రేపే ‘గుణ 369’ ఫస్ట్‌ లుక్‌ | Guna 369 First Look On 29th May | Sakshi
Sakshi News home page

రేపే ‘గుణ 369’ ఫస్ట్‌ లుక్‌

Published Tue, May 28 2019 7:00 PM | Last Updated on Tue, May 28 2019 7:00 PM

Guna 369 First Look On 29th May - Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’తో మంచి హిట్‌ కొట్టిన యంగ్‌ హీరో కార్తికేయ.. తన తదుపరి ప్రాజెక్ట్‌లను చకచకా పట్టాలెక్కిస్తున్నాడు. హిప్పీ దాదాపు షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేసుకోగా.. గుణ 369 అనే మరో చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ వచ్చేసింది.

గుణ 369 అంటూ టైటిల్‌ లోగోను రిలీజ్‌ చేస్తూ.. కార్తికేయ బాడీషో చేసిన పోస్టర్‌ అప్పట్లో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. రేపు (మే 29th​) 11.11గంటలకు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.  స్ప్రింట్‌ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement