ఆ్రస్టేలియా అండర్–19 జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో భారత అండర్–19 జట్టు శుభారంభం చేసింది. పుదుచ్చేరి వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ అండర్-19 జట్టు 49.4 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. స్టీవెన్ హోగన్ (42), రిలీ కింగ్‌సెల్ (36) రాణించారు. యువ భారత బౌలర్లలో మహమ్మద్ ఇనాన్ 4, కేపీ కార్తికేయ రెండు వికెట్లు పడగొట్టారు.
అదరగొట్టిన కార్తికేయ..
అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని భారత యువ జట్టు 36 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో కేపీ కార్తికేయ (99 బంతుల్లో 85 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ప్రదర్శన కనబరచగా.. అమాన్ (58 నాటౌట్; 5 ఫోర్లు) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఆసీస్ బౌలర్లలో పాటిర్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక అటు బంతితో, ఇటు బ్యాట్‌తో సత్తాచాటిన టీమిండియా ఆల్‌రౌండర్ కేపీ కార్తికేయకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య సోమవారం(సెప్టెంబర్ 23) రెండో మ్యాచ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment