![Young Hero Karthikeya Released The Title Logo Of Abadameva Jayathe](/styles/webp/s3/article_images/2024/11/26/abaddame-jayathe.jpg.webp?itok=XACRpFZd)
సుశాంత్ యష్కీ, ప్రవణ్యా రెడ్డి, మాస్టర్ వికాస్, మాస్టర్ భాను, విజయ కృష్ణా, వెంకీ లింగం ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అబద్దమేవ జయతే’. కె. కార్తికేయన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పర్పుల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై కొండా సందీప్, అభిరామ్ అలుగంటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/karthikeya.jpg)
తాజాగా ఈ మూవీ టైటిల్ లోగోని యంగ్ హీరో కార్తికేయ విడుదల చేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతు.. టైటిల్ చాలా వెరైటీగా ఉందని అభినందిస్తూ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. విలేజ్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రం లో ఒక ఇరవై ఏళ్ల క్రితం ఉన్న సెట్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ఈ సినిమా కి సంగీతాన్ని అందిస్తున్నారు. వికాస్ చిక్‌బల్లాపూర్ కెమెరామెన్‌గా, షాడో ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
సూరారం, వేములవాడ, వికారాబాద్, రాజమండ్రి, కాకినాడ ఇలా చాలా గ్రామీణ వాతావరణంలోనే సినిమాను షూట్ చేశారు. చిత్రయూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాకు రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment