‘‘ప్రతి ఒక్కరి జీవితంలో బ్యాడ్‌టైమ్ ఉంటుంది. నా జీవితంలోనూ బ్యాడ్‌టైమ్ గడిచింది. అందుకే డైరెక్టర్‌గా గ్యాప్ వచ్చింది’’ అన్నారు దర్శకుడు టి.ఎన్. కృష్ణ. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో కలైపులి యస్. థాను నిర్మించిన చిత్రం ‘హిప్పీ’. ఈ చిత్రంలో దిగంగనా సూర్యవన్షీ, జజ్బాసింగ్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు టి.ఎన్. కృష్ణ చెప్పిన విశేషాలు.
►‘హిప్పీ’ సినిమాను ముందు తమిళ భాషలో తీద్దాం అనుకున్నాం. ఆ టైమ్‌లో ‘ఆర్‌ఎక్స్ 100’ తమిళ రీమేక్ ఆఫర్ వచ్చింది నాకు. తెలుగు ‘ఆర్‌ఎక్స్ 100’ చూశాను. హీరోగా కార్తికేయ బాగా నటించాడు. ఇక రీమేక్ ఎందుకు? అనిపించి స్ట్రయిట్ తెలుగు సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాం. ‘హిప్పీ’ కథను కార్తికేయకు చెప్పాం. నచ్చింది అన్నారు. అలా ‘హిప్పీ’ ప్రయాణం మొదలైంది. జాన్ మిల్టన్ అనే బ్రిటిష్ కవి ప్రస్తావించిన ప్యారడైజ్ లాస్, ప్యారడైజ్ గెయిన్ అనే అంశాల ఇన్‌స్పిరేషన్‌తో ఈ సినిమా చేశాను.
►కార్తికేయ బాగా నటించాడు. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి క్యారెక్టర్ పాజిటివ్‌గా ఉంటుంది. నిర్మాత థానుగారు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇది యూత్‌ఫుల్ ఫిల్మ్. నేటి యువత రిలేషన్‌షిప్స్‌ను ఎలా డీల్ చేస్తున్నారు? రిలేషన్‌షిప్స్‌లో వారికి ఎదురయ్యే సమస్యలు ఏంటి? అనే అంశాలను ప్రస్తావించాం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. నెక్ట్స్ సీన్ ఏంటి? అని ఆడియన్స్ అంత వీజిగా ఊహించలేరు. ఇది కంప్లీట్ లవ్ ఫిల్మ్. ఫ్యామిలీ ఆడియన్స్‌కూ నచ్చుతుంది.
►సోషల్ మీడియా వచ్చిన తర్వాత కల్చలర్ ట్రాన్స్‌ఫార్మేషన్ జరుగుతోంది. నేటి టెక్నాలజీకి అందరూ ట్రాన్స్‌ఫర్ అవుతున్నారు. ఇండస్ట్రీలో అయినా అంతే. అప్‌డేట్ కావాలి.
►ఈ సినిమాలో నా పర్సనల్ లైఫ్ సీన్స్, నా స్నేహితులవి కొన్ని ఉన్నాయి. పర్సనల్ లైఫ్‌లో లవ్‌ని ఫీల్ అవ్వలేనివారు లవ్‌స్టోరీ తీయలేరని నా నమ్మకం. తెలుగు ఇండస్ట్రీ నాకు బాగా నచ్చింది. ఒక్కో లాంగ్వేజ్‌లో ఒక్కో బ్యూటీ ఉంటుంది.
►‘సిల్లున్ను ఒరు కాదల్’ (‘నువ్వు నేను ప్రేమ’) (2006) సినిమా తర్వాత ఓ సినిమా స్టార్ట్ చేశాం. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు నేను చేసిన ‘నెడుంజాలై’ రిలీజైంది. ‘హిప్పీ’ నా మూడో సినిమా. నెక్ట్స్ థానుగారే నా డైరెక్షన్‌లో ఓ సినిమా నిర్మించబోతున్నారు. అలాగే పీఫుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో ఓ తెలుగు సినిమా చేయబోతున్నాను.
Comments
Please login to add a commentAdd a comment