Hippi Movie
-
‘హిప్పీ’ మూవీ రివ్యూ
టైటిల్ : హిప్పీ జానర్ : రొమాంటిక్ కామెడీ తారాగణం : కార్తికేయ, దిగంగనా సూర్యవంశీ, జేడీ చక్రవర్తి, జజ్బా సింగ్, వెన్నెల కిశోర్ సంగీతం : నివాస్ కే ప్రసన్న దర్శకత్వం : టీఎన్ కృష్ణ నిర్మాత : కలైపులి ఎస్ థాను ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ సృష్టించిన కార్తికేయ హీరోగా తెరకెక్కిన మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ హిప్పీ. ఆర్ఎక్స్ 100లో బోల్డ్ సీన్స్‌తో రెచ్చిపోయిన కార్తీకేయ హిప్పీలోనూ అదే ఫార్ములా కంటిన్యూ చేశాడు. తమిళ స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను నిర్మాతగా టీఎన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన హిప్పీలో ఈ యంగ్ హీరో స్టైలిష్ మేకోవర్‌తో ఆకట్టుకున్నాడు. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? కార్తికేయ తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేశాడా..? కథ ; హిప్పీ దేవదాస్ (కార్తికేయ) ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్నేహ (జజ్బా సింగ్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. స్నేహతో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లినప్పుడు ఆమె ఫ్రెండ్ ఆముక్తమాల్యద(దిగంగన సూర్యవంశీ)ను చూసి తొలి చూపులోనే మళ్లీ ప్రేమలో పడతాడు. స్నేహను కాదని ఆముక్తమాల్యద చుట్టూ తిరుగుతుంటాడు. హిప్పీకి ఇన్నాళ్లు తన మీద ఉన్నది ప్రేమ కాదు ఎట్రాక్షన్ అని అర్థం చేసుకున్న స్నేహ, వేరే పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. తరువాత హిప్పీ, ఆముక్తమాల్యదలు దగ్గరవుతారు. కానీ అక్కడి నుంచే అసలు కథ మొదలువుతుంది. ఆముక్తమాల్యద తన ఆంక్షలతో హిప్పీకి నరకం చూపిస్తుంది. చెప్పినట్టు వినాలని, చెప్పిన టైంకి రావాలని ఇబ్బంది పెడుతుంది. దీంతో ఎలాగైనా ఆముక్తమాల్యదను వదిలించు కోవాలనుకుంటాడు హిప్పీ. అందుకోసం హిప్పీ ఏం చేశాడు..? చివరకు హిప్పీ, ఆముక్తమాల్యదలు కలిసున్నారా.. విడిపోయారా? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఆర్ఎక్స్ 100లో ఒకే ఎక్స్ప్రెషన్లో కనిపించిన కార్తికేయకు ఈ సినిమాలో వేరియేషన్స్ చూపించే అవకాశం దక్కింది. లుక్స్‌తో పాటు నటనపరంగానూ మంచి మార్కులు సాధించాడు. యాక్షన్ సీన్స్‌లో సూపర్బ్ అనిపించాడు. హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ.. ఆముక్తమాల్యద పాత్రలో ఒదిగిపోయింది. నటనతో పాటు గ్లామర్ షోతోను యూత్ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. మరో కీలక పాత్రలో నటించిన జేడీ చక్రవర్తి, తన అనుభవంతో అరవింద్ పాత్రను అవలీలగా పోషించాడు. వెన్నెల కిశోర్ తన కామెడీ టైమింగ్‌తో బాగానే నవ్వించాడు. ఇతర పాత్రల్లో జజ్బా సింగ్, బ్రహ్మాజీ, సుదర్శన్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; హీరో హీరోయిన్లు ప్రేమించుకోవటం, తరువాత విడిపోవటం, తిరిగి కలవటం లాంటి కాన్సెప్ట్‌తో తెలుగు తెర మీద చాలా సినిమాలు వచ్చాయి. అయితే అదే కాన్సెప్ట్‌కు మరింత మసాలా జోడించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు టీఎన్ కృష్ణ. తొలి పది నిమిషాల్లోనే జేడీ చక్రవర్తి చెప్పే డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో సినిమా ఎవరిని టార్గెట్ చేసి రూపొందించారు క్లారిటీ ఇచ్చేశారు. రొమాంటిక్ సీన్స్ విషయంలోనూ కాస్త లిమిట్స్ క్రాస్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. కథ పరంగా బాగానే ఉన్నా కథనం మాత్రం సుధీర్ఘంగా సాగుతూ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. కామెడీ బాగానే వర్క్ అవుట్ కావటం కాస్త రిలీఫ్ ఇస్తుంది. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫి బాగుంది. నివాస్ కే ప్రసన్నా సంగీతం పరవాలేదు. పాటలు విజువల్‌గా బాగున్నాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. చాలా సన్నివేశాలు బోర్ ఫీలింగ్ కలిగిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; యూత్‌ను ఆకట్టుకునే అంశాలు మైనస్ పాయింట్స్ ; డబుల్ మీనింగ్ డైలాగ్స్ స్లో నేరేషన్ సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
జీరో నుంచి వందకి తీసుకెళ్లింది
‘‘ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంలో నాకు ఫుల్ క్లారిటీ ఉంది. కన్ఫ్యూజన్ లేదు. కథ నాకు నచ్చి, డైరెక్టర్ చేయగలుతాడనే నమ్మకం వస్తే సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకుంటాను’’ అని కార్తికేయ అన్నారు. టీఎన్ కృష్ణ దర్శకత్వంలో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా కలైపులి యస్. థాను నిర్మించిన చిత్రం ‘హిప్పీ’. ఇందులో దిగంగనా సూర్యవన్షీ, జజ్బా సింగ్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన విశేషాలు. ► ‘హిప్పీ’ సినిమా బాగా వచ్చింది. నేను బాగా నటించాననే నమ్మకం ఉంది. ఆడియన్స్‌కి నన్ను నేను డిఫరెంట్‌గా చూపించుకోబోతున్నాను. సినిమా చూసిన తర్వాత రివ్యూలు ఎలా ఉంటాయి? ఆడియన్స్ నా గురించి ఎలా మాట్లాడుకుంటారు? అని ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నాను. ► జేడీ చక్రవర్తిగారి గురించి ‘జేడీ.. ఉంటే సినిమా ఫినిష్ కాదు. సెట్లో నుంచి వెళ్లిపోతారు’ అని కొందరు రాంగ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. కానీ అంతా రివర్స్. ఆఫ్‌స్క్రీన్‌లో మేం ఫ్రెండ్స్ అయిపోయాం. సార్.. కొందరు మీ గురించి బ్యాడ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారని చెప్పాను. ‘వాళ్లు చెప్పింది నిజమే. నచ్చని సినిమాలకు నేను అలానే చేశా’నని జేడీ అన్నారు. ► టీఎన్కృష్ణగారు కథ చెబుతా అన్నప్పుడు ‘ఏమాయ చేసావె’ లాంటి సాఫ్ట్ లవ్‌స్టోరీ ఎక్స్పెక్ట్ చేశాను. కథ నరేట్ చేసిన తర్వాత అర్థం అయ్యింది. ఇది ‘ఆర్ఎక్స్ 100’ సినిమాకు ఫుల్ డిఫరెంట్ అని. ► ‘ఆర్ఎక్స్ 100’తో పెద్దహిట్ వచ్చిందని అందరూ అంటున్నారు. కానీ థానుగారులాంటి పెద్ద ప్రొడ్యూసర్ నాతో సినిమా చేయడానికి రెడీ అయినప్పుడు ఆ నమ్మకం నాకు వచ్చింది. నాపై నాకు భరోసా కలిగింది. ‘ఆర్ఎక్స్ 100 ’సినిమాను మేమే తీశాం. నాకు ఫస్ట్ ఎర్నింగ్ థానుగారే ఇచ్చారు. అడ్వాన్స్‌గా పది లక్షలు తీసుకున్నాను. ► ఒక హిట్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి నిజానికి ఒత్తిడిలోనే ఉన్నాను. ‘ఆర్ఎక్స్ 100’ రిలీజ్‌కు ముందు జీరోలో ఉన్నాను. ఆ సినిమా జీరో నుంచి 100కి తీసుకెళ్లింది. సో... ఇది 101 వస్తేనే సక్సెస్ వచ్చినట్లుగా ఫీల్ అవుతున్నాను. ► ‘ఆర్ఎక్స్100’ సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. నా ఏజ్ ప్రకారం నాకు లవ్‌స్టోరీలే వస్తాయి. లవ్‌స్టోరీలు అన్నప్పుడు లిప్ లాక్‌లు తప్పవు. రియలిస్టిక్ సినిమాలు చేయాలి. న్యాచురల్‌గా ఉండాలి, అందరికీ కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు లిప్‌లాక్ సీన్స్‌ను కూడా న్యాచురల్‌గానే చూపించాలి. ► పాతికేళ్ల వయసు వచ్చేసరికి ఏ అమ్మాయికైనా, ఏ అబ్బాయికైనా ఎవరూ నచ్చకుండా ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. కాలేజ్ డేస్‌లో ఓ లవ్‌ఫెయిల్యూర్ ఉంది. ► ఇప్పటి యంగ్ హీరోలతో కాంపిటీషన్ ఫీలయ్యే స్టేజ్‌కి నేను ఇంకా రాలేదు. నాకు పెద్దగా ఫ్యాన్స్ లేరనుకుంటా. ఇటీవల ఇద్దరు యంగ్ హీరోల మధ్య వినిపించిన ఫ్యాన్స్ వార్ మిస్అండర్స్టాండింగ్ వల్లే వచ్చిందని నా భావన. ► ‘ఆర్ఎక్స్ 100’ సినిమాకు ఫస్ట్ బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేయాలా? అనుకున్నాను. నిజంగా భయం వేసింది. నెక్ట్స్ డే థియేటర్లోకి వెళితే ఆడియన్స్ బ్లాక్‌బస్టర్ అన్నారు. అప్పుడు రివ్యూస్‌పై కోపం వచ్చింది. ఏదైనా తేడా జరిగితే నాది, పాయల్, అజయ్ ఇలా అందరి కెరీర్లకు ఇబ్బంది కలిగేది. ► ప్రస్తుతం ‘గుణ 369, గ్యాంగ్‌లీడర్’ చేస్తున్నాను. శేఖర్‌రెడ్డి, వీవీ వినాయక్ దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేసిన శ్రీ సరిపల్లితో సినిమా చేయబోతున్నాను. -
ఊహించడం అంత వీజీ కాదు
‘‘ప్రతి ఒక్కరి జీవితంలో బ్యాడ్‌టైమ్ ఉంటుంది. నా జీవితంలోనూ బ్యాడ్‌టైమ్ గడిచింది. అందుకే డైరెక్టర్‌గా గ్యాప్ వచ్చింది’’ అన్నారు దర్శకుడు టి.ఎన్. కృష్ణ. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో కలైపులి యస్. థాను నిర్మించిన చిత్రం ‘హిప్పీ’. ఈ చిత్రంలో దిగంగనా సూర్యవన్షీ, జజ్బాసింగ్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు టి.ఎన్. కృష్ణ చెప్పిన విశేషాలు. ►‘హిప్పీ’ సినిమాను ముందు తమిళ భాషలో తీద్దాం అనుకున్నాం. ఆ టైమ్‌లో ‘ఆర్ఎక్స్ 100’ తమిళ రీమేక్ ఆఫర్ వచ్చింది నాకు. తెలుగు ‘ఆర్ఎక్స్ 100’ చూశాను. హీరోగా కార్తికేయ బాగా నటించాడు. ఇక రీమేక్ ఎందుకు? అనిపించి స్ట్రయిట్ తెలుగు సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాం. ‘హిప్పీ’ కథను కార్తికేయకు చెప్పాం. నచ్చింది అన్నారు. అలా ‘హిప్పీ’ ప్రయాణం మొదలైంది. జాన్ మిల్టన్ అనే బ్రిటిష్ కవి ప్రస్తావించిన ప్యారడైజ్ లాస్, ప్యారడైజ్ గెయిన్ అనే అంశాల ఇన్స్పిరేషన్తో ఈ సినిమా చేశాను. ►కార్తికేయ బాగా నటించాడు. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి క్యారెక్టర్ పాజిటివ్‌గా ఉంటుంది. నిర్మాత థానుగారు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇది యూత్‌ఫుల్ ఫిల్మ్. నేటి యువత రిలేషన్‌షిప్స్‌ను ఎలా డీల్ చేస్తున్నారు? రిలేషన్షిప్స్లో వారికి ఎదురయ్యే సమస్యలు ఏంటి? అనే అంశాలను ప్రస్తావించాం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. నెక్ట్స్ సీన్ ఏంటి? అని ఆడియన్స్ అంత వీజిగా ఊహించలేరు. ఇది కంప్లీట్ లవ్ ఫిల్మ్. ఫ్యామిలీ ఆడియన్స్‌కూ నచ్చుతుంది. ►సోషల్ మీడియా వచ్చిన తర్వాత కల్చలర్ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతోంది. నేటి టెక్నాలజీకి అందరూ ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఇండస్ట్రీలో అయినా అంతే. అప్డేట్ కావాలి. ►ఈ సినిమాలో నా పర్సనల్ లైఫ్ సీన్స్, నా స్నేహితులవి కొన్ని ఉన్నాయి. పర్సనల్ లైఫ్‌లో లవ్‌ని ఫీల్ అవ్వలేనివారు లవ్‌స్టోరీ తీయలేరని నా నమ్మకం. తెలుగు ఇండస్ట్రీ నాకు బాగా నచ్చింది. ఒక్కో లాంగ్వేజ్‌లో ఒక్కో బ్యూటీ ఉంటుంది. ►‘సిల్లున్ను ఒరు కాదల్’ (‘నువ్వు నేను ప్రేమ’) (2006) సినిమా తర్వాత ఓ సినిమా స్టార్ట్ చేశాం. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు నేను చేసిన ‘నెడుంజాలై’ రిలీజైంది. ‘హిప్పీ’ నా మూడో సినిమా. నెక్ట్స్ థానుగారే నా డైరెక్షన్లో ఓ సినిమా నిర్మించబోతున్నారు. అలాగే పీఫుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో ఓ తెలుగు సినిమా చేయబోతున్నాను. -
‘హిప్పీ’ వర్కింగ్ స్టిల్స్
-
హిప్పీ ప్రీ-రిలీజ్ ఈవెంట్
-
రేపే ‘గుణ 369’ ఫస్ట్ లుక్
‘ఆర్ఎక్స్ 100’తో మంచి హిట్ కొట్టిన యంగ్ హీరో కార్తికేయ.. తన తదుపరి ప్రాజెక్ట్‌లను చకచకా పట్టాలెక్కిస్తున్నాడు. హిప్పీ దాదాపు షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకోగా.. గుణ 369 అనే మరో చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చేసింది. గుణ 369 అంటూ టైటిల్ లోగోను రిలీజ్ చేస్తూ.. కార్తికేయ బాడీషో చేసిన పోస్టర్ అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. రేపు (మే 29th) 11.11గంటలకు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నాడు. -
‘అది యాటపోతు కాదు యాటకత్తి’
‘ఆర్ఎక్స్ 100’తో యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్న హీరో కార్తికేయ. ఈ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన ఈ హీరో వరుసబెట్టి ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడీ హీరో. ఆర్ఎక్స్ 100 స్టైల్లోనే కాస్త బోల్డ్నెస్, యూత్ ఎంటర్టైనర్గా రాబోతోన్న హిప్పీ టీజర్‌తో మంచి హైప్‌ను క్రియేట్ అయింది. తాజగా హిప్పీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్లో కావల్సినంత బోల్డ్ కంటెంటే కాకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. ముఖ్యంగా జేడీ చక్రవర్తితో చెప్పించే డైలాగ్‌లు బాగా ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ అండ్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్మించగా.. టీఎన్ కృష్ణ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆయన నటనకు పెద్ద ఫ్యాన్‌ని
‘‘పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ‘హిప్పీ’. ఇందులో ఓ వైపు రియలిస్టిక్ స్టోరీ ఉంటుంది. మరో వైపు ఫుల్‌లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అన్ని కమర్షియల్ అంశాలను పర్ఫెక్ట్గా తెరకెక్కించారు దర్శకుడు. ఔట్పుట్ అనుకున్నదానికన్నా బాగా రావడంతో టీమ్ అంతా హ్యాపీగా ఉన్నాం’’ అని కార్తికేయ అన్నారు. ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ, దిగంగన సూర్యవన్షీ జంటగా టిఎన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన లవ్ ఎంటర్టైనర్ ‘హిప్పీ’. కలైపులి ఎస్. థాను సమర్పణలో వి.క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాని జూన్ 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ– ‘‘కబాలి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం నిర్మించిన కలైపులి ఎస్. థానుగారి సంస్థలో ‘హిప్పీ’ చేయడం గొప్పగా భావిస్తున్నాను. జె.డి. చక్రవర్తిగారిది చాలా కీ రోల్. కథ వినగానే ఆయన ఒప్పుకోవడంతో హ్యాపీగా ఫీలయ్యా. ఎందుకంటే ఆయన నటనకు నేను పెద్ద ఫ్యాన్‌ని’’ అన్నారు. ‘‘నా పాత్రకు ఉన్న ప్రాధాన్యత అర్థమై వెంటనే ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పేశాను. కార్తికేయ రొమాన్స్, ఫైట్స్, డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నాడు. తప్పకుండా మంచి హీరోగా ఎదుగుతాడు’’ అన్నారు నటుడు జె.డి. చక్రవర్తి. ‘‘హిప్పీ’ చాలా సహజంగా, సింపుల్‌గా ఉంటుంది. మన కుటుంబంలోనో, స్నేహితుల జీవితాల్లోనో జరుగుతున్న అంశంలా ఉంటుంది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా సాగుతుంది. జె.డి. చక్రవర్తిగారి కెరీర్లో గుర్తుంచుకోదగ్గ సినిమా అవుతుంది’’ అన్నారు టిఎన్. కృష్ణ. ‘‘అన్ని వర్గాల వారికి కావాల్సిన అంశాలు మా చిత్రంలో ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 7న సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తాం’’ అన్నారు కలైపులి ఎస్. థాను. జజ్బా సింగ్, బ్రహ్మాజీ నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఆర్డీ రాజశేఖర్, సంగీతం: నివాస్ కె. ప్రసన్న. -
జూన్ 7న విడుదలకు సిద్ధమవుతున్న ‘హిప్పి’
‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ, దిగంగన సూర్యవన్షీ జంటగా తెరకెక్కుతున్న సినపిమా హిప్పీ. కలైపులి ఎస్. థాను సమర్పణలో వి. క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు టిఎన్ కృష్ణ దర్శకుడు. షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూన్ 7న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ - ‘మా హిప్పీ జూన్ 7న విడుదల కానుంది. షూటింగ్ చాలా బాగా జరిగింది. ఔట్పుట్ అనుకున్నదానికన్నా బాగా వచ్చింది. టీమ్ అందరం హ్యాపీగా ఉన్నాం. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో ఓ వైపు రియలిస్టిక్ స్టోరి ఉంటుంది. మరో వైపు ఫుల్‌లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అన్ని కమర్షియల్ అంశాలను పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు దర్శకుడు. కబాలి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన కలైపులి ఎస్. థానుగారి సంస్థలో హిప్పీ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెద్ద బడ్జెట్ చిత్రంలా చేశారు. జె.డి. చక్రవర్తిగారిది చాలా చాలా కీ రోల్. ఆయన కథ వినగానే ఒప్పుకోవడంతో హ్యాపీగా ఫీలయ్యా. ఆయన నటనకు నేను పెద్ద ఫ్యాన్‌ని. హీరోయిన్ దిగంగన చాలా అద్భుతమైన నటి. ఈ సినిమాలో తనది మంచి క్యారెక్టర్. అందరినీ మెప్పిస్తుంది. సంగీతం కూడా చాలా బాగుంది. ఆర్.డి. రాజశేఖర్‌గారి ఫొటోగ్రఫీ సినిమాకు మంచి ఎస్సెట్‌గా నిలుస్తుంది’ అన్నారు. నటుడు జె.డి. చక్రవర్తి మాట్లాడుతూ - ‘కథ వినగానే నచ్చింది. నా పాత్రకున్న ఇంపార్టెన్స్ అర్థమై వెంటనే ఓకే చెప్పేశాను. కార్తికేయను ఆర్.ఎక్స్ 100లో చూశా. రొమాన్స్, ఫైట్స్, డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నాడు. తప్పకుండా మంచి హీరోగా ఎదుగుతాడు. అతనికి కెరీర్ బిగినింగ్‌లోనే హిప్పీ లాంటి కథ కుదరడం గ్రేట్. మంచి మనసున్న కలైపులి థానుగారి బ్యానర్లో ఈ సినిమా చేస్తున్నందుకు నాక్కూడా చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. -
నా అహం దెబ్బతింది
‘‘ఆర్ఎక్స్ 100’ సినిమా విడుదలకు ముందునుంచే కార్తికేయ తెలుసు. ఈ చిత్రంలో నేను చేసిన పాత్రకి దర్శకుడు నన్ను పరీక్షించాలన్నప్పుడు నా అహం దెబ్బతింది. అయితే.. తను చెప్పిన విషయాన్ని నేను నెగటివ్‌గా తీసుకొని ఉంటే మంచిపాత్రలో నటించే అవకాశం వచ్చేది కాదు’’ అని నటుడు జేడీ చక్రవర్తి అన్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హిప్పీ’. టి.ఎన్. కృష్ణ దర్శకుడు. వి. క్రియేషన్స్, ఏషియన్ సినిమాస్ పతాకాలపై కలైపులి యస్.థాను నిర్మిస్తున్నారు. దిగంగనా సూర్యవంశీ, జబ్బాసింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఆర్ఎక్స్ 100’ తర్వాత చాలా కథలు విన్నా. అదే టైమ్‌లో ‘నువ్వు నేను ప్రేమ’ ఫేమ్ టి.ఎన్.కృష్ణగారు వినిపించిన ‘హిప్పీ’ కథ కొత్తగా అనిపించడంతో వెంటనే ఓకే చెప్పేశా. కలైపులి థానుగారు ఓకే చెప్పడంతో సినిమా మొదలైంది. జేడీ చక్రవర్తిగారు చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించారు. ఈ సినిమాలో దాదాపు అందరూ నాకంటే సీనియర్లే పని చేశారు. విజువల్స్ చాలా గ్రాంyŠ గా ఉంటాయి. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాని మించి ‘హిప్పీ’ బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. టి.ఎన్. కృష్ణ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ కామెడీ చిత్రమిది. కథ చాలా సింపుల్. మన ఇరుగు పొరుగు ఇళ్లలో జరుగుతున్నట్లు ఉంటుంది. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. మన జీవితంలో నిత్యం జరిగే ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయి. ఈ సినిమాని తొలుత తమిళంలో చేయాలనుకున్నాం. ‘ఆర్ఎక్స్ 100’లో కార్తికేయను చూశాక ‘హిప్పీ’ ఇతనితో ఎందుకు చేయకూడదు? అనిపించింది. కథ అతనికి నచ్చడంతో తెలుగులో ఈ సినిమా స్టార్ట్ అయింది’’ అన్నారు. ‘‘నేను ఎప్పుటి నుంచో తెలుగులో నేరుగా ఓ సినిమా తీయాలనుకుంటుంటే ‘హిప్పీ’తో కుదిరింది. త్వరలోనే పాటలను విడుదల చేయనున్నాం’’ అన్నారు కలైపులి యస్.థాను. ఈ చిత్రానికి నివాస్ కె.ప్రసన్న సంగీతం అందించారు. -
‘హిప్పీ’ టీజర్ రిలీజ్ చేసిన నాని
