జూన్ 7న విడుద‌ల‌కు సిద్ధమ‌వుతున్న ‘హిప్పి’ | Rx 100 Fame Karthikeya New Movie Hippi Release Date | Sakshi
Sakshi News home page

జూన్ 7న విడుద‌ల‌కు సిద్ధమ‌వుతున్న ‘హిప్పి’

Published Wed, Apr 17 2019 10:08 AM | Last Updated on Wed, Apr 17 2019 10:08 AM

Rx 100 Fame Karthikeya New Movie Hippi Release Date - Sakshi

‘ఆర్‌ఎక్స్‌100’ ఫేమ్‌ కార్తికేయ, దిగంగన సూర్యవన్షీ జంట‌గా తెరకెక్కుతున్న సినపిమా హిప్పీ. కలైపులి ఎస్‌. థాను సమర్పణలో వి. క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు టిఎన్‌ కృష్ణ దర్శకుడు. షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూన్ 7న సినిమాను విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్‌.

ఈ సంద‌ర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ - ‘మా హిప్పీ జూన్ 7న విడుద‌ల కానుంది. షూటింగ్ చాలా బాగా జ‌రిగింది. ఔట్‌పుట్ అనుకున్నదానికన్నా బాగా వ‌చ్చింది. టీమ్ అంద‌రం హ్యాపీగా ఉన్నాం.  పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైన‌ర్ ఇది. ఇందులో ఓ వైపు రియలిస్టిక్‌ స్టోరి ఉంటుంది. మ‌రో వైపు ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. అన్ని కమర్షియల్‌ అంశాలను పర్‌ఫెక్ట్‌గా బ్లెండ్‌ చేశారు ద‌ర్శకుడు.

కబాలి వంటి బ్లాక్ బ‌స్టర్ చిత్రాలను నిర్మించిన  కలైపులి ఎస్‌. థానుగారి సంస్థలో హిప్పీ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయ‌న ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెద్ద బ‌డ్జెట్ చిత్రంలా చేశారు. జె.డి. చ‌క్రవ‌ర్తిగారిది చాలా చాలా కీ రోల్‌. ఆయ‌న క‌థ విన‌గానే  ఒప్పుకోవ‌డంతో  హ్యాపీగా ఫీల‌య్యా. ఆయన నటనకు నేను పెద్ద ఫ్యాన్‌ని. హీరోయిన్ దిగంగన చాలా అద్భుతమైన నటి. ఈ సినిమాలో తనది మంచి క్యారెక్టర్‌. అంద‌రినీ మెప్పిస్తుంది. సంగీతం కూడా చాలా బాగుంది. ఆర్‌.డి. రాజశేఖర్‌గారి ఫొటోగ్రఫీ సినిమాకు మంచి ఎస్సెట్‌గా నిలుస్తుంది’ అన్నారు. 

నటుడు జె.డి. చక్రవర్తి మాట్లాడుతూ - ‘క‌థ విన‌గానే న‌చ్చింది. నా పాత్రకున్న ఇంపార్టెన్స్ అర్థమై వెంట‌నే ఓకే చెప్పేశాను. కార్తికేయ‌ను ఆర్‌.ఎక్స్ 100లో చూశా. రొమాన్స్‌, ఫైట్స్‌, డ్యాన్స్‌ చాలా బాగా చేస్తున్నాడు. తప్పకుండా మంచి హీరోగా ఎదుగుతాడు. అతనికి కెరీర్ బిగినింగ్‌లోనే హిప్పీ లాంటి క‌థ కుద‌ర‌డం గ్రేట్‌. మంచి మ‌న‌సున్న క‌లైపులి థానుగారి బ్యాన‌ర్‌లో ఈ సినిమా చేస్తున్నందుకు నాక్కూడా చాలా ఆనందంగా ఉంది’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement