముక్కోణపు ప్రేమకథ
అభినవ్ మదిశెట్టి, స్నేహా సింగ్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ సే’. మంకల్ వీరేంద్ర, రవికుమార్ సబ్బాని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 4న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పి. కౌశిక్ రెడ్డి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ అతిథులుగా హాజరయ్యారు.‘‘ముక్కోణపు ప్రేమకథా చిత్రమిది’’అని మంకల్ వీరేంద్ర, రవికుమార్ సబ్బాని అన్నారు. -
పాట కోసం రక్తం చిందించాను
‘ఛయ్యా ఛయ్యా’ పాటతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటి మలైకా అరోరా. ఈ ఒక్క పాటతో ఆమె కెరీర్ బాలీవుడ్లో రాకెట్లా దూసుకెళ్లిపోయింది. అయితే ఈ పాటను చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె చాలా తీవ్రంగా గాయపడ్డారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు మలైకా. ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ.. ‘పాట మొత్తం కదులుతున్న రైలు పైనే చిత్రీకరించారు. గాలి బలంగా వీస్తుండటంతో నేను చాలా సార్లు పట్టుతప్పి పడిపోయాను. దాంతో నేను పడిపోకుండా ఉండటానికి నేను ధరించిన గాగ్రాకి తాడు కట్టి, రైలుకు కట్టేశారు. ఆ తాడు కట్టుకునే డ్యాన్స్ చేశాను. పాట షూటింగ్ అయిపోయాక తాడు విప్పుతుంటే నడుమంతా రక్తమోడుతోంది. తాడు కట్టడం వల్ల రాసుకుపోయి ఇలా జరిగింది. దాంతో సెట్లో ఉన్న వారంతా కంగారుపడిపోయారు’ అని తెలిపారు మలైకా. మణిరత్నం దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘దిల్ సే’ చిత్రంలోని ఈ పాటకు ఫరాఖాన్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. బెస్ట్ కొరియోగ్రఫీ కేటగిరీలో ఫరాఖాన్‌కు ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. ఇప్పటికీ పాటకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. -
ప్రీతి జింతాకు షారూఖ్ సారీ ఎందుకు?
ముంబై: బాలీవుడ్ 'కింగ్ ఖాన్' షారూఖ్ ఖాన్.. హీరోయిన్ ప్రీతి జింతాకు క్షమాపణ చెప్పాడు. వీరిద్దరూ నటించిన 'దిల్ సే' సినిమా విడుదలై 18 ఏళ్లు పూర్తైన సందర్భంగా షారూఖ్ ప్రత్యేకంగా తయారు చేసిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. 'మనం ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడినప్పుడు వారిని ఎంతో ప్రేమిస్తాం. అయితే ఎల్లకాలం ఎక్కువగా ప్రేమించడం సాధ్యంకాకపోవచ్చు. కానీ నాకు ఎంతో ఇష్టమైన దిల్ సే సినిమాపై ప్రేమ కాస్త కూడా తగ్గలేద'ని ఇన్స్టాగ్రామ్ వీడియోకు మెసేజ్ పెట్టాడు. అయితే ఈ వీడియో హీరోయిన్ ప్రీతి జింతా ప్రస్తావన లేకపోవడంతో ఆమెకు షారూఖ్ క్షమాపణ చెప్పాడు. వీడియోలో ప్రీతి జింతాను కూడా చేర్చి మరోసారి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు. విలక్షణ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన 'దిల్ సే' సినిమా 1998, ఆగస్టు 21న విడుదలైంది. ఇందులో షారూఖ్ సరసన మనీషా కొయిరాల, ప్రీతి జింతా నటించారు. తీవ్రవాదం నేపథ్యంలో రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను మణిరత్నం, రాంగోపాల్ వర్మ, శేఖర్ కపూర్, భరత్ షా సంయుక్తంగా నిర్మించడం విశేషం. ఈ సినిమాతోనే ప్రీతి జింతా బాలీవుడ్ ను పరిచయమైంది.