ఆర్ఎక్స్ 100 సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన యంగ్ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం హిప్పీ. తమిళ స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. వీ క్రియేషన్స్ బ్యానర్‌పై టీ ఎన్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. టీజర్ ఆవిష్కరణ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘కార్తికేయతో కలిసి ‘గ్యాంగ్ లీడర్’లో పనిచేస్తున్నాను. ఆర్ఎక్స్ 100 గురించి ఇంతకు ముందు చాలా విన్నాను. ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. కార్తికేయ చాలా బాగా చేశాడని అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడు అతనితో కలిసి పనిచేస్తుంటే... ఆ సినిమా ఎందుకు అంత పెద్ద హిట్ అయి ఉంటుందో అర్థమైంది. కార్తికేయతో పనిచేయడం చాలా సరదాగా ఉంది. ఈ పరిచయంతోనే నేను హిప్పీ టీజర్ విడుదల చేశాను. టీజర్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. చాలా బావుంది. సక్సెస్ఫుల్ సినిమాకు ఉండే అన్నీ లక్షణాలు, వైబ్రేషన్స్ ఇందులో ఉన్నాయి. సినిమా చాలా బావుంటుందనిపిస్తోంది. టీమ్‌కి ఆల్ ది బెస్ట్. ఈ సమ్మర్లో తప్పకుండా కూల్ సినిమా అవుతుంది. సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా’ అని అన్నారు. కార్తికేయ మాట్లాడుతూ ‘నాని సార్‌తో పనిచేసే చాన్స్ నాకు ‘గ్యాంగ్‌లీడర్’ చిత్రంతో వచ్చింది. దాన్నుంచి అడ్వాంటేజ్ తీసుకుని, టీజర్ లాంచ్ ఆయన చేతుల మీదుగా జరిపించాలని అనుకున్నా. నేను అడగ్గానే అంగీకరించారు. ఆయనకు ధన్యవాదాలు. నేను అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు కదా సార్ అని అన్నా. నువ్వు అడక్కపోయినా చేసేవాడిని అని నాని సార్ అన్నారు. అంత మంచి వ్యక్తి ఆయన . షూటింగ్ చేస్తున్నప్పుడే ఆయన బాగా క్లోజ్ అయ్యారు. ఇండస్ట్రీకి వచ్చాక నాకు ఇంకా ఏ పెద్ద హీరో తెలియదు అని అనుకుంటున్న తరుణంలో నాని గారితో ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆయనతో స్నేహపూర్వకంగా ఉండగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆయనతో ఈ జర్నీ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా’ అన్నారు. దర్శకుడు టీఎన్ కృష్ణ మాట్లాడుతూ ‘మా సినిమా టీజర్‌ను విడుదల చేసినందుకు నాని సార్‌కు చాలా ధన్యవాదాలు. ఆయనతో పాటు నేను దర్శకుడు విక్రమ్ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. విక్రమ్‌గారి షూటింగ్లో ఉండగానే మేం నానిగారితో టీజర్ విడుదల చేయించాం’ అని అన్నారు. విక్రమ్.కె.కుమార్ మాట్లాడుతూ ‘కార్తికేయకు ఆల్ ది వెరీ బెస్ట్. ఈ చిత్ర దర్శకుడు నాకు మంచి స్నేహితుడు. టీజర్ చూస్తుంటే మంచి ఫన్ రైడ్‌లా అనిపిస్తోంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కావాలి. మంచి టీమ్ కలిసి చేసిన చిత్రమిది’ అని తెలిపారు. నిర్మాత కలైపులి థాను మాట్లాడుతూ ‘రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. ఒక పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో, ఒక పాటను పబ్బులో చిత్రీకరిస్తాం. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ షూటింగ్ ఉంటుంది. టీజర్ చాలా బావుందని అందరూ మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది. అందరి అంచనాలకు తగ్గరీతిలో నిర్మిస్తున్నాం. తప్పకుండా సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాం’ అని చెప్పారు.